< I Sa-mu-ên 18 >
1 Sau khi Đa-vít trò chuyện với Sau-lơ xong, người gặp Giô-na-than, con trai của vua. Lập tức có mối thâm tình giữa họ, vì Giô-na-than yêu mến Đa-vít lắm.
౧దావీదు సౌలుతో మాట్లాడడం అయిపోయిన తరువాత, యోనాతాను మనసు దావీదు మనసుతో పెనవేసుకు పోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణస్నేహితునిగా భావించుకుని అతణ్ణి ప్రేమించాడు.
2 Từ đó Sau-lơ giữ Đa-vít ở lại, không để ông trở về nhà cha nữa.
౨ఆ రోజు దావీదును అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనీయకుండా సౌలు తన దగ్గరే ఉంచుకున్నాడు.
3 Giô-na-than kết nghĩa với Đa-vít và yêu thương Đa-vít hết lòng.
౩యోనాతాను దావీదును తన ప్రాణంతో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి అతనితో ఒప్పందం చేసుకున్నాడు.
4 Giô-na-than cởi áo mình mặc cho Đa-vít, và còn cho Đa-vít áo giáp, gươm, cung, và đai thắt lưng của mình nữa.
౪యోనాతాను తన దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టును తీసి దావీదుకు ఇచ్చాడు.
5 Mỗi khi Sau-lơ giao cho Đa-vít việc gì, công việc đều kết quả tốt đẹp. Vì thế, Sau-lơ phong Đa-vít làm tướng chỉ huy quân đội. Đa-vít được lòng mọi người, từ dân cho đến quần thần trong triều Sau-lơ.
౫దావీదు, సౌలు తనను పంపిన ప్రతి చోటుకీ వెళ్ళి, తెలివిగా పనులు సాధించుకుంటూ వచ్చాడు. సౌలు తన సైన్యంలో అధిపతిగా అతణ్ణి నియమించాడు. ప్రజల దృష్టిలో, సౌలు సేవకుల దృష్టిలో దావీదు అనుకూలంగా ఉన్నాడు.
6 Sau khi Đa-vít giết người Phi-li-tin và đoàn quân Ít-ra-ên chiến thắng trở về, phụ nữ trong khắp các thành thị Ít-ra-ên kéo ra múa hát chào mừng Vua Sau-lơ. Họ vui vẻ hát hò và nhảy múa theo tiếng trống cơm và chập chõa.
౬వారు ఫిలిష్తీయులను ఓడించి, తిరిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఊళ్ళల్లో ఉన్న స్త్రీలంతా అమిత ఆనందంగా తంబురలతో, వాయిద్యాలతో పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును ఎదుర్కున్నారు.
7 Bài hát như sau: “Sau-lơ giết hàng nghìn, Đa-vít giết hàng vạn!”
౭ఆ స్త్రీలు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ: “సౌలు వెయ్యిమందిని, దావీదు పదివేలమందినీ చంపేశారు.” అని పాడారు.
8 Nghe thế, Sau-lơ giận lắm. Vua nói: “Người ta tán tụng Đa-vít giết hàng vạn, còn ta chỉ có hàng nghìn. Kế đến họ sẽ tôn nó làm vua của mình!”
౮ఈ పాట సౌలుకు నచ్చలేదు, అతనికి చాలా కోపం వచ్చింది. “వారు దావీదుకు పదివేలమంది అన్నారు కానీ నాకు వెయ్యిమందే అన్నారు. రాజ్యం కాకుండా అతడు ఇంకేం తీసుకోగలడు” అని మనసులో అనుకున్నాడు.
9 Từ hôm ấy, Sau-lơ thường nhìn Đa-vít với con mắt ganh tị.
౯అప్పటినుండి సౌలు దావీదుపై కక్ష పెంచుకున్నాడు.
10 Hôm sau, Đức Chúa Trời sai ác thần quấy phá Sau-lơ, và vua nói lảm nhảm trong lúc mê sảng. Đa-vít đến khảy đàn như những lần trước.
౧౦తరువాతి రోజు దేవుని నుండి దురాత్మ సౌలు మీదికి బలంగా దిగి వచ్చింది. అతడు ఇంట్లో పూనకంలో మాట్లాడుతున్నప్పుడు దావీదు ఎప్పటిలాగే తంతి వాద్యం తీసుకుని వాయించాడు.
11 Cầm một cây giáo, Sau-lơ phóng, định ghim Đa-vít vào tường. Nhưng Đa-vít tránh được hai lần như thế.
౧౧ఒకసారి సౌలు తన చేతిలో ఉన్న ఈటెతో దావీదును గోడకు గుచ్చేస్తాననుకుని ఆ ఈటెను దావీదు మీద బలంగా విసిరాడు. అయితే అది తనకు తగలకుండా దావీదు రెండుసార్లు తప్పించుకున్నాడు.
