< I Sa-mu-ên 3 >
1 Sa-mu-ên trong tuổi thơ ấu phục vụ Chúa Hằng Hữu dưới sự hướng dẫn của Hê-li. Lúc ấy Chúa Hằng Hữu ít khi phán trực tiếp hay dùng khải tượng để dạy bảo loài người.
౧బాల సమూయేలు ఏలీ సమక్షంలో యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఆ రోజుల్లో యెహోవా స్వరం వినబడడం చాలా అరుదు. ఆయన ప్రత్యక్షం కావడం తరుచుగా జరిగేది కాదు.
2 Nhưng một đêm nọ, khi Hê-li đang nằm trên giường, bấy giờ mắt ông làng, không thấy rõ.
౨ఆ సమయంలో ఏలీ కంటి చూపు మందగించినందువల్ల అతడు ఏమీ చూడలేని స్థితిలో తన మంచంపై పండుకుని ఉన్నాడు.
3 Ngọn đèn của Đức Chúa Trời đang cháy, và Sa-mu-ên đang ngủ trong Đền Tạm, là nơi đặt Hòm Giao Ước của Đức Chúa Trời.
౩దేవుని మందసం ఉన్న యెహోవా మందిరంలోని దీపం అర్పివేయక ముందే, సమూయేలు నిద్రపోతూ ఉన్నాడు.
4 Thình lình có tiếng của Chúa Hằng Hữu gọi: “Sa-mu-ên!” Sa-mu-ên thưa: “Dạ, con đây!”
౪అప్పుడు యెహోవా సమూయేలును పిలిచాడు. అతడు “అయ్యగారూ, నేనిక్కడే ఉన్నాను” అన్నాడు.
5 Rồi cậu chạy đến cạnh Hê-li: “Ông vừa gọi con?” Hê-li đáp: “Ta không có gọi con. Hãy ngủ đi!” Vậy cậu lại đi nằm.
౫ఏలీ దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి “నన్ను పిలిచావు గదా, వచ్చాను” అన్నాడు. ఏలీ “నేను పిలవలేదు, వెళ్ళి నిద్రపో” అన్నాడు. అతడు వెళ్ళి నిద్రపోయడు.
6 Chúa Hằng Hữu lại gọi lần nữa: “Sa-mu-ên!” Sa-mu-ên vùng dậy, chạy đến Hê-li: “Dạ, con đây, ông gọi con có chuyện gì?” Hê-li nói: “Ta có gọi con đâu, con đi ngủ đi!”
౬యెహోవా రెండవసారి సమూయేలును పిలిచాడు. సమూయేలు లేచి ఏలీ దగ్గరికి వెళ్లి “అయ్యగారూ, నువ్వు పిలిచావని వచ్చాను” అన్నాడు. అందుకు అతడు “బాబూ, నేను పిలవలేదు, వెళ్ళి నిద్రపో” అని చెప్పాడు.
7 Sa-mu-ên chưa nhận biết Chúa Hằng Hữu vì cậu chưa bao giờ nhận sứ điệp từ Chúa Hằng Hữu.
౭అప్పటివరకూ సమూయేలు యెహోవా ప్రత్యక్షత పొందలేదు, యెహోవా మాట అతడికి ఇంకా వెల్లడి కాలేదు.
8 Chúa Hằng Hữu lại gọi lần thứ ba. Sa-mu-ên lại chạy đến Hê-li thưa: “Dạ, ông gọi con có việc gì?” Bây giờ, Hê-li mới hiểu chính Chúa Hằng Hữu gọi Sa-mu-ên.
౮యెహోవా మూడవసారి సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకి వెళ్ళి “అయ్యగారూ, నువ్వు నన్ను పిలిచావు గదా, ఇదిగో వచ్చాను” అన్నప్పుడు, యెహోవాయే అతణ్ణి పిలిచాడని ఏలీ గ్రహించాడు.
9 Vậy ông nói với Sa-mu-ên: “Con đi nằm lại đi. Nếu Chúa gọi lần nữa, con thưa: ‘Lạy Chúa Hằng Hữu, xin Ngài dạy; đầy tớ Ngài đang lắng nghe.’” Sa-mu-ên vâng lời, trở lại nằm tại chỗ mình.
౯అతడు “నువ్వు వెళ్ళి పడుకో. ఎవరైనా నిన్ను పిలిస్తే, ‘యెహోవా, నీ దాసుడు వింటున్నాడు, ఏమి చేయాలో చెప్పండి’ అని చెప్పు” అని సమూయేలుతో చెప్పాడు. సమూయేలు వెళ్ళి తన స్థలంలో పండుకున్నాడు.
10 Chúa Hằng Hữu đến gọi như những lần trước: “Sa-mu-ên! Sa-mu-ên!” Sa-mu-ên thưa: “Xin Chúa phán dạy, đầy tớ Ngài đang lắng nghe.”
౧౦తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలబడి అదే విధంగా “సమూయేలూ సమూయేలూ” అని పిలిచినప్పుడు సమూయేలు “నీ దాసుడు వింటున్నాడు, ఏమిటో చెప్పండి” అన్నాడు.
