< I Sa-mu-ên 23 >

1 Đa-vít được tin người Phi-li-tin kéo đến Kê-i-la và cướp phá các sân đạp lúa.
తరువాత ఫిలిష్తీయులు కెయీలా మీద యుద్ధం చేసి కళ్ళాల మీద ఉన్న ధాన్యం దోచుకొంటున్నారని దావీదుకు తెలిసింది.
2 Đa-vít cầu hỏi Chúa Hằng Hữu: “Con có nên đi đánh những người Phi-li-tin này không?” Chúa Hằng Hữu phán với ông: “Nên. Hãy đi và cứu Kê-i-la.”
అప్పుడు దావీదు “నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులను చంపమంటావా” అని యెహోవా దగ్గర విచారణ చేస్తే, యెహోవా “నీవు వెళ్లి ఫిలిష్తీయులను చంపి కెయీలాను కాపాడు” అని దావీదుతో చెప్పాడు.
3 Tuy nhiên, các thuộc hạ của Đa-vít bàn: “Ở ngay đây, trong đất Giu-đa, chúng ta còn sợ, huống hồ gì đi Kê-i-la đánh quân Phi-li-tin!”
దావీదుతో ఉన్నవారు “మేము ఇక్కడ యూదా దేశంలో ఉన్నప్పటికీ మాకు భయంగా ఉంది. కెయీలాలో ఫిలిష్తీయ సైన్యాలకు ఎదురుపడితే మాకు మరింత భయం గదా” అని దావీదుతో అన్నారు.
4 Đa-vít cầu hỏi Chúa Hằng Hữu lần nữa, Chúa Hằng Hữu đáp: “Hãy đi xuống Kê-i-la đi, Ta sẽ cho con thắng người Phi-li-tin.”
దావీదు మళ్ళీ యెహోవా దగ్గర విచారణ చేశాడు. “నువ్వు లేచి కెయీలాకు వెళ్లు, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగిస్తున్నాను” అని యెహోవా చెప్పాడు.
5 Vậy, Đa-vít cùng thuộc hạ kéo xuống Kê-i-la, đánh tan quân Phi-li-tin, giết vô số địch, bắt hết súc vật của họ và cứu người Kê-i-la.
దావీదు, అతని అనుచరులూ కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని పూర్తిగా చంపేసి వారి పశువుల మందలను దోచుకున్నారు. ఈ విధంగా దావీదు కెయీలా నివాసులను కాపాడాడు.
6 Khi trốn đến với Đa-vít và theo ông đi Kê-i-la, A-bia-tha, con A-hi-mê-léc có mang theo ê-phót bên mình.
దావీదు కెయీలాకు బయలుదేరితే అహీమెలెకు కొడుకు అబ్యాతారు ఏఫోదు చేత పట్టుకుని పారిపోయి అతని దగ్గరికి వచ్చాడు.
7 Khi Sau-lơ được tin Đa-vít đến Kê-i-la, vua nói: “Đức Chúa Trời giao mạng hắn cho ta đây, vì hắn tự giam mình trong một thành nhỏ có nhiều cổng và chấn song.”
దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని “దావీదు తలుపులూ, అడ్డుగడలు ఉన్న పట్టణంలో ప్రవేశించి అందులో చిక్కుకుపోయి ఉన్నాడు. దేవుడు అతణ్ణి నా చేతికి అప్పగించాడు” అనుకున్నాడు.
8 Sau-lơ huy động toàn lực kéo đến Kê-i-la để vây Đa-vít và thuộc hạ.
అందుకే సౌలు కెయీలాకు వెళ్ళి దావీదునూ అతని అనుచరులనూ మట్టుబెట్టాలని తన సైన్యాన్ని యుద్ధానికి పిలిపించాడు.
9 Nhưng Đa-vít biết được Sau-lơ tính kế hại mình, nên bảo A-bia-tha đem ê-phót đến.
సౌలు తనకు కీడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని దావీదు గ్రహించి యాజకుడైన అబ్యాతారును ఏఫోదు తీసుకురమ్మన్నాడు.
10 Đa-vít cầu hỏi: “Lạy Chúa Hằng Hữu, Đức Chúa Trời của Ít-ra-ên, con có nghe Sau-lơ định đến Kê-i-la phá thành bắt con.
౧౦అప్పుడు దావీదు “ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బంధించి పట్టణాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడని నీ దాసుడనైన నాకు కచ్చితంగా తెలిసింది.
11 Người Kê-i-la sẽ nạp con cho Sau-lơ không? Sau-lơ sẽ đến như con đã nghe không? Lạy Chúa Hằng Hữu, Đức Chúa Trời của Ít-ra-ên, xin cho con biết.” Chúa Hằng Hữu đáp: “Sau-lơ sẽ đến.”