12 Sau-lơ sợ Đa-vít, vì Chúa Hằng Hữu ở với Đa-vít và từ bỏ Sau-lơ.
౧౨యెహోవా తనను విడిచిపెట్టి దావీదుకు తోడుగా ఉండడం చూసి సౌలు దావీదు పట్ల భయం పెంచుకున్నాడు.
13 Cuối cùng, Sau-lơ đẩy Đa-vít đi xa và cho ông chỉ huy 1.000 quân, Đa-vít trung thành dẫn quân vào trận mạc.
౧౩అందుకని సౌలు దావీదును తన దగ్గర ఉండకుండాా సైనికులకు నాయకుడుగా నియమించాడు. అతడు ప్రజలందరితో కలిసిమెలిసి ఉన్నాడు.
14 Đa-vít thành công trong mọi việc, vì Chúa Hằng Hữu ở với ông.
౧౪దావీదుకు యెహోవా తోడుగా ఉండడంవల్ల అన్ని విషయాల్లో తెలివితేటలతో ప్రవర్తిస్తూ వచ్చాడు.
15 Sau-lơ thấy Đa-vít thành công như thế lại càng thêm sợ.
౧౫దావీదు మరింతగా అభివృద్ధి పొందడం సౌలు చూసి ఇంకా ఎక్కువగా భయపడ్డాడు.
16 Trong khi đó Đa-vít càng được người Ít-ra-ên và Giu-đa cảm mến vì ông rất thành công khi chỉ huy họ ngoài trận mạc.
౧౬దావీదు ఇశ్రాయేలువారితో, యూదావారితో కలిసిమెలిసి ఉండడంవల్ల వారు అతణ్ణి ప్రేమించారు.
17 Một hôm, Sau-lơ nói với Đa-vít: “Ta sẽ gả con gái lớn của ta là Mê-ráp cho con làm vợ. Nhưng con phải can đảm giúp ta và chiến đấu cho Chúa Hằng Hữu.” Nói thế vì Sau-lơ nghĩ: “Ta sai nó chống lại quân Phi-li-tin để họ giết hắn hơn là ta phải ra tay.”
౧౭సౌలు “నా చేతిలో అతడు చావకూడదు, ఫిలిష్తీయుల చేతిలో పడాలి” అనుకుని దావీదుతో “నా పెద్ద కూతురు మేరబు ఇదిగో. ఆమెను నీకు భార్యగా ఇస్తాను. కేవలం నీవు నా కోసం ధైర్యంగా ఉండి, యెహోవా యుద్ధాలు చేస్తూ ఉండు” అన్నాడు.
18 Nhưng Đa-vít đáp: “Tôi là ai và thân phận của tôi có là gì trong Ít-ra-ên đâu mà được làm phò mã của vua? Gia tộc của cha tôi cũng chẳng là gì!”
౧౮దావీదు “రాజువైన నీకు అల్లుణ్ణి కావడానికి నేనెంతటివాణ్ణి? నా స్తోమతు ఎంతటిది? ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబం ఏపాటిది?” అని సౌలుతో అన్నాడు.
19 Tuy nhiên, đến ngày Sau-lơ gả Mê-ráp, con gái mình cho Đa-vít, thì vua lại gả nàng cho Át-ri-ên, người Mê-hô-la.
౧౯అయితే సౌలు తన కుమార్తె మేరబును దావీదుకు ఇచ్చి పెళ్లి చేయవలసి ఉండగా, ఆమెను మెహోల గ్రామం వాడైన అద్రీయేలుకు ఇచ్చి పెళ్లి చేశాడు.
20 Khi ấy, Mi-canh, con gái của Sau-lơ, lại yêu Đa-vít. Khi nghe điều này Sau-lơ lấy làm thích thú.
౨౦అయితే సౌలు కూతురు మీకాలు దావీదును ప్రేమించింది. సౌలు అది విని సంతోషించాడు.
21 Ông nhủ thầm: “Gả con cho hắn để rồi dùng con ta hại hắn, như vậy hắn dễ bị người Phi-li-tin giết hơn!” Nhưng ông lại nói với Đa-vít: “Hôm nay con có thể làm phò mã thật rồi.”
౨౧“ఆమెను అతనికిచ్చి పెళ్లి చేస్తాను. ఆమె అతనికి ఉరి లాగా ఉంటుంది, ఫిలిష్తీయుల చెయ్యి అతనికి వ్యతిరేకంగా ఉంటుంది.” అని అనుకున్నాడు. సౌలు, రెండోసారి దావీదుతో “నువ్వు నా అల్లుడౌతున్నావు” అని చెప్పాడు.