11 Chúa Hằng Hữu phán bảo Sa-mu-ên: “Ta sắp làm một việc cho Ít-ra-ên, ai nghe đến việc này tai phải lùng bùng.
౧౧అప్పుడు యెహోవా సమూయేలుతో ఇలా చెప్పాడు. “ఇశ్రాయేలు ప్రజల మధ్య నేనొక పని చేయబోతున్నాను. దాన్ని గురించి తెలుసుకున్నవారి చెవులు హోరెత్తుతాయి.
12 Ta sẽ thực hiện những điều Ta đã phán với Hê-li về gia đình người.
౧౨ఆ రోజున ఏలీ కుటుంబం వారిని గురించి నేను చెప్పినదంతా వారి పైకి రప్పిస్తాను. నేనే దాన్ని చేయడం మొదలుపెట్టి ముగిస్తాను.
13 Vì Ta đã cảnh cáo Hê-li là Ta sẽ trừng phạt gia đình người vì tội các con của người đã phạm với Ta. Chính Hê-li thừa biết nhưng không cấm đoán.
౧౩తన కొడుకులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొంటున్నారని తెలిసి కూడా ఏలీ వారిని అడ్డగించలేదు కాబట్టి అతని కుటుంబానికి శాశ్వత శిక్ష విధిస్తానని నేను అతనికి తెలియజేస్తున్నాను.
14 Vì vậy, Ta thề rằng tội của Hê-li và gia đình người sẽ không bao giờ chuộc được, dù bằng sinh tế hay lễ vật.”
౧౪కాబట్టి ఏలీ కుటుంబం వారి దోషానికి బలిమూలంగా గానీ, అర్పణ మూలంగా గానీ ఎప్పటికీ క్షమాపణ ఉండదు అని శపథం చేశాను.”
15 Sa-mu-ên nằm cho đến sáng mới dậy và mở cửa Đền Tạm như thường lệ, vì sợ phải kể cho Hê-li việc Chúa Hằng Hữu nói với ông.
౧౫తరువాత సమూయేలు తెల్లవారేదాకా పండుకుని, లేచి యెహోవా ఆలయం తలుపులు తీశాడు గానీ భయం వేసి తనకు వచ్చిన దర్శనం విషయం ఏలీతో చెప్పలేకపోయాడు.
16 Nhưng Hê-li gọi: “Sa-mu-ên, con ơi!” Sa-mu-ên thưa: “Dạ, con đây.”
౧౬అయితే ఏలీ “సమూయేలూ, కుమారా” అని సమూయేలును పిలిచాడు. అతడు “చిత్తం, నేనిక్కడ ఉన్నాను” అన్నాడు.
17 Hê-li nói: “Kể cho ta nghe mọi lời Chúa Hằng Hữu đã nói, đừng giấu gì cả, nếu con giấu một lời nào, xin Đức Chúa Trời trừng phạt con.”
౧౭ఏలీ “నీకు యెహోవా ఏమి చెప్పాడో దాచకుండా దయచేసి నాతో చెప్పు. ఆయన నీతో చెప్పిన విషయాల్లో ఏదైనా చెప్పకుండా దాచిపెడితే దానికంటే ఎక్కువ ప్రమాదం ఆయన నీకు కలుగజేస్తాడు గాక” అనగా,
18 Vậy, Sa-mu-ên kể lại cho ông nghe tất cả. Ông nói: “Đó là ý muốn của Chúa Hằng Hữu. Xin Chúa làm điều gì Ngài thấy là tốt.”
౧౮సమూయేలు దేనినీ దాచకుండా విషయం అంతా అతనికి తెలియజేశాడు. అది విని ఏలీ “చెప్పినవాడు యెహోవా. ఆయన దృష్ఠికి ఏది అనుకూలమో దాన్ని ఆయన చేస్తాడు గాక” అన్నాడు.
19 Sa-mu-ên lớn lên, Chúa Hằng Hữu ở cùng người và không để cho một lời nào người nói thành ra vô ích.
౧౯సమూయేలు పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు యెహోవా అతనికి తోడుగా ఉన్నందువల్ల దేవుని మాటల్లో ఏదీ తప్పిపోలేదు.
20 Toàn dân Ít-ra-ên từ Đan cho đến Bê-e-sê-ba đều biết rằng Sa-mu-ên được chọn làm tiên tri của Chúa Hằng Hữu.
౨౦కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడ్డాడని దాను ప్రాంతం నుండి బెయేర్షెబా వరకూ ఇశ్రాయేలీయులంతా తెలుసుకున్నారు.
21 Chúa Hằng Hữu đã hiện ra tại Si-lô, và truyền dạy lời Ngài cho Sa-mu-ên trong Đền Tạm.
౨౧షిలోహులో యెహోవా మళ్ళీ దర్శనమిస్తూ వచ్చాడు. షిలోహులో యెహోవా తన వాక్కు ద్వారా తనను సమూయేలుకు ప్రత్యక్ష పరచుకుంటూ వచ్చాడు. సమూయేలు ద్వారా దేవుని వాక్కు ఇశ్రాయేలీయులకు వెల్లడి అయింది.