< Padixaⱨlar 2 4 >
1 Pǝyƣǝmbǝr xagirtliridin birining tul ⱪalƣan hotuni Elixaƣa pǝryad ⱪilip: Sening ⱪulung bolƣan mening erim ɵlüptu. Bilisǝnki, sening ⱪulung Pǝrwǝrdigardin ⱪorⱪⱪan adǝm idi. Əmdi ⱪǝrz igisi mening ikki oƣlumni ⱪulluⱪⱪa alƣili kǝldi.
౧ఆ తరువాత ప్రవక్తల సమాజంలో ఒకడి భార్య ఏడ్చుకుంటూ ఎలీషా దగ్గరికి వచ్చింది. “నీ సేవకుడైన నా భర్త చనిపోయాడు. అతనికి యెహోవాపై భయమూ, భక్తీ ఉన్నాయని నీకు తెలుసు. ఇప్పుడు మాకు అప్పు ఇచ్చిన వాడు నా ఇద్దరు కొడుకులనూ తనకు బానిసలుగా తీసుకు వెళ్ళడానికి వచ్చాడు” అని చెప్పింది.
2 Elixa uningdin: Sening üqün nemǝ ⱪilay? Deginǝ, ɵyüngdǝ nemǝng bar? — dǝp soridi. U: Dedikingning ɵyidǝ kiqik bir koza maydin baxⱪa ⱨeqnǝrsǝ yoⱪ, — dedi.
౨దానికి ఎలీషా ఆమెతో “నీకు నేనేం చేయగలను? నీకు ఇంట్లో ఏమున్నాయో చెప్పు” అన్నాడు. అప్పుడు ఆమె “నీ సేవకురాలి ఇంట్లో ఓ జాడీలో నూనె తప్పించి ఇంకేమీ లేదు” అంది.
3 U: Berip ⱨǝmmǝ ⱪoxniliringdin qɵgün-koza, yǝni box qɵgün-kozilarni ɵtnǝ alƣin, ular az bolmisun.
౩అప్పుడు ఎలీషా “నీవు వెళ్ళి నీ పొరుగు వాళ్ళ దగ్గర ఉన్న పాత్రలు అరువు తెచ్చుకో. ఎన్ని తేగలవో అన్ని తెచ్చుకో.
4 Andin ɵzüng bilǝn oƣulliring ɵygǝ kirgin, ixikni yepip ⱨǝmmǝ qɵgün-kozilarƣa may ⱪaqiliƣin. Toxⱪanlirini bir qǝtkǝ elip ⱪoyƣin, — dedi.
౪అప్పుడు నువ్వూ, నీ కొడుకులూ లోపలికి వెళ్ళి తలుపులు మూసుకోండి. అన్ని పాత్రల్లో నూనె పోయండి. నూనెతో నిండిన పాత్రలు ఒక పక్కన ఉంచండి” అని ఆమెతో చెప్పాడు.
5 Xuning bilǝn u u yǝrdin ayrilip oƣulliri bilǝn ɵygǝ kirip ixikni yapti. Oƣulliri qɵgün-kozilarni uning aldiƣa elip kǝlgǝndǝ, u may ⱪuydi.
౫ఆమె ఎలీషా దగ్గరనుండి వెళ్ళింది. తన కొడుకులతో లోపలికి వెళ్ళి తలుపులు మూసింది. తన కొడుకులు తెచ్చిన పాత్రలను నూనెతో నింపింది.
6 Wǝ xundaⱪ boldiki, qɵgün-kozilarning ⱨǝmmisi tolƣanda u oƣliƣa: Yǝnǝ bir koza elip kǝl, dedi. Əmma oƣli: Əmdi koza ⱪalmidi, dedi. U waⱪitta may tohtap ⱪaldi.
౬ఆ విధంగా తెచ్చిన పాత్రలన్నీ నూనెతో నిండిపోయాయి. ఆమె “ఇంకో పాత్ర పట్రండి” అంది. కానీ ఆమె కొడుకు “ఇక పాత్రలేమీ లేవు” అన్నాడు. దాంతో జాడీలోని నూనె ప్రవాహం నిలిచిపోయింది.
