< Ê-xê-ki-ên 48 >
1 “Đây là danh sách các đại tộc Ít-ra-ên và lãnh thổ chia cho mỗi đại tộc: Phần đất của Đan từ biên cương phía bắc. Đường biên giới từ đường Hết-lôn đến Lê-bô Ha-mát và chạy dài trên Hát-sa-ê-nan, nằm nơi biên giới Đa-mách, cạnh Ha-mát về phía bắc. Phần đất của Đan trải dài ngang đất Ít-ra-ên, từ đông sang tây.
౧గోత్రాల పేర్లు ఇవి. దానీయులకు ఒక భాగం. అది ఉత్తరదిక్కు సరిహద్దు నుండి హమాతుకు వెళ్ళే మార్గం వరకూ హెత్లోనుకు వెళ్ళే సరిహద్దు వరకూ హసరేనాను అనే దమస్కు సరిహద్దు వరకూ హమాతు సరిహద్దు దారిలో తూర్పుగా, పడమరగా వ్యాపించి ఉన్న భూమి.
2 Lãnh thổ của A-se nằm giáp ranh với phía nam của Đan và trải dài từ đông sang tây.
౨దాను సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగం.
3 Đất của Nép-ta-li nằm giáp ranh với phía nam của A-se, cũng trải dài từ đông sang tây.
౩ఆషేరీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగం.
4 Phần của Ma-na-se nằm về phía nam của Nép-ta-li, và lãnh thổ cũng trải dài từ đông sang tây.
౪నఫ్తాలి సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా మనష్షేయులకు ఒక భాగం.
5 Phía nam của Ma-na-se là Ép-ra-im,
౫మనష్షేయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా ఎఫ్రాయిమీయులకు ఒక భాగం.
౬ఎఫ్రాయిమీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా రూబేనీయులకు ఒక భాగం.
7 và Giu-đa, tất cả biên giới này đều trải dài từ đông sang tây.
౭రూబేనీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా యూదావారికి ఒక భాగం.
8 Phía nam Giu-đa là vùng đất được biệt riêng. Đất ấy rộng 13.300 mét và sẽ trải dài bằng ranh giới các đại tộc từ đông sang tây, với Đền Thờ nằm ở giữa.
౮యూదావారి సరిహద్దును అనుకుని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్టించే పవిత్రమైన స్థలం ఉంటుంది. దాని వెడల్పు 13 కిలోమీటర్ల 500 మీటర్లు దాని పొడవు తూర్పు నుండి పడమర వరకూ మిగిలిన భాగాల్లాగా ఉంటుంది. పరిశుద్ధ స్థలం దాని మధ్యలో ఉండాలి.
9 Phần đất biệt riêng cho Đền Thờ Chúa Hằng Hữu sẽ dài 13.300 mét và rộng 10.600 mét.
౯యెహోవాకు మీరు ప్రతిష్టించే ఈ ప్రదేశం 13 కిలోమీటర్ల, 500 మీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల, 400 మీటర్ల వెడల్పు ఉండాలి.
10 Phần đất thánh này sẽ dành cho các thầy tế lễ, có kích thước chiều dài là 13.300 mét và rộng 5.300 mét, với Đền Thờ của Chúa Hằng Hữu nằm ở giữa.
౧౦ఈ పవిత్రమైన స్థలం యాజకులది. అది ఉత్తరాన 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, పశ్చిమాన 5 కిలోమీటర్ల 400 మీటర్ల వెడల్పు, తూర్పున 5 కిలోమీటర్ల 400 మీటర్ల వెడల్పు, దక్షిణ దిక్కున 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు ఉండాలి. యెహోవా పరిశుద్ధస్థలం దాని మధ్య ఉంటుంది.
11 Đây là đất dành cho các thầy tế lễ thánh, thuộc dòng dõi Xa-đốc, là những người đã trung tín phục vụ Ta, không để cho người Ít-ra-ên bị lôi cuốn theo dòng tội ác như những người Lê-vi khác đã làm.
౧౧ఇది సాదోకు సంతతికి చెంది నాకు ప్రతిష్టితులై నేను వారికి అప్పగించిన దాన్ని కాపాడే యాజకులది. ఎందుకంటే ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోయినప్పుడు మిగిలిన లేవీయులు వారితో పోయినట్టు వారు నన్ను విడిచిపోలేదు.
12 Đó là đất thánh và là sản nghiệp chia cho họ trong ngày phân phối đất đai. Bên cạnh phần đất của các thầy tế lễ, người Lê-vi sẽ có một phần lãnh thổ để sống.
౧౨పవిత్రమైన భూమిలో లేవీయుల సరిహద్దు దగ్గర వారికొక స్థలం ఉంటుంది. దాన్ని అతి పరిశుద్ధంగా ఎంచుతారు.
13 Đất của người Lê-vi sẽ có kích thước và hình dạng như đất của các thầy tế lễ—tức dài 13.300 mét và rộng 5.300 mét. Toàn bộ phần đất này dài 13.300 mét và rộng 10.600 mét.
