< I Các Vua 18 >

1 Ba năm sau, Chúa Hằng Hữu phán bảo Ê-li: “Hãy đi gặp A-háp và bảo rằng Ta sẽ cho mưa trở lại.”
చాలా రోజులు గడిచిన తరువాత కరువు కాలంలో మూడో సంవత్సరం యెహోవా ఏలీయాతో “నేను భూమ్మీద వాన కురిపిస్తాను. నీవు వెళ్లి అహాబుకు కనబడు” అన్నాడు.
2 Ê-li vâng lời đi gặp A-háp. Lúc ấy, nạn đói đang hoành hành khắp xứ Sa-ma-ri.
అహాబును కలుసుకోడానికి ఏలీయా వెళ్ళాడు. షోమ్రోనులో కరువు తీవ్రంగా ఉంది.
3 Ngày nọ, A-háp gọi viên quản đốc hoàng cung là Áp Đia đến. (Áp Đia là người hết lòng kính sợ Chúa.
అహాబు తన కార్యనిర్వాహకుడు ఓబద్యాను పిలిపించాడు. ఈ ఓబద్యా యెహోవా పట్ల చాలా భయభక్తులు గలవాడు.
4 Khi Giê-sa-bên giết các tiên tri của Chúa, Áp Đia đem 100 tiên tri giấu trong hai hang đá, mỗi hang năm mươi người, và đem bánh và nước nuôi họ.)
యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపేస్తూ ఉన్నప్పుడు గుహకు యాభై మంది చొప్పున రెండు గుహల్లో వంద మందిని దాచి, అన్నపానాలు ఇచ్చి వారిని పోషించాడు.
5 Vua A-háp bảo Áp Đia: “Chúng ta chia nhau đi khắp nơi, đến các suối, các khe, tìm xem nơi nào có cỏ, may ra có thể cứu được một số ngựa và la khỏi chết.”
అహాబు ఓబద్యాతో “దేశంలోని నీటి ఊటలనూ వాగులనూ చూడడానికి వెళ్ళు. మన గుర్రాలూ కంచర గాడిదలూ చావకుండా వాటికి గడ్డి దొరుకుతుందేమో చూడు. అలా కొన్ని పశువులనైనా దక్కించుకుంటాం” అన్నాడు.
6 Vậy, họ lên đường; mỗi người đi một hướng.
కాబట్టి వాళ్ళు నీళ్ళ కోసం దేశమంతా తిరగి చూడడానికి బృందాలుగా వెళ్ళారు. అహాబు ఒక్కడే ఒక వైపూ ఓబద్యా మరొక వైపూ వెళ్ళారు.
7 Trên đường, Áp Đia gặp Ê-li. Khi nhận ra Ê-li, ông sấp mình dưới đất và hỏi: “Có đúng ông là Ê-li không?”
ఓబద్యా దారిలో వెళుతుంటే అనుకోకుండా ఏలీయా ఎదురు పడ్డాడు. ఓబద్యా అతన్ని గుర్తు పట్టి సాష్టాంగ నమస్కారం చేసి “మీరు నా యజమాని ఏలీయా గదా” అని అడిగాడు.
8 Ê-li đáp: “Vâng, ta là Ê-li. Ngươi hãy đi báo với Vua A-háp là ta đang ở đây.”
అతడు “నేనే. నీవు నీ యజమాని దగ్గరికి వెళ్లి, ‘ఏలీయా ఇక్కడున్నాడు’ అని చెప్పు” అన్నాడు.
9 Áp Đia thắc mắc: “Tôi có tội gì mà ông cho A-háp giết tôi?
అందుకు ఓబద్యా “అహాబు నన్ను చంపేసేలా మీ దాసుడినైన నన్ను అతనికి అప్పగిస్తావా ఏమిటి? నేనేం పాపం చేశాను?
