< Xuất Hành 16 >
1 Rời Ê-lim, đoàn người Ít-ra-ên tiếp tục lên đường, đến hoang mạc Sin (giữa Ê-lim và núi Si-nai) vào ngày mười lăm tháng hai, tính từ ngày ra khỏi Ai Cập.
౧తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా ఏలీము నుండి బయలుదేరి వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన రెండవ నెల పదిహేనోరోజున ఏలీముకు సీనాయికి మధ్య ఉన్న సీను ఎడారి ప్రాంతానికి వచ్చారు.
2 Ở đó, đoàn người Ít-ra-ên lại cằn nhằn Môi-se và A-rôn.
౨అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే, అహరోనుల మీద సణుగుకున్నారు.
3 Họ than khóc: “Chẳng thà chúng tôi cứ ở lại Ai Cập mà ăn thịt bánh no nê, rồi dù có bị Chúa Hằng Hữu giết tại đó đi nữa, cũng còn hơn theo hai ông vào giữa hoang mạc này để chết đói.”
౩ప్రజలు వారితో “మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం వండుకుని కుండల దగ్గర కూర్చుని తృప్తిగా భోజనం చేసేవాళ్ళం. ఆ సమయంలోనే యెహోవా చేతిలో మేము చనిపోయి ఉన్నట్టయితే బాగుండేది. మేమంతా ఆకలితో చనిపోవడం కోసం ఇక్కడికి తీసుకు వచ్చారు” అన్నారు.
4 Chúa Hằng Hữu phán bảo Môi-se: “Ta sẽ làm bánh rơi xuống từ trời như mưa. Ngày ngày, mỗi người sẽ đi ra nhặt bánh; nhưng chỉ nhặt đủ ăn trong ngày. Ta muốn thử xem họ có vâng lời Ta không.
౪యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నేను ఆకాశం నుండి మీ కోసం ఆహారం కురిపిస్తాను. ప్రతిరోజూ ప్రజలు వెళ్లి ఆనాటికి సరిపడేటంత ఆహారం సమకూర్చుకోవాలి. వాళ్ళు నా ఉపదేశం ప్రకారం నడుచుకుంటున్నారో లేదో నేను పరిశీలిస్తాను.
5 Ngày thứ sáu họ phải nhặt gấp đôi số bánh hằng ngày.”
౫ఆరవ రోజున వాళ్ళు మిగతా అన్ని రోజుల కంటే రెండింతలు సేకరించుకుని తెచ్చుకున్నది వండుకోవాలి.”
6 Vậy, Môi-se và A-rôn nói với đoàn người Ít-ra-ên: “Chiều hôm nay, mọi người sẽ nhận biết chính Chúa Hằng Hữu đã dẫn anh chị em ra khỏi Ai Cập;
౬మోషే, అహరోనులు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా అన్నారు. “మీరు మా మీద ఎందుకు సణుక్కుంటారు? మేము ఎంతటి వాళ్ళం? యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన విన్నాడు.
7 rồi đến sáng, sẽ chiêm ngưỡng vinh quang của Chúa Hằng Hữu, vì Ngài có nghe lời cằn nhằn oán trách rồi. Chúng tôi là ai, mà anh chị em cằn nhằn chúng tôi?
౭ఐగుప్తు దేశం నుండి యెహోవాయే మిమ్మల్ని బయటికి రప్పించాడని సాయంత్రం నాటికి మీరు తెలుసుకుంటారు. రేపు ఉదయానికి మీరు యెహోవా మహిమా ప్రభావం చూస్తారు.”
8 Môi-se cũng nói với họ: Anh chị em sẽ nhận biết Chúa Hằng Hữu khi Ngài ban cho thịt vào buổi chiều và bánh vào buổi sáng. Thật ra, anh chị em đã oán trách Chúa chứ không phải oán trách chúng tôi.”
౮మోషే వాళ్ళతో “మీరు సాయంత్రం తినడానికి మాంసం, ఉదయాన సరిపడినంత ఆహారం యెహోవా మీకు ఇస్తున్నప్పుడు మీరు ఇది తెలుసుకుంటారు. మీరు ఆయన మీద సణుక్కోవడం ఆయన విన్నాడు. మీరు సణుక్కోవడం యెహోవా మీదే, మా మీద కాదు. మాపై సణుక్కోవడానికి మేమెంతటివాళ్ళం?” అన్నాడు.