౧౩యాజకుల సరిహద్దును ఆనుకుని లేవీయులకు ఒక స్థలం ఏర్పాటు చేయాలి. అది 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, ఐదు కిలోమీటర్ల 400 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ రెండు స్థలాల మొత్తం పొడవు 13 కిలోమీటర్ల 500 మీటర్లు. వెడల్పు పది కిలో మీటర్ల 800 మీటర్లు ఉంటుంది.
14 Không một phần đất biệt riêng nào được phép bán, đổi, hay cho người ngoài sử dụng, vì nó thuộc về Chúa Hằng Hữu; và được biệt riêng ra thánh.
౧౪అది యెహోవాకు ప్రతిష్ఠితమైన భూమి కాబట్టి దానిలో ఏ కొంచెం భాగమైనా వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు, ఆ భూమి ప్రథమ ఫలాలను ఇతరులను అనుభవింపనియ్య కూడదు.
15 Phần đất còn lại dài 13.300 mét và rộng 2.650 mét, phía nam của khu vực Đền Thờ thánh sẽ là đất công cộng dùng—làm nhà ở, làm đồng cỏ cho súc vật, và vùng đất chung, với thành phố nằm ở giữa.
౧౫13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, రెండు కిలోమీటర్ల 700 మీటర్ల వెడల్పు ఉన్న మిగిలిన స్థలం సమిష్టి భూమిగా ఎంచి, పట్టణంలో నివాసాలకు, మైదానాలకు వాడాలి. దాని మధ్య నగర నిర్మాణం జరుగుతుంది.
16 Thành vuông vức, mỗi bề dài 2.400 mét—bắc, nam, đông, và tây.
౧౬నగర పరిమాణ వివరాలు, ఉత్తరాన రెండు కిలోమీటర్ల 400 మీటర్ల, దక్షిణాన రెండు కిలోమీటర్ల 400 మీటర్ల, తూర్పున రెండు కిలోమీటర్ల 400 మీటర్ల, పశ్చిమాన రెండు కిలోమీటర్ల 400 మీటర్ల,
17 Dải đất làm đồng cỏ bọc quanh thành rộng 133 mét cho mỗi hướng.
౧౭నగరానికి చేరిన ఖాళీ స్థలం ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు పడమటి వైపు, నాలుగు దిక్కుల్లో సమానంగా 135 మీటర్లు ఉండాలి.
18 Phần đất bên ngoài thành sẽ là khu vực trồng trọt, trải dài 5.300 mét phía đông, và 5.300 mét phía tây, dọc theo biên giới của vùng đất thánh. Khu vực này sẽ dùng để sản xuất thực phẩm cho những người làm việc trong thành.
౧౮పవిత్రమైన భూమిని ఆనుకుని ఉన్న మిగిలిన భూమి ఫలం పట్టణంలో పనిచేసి జీవించే వారికి ఆధారంగా ఉంటుంది. అది పవిత్రమైన భూమిని ఆనుకుని తూర్పున ఐదు కిలోమీటర్ల 400 మీటర్లు, పడమటి వైపున ఐదు కిలోమీటర్ల 400 మీటర్ల, ఉంటుంది.
19 Những người từ những đại tộc khác nhau đến làm việc trong thành có thể trồng trọt tại đất đó.
౧౯ఏ గోత్రపు వారైనా పట్టణంలో కష్టపడి జీవించేవారు దాన్ని సాగుబడి చేస్తారు.
20 Toàn bộ khu vực này—bao gồm vùng đất thánh và kinh thành—là một hình vuông, mỗi bề rộng 13.300 mét.
౨౦పవిత్రమైన భూమి అంతా 13 కిలోమీటర్ల 500 మీటర్ల నలు చదరంగా ఉంటుంది.
21 Phần đất còn lại ở phía đông và phía tây của đất thánh và kinh thành sẽ thuộc về vua. Mỗi khu vực này rộng 13.300 mét, trải dài từ hai nơi phần đất thánh về phía đông và phía tây cho đến tận biên giới Ít-ra-ên, đất thánh và Đền Thờ sẽ tọa lạc chính giữa.
౨౧పవిత్రమైన భూమికి, నగరానికి ఏర్పాటైన భూమికి రెండు వైపులా ఉన్న భూమి పాలకునిది. తూర్పున 13 కిలోమీటర్ల 500 మీటర్లు గల పవిత్రమైన భూమి నుండి అది తూర్పు సరిహద్దు వరకూ వ్యాపిస్తుంది. పడమర 13 కిలోమీటర్ల 500 మీటర్లు గల పవిత్రమైన భూమి నుండి అది పడమర సరిహద్దు వరకూ వ్యాపిస్తుంది.
22 Do đó, đất của vua sẽ nằm giữa lãnh thổ của Giu-đa và Bên-gia-min, ngoại trừ phần đất đã biệt riêng cho vùng đất thánh và kinh thành.
