< II Sử Ký 9 >

1 Khi Nữ vương Sê-ba nghe danh tiếng của Sa-lô-môn, bà bèn đến Giê-ru-sa-lem; đặt nhiều câu hỏi khó để thử tài Sa-lô-môn. Bà đến với một đoàn tùy tùng đông đảo, cùng đoàn lạc đà chở rất nhiều hương liệu, vàng, và ngọc. Khi gặp Sa-lô-môn, bà nói với vua tất cả những nghi vấn trong lòng.
షేబ రాణి సొలొమోను గొప్పతనం గూర్చి విని క్లిష్టమైన ప్రశ్నలతో అతనిని పరీక్షించాలని, గొప్ప పరివారంతో, సుగంధ ద్రవ్యాలు, విస్తారమైన బంగారం, ప్రశస్తమైన రత్నాలు ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేముకు వచ్చింది. ఆమె సొలొమోను దగ్గరికి వచ్చి తన మనస్సులోని విషయాలన్నిటి గురించి అతనితో మాటలాడింది.
2 Sa-lô-môn giải đáp các thắc mắc, không có điều gì là khó khăn cho vua.
సొలొమోను ఆమె ప్రశ్నలన్నిటినీ ఆమెకు విడమర్చి చెప్పాడు. అతడు ఆమెకు జవాబు చెప్పలేని గూఢమైన మాట ఏదీ లేకపోయింది.
3 Nữ vương Sê-ba thấy sự khôn ngoan của Sa-lô-môn và cung điện ông xây cất,
షేబ రాణి సొలొమోను జ్ఞానాన్నీ అతడు కట్టించిన నగరాన్నీ
4 bà vô cùng thán phục. Bà cũng rất ngạc nhiên về những thức ăn trên bàn vua, thứ tự uy nghi của các đại thần và áo quần lộng lẫy của họ, các quan tửu chánh cùng áo choàng của họ, và những tế lễ thiêu mà Sa-lô-môn dâng tại đền thờ của Chúa Hằng Hữu.
అతని భోజనపు బల్ల మీది పదార్ధాలు, అతని అధిపతులు కూర్చుండడం, అతని సేవకులు కనిపెట్టడం, వారి వస్త్రాలు, అతనికి గిన్నెలందించేవారు, వారి వస్త్రాలు, యెహోవా మందిరంలో అతడు అర్పించే దహన బలులు, వీటన్నిటినీ చూసినప్పుడు, ఆమె ఎంతో విస్మయానికి గురైంది.
5 Nữ vương nói với vua: “Thật đúng như lời người ta đồn đại trong nước tôi về thành tựu và sự khôn ngoan của vua!
ఆమె రాజుతో “నీ పనులను గురించీ, నీ జ్ఞానం గురించీ నేను నా దేశంలో విన్న సమాచారం నిజమైనదే గాని, నేను వచ్చి నా కళ్ళారా చూసేటంత వరకూ వారి మాటలు నమ్మలేదు.
6 Tuy nhiên, trước kia tôi không tin, mà nay thấy tận mắt rồi, tôi phải nhìn nhận người ta chỉ kể cho tôi một nửa sự thật thôi! Vua thật khôn ngoan bội phần!
నీ గొప్ప జ్ఞానం గూర్చి సగమైనా వారు నాకు చెప్పలేదు. నిన్ను గూర్చి నేను విన్నదాని కంటే నీ కీర్తి ఎంతో ఎక్కువగా ఉంది.
7 Con dân của vua thật có phước! Các cận thần ngày ngày chầu chực và nghe các lời châu ngọc của vua thật có phước!
నీ సేవకులెంత భాగ్యవంతులు! ఎల్లకాలం నీ సన్నిధిలో ఉండి నీ జ్ఞాన సంభాషణ వింటూ ఉండే నీ సేవకులు ఎంత ధన్యులు.
8 Đáng chúc tụng Chúa Hằng Hữu, Đức Chúa Trời vua, vì Ngài vui lòng đặt vua trên ngôi báu để thay Ngài cai trị. Vì Đức Chúa Trời yêu thương dân tộc Ít-ra-ên, lập vững dân này đến đời đời, và vì Ngài đặt vua lên cai trị họ để xét xử công minh và thi hành sự công chính.”
నీ దేవుడైన యెహోవా సన్నిధిలో రాజుగా ఆయన సింహాసనం మీద ఆసీనుడయ్యే విధంగా నీ పైన అనుగ్రహం చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రాలు కలుగు గాక. ఇశ్రాయేలీయులను నిత్యమూ స్థిరపరచాలన్న దయగల ఆలోచన నీ దేవునికి కలగడం వల్లనే నీతిన్యాయాలు జరిగించడానికి ఆయన నిన్ను వారిమీద రాజుగా నియమించాడు” అని చెప్పింది.
9 Nữ vương tặng vua 4.000 ký vàng, rất nhiều hương liệu, và ngọc quý. Từ trước đến nay, chưa có ai có loại hương liệu nào quý như hương liệu của Nữ vương Sê-ba tặng Vua Sa-lô-môn.
ఆమె రాజుకు 4,000 కిలోగ్రాముల బంగారాన్ని, విస్తారమైన సుగంధ ద్రవ్యాలనూ రత్నాలనూ ఇచ్చింది. షేబదేశపు రాణి సొలొమోను రాజుకి ఇచ్చిన సుగంధ ద్రవ్యాలతో మరేదీ సాటి రాదు.
10 (Trong chuyến đi Ô-phia lấy vàng, các thủy thủ của Hi-ram và Sa-lô-môn cũng chở về nhiều gỗ bạch đàn hương và bảo thạch.
౧౦అంతే కాక, ఓఫీరు నుండి బంగారం తెచ్చిన హీరాము పనివారూ సొలొమోను పనివారూ అక్కడి నుంచి గంధం మానులు, ప్రశస్తమైన రత్నాలు కూడా తెచ్చారు.
11 Vua dùng gỗ này làm các bực thềm trong Đền Thờ Chúa Hằng Hữu và cung điện, cùng làm các đàn thụ cầm và đàn hạc. Trước kia ở nước Giu-đa chưa bao giờ có loại gỗ quý này.)
౧౧ఆ గంధం కొయ్యలతో రాజు యెహోవా మందిరానికి, రాజనగరానికి మెట్లూ, గాయకులకి తంబురలూ సితారాలూ చేయించాడు. అటువంటి చెక్కడపు పని అంతకు ముందు యూదా దేశంలో ఎవ్వరూ చూడలేదు.
12 Vua Sa-lô-môn tặng Nữ vương Sê-ba tất cả những gì nữ vương yêu cầu—những tặng phẩm này còn giá trị hơn những thứ nữ vương đem đến tặng vua. Rồi bà cùng đoàn tùy tùng trở về nước.
౧౨షేబ దేశపు రాణి రాజుకు తీసుకు వచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానాలు కాక ఆమె ఇష్టపడి అడిగిన వాటన్నిటినీ సొలొమోను ఆమెకిచ్చాడు. ఆ తరువాత ఆమె తన సేవకులతో తన దేశానికి తిరిగి వెళ్లిపోయింది.
13 Mỗi năm, Sa-lô-môn thu được 25 tấn vàng.
౧౩సుగంధ ద్రవ్యాలు అమ్మే వర్తకులు, ఇతర వర్తకులు తీసుకొచ్చే బంగారం కాక సొలొమోనుకు ప్రతి సంవత్సరం వచ్చే బంగారం బరువు 23 వేల కిలోలు.
14 Chưa kể số vàng các thương gia và người bán dạo mang vào nước. Các vua A-rập và các tổng trấn trong nước đều đem vàng và bạc đến nạp cho Sa-lô-môn.
౧౪అరబ్బు దేశపు రాజులు, దేశాధిపతులు కూడా సొలొమోను దగ్గరికి బంగారం, వెండి తీసుకు వచ్చారు.
15 Vua Sa-lô-môn cho làm 200 chiếc khiên lớn bằng vàng gò, mỗi chiếc nặng 6,8 ký.
౧౫సొలొమోను రాజు బంగారాన్ని సాగగొట్టి 200 డాళ్ళు చేయించాడు. ఒక్కొక్క డాలుకు ఆరు కిలోగ్రాముల బంగారం పట్టింది.
16 Ông cũng cho làm 300 chiếc khiên nhỏ bằng vàng gò, mỗi chiếc nặng 3,4 ký. Tất cả các khiên ấy đều tồn trữ trong Cung Rừng Li-ban.
౧౬సాగగొట్టిన బంగారంతో 300 కవచాలు చేయించాడు. ఒక్కొక్క కవచానికి మూడు కిలోగ్రాముల బంగారం పట్టింది. వాటిని రాజు లెబానోను అరణ్యంలో ఉన్న తన అంతఃపురంలో ఉంచాడు.
17 Rồi Vua cho làm một chiếc ngai lớn bằng ngà bọc vàng ròng.
౧౭సొలొమోను రాజు దంతంతో ఒక గొప్ప సింహాసనం చేయించి మేలిమి బంగారంతో దాన్ని పొదిగించాడు.
18 Ngai có sáu bậc thang, và một cái bệ bằng vàng gắn chặt vào ngai và hai bên ngai có tay dựa, mỗi bên có hình sư tử bằng vàng.
౧౮ఆ సింహాసనానికి ఆరు బంగారు మెట్లు ఉన్నాయి. సింహాసనానికి బంగారు పాదపీఠం కట్టి ఉంది. కూర్చునే చోటికి రెండు వైపులా చేతి ఊతలున్నాయి. ఊతల దగ్గర రెండు సింహాలున్నాయి.
19 Trên sáu bậc thang có đúc mười hai sư tử, mỗi bên có sáu con. Đây là chiếc ngai đặc biệt không nước nào có cả!
౧౯ఆ ఆరు మెట్ల మీద రెండు వైపులా 12 సింహాల ఆకారాలు నిలబడి ఉన్నాయి. మరి ఏ రాజ్యంలోనూ అలాటి పని ఎవరూ చేసి ఉండలేదు.
20 Các ly uống nước của Sa-lô-môn đều được làm bằng vàng ròng, cũng như các dụng cụ trong Cung Rừng Li-ban làm bằng vàng ròng. Họ không làm bằng bạc vì trong đời Sa-lô-môn, bạc là loại tầm thường!
౨౦సొలొమోను రాజుకున్న పానపాత్రలన్నీ బంగారంతో చేసినవే. లెబానోను అరణ్యం అంతఃపురంలో ఉన్న వస్తువులన్నీ కూడా బంగారంతో చేశారు. హీరాము పంపిన పనివారితో కలిసి రాజు ఓడలు తర్షీషుకు పోయి మూడు సంవత్సరాలకు ఒకసారి బంగారం, వెండి, ఏనుగు దంతం, కోతులు, నెమళ్ళు మొదలైన సరకులతో వచ్చేవి.
21 Đoàn tàu của vua vượt biển qua Ta-rê-si với các thủy thủ của Hi-ram, cứ ba năm một lần, chở về cho Sa-lô-môn rất nhiều vàng, bạc, ngà, dã nhân, và công.
౨౧సొలొమోను కాలంలో వెండి అసలు లెక్కకు రాలేదు.
22 Vua Sa-lô-môn nổi danh là giàu có và khôn ngoan hơn hết các vua trên đất.
౨౨సొలొమోను రాజు భూమి పైన రాజులందరికంటే ఐశ్వర్యంలో, జ్ఞానంలో అధికుడయ్యాడు.
23 Vua các nước đều tìm dịp đến thăm vua và nghe những lời khôn ngoan Chúa đã đặt trong lòng vua.
౨౩దేవుడు సొలొమోను హృదయంలో ఉంచిన జ్ఞానోక్తులు వినడానికి భూరాజులంతా అతనిని దర్శించాలని కోరేవారు.
24 Hằng năm, các vua cũng tiến cống nhiều lễ vật, các khí cụ bằng bạc và vàng, các y phục, khí giới, hương liệu, ngựa, và la.
౨౪ఒక్కొక్కరూ ప్రతి సంవత్సరం వెండి, బంగారు వస్తువులు, వస్త్రాలు, ఆయుధాలు, సుగంధద్రవ్యాలు, గుర్రాలు, కంచర గాడిదలు కానుకలుగా తీసుకు వచ్చారు.
25 Sa-lô-môn có 4.000 tàu ngựa và chiến xa. Số kỵ binh của vua lên đến 12.000 chia nhau đóng giữ các căn cứ quân sự, bảo vệ vua và phòng thủ Giê-ru-sa-lem.
౨౫సొలొమోనుకు రథాలు నిలిపి ఉంచే పట్టణాల్లో, తన దగ్గర, యెరూషలేములో, గుర్రాలకు, రథాలకు 4,000 శాలలు ఉండేవి. 12,000 గుర్రపు రౌతులు ఉండేవారు.
26 Sa-lô-môn cai trị trên các vua chư hầu từ Sông Ơ-phơ-rát đến lãnh thổ Phi-li-tin và xuống tận biên giới Ai Cập.
౨౬యూఫ్రటిసు నది మొదలుకుని ఫిలిష్తీయుల దేశం వరకూ, ఐగుప్తు సరిహద్దు వరకూ ఉన్న రాజులందరిపై అతడు పరిపాలన చేశాడు.
27 Tại Giê-ru-sa-lem, vua làm cho bạc bị xem thường như đá, và gỗ bá hương, tùng bách như gỗ cây sung.
౨౭సొలొమోను యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారంగా, దేవదారు మ్రానులను షెఫేలా ప్రదేశంలో ఉన్న మేడివృక్షాలంత విస్తారంగా ఉండేలా చేశాడు.
28 Ngựa của Vua Sa-lô-môn được nhập từ Ai Cập và các nước khác.
౨౮ఐగుప్తు నుండీ ఇతర అన్ని దేశాల నుండీ సొలొమోనుకు గుర్రాలు సరఫరా అవుతూ ఉండేవి.
29 Các việc khác của Sa-lô-môn, từ đầu đến cuối đều ghi vào Sách của Tiên Tri Na-than và Sách Tiên Tri của A-hi-gia từ Si-lô, và cũng ghi trong Sách Khải Tượng của Nhà Tiên Kiến Y-đô, là sách ghi chép các biến cố liên hệ đến Giê-rô-bô-am, con Nê-bát.
౨౯సొలొమోను చేసిన కార్యాలన్నిటి గూర్చి నాతాను ప్రవక్త రాసిన గ్రంథంలో, షిలోనీయుడైన అహీయా రచించిన ప్రవచన గ్రంథంలో, నెబాతు కొడుకు యరొబాము గూర్చి దీర్ఘదర్శి ఇద్దో గ్రంథంలో రాసి ఉంది.
30 Sa-lô-môn trị vì tại Giê-ru-sa-lem trên toàn dân Ít-ra-ên được bốn mươi năm.
౩౦సొలొమోను యెరూషలేములో ఇశ్రాయేలీయులందరి మీద 40 సంవత్సరాలు పరిపాలించాడు.
31 Vua qua đời và được an táng trong Thành Đa-vít. Con trai ông là Rô-bô-am lên ngôi kế vị.
౩౧ఆ తరవాత సొలొమోను తన పూర్వీకులతో కన్నుమూశాడు. అతనిని అతని తండ్రి అయిన దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతనికి బదులుగా అతని కొడుకు రెహబాము రాజయ్యాడు.

< II Sử Ký 9 >