7 Əmdi u berip Hudaning adimigǝ hǝwǝr yǝtküzdi. U: Berip mayni setiwǝt, ⱪǝrzingni tügǝtkin; andin ⱪalƣan pul bilǝn ɵzüng wǝ oƣulliringning jenini beⱪinglar, dedi.
౭అప్పుడు ఆమె వచ్చి దేవుని మనిషికి ఈ విషయం చెప్పింది. దానికతడు “వెళ్ళు, ఆ నూనె అమ్మి ఆ డబ్బుతో నీ అప్పులు తీర్చు. మిగిలిన దాంతో నువ్వూ నీ పిల్లలూ జీవించండి” అన్నాడు.
8 Bir küni Elixa Xunǝm xǝⱨirigǝ bardi. U yǝrdǝ bir bay ayal bar idi wǝ u uni ɵz ɵyidǝ tamaⱪⱪa tutup ⱪaldi. Xuningdin keyin ⱨǝrⱪaqan u yǝrdin ɵtüp mangsa, u uning ɵyigǝ kirip ƣizalinatti.
౮ఒకసారి ఎలీషా షూనేము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ అతణ్ణి భోజనానికి రమ్మని ప్రాధేయపడిన ఒప్పించింది. కాబట్టి ఎలీషా ఆ దారి గుండా వెళ్ళినప్పుడల్లా ఆమె దగ్గర భోజనం చేస్తూ ఉండేవాడు. ఆమె ఆ పట్టణంలో చాలా ప్రముఖురాలు.
9 Bir küni u ɵz erigǝ: Bu yǝrdin daim ɵtidiƣan kixi Hudaning bir muⱪǝddǝs adimi ikǝnlikini bilip yǝttim.
౯ఆమె ఒకసారి తన భర్తతో ఇలా అంది. “ఈ మార్గంలో రాకపోకలు సాగించే ఈ వ్యక్తి పవిత్రుడూ, దేవుని మనిషీ అని నాకు తెలుసు.
10 Biz ɵgzidǝ uningƣa bir kiqikrǝk ɵy salayli. Uningƣa ɵydǝ kariwat, xirǝ, orunduⱪ wǝ qiraƣdan tǝyyarlap berǝyli; wǝ xundaⱪ bolsunki, u ⱪaqanla yenimizƣa kǝlsǝ xu ɵydǝ tursun, — dedi.
౧౦కాబట్టి మనం మిద్దె మీద ఒక చిన్న గది కడదాం. అందులో ఒక మంచం, బల్ల, కుర్చీ, ఒక లాంతరూ ఏర్పాటు చేద్దాం. ఆయన మన దగ్గరికి వచ్చిన ప్రతిసారీ అందులో ఉంటాడు.”
11 Əmdi pǝyƣǝmbǝr bir küni u yǝrgǝ kǝlgǝndǝ, xu balihaniƣa kirip yetip ⱪaldi.
౧౧కాబట్టి తరువాత ఎలీషా ఆ గదిలో ఉండి విశ్రాంతి తీసుకునే రోజు వచ్చింది.
12 U ɵz hizmǝtkari Gǝⱨaziƣa: Sǝn u Xunǝmlik ayalni qaⱪirƣin, dedi. U uni qaⱪirƣanda, ayal uning ⱪexiƣa kǝldi.
౧౨అప్పుడు ఎలీషా తన సేవకుడు గేహజీని పిలిచి “ఆ షూనేమీ స్త్రీని పిలువు” అన్నాడు. అతడు ఆమెను పిలుచుకు వచ్చాడు. ఆమె వచ్చి అతని ముందు నిలబడింది.
