< Phục Truyền Luật Lệ 6 >
1 “Chúa Hằng Hữu, Đức Chúa Trời của anh em, bảo tôi dạy anh em các luật lệ sẽ được áp dụng trong lãnh thổ chúng ta sẽ chiếm cứ.
౧“మీరూ మీ కొడుకులూ మీ మనుమలూ
2 Nếu anh em, con cháu anh em suốt đời kính sợ Chúa Hằng Hữu, Đức Chúa Trời của anh em, tuyệt đối tuân hành luật lệ Ngài, thì anh em sẽ được sống lâu.
౨మీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను మీకు ఆజ్ఞాపించే ఆయన కట్టడలు, ఆజ్ఞలు అన్నిటినీ మీ జీవితకాలమంతా పాటిస్తే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీరు స్వాధీనం చేసుకోడానికి నది దాటి వెళ్తున్న దేశంలో మీరు పాటించడానికి మీకు బోధించాలని మీ యెహోవా దేవుడు ఆజ్ఞాపించిన కట్టడలు, విధులు ఇవే.
3 Vậy, xin anh em lắng tai nghe kỹ các luật lệ Ngài và thận trọng tuân hành. Nhờ đó, anh em sẽ được thịnh vượng, may mắn, dân số gia tăng nhanh chóng trong vùng đất phì nhiêu, đúng như Chúa Hằng Hữu, Đức Chúa Trời của tổ tiên đã hứa.
౩ఇశ్రాయేలూ, నీ పూర్వీకుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో సుఖశాంతులతో బాగా అభివృద్ధి చెందడానికి నువ్వు వాటిని విని, అనుసరించాలి.
4 Xin anh em lắng nghe đây: Chỉ có một mình Chúa Hằng Hữu là Đức Chúa Trời chúng ta mà thôi.
౪ఇశ్రాయేలూ విను. మన యెహోవా దేవుడు అద్వితీయుడు.
5 Phải hết lòng, hết linh hồn, hết sức yêu kính Chúa Hằng Hữu, Đức Chúa Trời của anh em.
౫నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.
6 Phải ghi lòng tạc dạ những lời tôi truyền cho anh em hôm nay.
౬ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి.
7 Cũng phải ân cần dạy dỗ những lời này cho con cái mình khi ở nhà, lúc ra ngoài, khi đi ngủ, lúc thức dậy.
౭మీరు మీ కొడుకులకు వాటిని నేర్పించి, మీ ఇంట్లో కూర్చున్నప్పుడూ దారిలో నడిచేటప్పుడూ నిద్రపోయేటప్పుడూ లేచేటప్పుడూ వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని మీ చేతికి కట్టుకోవాలి.
8 Buộc những lời ấy vào tay mình, đeo trên trán mình,
౮అవి మీ రెండు కళ్ళ మధ్యలో బాసికం లాగా ఉండాలి.
9 ghi những lời ấy trên cột nhà và trước cổng.
౯మీ ఇంట్లో గుమ్మాల మీదా తలుపుల మీదా వాటిని రాయాలి.
10 Khi Đức Chúa Trời Hằng Hữu, Đức Chúa Trời của anh em đem anh em vào đất Ngài đã hứa với tổ tiên Áp-ra-ham, Y-sác, và Gia-cốp, cho anh em những thành to lớn tốt đẹp không do anh em kiến thiết,
౧౦మీ దేవుడు యెహోవా మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆ దేశంలోకి తీసుకెళ్ళి, మీరు కట్టని గొప్ప, మంచి పట్టణాలను మీకు ఇస్తున్నాడు.
11 những ngôi nhà đầy những vật dụng không do anh em mua sắm. Những giếng nước không do anh em đào, vườn nho, vườn ô-liu không do anh em trồng. Khi ăn uống no nê,
౧౧మీరు నింపని మంచి వస్తువులతో నిండిన ఇళ్ళనూ, మీరు తవ్వని బావులనూ, మీరు నాటని ద్రాక్షతోటలనూ ఒలీవ తోటలనూ మీకిస్తున్నాడు.
12 anh em phải thận trọng, đừng quên Chúa Hằng Hữu, Đấng đã giải thoát anh em khỏi ách nô lệ Ai Cập.
౧౨అక్కడ మీరు తిని, తృప్తి పొందినప్పుడు, బానిసలుగా ఉన్న ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త వహించాలి.
13 Phải kính trọng Chúa Hằng Hữu, Đức Chúa Trời của anh em, và phục vụ Ngài. Khi anh em thề nguyện phải lấy Danh Ngài mà thề nguyện.
౧౩మీ యెహోవా దేవునికే భయపడాలి, ఆయననే పూజించాలి, ఆయన పేరట మాత్రమే ప్రమాణం చేయాలి.
14 Không được theo các thần của các nước láng giềng,
౧౪మీరు ఇతర దేవుళ్ళను, అంటే మీ చుట్టూ ఉన్న ఇతర జాతుల ప్రజల దేవుళ్ళను పూజింపకూడదు.
15 vì Chúa Hằng Hữu, Đức Chúa Trời của anh em ở giữa anh em là Đức Chúa Trời kỵ tà. Nếu anh em thờ các thần đó, Chúa sẽ nổi giận, trừ diệt anh em khỏi mặt đất.
౧౫మీ మధ్య ఉన్న మీ యెహోవా దేవుడు రోషం గల దేవుడు కాబట్టి ఆయన కోపాగ్ని మీ మీద చెలరేగి దేశంలో ఉండకుండాా మిమ్మల్ని నాశనం చేస్తాడు.
16 Không được thử thách Chúa Hằng Hữu, Đức Chúa Trời của anh em, như anh em đã làm ở Ma-sa.
౧౬మీరు మస్సాలో ఆయన్ని పరీక్షించిన విధంగా మీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు.
17 Phải tuyệt đối tuân hành các điều răn, luật lệ của Chúa Hằng Hữu, Đức Chúa Trời của anh em.
౧౭ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, అంటే ఆయన శాసనాలను, కట్టడలను జాగ్రత్తగా పాటించాలి.
18 Làm những điều phải, điều tốt dưới mắt Chúa Hằng Hữu; như vậy anh em mới được may mắn, vào chiếm được đất Chúa đã hứa cho tổ tiên chúng ta,
౧౮మీకు సుఖశాంతులు కలిగేలా, మీ ఎదుట నుండి మీ శత్రువులందరినీ తరిమి వేస్తానని
19 và đánh đuổi quân thù trước mặt như Chúa đã phán.
౧౯యెహోవా చెప్పిన ప్రకారం మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఆ మంచి దేశంలో మీరు ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకొనేలా మీరు యెహోవా దృష్టికి యథార్థమైనదీ ఉత్తమమైనదీ చేయాలి.
20 Sau này, khi con cái anh em thắc mắc: ‘Ý nghĩa của điều răn, luật lệ của Chúa Hằng Hữu, Đức Chúa Trời chúng ta, phải tuân theo là gì?’
౨౦ఇక ముందు మీ కొడుకులు, మన యెహోవా దేవుడు మీకు ఆజ్ఞాపించిన శాసనాలు, కట్టడలు, విధులు ఏవి? అని మిమ్మల్ని అడిగినప్పుడు
21 Anh em sẽ giải thích như sau: ‘Ngày xưa, chúng ta là nô lệ của Pha-ra-ôn ở Ai Cập, nhưng Chúa Hằng Hữu đã ra tay giải thoát chúng ta.
౨౧మీరు వారితో ఇలా చెప్పాలి, మనం ఐగుప్తులో ఫరోకు బానిసలుగా ఉన్నప్పుడు యెహోవా తన బాహుబలంతో మనలను విడిపించాడు.
22 Chúa Hằng Hữu dùng nhiều phép lạ phi thường, những đòn khủng khiếp trừng phạt Ai Cập, Pha-ra-ôn và hoàng gia, ngay trước mắt dân chúng ta.
౨౨యెహోవా ఐగుప్తు మీదా ఫరో మీదా అతని ఇంటివారందరి మీదా బాధాకరమైన, గొప్ప సూచకక్రియలూ అద్భుతాలూ మన కళ్ళ ఎదుట కనపరచి,
23 Ngài đem dân ta ra khỏi Ai Cập, và cho chúng ta đất này như Ngài đã hứa với tổ tiên ta.
౨౩తాను మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశాన్ని మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టడానికి అక్కడ నుండి మనలను రప్పించాడు.
24 Chính Chúa Hằng Hữu, Đức Chúa Trời của anh em đã ban bố những luật lệ này để chúng ta triệt để tuân hành, và kính sợ Ngài, và nhờ thế, chúng ta mới được Ngài cho tồn tại đến ngày hôm nay.
౨౪మనం ఎప్పుడూ సుఖశాంతులు కలిగి ఈ రోజు ఉన్నట్టు మనం జీవించేలా మన యెహోవా దేవునికి భయపడి ఈ కట్టడలనన్నిటినీ పాటించాలని మనకు ఆజ్ఞాపించాడు.
25 Nếu cứ cẩn trọng tuân hành mọi luật lệ Chúa Hằng Hữu, Đức Chúa Trời của chúng ta đã truyền, chúng ta sẽ được kể là người công chính.’”
౨౫మన యెహోవా దేవుడు మనకి ఆజ్ఞాపించిన విధంగా ఆయన ఎదుట ఈ ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ నడుచుకుంటే అదే మన విషయంలో నీతి అనిపించుకుంటుంది.”