10 Tôi thề trước mặt Chúa Hằng Hữu, Đức Chúa Trời của tôi, rằng A-háp đã sai người đi lùng ông khắp nơi. Khi dân một địa phương nào nói: ‘Ê-li không có ở đây,’ Vua A-háp buộc họ phải thề rằng khắp địa phương ấy không ai gặp ông.
౧౦నీ దేవుడు యెహోవా ప్రాణం తోడు, నిన్ను పట్టుకోవాలని నా యజమాని వార్తాహరులను పంపించని దేశం గానీ రాజ్యం గానీ లేదు. ‘ఏలీయా ఇక్కడ లేడు’ అని ఆ దేశం గానీ రాజ్యం గానీ అంటే వారితో అలా ప్రమాణం చేయించుకునేవాడు.
11 Bây giờ, ông bảo tôi đi báo với A-háp rằng ông đang ở đây.
౧౧నీవు నీ యజమాని దగ్గరికి వెళ్లి, ‘ఏలీయా ఇక్కడున్నాడు’ అని చెప్పమని నాకు చెబుతున్నావే!
12 Nếu tôi bỏ đây ra đi, và Thần Linh của Chúa Hằng Hữu đem ông đi nơi nào chẳng biết. Khi A-háp đến đây không tìm thấy ông, vua sẽ giết tôi, mặc dù tôi vẫn một lòng tôn kính Chúa ngay từ thời thơ ấu.
౧౨నేను నీ దగ్గరనుండి వెళ్ళిన వెంటనే యెహోవా ఆత్మ, నాకు తెలియని ప్రదేశానికి నిన్ను తీసుకుపోతాడు. అప్పుడు నేను వెళ్లి అహాబుకు కబురు చెప్పిన తరువాత నీవు అతనికి కనబడకపోతే అతడు నన్ను చంపేస్తాడు. కాబట్టి అలా ఆజ్ఞాపించవద్దు. నీ దాసుడనైన నేను చిన్నప్పటి నుంచి యెహోవాపట్ల భయభక్తులు గలిగిన వాణ్ణి.
13 Ông không biết việc tôi làm khi Giê-sa-bên giết các tiên tri của Chúa Hằng Hữu sao? Tôi đã đem 100 vị giấu trong hai hang đá, đem bánh và nước nuôi họ.
౧౩యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపేస్తుంటే నేనేం చేశానో నీకు తెలియదా? నేను యెహోవా ప్రవక్తల్లో వందమందిని, గుహకు యాభై మంది చొప్పున దాచి, భోజనం పెట్టి వారిని పోషించాను.
14 Thế mà, bây giờ ông bảo tôi đi nói với A-háp rằng: ‘Ê-li ở đây.’ Nếu tôi làm vậy, thế nào tôi cũng bị giết.”
౧౪ఇప్పుడు ఏలీయా ఇక్కడున్నాడని నీ యజమానికి చెప్పు అంటున్నావే, అహాబు నన్ను చంపేస్తాడు” అని మనవి చేశాడు.
15 Ê-li đáp: “Trước Chúa Hằng Hữu Toàn Năng, ta thề với ông rằng ta sẽ gặp A-háp hôm nay.”
౧౫అప్పుడు ఏలీయా “ఎవరి సన్నిధిలో నేను నిలుచున్నానో దూతల సైన్యాల అధిపతి అయిన యెహోవా జీవం తోడు, కచ్చితంగా ఈ రోజు నేను అహాబును కలుసుకుంటాను” అన్నాడు.
16 Vậy, Áp Đia đi báo cho A-háp, và A-háp đến gặp Ê-li.
౧౬కాబట్టి ఓబద్యా అహాబును కలుసుకుని ఈ విషయం తెలియచేశాడు. వెంటనే ఏలీయాను కలుసుకోడానికి అహాబు బయలుదేరాడు.