౨౨యూదా వారి సరిహద్దుకు, బెన్యామీనీయుల సరిహద్దుకు మధ్యగా ఉన్న భాగం పాలకునిది. ఆ భాగం లోనే లేవీయుల స్వాస్థ్యం, నగరానికి ఏర్పాటైన భూమి ఉంటాయి.
23 Đây là những lãnh thổ được chia cho các đại tộc: Lãnh thổ của Bên-gia-min nằm về phía nam đất của vua, và trải ngang vùng đất của Ít-ra-ên từ đông sang tây.
౨౩తూర్పు నుండి పడమటి వరకూ కొలవగా మిగిలిన గోత్రాలకు భాగాలు ఏర్పాటవుతాయి.
24 Lãnh thổ phía nam của Bên-gia-min là đất của Si-mê-ôn, cũng trải dài từ đông sang tây.
౨౪బెన్యామీనీయులకు ఒక భాగం, వారి సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా షిమ్యోనీయులకు ఒక భాగం.
25 Tiếp nối là lãnh thổ của Y-sa-ca cũng trải dài từ đông sang tây.
౨౫షిమ్యోనీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా ఇశ్శాఖారీయులకు ఒక భాగం.
26 Kế đến là Sa-bu-luân cũng trải dài từ đông sang tây.
౨౬ఇశ్శాఖారీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా జెబూలూనీయులకు ఒక భాగం.
27 Lãnh thổ Gát tiếp giáp ranh giới địa phận của Sa-bu-luân từ đông sang tây.
౨౭జెబూలూనీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా గాదీయులకు ఒక భాగం.
28 Biên giới phía nam của Gát chạy từ Ta-ma đến suối Mê-ri-ba tại Ca-đe, rồi men theo Suối Ai Cập đến tận bờ Địa Trung Hải.
౨౮దక్షిణదిక్కున తామారునుండి కాదేషులో ఉన్న మెరీబా ఊటలవరకూ నది వెంబడి మహా సముద్రం వరకూ గాదీయులకు సరిహద్దుగా ఉంటుంది.
29 Đây là các phần đất được phân chia cho các đại tộc Ít-ra-ên làm cơ nghiệp. Ta, Chúa Hằng Hữu Chí Cao, phán vậy!”
౨౯మీరు చీట్లువేసి ఇశ్రాయేలీయుల గోత్రాలకు పంచిపెట్టాల్సిన దేశం ఇదే. వారి వారి భాగాలు ఇవే. ఇదే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ.
30 “Đây sẽ là những lối ra của thành: Bắt đầu trên tường thành phía bắc, dài 2.400 mét,
౩౦నగర వైశాల్యం ఉత్తరాన రెండు కిలోమీటర్ల 400 మీటర్లు.
31 có ba cổng, mỗi cổng được đặt tên của một đại tộc Ít-ra-ên. Cổng thứ nhất tên Ru-bên, cổng thứ hai là Giu-đa, và cổng thứ ba là Lê-vi.
౩౧ఇశ్రాయేలీయుల గోత్రాల పేర్ల ప్రకారం నగర గుమ్మాలకు పేర్లు పెట్టాలి. ఉత్తరాన రూబేనుదనీ, యూదాదనీ, లేవీదనీ మూడు గుమ్మాలు ఉండాలి.
32 Trên tường thành phía đông, dài 2.400 mét, các cổng được đặt tên là Giô-sép, Bên-gia-min, và Đan.
౩౨తూర్పు వైపు 2 కిలోమీటర్ల 400 మీటర్ల పొడవు ఉంది. ఆ వైపున యోసేపుదనీ, బెన్యామీనుదనీ, దానుదనీ, మూడు గుమ్మాలుండాలి.
33 Trên tường thành phía nam, cũng dài 2.400 mét, tên các cổng là Si-mê-ôn, Y-sa-ca, và Sa-bu-luân.
౩౩దక్షిణం వైపు రెండు కిలోమీటర్ల 400 మీటర్ల పొడవు. ఆ వైపున షిమ్యోనుదనీ, ఇశ్శాఖారుదనీ, జెబూలూనుదనీ, మూడు గుమ్మాలుండాలి.
34 Và trên tường thành phía tây, cũng dài 2.400 mét, các cổng được đặt tên là Gát, A-se, và Nép-ta-li.
౩౪పడమటి వైపు రెండు కిలోమీటర్ల 400 మీటర్ల పొడవు. ఆ వైపున గాదుదనీ, ఆషేరుదనీ, నఫ్తాలిదనీ మూడు గుమ్మాలుండాలి.
35 Chu vi thành được 9.600 mét. Và từ đó, tên của thành sẽ là ‘Chúa Hằng Hữu Ngự Tại Đó.’”
౩౫ఆ నగరం చుట్టు కొలత తొమ్మిది కిలోమీటర్ల, 700 మీటర్ల పొడవు. “యెహోవా ఉండే స్థలం” అని ఆనాటి నుండి ఆ పట్టణానికి పేరు.