< Phục Truyền Luật Lệ 32 >
1 “Hỡi trời, hãy lắng nghe, ta sẽ nói! Hỡi đất, hãy nghe lời ta nói!
౧ఆకాశమా! నేను చెప్పేది విను! నన్ను మాట్లాడనియ్యి. భూగోళమా, నా నోటి మాటలు ఆలకించు.
2 Lời ta êm nhẹ như sương sa, có lúc tầm tã như mưa móc. Nhuần tưới đồng xanh và thảo mộc.
౨నా ఉపదేశం వానలా కురుస్తుంది. నా మాటలు మంచు బిందువుల్లా, లేతగడ్డిపై పడే చినుకుల్లా, పచ్చికపై కురిసే చిరుజల్లులా, మొక్కలపై కురిసే జల్లులా ఉంటాయి.
3 Ta tung hô Danh Chúa Vĩnh Hằng; ca tụng công ơn Đức Chúa Trời vĩ đại.
౩నేను యెహోవా పేరును ప్రకటిస్తాను. మన దేవునికి ఘనత ఆపాదించండి.
4 Chúa là Vầng Đá hiên ngang. Đường lối Ngài chính là công lý. Tuyệt đối chính trực và công bằng; luôn thành tín, không hề nhiễm tội!
౪ఆయన మనకు ఆశ్రయ దుర్గం. ఆయన పని పరిపూర్ణం. ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన పక్షపాతం చూపని దేవుడు. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు.
5 Nhưng Ít-ra-ên phản phúc thình lình; không tình nghĩa cha con. Họ là một giống nòi lừa đảo, thông gian.
౫వారు తమను తాము చెడగొట్టుకున్నారు. వారు ఆయన సంతానం కారు. వారు దోషులు, మూర్ఖులైన వక్రతరం.
6 Phải chăng đây là cách báo đền ơn Chúa, hỡi dân tộc khờ khạo, điên cuồng? Có phải Chúa là Thiên Phụ từ nhân? Đấng chăn nuôi dưỡng dục, tác thành con dân?
౬బుద్ధి, ఇంగితం లేని మనుషులారా, యెహోవాకు ఇదా మీరిచ్చే కానుక? ఆయన మీ తండ్రి కాడా? ఆయనే గదా మిమ్మల్ని పుట్టించి స్థిరపరచింది?
7 Thử nhớ lại những ngày dĩ vãng; suy ngẫm về các thế hệ đã qua. Thử hỏi xem các bậc trưởng lão. Họ sẽ ân cần dạy bảo.
౭గతించిన కాలాన్ని గుర్తుకు తెచ్చుకోండి. తరతరాల సంవత్సరాల సంగతులను తలపోయండి. మీ తండ్రిని అడుగు, అతడు నీకు చూపిస్తాడు. పెద్దలను అడుగు, వాళ్ళు నీకు చెబుతారు.
8 Khi Đấng Tối Cao phân chia lãnh thổ, phân phối dòng dõi A-đam khắp thế gian, cho mỗi dân tộc đều hưởng một phần, thì Ngài căn cứ trên số dân của cộng đồng con cái Chân Thần.
౮మహోన్నతుడు ప్రజలకు వారి వారి వారసత్వాలను పంచి ఇచ్చినప్పుడు, మానవ జాతులను వేరు పరచినపుడు, ఇశ్రాయేలు ప్రజల లెక్క ప్రకారం ప్రజలకు హద్దులు నియమించాడు.
9 Nhưng Chúa là phần của Ít-ra-ên, vì Gia-cốp thuộc về Ngài.
౯యెహోవా వంతు ఆయన ప్రజలే. ఆయన వారసత్వం యాకోబు సంతానమే.
10 Chúa tìm thấy họ trong hoang mạc, giữa tiếng gào thét của chốn hoang vu; bảo vệ họ như con ngươi tròng mắt.
౧౦ఆయన ఆ ప్రజను ఎడారి ప్రదేశంలో కనుగొన్నాడు. బీడు భూమిలో, భీకరమైన శబ్దాలు ఉన్న నిర్జన ప్రదేశంలో అతణ్ణి రక్షించి ఆదుకున్నాడు. తన కనుపాపలా అతణ్ణి కాపాడాడు.
11 Như phụng hoàng lay động tổ, bay quanh các con bé bỏng mình, dang cánh ra hứng đỡ, rồi cõng đàn con trên cánh.
౧౧గద్ద తన గూడు రేపి తన పిల్లలపై ఎగురుతూ రెక్కలు చాపుకుని ఆ పిల్లలను రెక్కల మీద మోసినట్టు యెహోవా చేశాడు.
12 Dân ta cũng được Ngài dắt dìu; chỉ có Chúa, chẳng có thần nào khác.
౧౨యెహోవా ఒక్కడే ఆ ప్రజలకు దారి చూపుతున్నాడు. వేరే దేవుళ్ళెవరూ ఆయనకు సాటిరారు.
13 Ngài cho họ ở trên đồi cao, hưởng hoa màu của đất. Đá lửa bỗng phun dầu, khe núi tuôn dòng mật.
౧౩లోకంలో ఉన్నత స్థలాలపై ఆ ప్రజలను ఎక్కించాడు. పొలాల పంటలు వారికి తినిపించాడు. కొండబండల తేనెతో, చెకుముకి రాతిబండ నూనెతో వారిని తృప్తిపరిచాడు.
14 Họ được sữa bò, chiên dư dật, lấy giống chiên, dê đực, dê Ba-san. Gieo giống lúa mì thượng hạng, và uống rượu nho thuần chất.
౧౪ఆవు మజ్జిగను, గొర్రెల, మేకల పాలనూ, గొర్రెపిల్లల కొవ్వునూ, బాషాను పొట్టేళ్లను, మేకపోతులనూ, శ్రేష్ఠమైన గోదుమ పిండినీ మీకిచ్చాడు. మంచి ద్రాక్షరసంతో చేసిన మద్యం మీరు తాగారు.
15 Nhưng khi Ít-ra-ên vừa mập béo, liền từ bỏ Đức Chúa Trời, là Đấng Sáng Tạo, coi rẻ Vầng Đá cứu chuộc họ.
౧౫యెషూరూను కొవ్వి కాలు దువ్వాడు, మీరు కొవ్వుతో బలిసి మొద్దులాగా అయ్యారు. యెషూరూను తనను పుట్టించిన దేవుణ్ణి వదిలేశాడు. తన రక్షణ శిలను నిరాకరించాడు.
16 Họ cúng thờ thần tượng xa lạ khiến Ngài ghen tức, làm những việc ghê tởm để chọc giận Ngài.
౧౬వారు ఇతర దేవుళ్ళను అనుసరించి ఆయనకు రోషం పుట్టించారు. అసహ్యమైన విగ్రహాలు పెట్టుకుని ఆయనకు కోపం తెప్పించారు.
17 Họ dâng lễ vật cho quỷ chứ không thờ Đức Chúa Trời, cúng tế các thần xa lạ họ và tổ tiên chưa từng biết.
౧౭వారు దేవత్వం లేని దయ్యాలకు బలులు అర్పించారు. తమకు తెలియని దేవుళ్ళకూ, కొత్తగా పుట్టుకొచ్చిన దేవుళ్ళకూ, మీ పితరులు భయపడని దేవుళ్ళకూ బలులర్పించారు.
18 Họ không chú tâm đến Vầng Đá sáng tạo; lãng quên Đức Chúa Trời sinh thành họ.
౧౮నీకు తండ్రి లాంటి బండను వదిలేశావు, నిన్ను కన్న దేవుణ్ణి మరిచావు.
19 Thấy thế, Chúa Hằng Hữu buộc lòng ghét bỏ. Vì con cái Chúa dám khiêu khích Ngài.
౧౯యెహోవా దీన్ని చూసి వాళ్ళని వదిలేశాడు, తన కొడుకులూ కూతుర్లూ ఆయన్నలా రేపారు.
20 Chúa phán: ‘Ta sẽ lánh mặt; để xem cuối cùng họ ra sao! Họ chỉ là một dòng giống bất trung gian tà.
౨౦ఆయనిలా అన్నాడు. “వారికి నా ముఖాన్ని దాచు కుంటాను. వాళ్ళ అంతం ఎలా ఉంటుందో చూస్తాను. వాళ్ళు మొండి తరం, విశ్వసనీయత లేని పిల్లలు.
21 Họ làm Ta gớm ghét các tượng họ thờ, dù đó chỉ là tượng vô dụng, vô tri, chứ chẳng phải là thần. Ta sẽ làm cho họ ganh với nhiều dân; làm cho họ tị hiềm những dân ngoại.
౨౧దేవుడు కాని దానితో వాళ్ళు నాకు రోషం తెప్పించారు. తమ పనికిమాలిన విగ్రహాలతో నాకు కోపం తెప్పించారు. ప్రజలు కాని వారిని చూసి వారు అసూయ పడేలా చేస్తాను. తెలివిలేని రాజ్యాన్ని చూసి వారికి కోపం వచ్చేలా చేస్తాను.
22 Vì lửa giận Ta bốc cháy và thiêu đốt Âm Phủ đến tận đáy. Đốt đất và hoa mầu ruộng đất, thiêu rụi cả nền tảng núi non. (Sheol )
౨౨నా కోపాగ్ని రగులుకుంది. పాతాళ అగాధం వరకూ అది మండుతుంది. భూమినీ దాని పంటనూ అది కాల్చేస్తుంది. పర్వతాల పునాదులను రగులబెడుతుంది. (Sheol )
23 Tai họa sẽ chồng chất, Ta bắn tên trúng vào người họ.
౨౩వారిపై విపత్తుల సమూహం తెప్పిస్తాను. వారి మీదికి నా బాణాలు వదులుతాను.
24 Họ sẽ bị tiêu hao vì đói khát, thiêu nuốt vì nhiệt, và bệnh dịch độc địa. Ta sẽ sai thú dữ cắn xé họ, cùng với các loài rắn rít đầy nọc độc.
౨౪వారు కరువుతో అల్లాడతారు. ఒళ్ళు కాలే మంటతో, పెను నాశనంతో క్షీణిస్తారు. దుమ్ములో పాకే వాటి విషాన్నీ అడివి జంతువుల కోరలనూ వారిమీదికి రప్పిస్తాను.
25 Bên ngoài, rừng gươm giáo vây quanh, bên trong, nhung nhúc “kinh hoàng trùng,” già trẻ lớn bé đều tiêu vong.
౨౫బయట కత్తి చావు తెస్తుంది. పడక గదుల్లో భయం పీడిస్తుంది. యువకులూ, కన్యలూ, పసికందులూ, నెరిసిన వెంట్రుకలున్నవారూ నాశనం అవుతారు.
26 Ta định phân tán họ đến các nơi xa, và xóa sạch tàn tích dân này.
౨౬వాళ్ళను చాలా దూరం విసిరేస్తాను. వాళ్ళ జ్ఞాపకాలు మానవ జాతిలో లేకుండా తుడిచేస్తాను.
27 Thế nhưng, Ta nghĩ rằng kẻ thù sẽ hiểu lầm, tự phụ: “Ta đánh Ít-ra-ên tan tành. Chứ Chúa có giúp gì cho họ đâu!”’
౨౭కానీ అలా ఎందుకు చెయ్యలేదంటే, వాళ్ళ విరోధులు రెచ్చిపోతారేమో, వాళ్ళ విరోధులు అపార్థం చేసుకుని, ‘పైచెయ్యి మనదే, ఇది చేసింది యెహోవా కాదు’ అంటారేమో.”
28 Ít-ra-ên là một dân có óc lại ngu đần, thiếu hiểu biết.
౨౮ఇశ్రాయేలు తెలివిలేని ప్రజ. వాళ్ళలో వివేకమే లేదు.
29 Ước gì họ khôn ngoan! Ý thức được cuối cùng họ sẽ ra sao!
౨౯వారికి జ్ఞానముంటే, దీన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే, వాళ్లకు రాబోయే ఆపద గమనించుకుంటే,
30 Vì sao một người đuổi nghìn người chạy trốn? Hai tên địch đuổi nổi mười nghìn lính Ít-ra-ên? Vì Vầng Đá đã bán họ, Chúa lìa bỏ họ.
౩౦వారి ఆశ్రయదుర్గం వారిని అమ్మి వేయకపోతే, యెహోవా వారిపై మనకు విజయాన్నివ్వకపోతే, ఒకడు వేయి మందిని ఎలా తరుముతాడు? పదివేల మందిని ఇద్దరు ఎలా పారదోలతారు?
31 Nhưng hòn đá của kẻ thù đâu sánh nổi với Vầng Đá của chúng ta, chính kẻ thù cũng phải nhìn nhận.
౩౧మన శత్రువుల బండ మన ఆశ్రయదుర్గం లాంటిది కాదు. మన శత్రువులే దీనికి సాక్షులు.
32 Quân thù trồng các loại nho trong vườn Sô-đôm với cánh đồng Gô-mô-rơ. Nhưng sinh toàn trái nho độc, chua, và đắng.
౩౨వారి ద్రాక్షచెట్టు సొదొమ ద్రాక్ష చెట్టు నుంచి వచ్చింది. అది గొమొర్రా పొలాల్లోనిది. వారి ద్రాక్షపళ్ళు విషపు ద్రాక్షపళ్ళు. వాటి గెలలు చేదు.
33 Rượu nho của họ là nọc độc rắn.
౩౩వారి ద్రాక్షారసం పాము విషం. నాగుపాముల క్రూర విషం.
34 Chúa Hằng Hữu phán: ‘Ta đã thu thập và tồn trữ toàn dân như châu báu trong kho tàng.
౩౪ఇది నా రహస్య ఆలోచన కాదా? నా ఖజానాల్లో భద్రంగా లేదా?
35 Báo ứng là việc của Ta; Ta sẽ làm cho kẻ thù trượt ngã. Vì tai họa ào đến, diệt họ trong nháy mắt.’
౩౫వారి కాలు జారే కాలంలో పగ తీర్చే పని నాదే. ప్రతిఫలమిచ్చేది నేనే. వారి ఆపద్దినం దగ్గర పడింది. వారి అంతం త్వరగా వస్తుంది.
36 Chúa sẽ xét xử dân Ngài cách công minh, xót thương tôi trai tớ gái mình khi thấy năng lực họ tàn tắt, người tự do lẫn nô lệ.
౩౬బానిస గానీ, స్వతంత్రుడు గానీ, మరెవరూ మిగలకపోతే, వారికి ఆధారం లేనప్పుడు చూసి, తన సేవకులకు జాలి చూపిస్తాడు, తన ప్రజలకు యెహోవా నిర్ణయం చేస్తాడు.
37 Ngài phán: ‘Các thần họ đâu rồi? Các vầng đá họ ẩn thân đâu?
౩౭అప్పుడాయన వారి దేవుళ్ళు ఎక్కడ? వాళ్ళు నమ్ముకున్న బండ ఏది?
38 Thần được họ cúng tế rượu, mỡ, bây giờ đã ở đâu? Kêu chúng dậy giúp đỡ ngươi! Và bảo bọc các ngươi đi!
౩౮వారికి ఆధారం లేనప్పుడు చూసి, వారి నైవేద్యాల కొవ్వు తిని, వారి పానీయార్పణ ద్రాక్షారసాన్ని తాగిన వారి దేవుళ్ళు ఎక్కడ? వారు లేచి మీకు సాయపడనివ్వండి. వారినే మిమ్మల్ని కాపాడనివ్వండి.
39 Chỉ có một mình Ta là Chân Thần. Ta giết và truyền cho sự sống, gây thương tích, rồi chữa lành; chẳng quyền lực nào của trần gian giải thoát nổi người nào khỏi tay Ta!
౩౯చూడండి. నేనే, నేను మాత్రమే దేవుణ్ణి. నేను తప్ప మరో దేవుడు లేడు. చంపేది నేనే, బతికించేది నేనే. దెబ్బ కొట్టేది నేనే, బాగు చేసేది నేనే. నా చేతిలో నుంచి విడిపించేవాడెవడూ లేడు.
40 Ta đưa tay lên thề: “Thật như Ta Hằng Sống,
౪౦ఆకాశం వైపు నా చెయ్యెత్తి నేనెప్పటికీ జీవిస్తున్నట్టుగా పని చేస్తాను.
41 Ta sẽ mài gươm sáng loáng, tay Ta cầm cán cân công lý, xét xử công minh, đền báo lại, báo ứng những người thù ghét Ta.
౪౧నేను తళతళలాడే నా కత్తి నూరి, నా చెయ్యి న్యాయం తీర్చడం మొదలెడితే, నా శత్రువులకు ప్రతీకారం చేస్తాను. నన్ను ద్వేషించే వారికి ప్రతిఫలమిస్తాను.
42 Mũi tên Ta say máu kẻ gian tà, lưỡi gươm Ta nghiến nghiền xương thịt— đẫm máu những người bị giết, gom thủ cấp tướng lãnh địch quân.”’
౪౨నా బాణాలు రక్తంతో మత్తెక్కి పోయేలా చేస్తాను. నా కత్తి, మాంసం భక్షిస్తుంది! చచ్చిన వారి రక్తాన్నీ, బందీల రక్తాన్నీ, శత్రువు అధికారులనూ అవి తింటాయి.
43 Này dân các nước thế gian! Hãy cùng dân Chúa hân hoan ca mừng, dù tiêu diệt địch tàn hung, Chúa thương xót mãi dân cùng nước ta.”
౪౩ఇతర రాజ్యాల ప్రజలారా, దేవుని ప్రజలతో ఆనందించండి. వధకు గురి అయిన తన సేవకుల రక్తానికి ఆయన పగ తీరుస్తాడు. తన విరోధులకు ప్రతీకారం చేస్తాడు. తన దేశం కోసం, తన ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు.
44 Môi-se và Giô-suê, con của Nun, đọc lại bài ca cho toàn dân nghe.
౪౪మోషే, నూను కొడుకు యెహోషువ ఈ పాటలోని పదాలన్నీ ప్రజలకు పాడి వినిపించారు.
45 Sau khi Môi-se đọc xong,
౪౫మోషే ఈ పాట ఇశ్రాయేలు ప్రజల కోసం పాడి ముగించాడు.
46 ông căn dặn thêm: “Phải cố tâm ghi nhớ mọi điều tôi truyền lại cho anh em hôm nay, để rồi truyền lại cho con cháu mình.
౪౬తరువాత అతడు వారితో ఇలా చెప్పాడు, దీనికి మీరే సాక్ష్యం. ఈ రోజు నేను పలికిన మాటలన్నీ మీ మనస్సుల్లో నింపుకుని, ఈ ధర్మశాస్త్ర ప్రమాణాలన్నీ అనుసరించి నడుచుకోవాలని మీ సంతానానికి ఆజ్ఞాపించాలి.
47 Vì các luật lệ này không phải là những lời nhảm nhí mà là nguồn sống của anh em. Tuân hành các luật lệ này, anh em mới được sống lâu dài trên đất hứa, đất nước bên kia Sông Giô-đan mà anh em sắp chiếm hữu.”
౪౭ఇవి మీకు నిష్ఫలమైన మాటలు కావు, ఇవి మీకు జీవదాయకమైనవి. మీరు యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోతున్న దేశంలో దీన్ని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులవుతారు.
48 Cùng ngày hôm ấy, Chúa Hằng Hữu phán bảo Môi-se:
౪౮అదే రోజు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, యెరికో ఎదుట ఉన్న మోయాబు దేశంలోని అబారీం అనే ఈ పర్వతం,
49 “Hãy lên Núi Nê-bô thuộc dãy A-ra-rim trong đất Mô-áp, đối diện Giê-ri-cô để xem đất Ca-na-an là đất Ta cho Ít-ra-ên.
౪౯అంటే నెబో కొండ ఎక్కు. నేను ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇస్తున్న కనాను దేశాన్ని నువ్వు చూస్తావు.
50 Con sẽ qua đời trên núi ấy, được về cùng các tổ tiên, như A-rôn đã qua đời trên Núi Hô-rơ.
౫౦నీ సోదరుడు అహరోను, హోరు కొండ మీద చనిపోయి తమ పితరుల దగ్గరికి చేరినట్టు, నువ్వు ఎక్కబోతున్న కొండ మీద చనిపోయి, నీ పితరుల దగ్గరికి వెళ్తావు.
51 Vì con đã không tôn kính Ta trước mặt người Ít-ra-ên, tại suối nước Mê-ri-ba, vùng Ca-đe trong hoang mạc Xin,
౫౧ఎందుకంటే, మీరు సీను ఎడారిలో కాదేషు మెరీబా నీళ్ల దగ్గర ఇశ్రాయేలు ప్రజల మధ్య నన్ను ఘనపరచక ఇశ్రాయేలు ప్రజల మధ్య నా మీద తిరుగుబాటు చేశారు.
52 nên con không được vào đất Ta cho Ít-ra-ên, nhưng chỉ được nhìn đất ấy từ xa.”
౫౨నువ్వు ఆ దేశాన్ని దూరం నుంచి చూస్తావు. నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న ఆ దేశంలో నువ్వు అడుగుపెట్టవు.