< Əstǝr 7 >

1 Xuning bilǝn padixaⱨ bilǝn Ⱨaman hanix Əstǝrning ziyapitigǝ dahil boluxⱪa kǝldi.
రాజు, హామాను రెండవ రోజు ఎస్తేరు రాణి దగ్గరికి విందుకు వచ్చారు.
2 Padixaⱨ ikkinqi ⱪetimliⱪ ziyapǝt üstidǝ xarab iqiliwatⱪanda Əstǝrdin: — I hanix Əstǝr, nemǝ tǝliping bar? U sanga ijabǝt ⱪilinidu. Nemǝ iltimasing bar? Ⱨǝtta padixaⱨliⱪimning yerimini iltimas ⱪilsangmu xundaⱪ ⱪilinidu, — dedi.
రాజు “ఎస్తేరు రాణీ, నీ విన్నపం ఏమిటి? అది నెరవేరుస్తాను. నీ మనవి ఏమిటి? అర్థ రాజ్యమైనా సరే నీకు ఇస్తాను” అని ద్రాక్షారసం పోస్తూ ఉండగా ఎస్తేరుతో అన్నాడు.
3 — Əgǝr nǝzǝrliridǝ iltipatⱪa erixkǝn bolsam, i aliyliri, wǝ padixaⱨimƣa muwapiⱪ kɵrünsǝ, mening iltimasim ɵz jenimni ayiƣayla, xuningdǝk mening tǝlipim ɵz hǝlⱪimni saⱪliƣayla;
అప్పుడు ఎస్తేరు రాణి ఇలా జవాబిచ్చింది “రాజా, నీ అనుగ్రహానికి నేను నోచుకుంటే రాజువైన తమకు అంగీకారం అయితే, నా ప్రాణం నిలిచేలా చేయండి. ఇదే నా నివేదన. నా జాతి ప్రజల ప్రాణాల విషయంలో కూడా నేను వేడుకుంటున్నాను.
4 qünki biz, yǝni mǝn wǝ mening hǝlⱪim birgǝ yoⱪitilip, ⱪirilip, nǝslimizdin ⱪurutuluxⱪa setiwetilduⱪ. Əgǝr biz ⱪul wǝ dedǝklikkǝ setiwetilgǝn bolsaⱪ, süküt ⱪilƣan bolattim; lekin padixaⱨimning tartidiƣan ziyininimu düxmǝn tɵlǝp berǝlmǝytti, — dǝp jawap bǝrdi Əstǝr.
నేను, నా జాతి ప్రజలు, సమూల నాశనానికి, సంహారానికి, తుడిచి పెట్టి వేయడానికి అమ్ముడుబోయాము. మేమంతా ఆడ, మగ బానిసలుగా అమ్ముడుబోయినట్టైతే నేను నోరు విప్పేదాన్ని కాదు. ఎందుకంటే ఆ మాత్రం ఇబ్బందికి రాజువైన మీకు బాధ ఇవ్వడం భావ్యం కాదు గదా.”
5 Padixaⱨ Aⱨaxwerox hanix Əstǝrdin: — Bundaⱪ ⱪilixⱪa petinƣan kixi kim ikǝn? U ⱪǝyǝrdǝ?! — dǝp soridi. Əstǝr jawabǝn: —
అందుకు రాజైన అహష్వేరోషు “వాడెవడు? ఈ పని చేయడానికి సాహసించిన వాడెక్కడ?” అని ఎస్తేరు రాణిని అడిగాడు.
6 Bu düxmǝn wǝ zǝⱨǝrhǝndǝ mana muxu rǝzil Ⱨaman! — dewidi, Ⱨaman padixaⱨ bilǝn hanix aldida xu zamatla dǝkkǝ-dükkigǝ qüxti.
ఎస్తేరు “మా విరోధి అయిన ఆ శత్రువు, దుష్టుడైన ఈ హామానే” అంది. అప్పుడు రాజు, రాణి ముందు హమానుకు ముచ్చెమటలు పోశాయి.
