< Zǝbur 114 >
1 Israil Misirdin, Yaⱪup jǝmǝti yat tilliⱪ ǝllǝrdin qiⱪⱪanda,
౧ఈజిప్టులోనుండి ఇశ్రాయేలు, విదేశీ జాతుల్లోనుండి యాకోబు వెళ్లిపోయినప్పుడు,
2 Xu qaƣda Yǝⱨuda [Hudaning] muⱪǝddǝs jayi, Israil uning sǝltiniti boldi,
౨యూదా ఆయనకు పరిశుద్ధస్థలం అయింది. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం అయింది.
3 Dengiz buni kɵrüp bǝdǝr ⱪaqti, Iordan dǝryasi kǝynigǝ yandi;
౩సముద్రం దాన్ని చూసి పారిపోయింది. యొర్దాను నది వెనక్కి మళ్ళింది.
4 Taƣlar ⱪoqⱪarlardǝk, Dɵnglǝr ⱪozilardǝk oynaⱪlidi.
౪పర్వతాలు పొట్టేళ్లలాగా, కొండలు గొర్రెపిల్లల్లాగా గంతులు వేశాయి.
5 Əy dengiz, sǝn nemǝ boldung, ⱪaqⱪili? Iordan dǝryasi, yolungdin yanƣili?
౫ఓ సముద్రం, పారిపోయావేమిటి? యొర్దానూ, నీవు వెనక్కి మళ్లావేమిటి?
6 Taƣlar ⱪoqⱪarlardǝk, Dɵnglǝr ⱪozilardǝk oynaⱪliƣili?
౬పర్వతాల్లారా, మీరు పొట్లేళ్లలాగానూ కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లాగానూ కుప్పిగంతులు వేశారెందుకు?
7 I yǝr yüzi, Rǝbning jamalidin, Yaⱪupning Hudasining jamalidin tǝwrǝn;
౭భూమీ, ప్రభువు సన్నిధిలో, యాకోబు దేవుని సన్నిధిలో వణకు.
8 U ⱪoram taxni kɵlqǝkkǝ, Qaⱪmaⱪ texini mol bulaⱪ suliriƣa aylanduridu.
౮ఆయన బండరాతిని నీటిమడుగుగా, చెకుముకి రాతి శిలను నీటి ఊటలుగా చేశాడు.