౧౧కెయీలా ప్రజలు నన్ను అతని చేతికి అప్పగిస్తారా? నీ దాసుడనైన నాకు తెలిసినట్టుగా సౌలు వస్తాడా? ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దాన్ని తెలియజెయ్యి” అని ప్రార్థిస్తే “అతడు వస్తాడు” అని యెహోవా బదులిచ్చాడు.
12 Đa-vít hỏi nữa: “Người Kê-i-la sẽ nạp con cho Sau-lơ không?” Chúa Hằng Hữu đáp: “Có, họ sẽ nạp con.”
౧౨“కెయీలా ప్రజలు నన్నూ నా ప్రజలనూ సౌలు చేతికి అప్పగిస్తారా?” అని దావీదు తిరిగి అడిగితే, యెహోవా “వారు నిన్ను అప్పగించాలని ఉన్నారు” అన్నాడు.
13 Vậy, Đa-vít cùng thuộc hạ chừng 600 người, bỏ Kê-i-la, đi rải ra khắp nơi. Và khi nghe tin Đa-vít bỏ Kê-i-la, Sau-lơ không đi đến đó nữa.
౧౩దావీదు, సుమారు 600 మంది అతని అనుచరులు లేచి కెయీలా నుండి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ భద్రంగా ఉన్న స్థలాలకు చేరుకున్నారు. దావీదు కెయీలా నుండి తప్పించుకొన్న విషయం సౌలుకు తెలిసి వెళ్లకుండా మానుకున్నాడు.
14 Sau đó, Đa-vít hoạt động trong vùng đồi núi thuộc hoang mạc Xíp. Sau-lơ vẫn tiếp tục săn đuổi Đa-vít hằng ngày, nhưng Đức Chúa Trời không để vua gặp Đa-vít.
౧౪దావీదు సురక్షితమైన కొండ ప్రాంతంలో జీఫు ఎడారిలో ఉంటున్నాడు. సౌలు ప్రతిరోజూ అతణ్ణి వెదుకుతున్నప్పటికీ దేవుడు సౌలు చేతికి అప్పగించలేదు.
15 Lúc đang ở Hô-rết thuộc hoang mạc Xíp, Đa-vít được tin Sau-lơ sắp đến để giết mình.
౧౫తన ప్రాణం తీయాలని సౌలు బయలుదేరాడని తెలిసిన దావీదు హోరేషులో జీఫు అరణ్య ప్రాంతంలో దిగాడు.
16 Nhưng một hôm, Giô-na-than đến kiếm Đa-vít và khích lệ ông vững lòng tin cậy Đức Chúa Trời.
౧౬అప్పుడు సౌలు కొడుకు యోనాతాను తోటలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చి “నా తండ్రి సౌలు నిన్ను పట్టుకోలేడు, నువ్వేమీ భయపడకు.
17 Giô-na-than nói: “Anh đừng lo, cha tôi sẽ không bắt được anh đâu. Anh sẽ làm vua Ít-ra-ên và tôi sẽ làm tể tướng; cha tôi biết rõ như thế.”
౧౭నువ్వు తప్పక ఇశ్రాయేలీయులకు రాజు అవుతావు. నేను నీకు సహాయకునిగా ఉంటాను. ఈ విషయం నా తండ్రి సౌలుకు తెలిసిపోయింది” అని అతనితో చెప్పి దేవుని పేరట అతణ్ణి బలపరిచాడు.
18 Hai người lại lập ước trước mặt Chúa Hằng Hữu, rồi Giô-na-than về nhà, còn Đa-vít ở lại Hô-rết.
౧౮వీరిద్దరూ యెహోవా సన్నిధానంలో ఒప్పందం చేసుకొన్న తరువాత దావీదు అక్కడే నిలిచిపోయాడు, హోరేషు, యోనాతాను వారి ఇంటికి వెళ్ళిపోయారు.
19 Người Xíp đến Ghi-bê-a báo với Sau-lơ: “Đa-vít đang ẩn trong đất chúng tôi tại Hô-rết, trên đồi Ha-chi-la ở phía nam hoang mạc.
౧౯జీఫీయులు బయలుదేరి గిబియాలో ఉన్న సౌలు దగ్గరికి వచ్చి “యెషీమోనుకు దక్షిణ దిక్కులో ఉన్న హకీలా అడవిలోని కొండ స్థలాల్లో మా ప్రాంతంలో దావీదు దాక్కుని ఉన్నాడు.
20 Nếu vua xuống đó, chúng tôi sẽ bắt hắn nạp cho vua!”
౨౦రాజా, నీ కోరిక తీరేలా మాతో బయలుదేరు. రాజవైన నీ చేతికి అతణ్ణి అప్పగించడం మా పని” అని చెప్పారు.