13 Pǝyƣǝmbǝr hizmǝtkariƣa: Sǝn uningƣa: «Sili bizning ƣemimizni yǝp muxundaⱪ ɵzlirini kɵp awarǝ ⱪildila; mǝn sili üqün nemǝ ⱪilip berǝy? Padixaⱨⱪa yaki ⱪoxun sǝrdariƣa birǝr tǝlǝplirini yǝtküzǝymu?» — degin, dedi. Ayal buningƣa jawab berip: — Mǝn ɵz hǝlⱪim arisida yaxawatimǝn, boldi! dedi.
౧౩అప్పుడు ఎలీషా గేహజీకి ఇలా ఆదేశించాడు. “నీవు ఆమెతో చెప్పు. నీవు మా కోసం ఇంత బాధ తీసుకున్నావు. నీ కోసం ఏం చేయాలి? నీ గురించి రాజుతో గానీ సైన్యాధిపతితో గానీ మాట్లాడమంటావా?” దానికి జవాబుగా ఆమె “నేను నా చుట్టాల మధ్యనే నివసిస్తున్నాను” అంది.
14 Əmdi Elixa Gǝⱨazidin, uningƣa nemǝ ⱪilip berix kerǝk? — dǝp soridi. Gǝⱨazi: Uning oƣul balisi yoⱪ ikǝn, wǝ erimu ⱪeri ikǝn, dedi.
౧౪తరువాత ఎలీషా “ఈమెకు మనం ఏ ఉపకారం చేయగలం?” అని గేహజీని అడిగాడు. గేహజీ “ఆమెకి కొడుకు లేడు. భర్తేమో ముసలివాడు” అన్నాడు.
15 U: Uni qaⱪirƣin, dedi. Ayalni qaⱪiriwidi, ayal ixikkǝ kelip turdi.
౧౫కాబట్టి ఎలీషా “ఆమెను పిలువు” అన్నాడు. అతడు వెళ్లి ఆమెను తీసుకు వచ్చాడు. ఆమె వచ్చి గుమ్మం దగ్గర నిలుచుంది.
16 Pǝyƣǝmbǝr uningƣa: Kelǝr yili tǝhminǝn muxu waⱪitta ⱪuqaⱪlirida bir oƣulliri bolidu, dedi. U: Yaⱪ, i ƣojam! I Hudaning adimi, dedikinggǝ yalƣan eytmiƣin, dedi.
౧౬ఎలీషా ఆమెతో “వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నీ ఒడిలో కొడుకు ఉంటాడు” అన్నాడు. అప్పుడు ఆమె “నా ప్రభూ, వద్దు. దేవుని మనిషివైన నీవు నీ సేవకురాలినైన నాతో అబద్ధం చెప్పొద్దు” అంది.
17 Əmdi Elixa uningƣa degǝndǝk u ayal ⱨamilidar bolup, ikkinqi yili bekitilgǝn waⱪitta oƣul tuƣdi.
౧౭కానీ ఆ స్త్రీ గర్భం ధరించింది. ఆ తరువాత సంవత్సరం సరిగ్గా ఎలీషా చెప్పిన సమయానికి ఒక కొడుకుని కన్నది.
18 Bala ɵsüp qong boldi. Bir küni xundaⱪ boldiki, u atisi bar yǝrgǝ, ormiqilarning ⱪexiƣa qiⱪip kǝtti.
౧౮ఆ పిల్లవాడు పెరిగిన తరువాత ఒక రోజు పొలంలో కోత కోస్తున్న వాళ్ళ దగ్గర ఉన్న తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వాడు తన తండ్రితో “నా తల! నా తల!” అన్నాడు.
19 U atisiƣa: Way bexim, way bexim, dǝp waysidi. U hizmǝtkariƣa, uni anisining ⱪexiƣa elip barƣin, dedi.
౧౯వాడి తండ్రి తన సేవకుడితో “పిల్లాణ్ణి ఎత్తుకుని వాళ్ళమ్మ దగ్గరికి తీసుకు వెళ్ళు” అన్నాడు.