7 Xuning bilǝn padixaⱨ ⱪǝⱨri-ƣǝzǝpkǝ kelip ziyapǝt-xarab üstidin turdi-dǝ, qaribaƣⱪa qiⱪip kǝtti; Ⱨaman bolsa hanix Əstǝrdin jenini tilǝxkǝ ⱪaldi; qünki u padixaⱨning ɵzigǝ jaza bǝrmǝy ⱪoymaydiƣan niyǝtkǝ kǝlgǝnlikini kɵrüp yǝtkǝnidi.
రాజు పట్టరాని కోపంతో ద్రాక్షారసం విందును విడిచి చరచరా అంతఃపురం తోటలోకి వెళ్ళాడు. అయితే రాజు తనను సర్వనాశనం చేసే ఆలోచన చేస్తున్నాడని హమాను భయపడ్డాడు. అతడు తన ప్రాణాలు కాపాడమని ఎస్తేరు రాణిని ప్రాధేయ పడసాగాడు.
8 Padixaⱨ qaribaƣdin ziyapǝt-xarab dastihiniƣa ⱪaytip kǝlginidǝ Ⱨamanning ɵzini Əstǝr yɵlǝngǝn diwanƣa taxliƣiniqǝ turƣinini kɵrdi-dǝ: — — Ⱪara, uning ordida mening aldimdila hanixⱪa zorluⱪ ⱪilƣiliwatⱪinini?! — dewidi, bu sɵz padixaⱨning aƣzidin qiⱪixi bilǝnla adǝmlǝr Ⱨamanning bax-kɵzini qümkǝp ⱪoydi.
అంతఃపురం తోటలోనుండి ద్రాక్షారసం విందు స్థలానికి రాజు తిరిగి వచ్చి ఎస్తేరు కూర్చున్న తల్పం మీద హామాను పడి ఉండడం చూశాడు. “వీడు నా ఇంట్లో నేను చూస్తుండగానే రాణిని బలాత్కారం చేస్తాడా?” అన్నాడు. ఆ మాట రాజు నోట రాగానే సైనికులు హామాను ముఖానికి ముసుకు వేశారు.
9 Padixaⱨning aldida turuwatⱪan ⱨǝrǝm’aƣiliridin Ⱨarbona isimlik birsi: — Yǝnǝ bir ix bar, mana, Ⱨaman aliylirining ⱨayati üqün gǝp ⱪilƣan Mordikayni esix üqün, ǝllik gǝz igizliktǝ yasatⱪan dar tǝyyar turidu, u dar ⱨazir muxu Ⱨamanning ⱨoylisida, dewidi, padixaⱨ: — Ⱨamanni uningƣa esinglar! — dedi.
రాజు సముఖంలో ఉన్న అధికారుల్లో హర్బోనా అనే వాడు “అయ్యా, రాజు ప్రాణాలు కాపాడేందుకు మాట్లాడిన మొర్దెకైని ఉరి తీయాలని ఈ హామాను 50 మూరల ఎత్తున్న ఉరి కొయ్య ఒకటి చేయించాడు. అది హామాను ఇంటి దగ్గర ఉంది” అని చెప్పాడు. వెంటనే రాజు “దాని మీద వీడిని ఉరి తీయండి” అని ఆజ్ఞ ఇచ్చాడు.
10 Xuning bilǝn ular Ⱨamanni u Mordikayƣa tǝyyarlap ⱪoyƣan darƣa asti; xuning bilǝn padixaⱨning ƣǝzipi besildi.
౧౦ఆ విధంగా హామాను మొర్దెకై కోసం సిద్ధం చేసిన ఉరి కొయ్య మీద వాళ్ళు అతడినే ఉరి తీశారు. అప్పుడు రాజు ఆగ్రహం చల్లారింది.

< Əstǝr 7 >