17 Khi thấy Ê-li, A-háp hỏi: “Có phải đây là người gây rối loạn cho Ít-ra-ên không?”
౧౭అహాబు ఏలీయాను చూడగానే “ఇశ్రాయేలు ప్రజా కంటకుడా, నువ్వేనా” అన్నాడు.
18 Ê-li đáp: “Không phải tôi là người gây rối loạn Ít-ra-ên, nhưng chính vua và nhà cha vua, vì đã chối bỏ điều răn của Chúa, theo thờ thần Ba-anh.
౧౮ఏలీయా “ఇశ్రాయేలు ప్రజలను కష్ట పెట్టేది నేను కాదు, నువ్వూ నీ తండ్రి వంశం వాళ్ళు. మీరు యెహోవా ఆజ్ఞలను పాటించకుండా బయలు విగ్రహాలను అనుసరించారు.
19 Bây giờ, tôi yêu cầu vua triệu tập toàn dân Ít-ra-ên tại Núi Cát-mên, cùng với 450 tiên tri của Ba-anh và 400 tiên tri của A-sê-ra là những người ăn chung bàn với Giê-sa-bên.”
౧౯అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజెబెలు పోషిస్తున్న బయలు దేవుడి ప్రవక్తలు 450 మందినీ అషేరాదేవి ప్రవక్తలు 400 మందినీ నా దగ్గరికి కర్మెలు పర్వతానికి పిలిపించు” అన్నాడు.
20 Vậy, A-háp triệu tập toàn dân và các tiên tri tại Núi Cát-mên.
౨౦అహాబు ఇశ్రాయేలు వారందరి దగ్గరికి వార్తాహరులను పంపి, ప్రవక్తలను కర్మెలు పర్వతం దగ్గరికి సమకూర్చాడు.
21 Ê-li đến, trách cứ toàn dân: “Anh chị em còn phân vân giữa ngã ba đường cho đến bao giờ? Nếu Chúa Hằng Hữu là Đức Chúa Trời, hãy theo Ngài! Nếu Ba-anh là Đức Chúa Trời, hãy theo hắn!” Nhưng dân chúng không nói gì cả.
౨౧ఏలీయా ప్రజలందరి దగ్గరికి వచ్చి “ఎంతకాలం మీరు రెండు అభిప్రాయాల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించండి” అని చెప్పాడు. ప్రజలు అతనికి జవాబుగా ఒక మాట కూడా పలకలేదు.
22 Ê-li tiếp: “Trong số những nhà tiên tri của Chúa Hằng Hữu, chỉ có một mình tôi là tiên tri còn lại, nhưng tiên tri của Ba-anh có đến 450 người.
౨౨అప్పుడు ఏలీయా “యెహోవా ప్రవక్తల్లో నేను ఒక్కడినే మిగిలాను. అయితే, బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు.
23 Hãy đem đến đây hai con bò để các tiên tri Ba-anh chọn lấy một con, chặt ra từng miếng, chất trên củi, nhưng không được châm lửa. Tôi sẽ làm thịt con kia, chất trên củi và cũng không châm lửa.
౨౩మాకు రెండు ఎద్దులు ఇవ్వండి. వాళ్ళు వాటిలో ఒక దాన్ని కోరుకుని దాన్ని ముక్కలు చేసి, కింద నిప్పు పెట్టకుండా కట్టెల మీద ఉంచాలి. రెండవ ఎద్దును నేను సిద్ధం చేసి, కింద నిప్పు పెట్టకుండా దాన్ని కట్టెల మీద పెడతాను.
24 Họ sẽ cầu thần của họ; còn tôi sẽ cầu Chúa Hằng Hữu. Thần nào trả lời bằng lửa làm cho sinh tế bốc cháy là Đức Chúa Trời.” Toàn dân đều cho lời Ê-li nói là hợp lý.