20 U uni kɵtürüp anisining yeniƣa apirip ⱪoydi. Bala anisining etikidǝ qüxkiqǝ olturdi, andin ɵlüp ⱪaldi.
౨౦వాడు ఆ పిల్లవాణ్ణి తీసుకుని తల్లి దగ్గరికి తీసుకు వెళ్ళాడు. వాడు మధ్యాహ్నం వరకూ తల్లి ఒడిలో పడుకుని తరువాత చనిపోయాడు.
21 Andin anisi qiⱪip, uni Hudaning adimining ɵyidiki kariwatⱪa yatⱪuzup ⱪoyup, ixikni yepip qiⱪip kǝtti.
౨౧అప్పుడు ఆమె వాణ్ని దేవుని మనిషి కోసం వేయించిన మంచం పై పడుకోబెట్టి తలుపు వేసి బయటకు వెళ్ళింది.
22 U erini qaⱪirip uningƣa: Ƣulamlardin birini mangdurƣin, u bir exǝkni elip kǝlsun; mǝn uni qapturup, Hudaning adimining ⱪexiƣa dǝrⱨal berip kelǝy, dedi.
౨౨తన భర్తను పిలిచి “నేను దేవుని మనిషి దగ్గరికి త్వరగా వెళ్ళి రావాలి. ఒక పనివాణ్ణీ, ఒక గాడిదనీ పంపించు” అని చెప్పింది.
23 Eri uningƣa: Nemixⱪa uning ⱪexiƣa bügün barisǝn? Bügün ya yengi ay ya xabat küni bolmisa, dedi. Ayali uningƣa, Ⱨǝmmǝ ix tinqliⱪ — dedi.
౨౩దానికి ఆమె భర్త “ఆయన దగ్గరికి ఈ రోజు ఎందుకు వెళ్ళడం? ఈ రోజు అమావాస్యా కాదు, విశ్రాంతి దినమూ కాదు గదా” అన్నాడు. దానికామె “నేను వెళ్ళడం వల్ల అంతా మంచే జరుగుతుంది” అంది.
24 U exǝkni toⱪutup ƣulamiƣa: Ittik ⱨǝydǝp mang; mǝn demigüqǝ tohtimiƣin, dedi.
౨౪ఆమె ఆ గాడిదకు జీను కట్టించి దానిపై కూర్చుని పనివాడితో “వేగంగా పోనీ, నేను చెబితే తప్ప నిదానంగా తోలకు” అంది.
25 Xuning bilǝn u Karmǝl teƣiƣa berip Hudaning adimi aldiƣa kǝldi. Wǝ xundaⱪ boldiki, Hudaning adimi uni yiraⱪtinla kɵrüp ɵz hizmǝtkari Gǝⱨaziƣa: Mana Xunǝmlik ayal keliwatidu;
౨౫ఆ విధంగా ఆమె ప్రయాణం చేసి కర్మెలు పర్వతంపై ఉన్న దేవుని మనిషి దగ్గరికి వచ్చింది. ఆమె దూరంలో ఉండగానే దేవుని మనిషి ఆమెను చూశాడు. తన సేవకుడైన గేహజీని పిలిచి “చూడు, ఆ షూనేమీ స్త్రీ ఇక్కడికి వస్తుంది.
26 Sǝn uning aldiƣa yügürüp berip uningdin: Sili tinqliⱪmu? Ərliri tinqliⱪmu? Baliliri tinqliⱪmu?» — dǝp soriƣin, dedi. — Ⱨǝmmǝ ix tinqliⱪ, dǝp eytti ayal.
౨౬నీవు పరిగెత్తుకుంటూ వెళ్ళి ‘నువ్వూ, నీ భర్తా, నీ కొడుకూ క్షేమంగా ఉన్నారా?’ అని అడుగు” అని చెప్పి పంపించాడు. దానికామె “క్షేమంగానే ఉన్నాం” అని జవాబిచ్చింది.