9 Môi-se nói với A-rôn: “Hãy nói với toàn dân Ít-ra-ên rằng: ‘Bây giờ, toàn dân hãy đến đây trước mặt Chúa Hằng Hữu, vì Ngài đã nghe lời cằn nhằn của anh chị em.’”
౯మోషే అహరోనులతో యెహోవా “ప్రజల సర్వ సమాజంతో ఇలా చెప్పు, ఆయన మీ సణుగులు విన్నాడు. సర్వ సమాజం అంతా యెహోవా సన్నిధికి రండి.”
10 Trong khi A-rôn còn đang nói với toàn dân, bỗng, về phía hoang mạc, vinh quang của Chúa Hằng Hữu chói lọi trong áng mây.
౧౦అహరోను ఇశ్రాయేలు సమాజమంతటితో మాట్లాడుతున్న సమయంలోనే ప్రజలు ఎడారి వైపు చూశారు. అప్పుడు మేఘంలో యెహోవా మహిమ వాళ్లకు కనిపించింది.
11 Chúa Hằng Hữu phán bảo Môi-se:
౧౧అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “నేను ఇశ్రాయేలు ప్రజల సణుగులు విన్నాను.
12 “Ta đã nghe lời họ cằn nhằn. Con cho họ hay rằng buổi chiều họ sẽ có thịt, buổi sáng có bánh ăn dư dật để họ biết Ta là Chúa Hằng Hữu, Đức Chúa Trời của họ.”
౧౨వాళ్ళతో ఇలా చెప్పు. సాయంత్రం పూట మీరు మాంసం తింటారు, ఉదయం పూట తృప్తిగా ఆహారం తింటారు. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.”
13 Chiều hôm ấy, chim cút bay đến vô số, bao phủ cả trại. Đến sáng, chung quanh trại có một lớp sương dày.
౧౩అలాగే జరిగింది. సాయంకాలం అయినప్పుడు పూరేడు పిట్టలు వచ్చి శిబిరం అంతా కమ్ముకున్నాయి. ఉదయమయ్యాక శిబిరం అంతా మంచు పడి ఉంది.
14 Lớp sương tan đi, để lại trên mặt cát hoang mạc những hạt nhỏ và mịn.
౧౪నేలపై మంచు ఇంకిపోయాక నేలమీద సన్నని కణాలు పొరలుగా ఎడారి భూమి మీద కనబడ్డాయి.
15 Người Ít-ra-ên trông thấy, hỏi nhau: “Vật gì vậy?” Môi-se nói: “Đó là bánh Chúa Hằng Hữu cho anh chị em.”
౧౫ఇశ్రాయేలీయులు దాన్ని చూసి, అది ఏమిటో తెలియక “ఇదేంటి?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
16 Ông tiếp: “Chúa Hằng Hữu phán dạy mỗi người thu nhặt bánh ấy tùy theo nhu cầu của gia đình mình, chừng hai lít mỗi đầu người.”
౧౬మోషే వాళ్ళతో “ఇది తినడానికి యెహోవా మీకిచ్చిన ఆహారం. యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ప్రతి ఒక్కరూ తమకు అవసరమైనంత మేరకు సేకరించుకోవాలి. తమ గుడారంలో ఉన్న వాళ్ళ కోసం ప్రతి ఒక్కరికీ ఒక ఓమెరు చొప్పున తీసుకోవాలి.”
17 Người Ít-ra-ên bắt đầu đi ra nhặt bánh, ước chừng hai lít cho mỗi người.
౧౭ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా చేశారు. అయితే కొందరు ఎక్కువగా, కొందరు తక్కువగా కూర్చుకున్నారు.
18 Nhưng dù có ai nhặt nhiều cũng không thừa; ai nhặt ít cũng không thiếu. Mỗi người nhặt đủ cho mình ăn.
౧౮వాళ్ళు కొలత ప్రకారం చూసినప్పుడు ఎక్కువగా తీసుకొన్న వారికి ఏమీ మిగల్లేదు, తక్కువ తీసుకొన్నవారికి ఏమీ తక్కువ కాలేదు. ప్రతి ఒక్కరూ తమ అవసరం మేరకు తమ ఇంటి వాళ్ళ భోజనానికి సరిపడినంత సమకూర్చుకున్నారు.
19 Mặc dù Môi-se có căn dặn: “Đừng ai để dành bánh đến ngày mai,”
౧౯అప్పుడు మోషే “ఉదయమయ్యే దాకా ఎవ్వరూ దీన్లో ఏమీ మిగుల్చుకోకూడదు” అని వాళ్ళతో చెప్పాడు.
20 nhưng có người vẫn không vâng lời, để bánh lại đến sáng hôm sau, bánh hóa giòi và hôi hám. Vì thế, Môi-se giận họ.
౨౦అయితే కొందరు మోషే మాట వినకుండా తెల్లవారే దాకా దానిలో కొంచెం మిగుల్చుకున్నారు. మోషే వారిపై కోపగించుకున్నాడు. అది పురుగు పట్టి దుర్వాసన కొట్టింది.
21 Cho nên, cứ sáng ra, mỗi người đi nhặt bánh vừa đủ ăn trong ngày; và khi nắng chiếu nóng mặt đất, bánh liền tan đi.
౨౧కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఉదయమూ తమ ఇంటివారి కోసం ఏ రోజుకు సరిపడినది ఆ రోజు సేకరించుకున్నారు. ఎండ ఎక్కువైనప్పుడు అది కరిగిపోయింది.
22 Ngày thứ sáu, họ nhặt gấp đôi phần bánh ngày thường, mỗi người chừng bốn lít. Các bậc huynh trưởng có đến hỏi Môi-se về việc này,
౨౨ఆరవ రోజున వాళ్ళు ఒక్కొక్కరు రెండు లీటర్లకు రెట్టింపు లెక్క చొప్పున నాలుగు లీటర్లు సేకరించారు. ప్రజల అధికారులు వచ్చి ఆ విషయం మోషేకు చెప్పారు.
23 ông đáp: “Theo huấn thị của Chúa Hằng Hữu, ngày mai là ngày Sa-bát thánh dành cho Chúa Hằng Hữu, mọi người đều nghỉ ngơi. Vậy, hôm nay cứ nấu nướng dư dả, để dành một phần cho ngày mai.”
౨౩అందుకు మోషే “యెహోవా చెప్పిన మాట ఇదే. రేపు వివేచనాపూర్వక విశ్రాంతి దినం. అది యెహోవాకు గౌరవార్థం ఆచరించ వలసిన పవిత్ర విశ్రాంతి దినం. మీరు వండుకోవలసింది వండుకోండి, ఉడికించుకోవలసింది ఉడికించుకోండి. తినగా మిగిలినది రేపటికి ఉంచుకోండి.”
24 Phần bánh người ta để dành qua hôm sau theo lời Môi-se dặn, vẫn tốt lành, không sâu bọ, không hôi hám.
౨౪మోషే ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళు తెల్లవారే వరకూ దాన్ని ఉంచుకున్నారు. అది దుర్వాసన వేయలేదు, దానికి పురుగు పట్టలేదు.
25 Môi-se nói: “Đó là phần ăn ngày hôm nay, vì hôm nay là ngày Sa-bát của Chúa Hằng Hữu, sẽ không có bánh trên mặt đất.
౨౫అప్పడు మోషే “ఈ రోజు దాన్ని తినండి, ఈ రోజు యెహోవాకు విశ్రాంతి దినం, నేడు అది బయట మైదానంలో దొరకదు.
26 Mọi người sẽ nhặt bánh trong sáu ngày, nhưng ngày thứ bảy là lễ Sa-bát sẽ không có bánh.”
౨౬మీరు ఆరు రోజులే దాన్ని సమకూర్చుకోవాలి. విశ్రాంతి దినమైన ఏడవ రోజున అది దొరకదు” అని చెప్పాడు.
27 Tuy nhiên, cũng có vài người cứ đi nhặt bánh ngày thứ bảy, nhưng chẳng được gì cả.
౨౭ఆ విధంగానే జరిగింది. ప్రజల్లో కొందరు ఏడవ రోజున దాన్ని ఏరుకోవడానికి వెళ్ళారు గానీ వాళ్లకు ఏమీ దొరకలేదు.
28 Chúa Hằng Hữu hỏi Môi-se: “Tại sao những người này không chịu nghe lời Ta?
౨౮అందుచేత యెహోవా మోషేతో ఇలా అన్నాడు “మీరు ఎంతకాలం నా ఆజ్ఞలను, ఉపదేశాన్ని అనుసరించి నడుచుకోకుండా ఉంటారు?
29 Hãy nhớ rằng Chúa Hằng Hữu đã cho các con ngày sa-bát, vì thế vào ngày thứ sáu Ngài ban cho các con hai ngày bánh. Trong ngày thứ bảy, không ai được ra khỏi nhà nhặt bánh.”
౨౯వినండి, యెహోవా ఈ విశ్రాంతి దినాన్ని తప్పకుండా ఆచరించాలని సెలవిచ్చాడు. కనుక ఆరవ రోజున రెండు రోజులకు సరిపడే ఆహారం మీకు ఇస్తున్నాడు. ఏడవ రోజున ప్రతి ఒక్కరూ తమ స్థలాల్లోనే ఉండిపోవాలి.”
30 Vậy, người ta đều nghỉ ngơi ngày thứ bảy.
౩౦అందువలన ఏడవ రోజున ప్రజలు విశ్రాంతి తీసుకున్నారు.
31 Người Ít-ra-ên gọi bánh này là ma-na, nó giống như hạt ngò, sắc trắng, và có vị ngọt như bánh mật ong.
౩౧ఇశ్రాయేలీయులు ఆ పదార్థానికి “మన్నా” అని పేరు పెట్టారు. అది తెల్లగా ధనియాల వలే ఉంది. దాని రుచి తేనెతో కలిపిన పిండి వంటకం లాగా ఉంది.
32 Môi-se truyền cho họ lệnh của Chúa Hằng Hữu: “Lấy hai lít ma-na để cất giữ, lưu truyền lại cho hậu thế thấy thứ bánh Chúa Hằng Hữu dùng để nuôi người Ít-ra-ên trong hoang mạc sau khi rút họ ra khỏi Ai Cập.”
౩౨మోషే ఇలా చెప్పాడు “యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ఈ మన్నాను ఒక ఓమెరు పట్టే పాత్రలో నింపండి. నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఎడారిలో తినడానికి మీకిచ్చిన ఈ ఆహారాన్ని మీ తరతరాల కోసం మీ వంశాల కోసం వాళ్ళు దగ్గర ఉంచుకోవాలి.”
33 Vậy, Môi-se bảo A-rôn lấy một cái bình đổ hai lít ma-na vào, để giữ lại trước mặt Chúa Hằng Hữu từ thế hệ này sang thế hệ khác.
౩౩అప్పుడు మోషే అహరోనుతో “నువ్వు ఒక గిన్నె తీసుకుని, దాన్ని ఒక ఓమెరు మన్నాతో నింపి, మీ తరతరాల సంతతి కోసం యెహోవా సన్నిధిలో ఉంచు” అని చెప్పాడు.
34 A-rôn vâng lời, làm theo lệnh Chúa Hằng Hữu truyền cho Môi-se. Bình ma-na vì thế được để trong “Hòm Giao Ước.”
౩౪యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేశాడు. ఆది భద్రంగా ఉండేలా శాసనాలు ఉంచే స్థలం ఎదుట ఉంచాడు.
35 Người Ít-ra-ên ăn ma-na trong suốt bốn mươi năm cho đến khi vào đất Ca-na-an, là nơi họ định cư.
౩౫తాము చేరుకోవలసిన కనాను దేశపు సరిహద్దుల వరకూ నలభై సంవత్సరాల వాళ్ళ ప్రయాణంలో మన్నా తింటూ వచ్చారు.
36 Thùng chứa được dùng để do lường ma-na là một ô-me bằng một phần mười ê-pha.
౩౬ఓమెరు అంటే ఏఫాలో పదవ వంతు.