< II Sử Ký 21 >

1 Giô-sa-phát qua đời, được an táng với tổ phụ mình trong Thành Đa-vít. Con ông là Giô-ram lên ngôi kế vị cha.
యెహోషాపాతు చనిపోయినప్పుడు తన పూర్వీకులతో పాటు అతణ్ణి దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతని కొడుకు యెహోరాము అతని బదులు రాజయ్యాడు.
2 Anh em của Giô-ram—con trai của Giô-sa-phát—là A-xa-ria, Giê-hi-ên, Xa-cha-ri, A-xa-ra, Mi-ca-ên, và Sê-pha-tia; tất cả họ là con trai của Giô-sa-phát, vua Giu-đa.
యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, షెఫట్య అనేవారు ఇతనికి సోదరులు. వీరంతా ఇశ్రాయేలు రాజు యెహోషాపాతు కొడుకులు.
3 Vua cha đã cho họ nhiều tặng phẩm bằng bạc, vàng, bảo vật, với các thành kiên cố trong nước Giu-đa, nhưng giao vương quyền cho Giô-ram vì là trưởng nam.
వారి తండ్రి బహుమానాలుగా, వెండి, బంగారం ఇంకా ఎన్నో విలువైన వస్తువులను, యూదాదేశంలో గోడలున్న పట్టణాలను వారికిచ్చాడు. అయితే యెహోరాము తనకు పెద్ద కొడుకు కాబట్టి అతనికి రాజ్యాన్ని ఇచ్చాడు.
4 Vì muốn củng cố quyền hành, Giô-ram sát hại tất cả em ruột mình cùng một số lãnh đạo Ít-ra-ên.
యెహోరాము తన తండ్రి రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టి తన అధికారం సుస్థిరం చేసుకున్న తరువాత తాను స్థిరపడి, తన సోదరులందరినీ ఇశ్రాయేలీయుల అధిపతుల్లో కొంత మందినీ చంపేసాడు.
5 Giô-ram được ba mươi hai tuổi khi lên ngôi và trị vì tám năm tại Giê-ru-sa-lem.
యెహోరాము పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతనికి 32 ఏళ్ళు. అతడు యెరూషలేములో 8 ఏళ్ళు పాలించాడు.
6 Vua đi theo đường lối các vua Ít-ra-ên và gian ác như Vua A-háp, vì vua cưới con gái A-háp làm vợ. Vậy, Giô-ram làm điều ác trước mặt Chúa Hằng Hữu.
అతడు అహాబు కూతుర్ని పెళ్లి చేసుకుని, అహాబు సంతతివారు నడచిన ప్రకారం ఇశ్రాయేలు రాజుల పద్ధతుల్లో నడిచాడు. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించాడు.
7 Tuy nhiên, Chúa Hằng Hữu không muốn tiêu diệt gia tộc Đa-vít, vì giao ước Ngài đã lập với Đa-vít, và hứa rằng con cháu của ông sẽ tiếp tục cai trị và chiếu sáng như ngọn đèn mãi mãi.
అయినా యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన బట్టి, అతనికీ అతని కుమారులకూ ఎప్పుడూ జీవమిస్తానని చేసిన వాగ్దానం కోసం దావీదు సంతతిని నాశనం చేయడానికి ఇష్టపడలేదు.
8 Dưới đời trị vì của Giô-ram, người Ê-đôm nổi dậy chống Giu-đa và lập vua cho riêng mình.
యెహోరాము రోజుల్లో యూదా రాజుల అధికారానికి వ్యతిరేకంగా ఎదోమీయులు తిరుగుబాటు చేసి తమకు ఒక రాజును ఉంచుకున్నారు.
9 Giô-ram cùng toàn đội quân và các đoàn chiến xa, ban đêm thức dậy kéo quân tấn công quân đội Ê-đôm đang dùng chiến xa bao vây quân Giu-đa.
యెహోరాము తన అధికారులను వెంటబెట్టుకుని, తన రథాలన్నిటితో బయలుదేరి రాత్రివేళ లేచి తనను చుట్టుముట్టిన ఎదోమీయులనూ రథాధిపతులను చంపేసాడు.
10 Dù vậy, Ê-đôm vẫn thoát ách thống trị của Giu-đa cho đến ngày nay. Cùng lúc đó, Líp-na cũng phản nghịch với Giô-ram. Tất cả điều này xảy ra vì vua đã lìa bỏ Chúa Hằng Hữu, là Đức Chúa Trời của tổ phụ mình.
౧౦కాబట్టి ఇప్పటి వరకూ ఎదోమీయులు యూదావారి అధికారం కింద ఉండక తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. యెహోరాము తన పూర్వీకుల దేవుడైన యెహోవాను విస్మరించినందుకు అదే సమయంలో లిబ్నా పట్టణం కూడా అతని అధికారం కింద ఉండకుండాా తిరుగుబాటు చేసింది.
11 Giô-ram cũng lập các miếu thờ tà thần trên các đỉnh đồi núi xứ Giu-đa, gây cho dân chúng Giê-ru-sa-lem và Giu-đa phạm tội thờ tà thần và đi vào con đường sai lạc.
౧౧యెహోరాము యూదా కొండల్లో బలిపీఠాలు కట్టించి యెరూషలేము నివాసులు వేశ్యలా ప్రవర్తించేలా చేశాడు. ఈ విధంగా అతడు యూదావారిని తప్పుదారి పట్టించాడు.
12 Tiên tri Ê-li gửi thông điệp cho Giô-ram như sau: “Đây là điều Chúa Hằng Hữu, Đức Chúa Trời của Đa-vít tổ phụ của vua, đã phán: Ngươi không đi theo đường lối của Giô-sa-phát, cha ngươi, cũng chẳng đi theo đường lối của ông nội ngươi là A-sa, vua Giu-đa,
౧౨ఏలీయా ప్రవక్త నుంచి ఒక ఉత్తరం యెహోరాముకు వచ్చింది. దానిలో ఇలా ఉంది. “నీ పితరుడైన దావీదు దేవుడైన యెహోవా ఇలా చెబుతున్నాడు. ‘నీవు నీ తండ్రియైన యెహోషాపాతు మార్గాల్లో గానీ యూదారాజు ఆసా మార్గాల్లో గానీ నడుచుకోకుండా
13 nhưng lại đi theo đường lối của vua Ít-ra-ên, xúi giục người Giu-đa và Giê-ru-sa-lem phạm tội thờ hình tượng như Vua A-háp đã làm trong Ít-ra-ên. Hơn nữa, ngươi tàn sát các em ruột ngươi là những người tốt hơn ngươi.
౧౩ఇశ్రాయేలు రాజుల మార్గాల్లో నడచి అహాబు సంతతివారు చేసిన ప్రకారం యూదానూ యెరూషలేము నివాసులనూ వ్యభిచరింపజేసి, నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతానమైన నీ సోదరులను చంపావు.
14 Này, Chúa Hằng Hữu sẽ đổ tai họa lớn trên dân tộc ngươi, trên các con ngươi, trên các vợ ngươi, và trên tài sản ngươi.
౧౪కాబట్టి గొప్ప తెగులుతో యెహోవా నీ ప్రజలనూ నీ పిల్లలనూ నీ భార్యలనూ నీ సంపదనంతటినీ దెబ్బ తీస్తాడు.
15 Còn chính ngươi sẽ mắc bạo bệnh trong gan ruột, ngày càng trầm trọng cho đến khi gan ruột ngươi đứt rời ra.”
౧౫నీవు పేగుల్లో ఘోరమైన జబ్బుతో రోగిష్టిగా ఉంటావు. రోజురోజుకూ ఆ జబ్బుతో నీ పేగులు చెడిపోతాయి.’”
16 Chúa Hằng Hữu lại thúc giục người Phi-li-tin và người A-rập, sống ở gần nước Ê-thi-ô-pi, kéo quân tấn công Giô-ram.
౧౬యెహోవా యెహోరాము మీదికి ఫిలిష్తీయులను, ఇతియోపియాకు దగ్గరగా ఉన్న అరబీయులను రేపాడు.
17 Họ chiếm đóng Giu-đa, cướp đoạt các tài sản trong cung điện, bắt các con trai và các vợ của vua. Chỉ còn lại người con út là A-cha-xia.
౧౭వారు యూదాదేశంపై దాడి చేసి దానిలో చొరబడి రాజనగరులో దొరికిన సంపదనంతా, అతని కొడుకులనూ భార్యలనూ పట్టుకెళ్ళారు. అతని కొడుకుల్లో చివరి వాడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కొడుకును కూడా విడిచిపెట్టలేదు.
18 Sau hết, Chúa Hằng Hữu hành hạ Giô-ram, phạt vua bị bạo bệnh trong ruột.
౧౮ఇదంతా జరిగిన తరువాత యెహోవా అతని కడుపులో నయం కాని జబ్బు కలిగించాడు.
19 Ngày tháng trôi qua, bệnh càng trầm trọng; đến năm thứ nhì, ruột gan của Giô-ram đứt rời ra và vua qua đời trong một cơn đau khủng khiếp. Dân chúng không xông thuốc thơm để ướp xác vua như họ đã làm cho tổ phụ của vua.
౧౯రెండేళ్ళ తరువాత ఆ జబ్బు ముదిరి అతని పేగులు చెడిపోయి దుర్భరంగా చనిపోయాడు. అతని ప్రజలు అతని పూర్వీకులకు చేసిన అంత్యక్రియలు అతనికి చేయలేదు.
20 Giô-ram được ba mươi hai tuổi khi lên ngôi và trị vì tám năm tại Giê-ru-sa-lem. Khi vua qua đời, chẳng một người thương tiếc. Người ta an táng vua trong Thành Đa-vít, chứ không đặt trong khu lăng mộ các vua.
౨౦అతడు పరిపాలన చేయడం మొదలుపెట్టినప్పుడు 32 ఏళ్లవాడు. యెరూషలేములో 8 ఏళ్ళు పాలించి చనిపోయాడు. అతని మృతికి ఎవరూ విలపించలేదు. రాజుల సమాధుల్లో గాక దావీదు పట్టణంలో వేరే చోట ప్రజలు అతణ్ణి పాతిపెట్టారు.

< II Sử Ký 21 >