27 Əmdi taƣⱪa qiⱪip Hudaning adimining ⱪexiƣa kǝlgǝndǝ, u uning putlirini ⱪuqaⱪlidi. Gǝⱨazi uning yeniƣa berip uni ittiriwǝtmǝkqi boldi; lekin Hudaning adimi: — Uni ɵz ihtiyariƣa ⱪoyƣin; qünki uning kɵngli intayin sunuⱪ wǝ Pǝrwǝrdigar bu ixni manga demǝy yoxuruptu, dedi.
౨౭తరువాత ఆమె పర్వతం మీద ఉన్న దేవుని మనిషి దగ్గరికి వచ్చి అతని కాళ్ళు పట్టుకుంది. గేహజీ ఆమెను తోలివేయడానికి దగ్గరికి గా వచ్చాడు. అప్పుడు దేవుని మనిషి “ఆమె చాలా నిస్పృహలో ఉంది. యెహోవా ఈ సమస్యను నాకు దాచి ఉంచాడు. నీవు ఆమె జోలికి పోకు” అని ఆదేశించాడు.
28 Ayal: Mǝn ƣojamdin bir oƣul tilidimmu? Manga yalƣan sɵz ⱪilmiƣin, dǝp sǝndin ɵtünmidimmu? — dedi.
౨౮అప్పుడు ఆమె “ప్రభూ, కొడుకు కావాలని నేను నిన్ను అడిగానా? నాతో అసత్యం పలుక వద్దు అనలేదా?” అంది.
29 Pǝyƣǝmbǝr Gǝⱨaziƣa: — Belingni qing baƣlap, mening ⱨasamni elip mangƣin. Birsigǝ uqrisang, uningƣa salam ⱪilmiƣin, birsi sanga salam ⱪilsa, sǝn uningƣa jawab bǝrmigin. Mening ⱨasamni balining yüzigǝ ⱪoyƣin, dedi.
౨౯అప్పుడు ఎలీషా గేహజీతో “నీవు ప్రయాణానికి సిద్ధపడు. నా కర్ర చేత్తో పట్టుకో. ఆమె ఇంటికి వెళ్ళు. దారిలో నీకెవరైనా ఎదురైతే వాళ్ళను పలకరించ వద్దు. ఎవరైనా నిన్ను పలకరిస్తే వాళ్ళకు జవాబివ్వవద్దు. అక్కడికి వెళ్ళి నా కర్ర పిల్లవాడి ముఖంపై పెట్టు” అని చెప్పాడు.
30 Balining anisi: Pǝrwǝrdigarning ⱨayati bilǝn wǝ sening ⱨayating bilǝn ⱪǝsǝm ⱪilimǝnki, sǝndin ayrilmaymǝn, dedi. Elixa ornidin turup uning kǝynidin ǝgǝxti.
౩౦కానీ ఆ పిల్లవాడి తల్లి “యెహోవా ప్రాణం మీదా, నీ ప్రాణం మీదా ఒట్టేసి చెప్తున్నా, నేను మాత్రం నిన్ను వదలను” అంది. కాబట్టి ఎలీషా లేచి ఆమెతో కూడా వెళ్ళాడు.
31 Gǝⱨazi ulardin burun berip ⱨasisini balining yüzigǝ ⱪoyƣanidi. Əmma ⱨeq awaz yaki tiwix qiⱪmidi. Xuning bilǝn u yenip Elixaning aldiƣa berip uningƣa: Bala oyƣanmidi, dedi.
౩౧వాళ్ళ కంటే ముందుగా చేరుకున్న గేహజీ ఆ పిల్లవాడి ముఖంపై కర్ర ఉంచాడు కానీ పిల్లవాడు ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నాడు. కాబట్టి గేహజీ వెనక్కు వచ్చి దారిలో ఎలీషాను కలుసుకున్నాడు. ఎలీషాతో “పిల్లవాడు కళ్ళు తెరవలేదు” అని చెప్పాడు.
32 Elixa ɵygǝ kelip ⱪarisa, mana, bala uning kariwitida ɵlük yatatti.
౩౨ఎలీషా ఆ ఇల్లు చేరుకుని చనిపోయిన పిల్లవాడు తన మంచంపై పడి ఉండటం చూశాడు.
