< Công Vụ Các Sứ đồ 27 >
1 Đến ngày ấn định, chúng tôi lên tàu qua Ý-đại-lợi. Phao-lô và mấy tù nhân khác được giao cho Đội trưởng Giu-lơ, thuộc trung đoàn Âu-gút trông coi.
౧మేము ఓడలో ఇటలీ వెళ్ళాలని నిర్ణయమైంది. వారు పౌలునీ, మరికొందరు ఖైదీలనీ అగస్టస్ సైనిక దళంలోని శతాధిపతి అయిన జూలియస్ అనే అతనికి అప్పగించారు.
2 Chúng tôi xuống tàu của thành A-đa-mi; tàu này sắp chạy và nghé qua các hải cảng Tiểu Á. Có A-ri-tạc người Ma-xê-đoan, quê ở Tê-sa-lô-ni-ca cùng đi với chúng tôi.
౨ఆసియా తీరం పక్కగా ఉన్న పట్టణాల మీదుగా ప్రయాణించే అగస్టస్ సైనిక దళంలోని ఎక్కి మేము బయలుదేరాం. మాసిదోనియ లోని తెస్సలోనిక పట్టణం వాడైన అరిస్తార్కు మాతో కూడ ఉన్నాడు.
3 Hôm sau, chúng tôi đến cảng Si-đôn. Giu-lơ đối xử với Phao-lô rất tử tế, cho phép ông lên bờ thăm bạn hữu và được họ tiếp tế.
౩మరునాడు సీదోను వచ్చాం. అప్పుడు జూలియస్ పౌలు మీద దయ చూపించి, అతడు తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి పరిచర్యలు పొందడానికి అనుమతించాడు.
4 Chúng tôi tiếp tục cuộc hành trình. Vì gió ngược tàu phải vòng lên hướng bắc đảo Síp đi giữa đảo và đất liền.
౪అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టడం చేత సైప్రస్ దీవి చాటుగా ఓడ నడిపించాము.
5 Vượt qua hải phận Si-li-si và Bam-phi-ly, chúng tôi đến cảng My-ra thuộc xứ Ly-si.
౫తరువాత కిలికియకు పంఫూలియకు ఎదురుగా ఉన్న సముద్రం దాటి లుకియ పట్టణమైన మురకు చేరాం.
6 Đội trưởng Giu-lơ tìm được một chiếc tàu từ A-léc-xan-ri-a đến, sắp đi Ý-đại-lợi, nên cho chúng tôi xuống tàu đó.
౬అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళబోతున్న అలెగ్జాండ్రియ పట్టణపు ఓడను చూసి అందులో మమ్మల్ని ఎక్కించాడు.
7 Tàu phải chạy chậm và vất vả nhiều mới tới ngang thành Cơ-nít. Vì gió quá mạnh, chúng tôi phải chạy dọc theo bờ đảo Cơ-rết, đối ngang Sanh-môn.
౭చాలా రోజుల పాటు మెల్లగా నడిచి, ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మల్ని అడ్డగించడం చేత క్రేతు చాటుగా సల్మోనే తీరంలో ఓడ నడిపించాము.
8 Men theo bờ cách chật vật, chúng tôi đến My-ra, gần thành La-sê.
౮అతి కష్టంతో దాన్ని దాటి, ‘సురక్షిత ఆశ్రయాలు’ అనే స్థలానికి చేరాం. దాని పక్కనే లాసియ పట్టణం ఉంది.
9 Chúng tôi dừng tại My-ra khá lâu. Thời tiết càng thêm bất lợi cho cuộc vượt biển, vì tiết thu phân đã qua, nên Phao-lô nêu ý kiến với các viên quan trên tàu.
౯చాలా కాలం గడిచింది. చాలా కాలం గడిచింది కూడా అప్పటికి గడిచిపోయింది, ప్రయాణం చేయడం ప్రమాదకరంగా మారింది.
10 Ông nói: “Thưa các ông, tôi nhận thấy cuộc hải trình này rất nguy hiểm, không những chiếc tàu và hàng hóa bị thiệt hại mà cả sinh mạng chúng ta cũng lâm nguy!”