౨౪తరువాత మీరు మీ దేవుడు పేరును బట్టి ప్రార్థన చేయండి. నేను యెహోవా పేరును బట్టి ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు కట్టెలు కాల్చి జవాబిస్తాడో ఆయనే దేవుడు” అన్నాడు. ప్రజలంతా “ఆ మాట బాగుంది” అని జవాబిచ్చారు.
25 Ê-li bảo các tiên tri của Ba-anh: “Các ông chọn lấy một con bò, làm thịt trước đi vì bên các ông đông. Nhớ cầu thần mình nhưng đừng châm lửa vào củi.”
౨౫అప్పుడు ఏలీయా, బయలు ప్రవక్తలను పిలిచి “మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరే మొదట ఒక ఎద్దును సిద్ధం చేసి మీ దేవుడి పేర ప్రార్థన చేయండి. అయితే కింద నిప్పు పెట్టొద్దు” అన్నాడు.
26 Họ làm thịt con bò, và từ sáng đến trưa, họ khấn vái Ba-anh: “Lạy Ba-anh, xin đáp lời chúng tôi!” Nhưng chẳng có tiếng đáp. Họ bắt đầu nhảy chung quanh bàn thờ mới dựng.
౨౬వారు తమకిచ్చిన ఎద్దును తీసుకు సిద్ధం చేసి, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ “బయలు దేవుడా, మా ప్రార్థన విను” అంటూ బయలు పేరున ప్రార్థన చేశారు గాని వారికి ఒక్క మాట కూడా జవాబిచ్చేవాడు ఎవడూ లేకపోయారు. వాళ్ళు తాము చేసిన బలిపీఠం దగ్గర చిందులు తొక్కడం మొదలు పెట్టారు.
27 Đến trưa, Ê-li chế giễu họ: “Chắc các ông phải la lớn hơn. Ba-anh là thần mà! Có lẽ Ba-anh đang suy niệm, hoặc bận việc, hoặc đi đường xa, có khi đang ngủ, các ông phải đánh thức dậy chứ!”
౨౭మధ్యాహ్నమైనప్పుడు ఏలీయా “వాడు దేవుడు గదా! పెద్దగా కేకలేయండి. వాడు ఒకవేళ పరధ్యానంలో ఉన్నాడేమో! మూత్రవిసర్జనకు వెళ్లాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో! ఒకవేళ నిద్రపోతుంటే లేపాలేమో” అని గేలి చేశాడు.
28 Họ kêu thật lớn và lấy gươm giáo rạch mình cho đến khi máu đổ ra như họ thường làm.
౨౮వారింకా పెద్దగా కేకలేస్తూ రక్తం కారేంత వరకూ తమ అలవాటు ప్రకారం కత్తులతో బాణాలతో తమ దేహాలను కోసుకుంటున్నారు.
29 Họ nói lảm nhảm suốt buổi trưa cho đến giờ dâng sinh tế buổi chiều. Dù vậy, chẳng có tiếng nói, không ai trả lời, tuyệt nhiên không một thần nào lưu ý.
౨౯ఈ విధంగా మధ్యాహ్నం నుంచి సాయంత్ర బలి అర్పణ సమయం వరకూ వారు కేకలు వేశారు గానీ వాళ్ళకి ఏ జవాబూ రాలేదు. ఏ దేవుడూ వారి కేకలను పట్టించుకోలేదు.
30 Lúc ấy, Ê-li nói với toàn dân: “Hãy lại gần ta!” Họ đến gần ông. Ê-li sửa lại bàn thờ của Chúa Hằng Hữu đã bị phá hủy.
౩౦అప్పుడు ఏలీయా “నా దగ్గరికి రండి” అని ప్రజలతో చెప్పాడు. వారంతా అతని దగ్గరికి వచ్చారు. అతడు పాడైపోయి ఉన్న యెహోవా బలిపీఠాన్ని మరమ్మతు చేశాడు.