21 Sau-lơ nói: “Xin Chúa Hằng Hữu ban phước lành cho các ngươi vì đã có lòng thương ta.
౨౧సౌలు వారితో ఇలా అన్నాడు. “మీరు నాపై చూపిన అభిమానాన్ని బట్టి యెహోవా మిమ్మల్ని దీవిస్తాడు గాక.
22 Bây giờ các ngươi hãy trở về dò lại cho kỹ xem nó đang ở nơi nào, và ai đã trông thấy hắn, vì nghe nói hắn rất mưu mô quỷ quyệt.
౨౨మీరు వెళ్ళి అతడు దాగిన స్థలం ఏదో, అతణ్ణి చూసినవాడు ఎవరో కచ్చితంగా తెలుసుకోండి. అతడు ఎంతో చాకచక్యంగా ప్రవర్తిస్తున్నాడని నాకు తెలిసింది కాబట్టి
23 Các ngươi nhớ tìm cho ra tất cả nơi hắn trú ẩn, rồi trở lại trình báo rõ ràng hơn. Lúc ấy ta sẽ đi với các ngươi. Nếu hắn ở trong vùng ấy, ta sẽ tìm được, dù phải truy tìm khắp mọi nơi trong lãnh thổ Giu-đa.”
౨౩మీరు ఎంతో జాగ్రత్తగా అతడు దాక్కొన్న ప్రాంతాలను కనిపెట్టిన సంగతి అంతా నాకు తెలియజేయడానికి మళ్ళీ నా దగ్గరికి తప్పకుండా రండి, అప్పుడు నేను మీతో కలసి వస్తాను. అతడు దేశంలో ఎక్కడ ఉన్నప్పటికీ యూదావారందరిలో నేను అతణ్ణి వెతికి పట్టుకొంటాను” అని చెప్పాడు.
24 Họ vâng lời, trở về Xíp. Trong khi Đa-vít và thuộc hạ của ông ở trong hoang mạc Ma-ôn, thuộc Thung Lũng A-ra-ba, phía nam Giê-si-môn.
౨౪వారు లేచి సౌలు కంటే ముందుగా జీఫుకు తిరిగి వెళ్లారు. దావీదు, అతని అనుచరులూ యెషీమోనుకు దక్షిణ వైపున ఉన్న మైదానంలోని మాయోను ఎడారి ప్రాంతంలో ఉన్నప్పుడు,
25 Đa-vít hay tin Sau-lơ và thuộc hạ người lùng bắt mình, ông liền trốn đến vầng đá trong hoang mạc Ma-ôn. Nhưng Sau-lơ hay được nên cũng đi đến đó.
౨౫సౌలు, అతని బలగమూ తనను వెదికేందుకు బయలుదేరారన్న మాట దావీదు విని, కొండ పైభాగంలోని మాయోను ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఆది విన్న సౌలు మాయోను ఎడారిలో దావీదును తరుమబోయాడు.
26 Sau-lơ đi phía bên này một triền núi, trong lúc Đa-vít cùng các thuộc hạ ở phía bên kia. Mặc dù cố gắng di chuyển thật nhanh, Đa-vít vẫn không thoát vòng vây của quân Sau-lơ. Ngay lúc họ tiến lên để bắt Đa-vít,
౨౬కొండకు ఒకవైపు సౌలు, మరోవైపు దావీదు, అతని అనుచరులు వెళ్తున్నపుడు దావీదు సౌలు నుండి తప్పించుకుపోవాలని తొందరపడుతున్నాడు. సౌలు, అతని సైనికులు దావీదును, అతని అనుచరులను పట్టుకోవాలని వారిని చుట్టుముడుతున్నారు.
27 có một người đem tin chạy đến nói với Sau-lơ: “Xin vua về ngay. Quân Phi-li-tin đang kéo đến đánh ta.”
౨౭ఇలా జరుగుతున్నప్పుడు గూఢచారి ఒకడు సౌలు దగ్గరికి వచ్చి “నువ్వు త్వరగా బయలుదేరు, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడ్డారు” అని చెబితే
28 Sau-lơ thôi đuổi theo Đa-vít, quay về đánh Phi-li-tin. Từ lúc ấy, nơi này được gọi là Tảng Đá Phân Rẽ.
౨౮సౌలు దావీదును తరమడం మానుకుని ఫిలిష్తీయులను ఎదుర్కొనడానికి వెనక్కి తిరిగి వెళ్ళాడు. కాబట్టి ఆ స్థలానికి సెలహమ్మలెకోతు అని పేరు పెట్టబడింది.
29 Rồi Đa-vít đến ẩn trú trong vùng Ên-ghê-đi.
౨౯తరువాత దావీదు అక్కడనుండి వెళ్ళి ఏన్గెదీకి వచ్చి కొండ ప్రాంతలో నివాసం ఏర్పరచుకున్నాడు.

< I Sa-mu-ên 23 >