22 Sau-lơ cũng sai bầy tôi mình nói với Đa-vít: “Ông được lòng vua lắm, và quần thần đều mến yêu ông. Tại sao ông không chấp nhận lời đề nghị của vua và làm phò mã?”
౨౨సౌలు తన సేవకులతో ఇలా ఆజ్ఞాపించాడు “మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడండి, ‘రాజుకు నువ్వంటే ఇష్టం కలిగింది. రాజు సేవకులంతా నీపట్ల స్నేహంగా ఉన్నారు. కాబట్టి నువ్వు రాజుకు అల్లుడివి కావాలి’ అని చెప్పండి.”
23 Khi các bầy tôi của Sau-lơ nói những điều này với Đa-vít xong, chàng trả lời: “Làm thế nào một người nghèo mọn thấp hèn có thể cưới con gái của vua?”
౨౩సౌలు సేవకులు దావీదుతో మాట్లాడినప్పుడు అతడు “నేను పేదవాణ్ణి, పేరు ప్రఖ్యాతులు లేనివాణ్ణి. రాజుకు అల్లుడు కావడమంటే ఆది చిన్న విషయంగా మీకు అనిపిస్తుందా?” అని వారితో అన్నాడు.
24 Các bầy tôi của Sau-lơ đem chuyện trình lại với vua,
౨౪సౌలు సేవకులు దావీదు చెప్పిన మాటలు అతనికి తెలియచేశారు.
25 ông dặn họ: “Hãy nói với Đa-vít rằng, sính lễ ta muốn là 100 dương bì của người Phi-li-tin! Ta chỉ muốn trả thù quân địch mà thôi.” Nói thế vì Sau-lơ nghĩ đây là dịp cho người Phi-li-tin giết Đa-vít.
౨౫ఫిలిష్తీయుల చేతికి దావీదు చిక్కేలా చేయాలన్న తలంపుతో సౌలు “రాజు కన్యాశుల్కం ఏమీ కోరడం లేదు, అయితే రాజు శత్రువులమీద పగతీర్చుకోవడానికి కేవలం వందమంది ఫిలిష్తీయుల మర్మాంగ చర్మాలు తీసుకురావాలని కోరుతున్నాడని దావీదుకు చెప్పండి” అన్నాడు.
26 Nghe điều kiện này, Đa-vít vui vẻ chấp nhận. Trước khi hết thời hạn,
౨౬సౌలు సేవకులు ఆ మాటలు దావీదుకు చెప్పినప్పుడు, రాజుకు అల్లుడు కావాలన్న కోరికతో
27 Đa-vít dẫn thuộc hạ đi đánh giết 200 người Phi-li-tin, đem dương bì của họ nộp cho vua để được làm phò mã. Vậy Sau-lơ gả Mi-canh cho Đa-vít.
౨౭గడువుకంటే ముందుగానే లేచి తన మనుషులతో వెళ్ళి ఫిలిష్తీయుల్లో 200 మందిని చంపి వారి మర్మాంగ చర్మాలు తీసుకువచ్చి, రాజుకు అల్లుడు అయ్యేందుకు అవసరమైన లెక్క పూర్తిచేసి అప్పగించాడు. సౌలు తన కుమార్తె మీకాలును అతనికిచ్చి పెళ్లి చేశాడు.
28 Khi ý thức rõ ràng Chúa Hằng Hữu ở cùng Đa-vít và thấy Mi-canh thật tình yêu quý chồng,
౨౮యెహోవా దావీదుకు తోడుగా ఉండడం, తన కుమార్తె మీకాలు అతణ్ణి ప్రేమించడం చూసి,
29 Sau-lơ càng thêm sợ và căm thù Đa-vít không nguôi.
౨౯సౌలు దావీదు అంటే మరింత భయం పెంచుకున్నాడు, దావీదుపై శత్రుభావం పెంచుకున్నాడు.
30 Mỗi lần có chuyện chinh chiến với quân Phi-li-tin, Đa-vít lập được nhiều chiến công hơn mọi tướng khác của Sau-lơ. Vì vậy, danh tiếng ông càng lừng lẫy.
౩౦ఫిలిష్తీయ నాయకులు తరుచుగా యుద్ధానికి దండెత్తి వస్తూ ఉండేవారు. వారు దండెత్తినప్పుడల్లా దావీదు ఎక్కువ వివేకంతో ప్రవర్తించడం వల్ల సౌలు సేవకులందరికంటే అతని పేరు ఎంతో ప్రఖ్యాతి చెందింది.