31 Ông lấy mười hai viên đá theo số mười hai đại tộc của các con Gia-cốp người được Chúa đổi tên thành Ít-ra-ên,
౩౧“నీ పేరు ఇశ్రాయేలు” అని యెహోవా వాగ్దానం పొందిన యాకోబు వంశపు గోత్రాల లెక్క ప్రకారం ఏలీయా పన్నెండు పెద్ద రాళ్లను తీసుకున్నాడు.
32 xây dựng một bàn thờ cho Chúa Hằng Hữu. Chung quanh bàn thờ, ông đào một cái mương rộng có thể chứa được mười hai lít hạt giống.
౩౨ఆ రాళ్లతో యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించి, దాని చుట్టూ 20 లీటర్ల నీళ్ళు పట్టేంత లోతుగా కందకమొకటి తవ్వించాడు.
33 Ông chất củi lên bàn thờ, chặt con bò ra từng miếng, đem sắp trên củi. Rồi ông nói: “Múc đầy bốn bình nước, đem tưới lên sinh lễ và củi.”
౩౩కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును ముక్కలు చేసి ఆ కట్టెల మీద ఉంచాడు. ప్రజలు చూస్తూ ఉంటే “మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి, దహనబలి పశుమాంసం మీదా కట్టెల మీదా పోయండి” అన్నాడు.
34 Khi người ta làm xong, ông bảo họ làm như thế lần thứ hai. Ông lại bảo làm lần thứ ba. Họ vâng lời,
౩౪తరువాత “రెండవ సారి అలాగే చేయండి” అని చెప్పాడు. వారు రెండవ సారి కూడా ఆలాగే చేశారు. “మూడవ సారి కూడా చేయండి” అన్నాడు. వారు మూడవ సారి కూడా అలా చేశారు.
35 nước từ bàn thờ chảy ra ngập cả mương.
౩౫అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారాయి. అతడు కందకాన్ని నీళ్లతో నింపాడు.
36 Đến giờ dâng sinh tế buổi chiều, Tiên tri Ê-li đến bên bàn thờ và cầu nguyện: “Lạy Chúa Hằng Hữu, Đức Chúa Trời của Áp-ra-ham, Y-sác, và Gia-cốp, hôm nay xin chứng minh cho mọi người biết Chúa là Đức Chúa Trời của Ít-ra-ên, cho họ biết con là đầy tớ Ngài, và con làm những việc này theo lệnh Chúa.
౩౬సాయంత్ర బలి అర్పణ అర్పించే సమయానికి ఏలీయా ప్రవక్త బలిపీఠం దగ్గరికి వచ్చి “యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనీ నేను నీ సేవకుడనై ఉన్నాననీ నేనిదంతా నీ మాట ప్రకారమే చేశాననీ ఈ రోజు చూపించు.
37 Lạy Chúa Hằng Hữu, xin đáp lời con. Ngài đáp lời con để dân này biết Chúa Hằng Hữu là Đức Chúa Trời, và Chúa dẫn họ trở về với Ngài.”
౩౭యెహోవా, నా ప్రార్థన విను. యెహోవావైన నువ్వే దేవుడవనీ నీవు వారి హృదయాలను మళ్ళీ నీ వైపు తిప్పుతున్నావనీ ఈ ప్రజలకు తెలిసేలా నా ప్రార్థన విను” అన్నాడు.
38 Lập tức, Chúa Hằng Hữu cho lửa xuống thiêu đốt cá sinh tế, củi, đá, bụi, và đốt cạn nước trong mương.
౩౮అతడు ఇలా ప్రార్థన చేస్తూ ఉండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువునూ కట్టెలనూ రాళ్లనూ మట్టినీ కాల్చి కందకంలోని నీళ్లను ఆర్పేసింది.
39 Dân chúng thấy thế, đồng loạt quỳ rạp xuống đất, và tung hô: “Chúa Hằng Hữu là Đức Chúa Trời! Chúa Hằng Hữu là Đức Chúa Trời!”
౩౯ప్రజలంతా దాన్ని చూసి సాష్టాంగ నమస్కారం చేసి “యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు” అని కేకలు వేశారు.
40 Ê-li ra lệnh: “Bắt hết các tiên tri Ba-anh, đừng để ai trốn thoát!” Dân chúng vâng lời và bắt họ. Ê-li đem họ xuống Trũng Ki-sôn và giết tất cả.
౪౦అప్పుడు ఏలీయా “బయలు దేవుడి ప్రవక్తలందర్నీ పట్టుకోండి. ఎవర్నీ వదలొద్దు” అన్నాడు. ప్రజలు వారిని పట్టుకున్నారు. ఏలీయా కీషోను వాగు దగ్గరికి వారిని తీసికెళ్ళి చంపేశాడు.
41 Ê-li nói với A-háp: “Vua lo ăn và uống đi, vì tôi nghe có tiếng mưa lớn!”
౪౧ఏలీయా “పెద్ద వాన కురుస్తున్న శబ్దం వస్తున్నది. నీవు వెళ్లి భోజనం చెయ్యి” అని అహాబుతో చెప్పాడు.
42 Vậy, A-háp đi ăn và uống. Còn Ê-li lên đỉnh Núi Cát-mên, gập mình xuống đất, và cúi mặt giữa hai đầu gối.
౪౨అహాబు భోజనం చేయడానికి వెళ్ళాడు గాని, ఏలీయా కర్మెలు పర్వతం ఎక్కి నేలమీద పడి ముఖం మోకాళ్ల మధ్య పెట్టుకున్నాడు.
43 Ông bảo người đầy tớ: “Đi nhìn về hướng biển xem.” Người ấy vâng lời, đi nhìn rồi thưa: “Con chẳng thấy gì cả.” Ông bảo: “Cứ tiếp tục đi bảy lần như thế.”
౪౩తరువాత అతడు తన సేవకుణ్ణి పిలిచి “నీవు పైకి వెళ్లి సముద్రం వైపు చూడు” అన్నాడు. వాడు మెరక ఎక్కి చూసి “ఏమీ కనబడ్డం లేదు” అన్నాడు. అతడు ఇంకా ఏడు సార్లు “వెళ్లి చూడు” అన్నాడు.
44 Lần thứ bảy người đầy tớ nói: “Có một cụm mây nhỏ bằng bàn tay hiện ra từ biển lên.” Ê-li nói: “Đi bảo A-háp lên xe chạy xuống núi ngay, nếu không sẽ bị mưa cầm chân!”
౪౪ఏడో సారి అతడు చూసి “అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘం, సముద్రం నుంచి పైకి లేస్తూ ఉంది” అన్నాడు. అప్పుడు ఏలీయా “నీవు అహాబు దగ్గరికి వెళ్లి, నీ రథాన్ని సిద్ధ పరచుకో, వానలో చిక్కుకుపోక ముందే వెళ్ళిపో” అని చెప్పమని అతన్ని పంపాడు.
45 Trong khoảnh khắc, bầu trời bị mây đen phủ kín. Gió kéo mưa lớn đến; và A-háp vội vàng lên xe về Gít-rê-ên.
౪౫అంతలోనే ఆకాశం కారుమేఘాలు కమ్మింది. దానికి గాలి తోడైంది. వాన జోరుగా కురిసింది. అహాబు రథమెక్కి యెజ్రెయేలు పట్టణం వెళ్లిపోయాడు.
46 Lúc đó quyền năng Chúa Hằng Hữu giáng trên Ê-li, người quấn áo ở thắt lưng và chạy trước xe A-háp cho đến thành Gít-rê-ên.
౪౬అయితే యెహోవా హస్తం ఏలీయా మీద ఉంది. అతడు నడుం బిగించుకుని అహాబు కంటే ముందే పరుగెత్తి యెజ్రెయేలు చేరుకున్నాడు.

< I Các Vua 18 >