౧౦అప్పుడు పౌలు, “సోదరులారా, ఈ ప్రయాణం వలన సరకులకు, ఓడకు మాత్రమే కాక మనకూ ప్రాణహానీ, తీవ్ర నష్టం కలగబోతున్నదని నాకనిపిస్తుంది” అని వారిని హెచ్చరించాడు.
11 Nhưng Đội trưởng Giu-lơ không quan tâm, chỉ nghe lời thuyền trưởng và chủ tàu thôi.
౧౧అయితే శతాధిపతి, పౌలు చెప్పింది కాక నావికుడు, ఓడ యజమాని చెప్పిందే నమ్మాడు.
12 Vì My-ra không thuận lợi cho tàu đậu mùa Đông, nên đa số đồng ý ra khơi và cố gắng đến Phê-nít tạm trú qua mùa Đông. Cảng này thuộc đảo Cơ-rết, nhìn ra hướng tây bắc và tây nam.
౧౨పైగా చలి కాలం గడపడానికి ఆ రేవు అనుకూలమైనది కాకపోవడం చేత అక్కడ నుండి బయలుదేరి వీలైతే ఫీనిక్సు చేరి అక్కడ చలికాలం గడపాలని ఎక్కువమంది ఆలోచన చెప్పారు. అది క్రేతులోని నైరుతి వాయువ్య దిక్కుల వైపు ఉన్న ఒక రేవు.
13 Gió nam bắt đầu thổi nhẹ, thủy thủ tưởng gặp được ngày thuận gió, liền nhổ neo cho tàu chạy men theo bờ biển Cơ-rết.
౧౩అంతేగాక దక్షిణపు గాలి మెల్లగా విసరడంతో వారు తమ ఆలోచన సరైందని భావించి ఫీనిక్సు చేరి, క్రేతు తీరంలో ఓడను నడిపించారు.
14 Nhưng thời tiết thình lình thay đổi, bão thổi mạnh hướng đông bắc,
౧౪కొంచెం సేపటికి ఊరకులోను అనే పెనుగాలి క్రేతు మీద నుండి విసిరింది.
15 đẩy tàu ra khơi. Vì không thể đưa tàu vào bờ, họ để mặc cho tàu trôi theo chiều gió.
౧౫ఓడ దానిలో చిక్కుకుపోయి గాలికి ఎదురు నడవలేక పోయింది. ఇక ఎదురు నడిపించడం మాని, గాలికి కొట్టుకుపోయాం.
16 Tàu trôi ngang đảo nhỏ Cơ-lô-đa, chúng tôi vào chỗ khuất gió. Chúng tôi phải chật vật lắm mới trục được chiếc thuyền cứu nạn kéo theo tàu.
౧౬తరువాత కౌద అనే ఒక చిన్న ద్వీపం చాటుగా ఓడ నడిపించాం. బహు కష్టంగా ఓడకు కట్టిన పడవను కాపాడుకోగలిగాం.
17 Rồi, thủy thủ dùng dây thừng ràng đáy tàu lại cho chắc vì sợ tàu mắc cạn trên bãi cát nên họ hạ buồm xuống, rồi để mặc cho gió đưa tàu đi.
౧౭దాన్ని పైకెత్తి కట్టిన తరువాత తాళ్ళు మొదలైనవి తీసుకుని ఓడ చుట్టూ బిగించి కట్టారు. ఓడ సూర్తిస్ అనే ఇసుకతిప్పకు తగిలి పగిలిపోతుందేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకుపోయారు.
18 Qua ngày sau, cuồng phong càng thổi mạnh, họ bắt đầu ném hàng hóa xuống biển.
౧౮గాలి చాలా తీవ్రంగా కొట్టడం వలన ఆ మరునాడు సరుకులు పారవేయడం మొదలుపెట్టారు.
19 Đến ngày kế tiếp, họ tự tay vất bỏ mọi dụng cụ hàng hải ra khỏi tàu.
౧౯మూడవ రోజున తమ చేతులారా ఓడ సామగ్రిని పారవేశారు.
20 Cuồng phong tiếp tục thổi, suốt nhiều ngày không nhìn thấy mặt trời, chúng tôi chẳng còn hy vọng thoát nạn.
౨౦కొన్ని రోజులపాటు సూర్యుడుగానీ నక్షత్రాలుగానీ కనబడక పెద్దగాలి మా మీద కొట్టింది. మేము ప్రాణాలతో తప్పించుకుంటామనే ఆశ పూర్తిగా నశించిపోయింది.
21 Thấy mọi người nhịn ăn đã lâu, Phao-lô bước ra khích lệ: “Thưa anh em, nếu anh em nghe tôi, đừng rời khỏi Cơ-rết, chắc chúng ta đã tránh được những thiệt hại mất mát này.
౨౧వారు చాలాకాలం పస్తులు ఉండగా పౌలు వారి మధ్య నిలబడి, “అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకుండానే ఉండవలసింది. అప్పుడీ హానీ, నష్టమూ కలగకపోయేది.
22 Bây giờ anh em hãy can đảm lên! Không một ai trong chúng ta sẽ bị thiệt mạng, chỉ phải mất chiếc tàu này thôi.
౨౨ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి. ఓడకి మాత్రమే నష్టం కలుగుతుందిగానీ, మీలో ఎవరి ప్రాణానికీ హాని కలగదు.
23 Vì đêm qua, một thiên sứ của Đức Chúa Trời, là Đấng tôi thờ phượng và phục vụ, đến đứng bên cạnh,
౨౩నేను ఎవరి వాడినో ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత గత రాత్రి నా పక్కన నిలబడి,
24 bảo tôi: ‘Phao-lô, đừng sợ! Vì con sẽ ra ứng hầu trước Sê-sa! Đức Chúa Trời cũng sẽ cứu mạng những bạn đồng hành với con.’
౨౪‘పౌలూ, భయపడకు. నీవు సీజరు ముందు నిలబడాల్సి ఉంది. ఇదిగో, నీతో కూడ ఓడలో ప్రయాణిస్తున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడు’ అని నాతో చెప్పాడు.
25 Vậy, anh em hãy can đảm! Tôi tin chắc Đức Chúa Trời sẽ thực hiện mọi điều Ngài hứa,
౨౫కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగుతుందని నేను దేవుని నమ్ముతున్నాను.
26 và chúng ta sẽ tấp vào một hòn đảo.”
౨౬అయినప్పటికీ మనం కొట్టుకుపోయి ఏదైనా ఒక ద్వీపానికి తగులుకోవాలి” అని చెప్పాడు.
27 Đêm thứ mười bốn, chúng tôi bị gió bão dồi dập trong vùng biển A-đơ-ria. Khoảng nửa đêm, thủy thủ tưởng đã đến gần bờ.
౨౭పద్నాలుగవ రాత్రి మేము అద్రియ సముద్రంలో ఇటు అటు కొట్టుకు పోతుండగా అర్థరాత్రి వేళ ఓడ నావికులు ఏదో ఒక దేశం దగ్గర పడుతున్నదని ఊహించి
28 Họ thả dây dò, thấy sâu độ 37 mét. Ít lâu sau, chỉ còn 27 mét.
౨౮ఇనుప గుండు కట్టిన తాడు వేసి చూసి సుమారు 120 అడుగుల లోతని తెలుసుకున్నారు. ఇంకా కొంతదూరం వెళ్ళిన తరువాత, మళ్ళీ గుండు వేసి చూసి 90 అడుగుల లోతని తెలుసుకున్నారు.
29 Sợ tàu đâm vào bờ đá, họ hạ bốn chiếc neo sau lái xuống biển rồi cầu trời cho mau sáng.
౨౯అప్పుడు రాతి దిబ్బలకు కొట్టుకుంటామేమో అని భయపడి, వారు ఓడ అడుగు నుండి నాలుగు లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారుతుందా అని కాచుకుని ఉన్నారు.
30 Nhưng các thủy thủ định bỏ tàu trốn, lấy cớ đi thả neo đàng mũi tàu để hạ chiếc thuyền con xuống biển.
౩౦అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని ఆలోచించి, లంగరులు వేయబోతున్నట్లుగా నటించి సముద్రంలో పడవ దింపివేశారు.
31 Phao-lô bảo viên đội trưởng và quân lính: “Các ông không thể thoát nạn nếu những người kia rời tàu.”
౩౧అందుకు పౌలు “వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకోలేరు” అని శతాధిపతితో, సైనికులతో చెప్పాడు.
32 Quân lính liền cắt đứt dây, chiếc thuyền con rơi xuống biển.
౩౨వెంటనే సైనికులు పడవ తాళ్ళు కోసి దాని కొట్టుకు పోనిచ్చారు.
33 Lúc trời gần sáng, Phao-lô khuyên mọi người: “Đã mười bốn ngày nay anh em không ăn gì cả.
౩౩తెల్లవారుతుండగా పౌలు, “పద్నాలుగు రోజుల నుండి మీరేమీ ఆహారం తీసుకోక పస్తులున్నారు.
34 Bây giờ nên ăn để lấy sức. Dù một sợi tóc anh em cũng chẳng mất đâu!”
౩౪కాబట్టి ఆహారం పుచ్చుకోమని మిమ్మల్ని బతిమాలుతున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయంగా ఉంటుంది. మీలో ఎవరి తలనుండీ ఒక్క వెంట్రుక కూడా నశించదు” అని చెప్పి ఆహారం తీసుకోమని అందరినీ బతిమాలాడు.
35 Phao-lô lấy bánh tạ ơn Đức Chúa Trời trước mặt mọi người rồi bẻ ra ăn.
౩౫ఈ మాటలు చెప్పి, ఒక రొట్టె పట్టుకుని అందరి ముందూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాడు.
36 Được khích lệ, mọi người đều ăn bánh.
౩౬అప్పుడంతా ధైర్యం తెచ్చుకుని ఆహారం తీసుకున్నారు.
37 Có tất cả 276 người trong tàu.
౩౭ఓడలో ఉన్న మేమంతా రెండు వందల డెబ్భై ఆరుగురం.
38 Ăn xong, họ ném hết lương thực xuống biển cho nhẹ tàu.
౩౮వారు తిని తృప్తి పొందిన తరువాత, గోదుమలను సముద్రంలో పారబోసి ఓడను తేలిక చేశారు.
39 Trời vừa sáng, họ thấy một cái vịnh có bãi cát, nhưng không biết thuộc hải phận nào. Bàn tính phương cách đưa tàu vào bãi xong,
౩౯తెల్లవారిన తరవాత అది ఏ దేశమో వారు గుర్తు పట్టలేకపోయారు, కానీ తీరం గల ఒక సముద్రపు పాయను చూసి, సాధ్యమైతే ఓడను అందులోకి నడిపించాలని ఆలోచించారు.
40 họ cắt neo bỏ lại dưới biển, mở dây cột bánh lái rồi trương buồm mũi cho gió đưa tàu vào bờ.
౪౦కాబట్టి వారు గుర్తు పట్టలేకపోయారు వాటిని సముద్రంలో విడిచి పెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా ఒడ్డుకి నడిపించారు.
41 Tàu trôi vào bãi cát bị mắc cạn, mũi tàu cắm vào cát không xê dịch được, còn đằng lái bị sóng đánh dữ dội vỡ tan tành.
౪౧కానీ ఓడ రెండు ప్రవాహాలు కలిసిన చోట చిక్కుకుపోయి ఇసుకలో ఇరుక్కుపోయింది. అందువల్ల ఓడ ముందు భాగం కూరుకుపోయి కదలలేదు. వెనక భాగం అలల దెబ్బకు బద్దలైపోతూ ఉంది.
42 Quân lính đề nghị giết hết tù nhân, sợ có người bơi vào bờ trốn thoát.
౪౨ఖైదీల్లో ఎవరూ ఈదుకుని పారిపోకుండేలా వారిని చంపాలనే ఆలోచన సైనికులకు కలిగింది గాని,
43 Vì muốn cứu Phao-lô, Đội trưởng Giu-lơ bác bỏ đề nghị ấy. Ông ra lệnh cho ai biết bơi cứ nhảy xuống nước, bơi vào bờ trước.
౪౩శతాధిపతి పౌలుని రక్షించాలని కోరి వారి ఆలోచనకు అంగీకరించలేదు. ఈత వచ్చినవారు ముందు సముద్రంలో దూకి ఈదుకుంటూనూ,
44 Những người còn lại bám vào tấm ván hoặc mảnh tàu. Thế là mọi người đều vào bờ an toàn.
౪౪మిగిలినవారు ఓడ చెక్క పలకలు, ఇతర వస్తువుల సాయంతోనూ ఒడ్డుకు చేరాలని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా అందరం తప్పించుకుని ఒడ్డుకు చేరాం.