33 U bala bilǝn ɵzini ayrim ⱪaldurup, ixikni yepiwetip Pǝrwǝrdigarƣa dua ⱪildi.
౩౩కాబట్టి ఎలీషా లోపలికి వెళ్ళి తలుపులు వేశాడు. తానూ, ఆ పిల్లవాడూ మాత్రమే లోపల ఉండగా యెహోవాకు విజ్ఞాపన చేశాడు.
34 Andin u kariwatⱪa qiⱪip balining üstigǝ ɵzini ⱪoyup aƣzini uning aƣziƣa, kɵzlirni uning kɵzlirigǝ, ⱪollirini uning ⱪolliriƣa yeⱪip yatti. Xuning bilǝn balining bǝdini issixⱪa baxlidi.
౩౪అతడు మంచం ఎక్కి పిల్లవాడి మీద పడుకున్నాడు. తన నోటిని వాడి నోటి మీదా, తన కళ్ళు వాడి కళ్ళ మీదా తన చేతులు వాడి చేతుల మీదా ఉంచి వాడిపై పడుకున్నాడు. అప్పుడు పిల్లవాడి ఒంట్లో వేడి పుట్టింది.
35 U qüxüp ɵydǝ u yaⱪ-bu yaⱪⱪa mengip andin yǝnǝ kariwatⱪa qiⱪip yǝnǝ balining üstigǝ egildi. U waⱪitta bala yǝttǝ ⱪetim qüxkürdi, andin kɵzlirini aqti.
౩౫తరువాత ఎలీషా లేచి ఆ గదిలో చుట్టూ తిరిగి మళ్ళీ ఆ పిల్లవాడి పైన పడుకున్నాడు. పిల్లవాడు ఏడుసార్లు తుమ్మి కళ్ళు తెరిచాడు.
36 Pǝyƣǝmbǝr Gǝⱨazini qaⱪirip uningƣa: Xunǝmlik ayalni qaⱪirƣin, dedi. U uni qaⱪirip ⱪoydi. U Elixaning yeniƣa kǝlgǝndǝ. U uningƣa: Oƣullirini kɵtürüp alsila, dedi.
౩౬అప్పుడు ఎలీషా గేహజీని పిలిచి “ఆ షూనేమీ స్త్రీని పిలుచుకురా” అన్నాడు. అతడు ఆమెను పిలుచుకు వచ్చాడు. ఆమె గది లోపలికి వచ్చింది. ఎలీషా ఆమెతో “నీ కొడుకుని ఎత్తుకో” అన్నాడు.
37 U ɵyigǝ kiripla uning ayiƣi aldiƣa yiⱪilip düm yatti, bexi yǝrgǝ tǝgküdǝk tǝzim ⱪildi. Andin ɵz oƣlini kɵtürüp qiⱪip kǝtti.
౩౭అప్పుడు ఆమె అతని కాళ్ల మీద సాష్టాంగపడి లేచి తన కొడుకుని ఎత్తుకుని వెళ్ళింది.
38 Elixa Gilgalƣa yenip bardi. Xu qaƣda yurtta aqarqiliⱪ bolƣanidi. Pǝyƣǝmbǝrlǝrning xagirtliri Elixaning yenida olturƣanda u ɵz hizmǝtkariƣa: Sǝn qong ⱪazanni esip pǝyƣǝmbǝrlǝrning xagirtliriƣa xorpa pixurup bǝrgin, dedi.
౩౮ఎలీషా తిరిగి గిల్గాలుకు వచ్చాడు. అప్పుడు ఆ దేశంలో కరువు నెలకుని ఉంది. ప్రవక్తల సమాజం వారు అతని ముందు కూర్చుని ఉన్నారు. అప్పుడు అతడు “పొయ్యి మీద పెద్ద వంట పాత్ర పెట్టి వీళ్ళకు ఆహరం సిద్ధం చెయ్యి” అని తన సేవకుడికి ