< II Sa-mu-ên 17 >
1 A-hi-tô-phe lại đề nghị với Áp-sa-lôm: “Để tôi chọn 12.000 quân, đuổi theo Đa-vít ngay đêm nay.
౧అహీతోపెలు అబ్షాలోముతో ఇలా చెప్పాడు “దావీదు బాగా అలసిపోయి బలహీనంగా ఉన్నాడు. కాబట్టి నీకు అంగీకారమైతే నాకు 12,000 మంది సైన్యాన్ని సిద్ధం చేయించు. ఈ రాత్రే దావీదును తరిమి పట్టుకుంటాను” అన్నాడు.
2 Trong lúc ông ấy đang mỏi mệt, chán nản, tôi sẽ xông đến tấn công, thế nào ông ấy cũng hoảng hốt, mọi người sẽ bỏ chạy, tôi sẽ giết một mình Đa-vít,
౨నేను అతనిపై దాడిచేసి అతణ్ణి బెదిరిస్తాను. అప్పుడు అతని దగ్గర ఉన్నవారంతా పారిపోతారు.
3 còn mọi người khác tôi sẽ đem về với vua. Chỉ giết một người, mà mọi người được hưởng thái bình.”
౩అప్పుడు రాజును మాత్రం చంపివేసి ప్రజలందరినీ నీవైపు తిప్పుతాను. నువ్వు వెతుకుతున్న వ్యక్తిని నేను పట్టుకున్నప్పుడు ప్రజలంతా నీతో రాజీ పడిపోతారు.
4 Áp-sa-lôm và các trưởng lão Ít-ra-ên đều cho lời bàn này là chí lý.
౪ఈ మాటలు అబ్షాలోముకు, ఇశ్రాయేలు పెద్దలందరికీ మంచిగా అనిపించాయి.
5 Nhưng Áp-sa-lôm nói: “Mời Hu-sai, người Ạt-kít đến đây, xem thử ông ta có ý kiến gì không.”
౫అప్పుడు అబ్షాలోము “ఈ విషయంలో అర్కీయుడైన హూషై ఏమి చెబుతాడో విందాం. అతణ్ణి పిలిపించండి” అని ఆజ్ఞాపించాడు. హూషై అబ్షాలోము దగ్గరికి వచ్చాడు.
6 Khi Hu-sai đến, Áp-sa-lôm kể cho ông nghe lời A-hi-tô-phe bàn, rồi hỏi: “Ta có nên làm như thế không? Nếu không, ông cho biết ý kiến.”
౬అబ్షాలోము అహీతోపెలు చెప్పిన పథకం అతనికి తెలియజేశాడు. “అతడు చెప్పినట్టు చేయడం మంచిదా, కాదా? నీ ఆలోచన ఏమిటో చెప్పు” అని అడిగాడు.
7 Hu-sai đáp: “Lần này mưu của A-hi-tô-phe không hay.
౭హూషై అబ్షాలోముతో ఇలా అన్నాడు. “ఇప్పుడు అహీతోపెలు చెప్పిన ప్రణాళిక మంచిది కాదు.
8 Vua biết rõ, cha của vua và thuộc hạ toàn là dũng sĩ, nay họ đang giận dữ khác nào gấu cái bị bắt mất con. Ngoài ra, cha của vua là người thạo việc chiến trường, ông ấy không ngủ đêm giữa đám ba quân đâu.
౮నీ తండ్రి, అతనితో ఉన్నవారు మహా బలమైన యుద్ధ వీరులు. అడవిలో తమ పిల్లలను పోగొట్టుకొన్న ఎలుగుబంటులను పోలినవారై రగిలిపోతూ ఉన్నారని నీకు తెలుసు. నీ తండ్రి యుద్ధవిద్యలో నేర్పరి. అదీకాక అతడు తన మనుషులతో కలసి బసచేయడు.
9 Có lẽ ông đang ẩn trong hang hố hoặc một nơi nào đó. Nếu ngay trận đầu, một số quân ta bị chém ngã, ai nghe cũng sẽ nói: ‘Phe Áp-sa-lôm bị tàn sát vô số.’
౯అతడు ఏదో ఒక గుహలోనో, లేకపోతే ఏదైనా రహస్య స్థలంలోనో దాక్కుంటాడు. యుద్ధం ఆరంభంలో నీ మనుషులు కొందరు చనిపోతే ప్రజలు వెంటనే దాన్నిబట్టి అబ్షాలోము మనుషులు ఓడిపోయారని చెప్పుకుంటారు.
10 Lúc ấy, dù người can đảm, có lòng dạ như sư tử cũng phải khiếp vía, vì ai trong Ít-ra-ên cũng biết cha của vua là một dũng sĩ và thuộc hạ ông đều là người gan dạ.
౧౦నీ తండ్రి గొప్ప బలవంతుడని, అతని మనుషులు అత్యంత ధైర్యవంతులని ఇశ్రాయేలీయులందరికీ తెలుసు. అందువల్ల సింహాలవంటి పౌరుషం గలవారు కూడా భీతిల్లిపోతారు.
11 Vậy tôi đề nghị ta nên kêu gọi toàn quốc, từ Đan cho đến Bê-e-sê-ba. Quân số sẽ đông như cát biển, và vua thân hành cầm quân ra trận.
౧౧నా ఆలోచన ఏమిటంటే, దాను నుండి బెయేర్షెబా వరకూ సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా ఇశ్రాయేలీయులనందరినీ నాలుగు దిక్కులకు సమకూర్చుకుని నువ్వే స్వయంగా యుద్ధానికి బయలుదేరు.
12 Như thế, nếu biết được Đa-vít đang ở nơi nào, ta sẽ bủa vây tấn công, trùm kín đối phương như sương phủ đất và giết sạch không chừa một người.
౧౨అప్పుడు అతడు ఎక్కడ కనబడితే అక్కడ మనం అతనిపై దాడి చేయవచ్చు. మంచు నేల మీద ఎలా పడుతుందో ఆ విధంగా మనం అతనిమీద పడితే అతని మనుషుల్లో ఒక్కడు కూడా తప్పించుకోలేడు.
13 Nếu ông ấy rút vào một thành nào, đại quân Ít-ra-ên sẽ lấy dây thừng kéo đổ thành, đùa cả xuống thung lũng, không chừa một viên sỏi.”
౧౩అతడు గనుక ఒక పట్టణం వెనుక దాక్కొంటే ఇశ్రాయేలీయులంతా ఆ పట్టణాన్ని తాళ్లు తీసుకుని ఒక చిన్న రాయి కూడా కనబడకుండా దాన్ని నదిలోకి లాగుతారు.”
14 Áp-sa-lôm và mọi người nói: “Mưu của Hu-sai hay hơn kế của A-hi-tô-phe,” vì Chúa Hằng Hữu đã làm cho mưu của A-hi-tô-phe bị bác bỏ để giáng họa lên Áp-sa-lôm.
౧౪అబ్షాలోము, ఇశ్రాయేలువారు ఈ మాట విని అర్కీయుడైన హూషై చెప్పిన మాట అహీతోపెలు చెప్పినదానికంటే యోగ్యమైనదని ఒప్పుకున్నారు. ఎందుకంటే యెహోవా అబ్షాలోము మీదికి విపత్తు రప్పించాలని అహీతోపెలు చెప్పిన తెలివైన ప్రణాళిక నిరర్ధకమయ్యేలా చేయాలని నిశ్చయించుకున్నాడు.
15 Hu-sai báo cho hai Thầy Tế lễ Xa-đốc và A-bia-tha hay lời bàn của A-hi-tô-phe và lời đề nghị của mình trước mặt Áp-sa-lôm và các trưởng lão.
౧౫అప్పుడు హూషై, అబ్షాలోము, ఇశ్రాయేలు పెద్దలకందరికీ అహీతోపెలు వేసిన పథకం, తాను చెప్పిన ఆలోచన యాజకులైన సాదోకు, అబ్యాతారులకు తెలియజేశాడు.
16 Ông dặn họ: “Lập tức sai người đi nói với Vua Đa-vít: ‘Đêm nay đừng ở bên khúc sông cạn nữa, nhưng phải qua sông ngay, nếu không vua và mọi người sẽ bị hại.’”
౧౬“మీరు తొందరగా వెళ్లి, రాజు, అతని దగ్గర ఉన్న మనుషులంతా హతం కాకుండా ఉండేలా దావీదుకు ఈ విషయం చెప్పండి. మీరు ఈ రాత్రి అరణ్యంలో నది తీరం దాటే స్థలాల్లో ఉండవద్దు” అని చెప్పాడు.
17 Vì sợ bại lộ nên Giô-na-than và A-hi-mát không vào thành, nhưng chờ ở Ên-rô-ghên cho đến khi một đầy tớ gái mang tin đến, để họ đi báo lại cho Đa-vít.
౧౭యోనాతాను, అహిమయస్సు తాము పట్టణం హద్దుకు వచ్చిన సంగతి ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఏన్‌రోగేలు దగ్గెర నిలిబడి ఉన్నప్పుడు ఒక పనిమనిషి వచ్చి, హూషై చెప్పిన సంగతి వారికి చెప్పినప్పుడు వారు వెళ్లి రాజైన దావీదుకు ఆ సంగతి చెప్పారు.
18 Nhưng có một thiếu niên thấy họ, báo cho Áp-sa-lôm. Hai người liền trốn đến Ba-hu-rim, vào nhà một người kia. Nhà này có một cái giếng ngoài sân, họ leo xuống giếng.
౧౮వారిద్దరినీ అక్కడ చూసిన ఒక పనివాడు అబ్షాలోముకు చెప్పాడు. వారిద్దరూ వెంటనే పరుగెత్తి వెళ్లి బహూరీములో ఒకడి ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంటి ముందు ఉన్న ఒక బావిలో దిగి దాక్కున్నారు.
19 Vợ người chủ nhà lấy vải phủ miệng giếng, rải thóc lên trên để không ai nghi ngờ.
౧౯ఆ ఇంటి ఇల్లాలు ఒక పరదా తీసుకువచ్చి బావిమీద పరిచి, దానిపైన గోదుమపిండి ఆరబోసింది. కనుక వారు బావిలో ఉన్న సంగతి ఎవ్వరికీ తెలియలేదు.
20 Khi người của Áp-sa-lôm đến hỏi: “Chị có thấy Giô-na-than và A-hi-mát không?” Người ấy đáp: “Họ đi qua suối rồi.” Người của Áp-sa-lôm tìm một hồi chẳng thấy, nên quay về Giê-ru-sa-lem.
౨౦అబ్షాలోము సేవకులు ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. అహిమయస్సు, యోనాతాను ఎక్కడ ఉన్నారని అడిగారు. ఆమె “వారు నది దాటి వెళ్లిపోయారు” అని చెప్పింది. వారు వెళ్లి చుట్టుపక్కల అంతా వెతికి వారు కనబడకపోయే సరికి యెరూషలేముకు తిరిగి వచ్చారు.
21 Sau khi họ đi khỏi, hai người ở dưới giếng leo lên, đi báo tin cho Đa-vít, kể lại lời bàn của A-hi-tô-phe và nói: “Xin vua sang sông ngay.”
౨౧సేవకులు వెళ్లిపోయిన తరువాత యోనాతాను, అహిమయస్సు బావిలో నుండి బయటికి వచ్చి దావీదు దగ్గరికి వెళ్లి. అహీతోపెలు అతని మీద వేసిన పథకం గురించి చెప్పి “నువ్వు లేచి త్వరగా నది దాటు” అని చెప్పారు.
22 Đa-vít và những người theo ông qua đến bờ bên kia Sông Giô-đan trước khi trời sáng.
౨౨దావీదు, అతని దగ్గర ఉన్న మనుషులంతా లేచి యొర్దాను నది దాటారు. తెల్లవారేసరికి ఒక్కడు కూడా మిగలకుండా అందరూ నది దాటి వెళ్ళిపోయారు.
23 A-hi-tô-phe thấy kế mình bàn không ai theo, liền thắng lừa về quê. Sau khi xếp đặt mọi việc trong nhà, ông treo cổ tự tử. Người ta chôn A-hi-tô-phe cạnh mộ cha ông.
౨౩అహీతోపెలు తాను చెప్పిన పథకం అమలు కాకపోవడం చూసి, గాడిదకు గంతలు కట్టి ఎక్కి తన ఊరికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లి, ఇంటి విషయాలు చక్కబెట్టి ఉరి వేసుకుని చనిపోయాడు. అతని తండ్రి సమాధిలో అతన్ని పాతిపెట్టారు.
24 Đa-vít đến Ma-ha-na-im trong khi Áp-sa-lôm kéo đại quân Ít-ra-ên qua Sông Giô-đan.
౨౪దావీదు మహనయీముకు చేరేటప్పటికి అబ్షాలోము, ఇశ్రాయేలీయులంతా యొర్దాను నది దాటి వచ్చారు.
25 Áp-sa-lôm chỉ định A-ma-sa làm tướng chỉ huy quân đội thay thế Giô-áp (Giô-áp là chú họ của A-ma-sa, vì mẹ A-ma-sa, bà A-bi-ga-in, có chồng là Ích-ra, người Ít-ra-ên, con của bà Na-hách, bà này là chị của mẹ Giô-áp, tên là Xê-ru-gia.)
౨౫అబ్షాలోము యోవాబును తొలగించి అమాశాను సైన్యాధిపతిగా నియమించుకున్నాడు. అమాశా తండ్రి ఇత్రా, ఇశ్రాయేలీయుడు. యోవాబు తల్లి సెరూయా సహోదరియైన నాహాషు కుమార్తెకు, అబీగయీలుకు ఇత్రా పుట్టాడు.
26 Áp-sa-lôm và quân đội Ít-ra-ên dừng lại đóng trại trong đất Ga-la-át.
౨౬అబ్షాలోము, ఇశ్రాయేలీయులు గిలాదు దేశంలో మకాం వేశారు.
27 Khi Đa-vít tới Ma-ha-na-im, Sô-bi, con của Na-hách ở Ráp-ba, thành của người Am-môn, Ma-ki, con của A-mi-ên ở Lô-đê-ba, và Bát-xi-lai, người Ga-la-át ở Rô-ghê-lim,
౨౭దావీదు మహనయీముకు చేరుకున్నప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణ వాస్త్యవ్యుడు, నాహాషు కొడుకు షోబీయు, లోదెబారు ఊరివాడు అమ్మీయేలు కొడుకు మాకీరు, రోగెలీము ఊరికి చెందిన గిలాదీయుడు బర్జిల్లయి
28 đem tiếp tế cho Đa-vít và những người theo ông chăn chiếu, nồi, chén bát, lúa mì, lúa mạch, bột mì, hạt rang, đậu, đậu lăng,
౨౮ఎడారిలో దావీదు, అతని మనుషులు అలసిపోయి, ఆకలి దాహంతో ఉంటారని గ్రహించి, పరుపులు, వంటపాత్రలు, కుండలు, వారంతా తినడం కోసం గోదుమలు, యవల పిండి, పప్పులు, చిక్కుడు కాయలు, పేలాలు,
29 mật ong, bơ (lấy từ sữa chiên), và phó mát (lấy từ sữa bò). Họ nói: “Chắc ai cũng mệt mỏi, đói khát vì phải vượt hoang mạc.”
౨౯తేనె, వెన్న, గొర్రెలు, జున్నుముద్దలు తీసుకువచ్చారు.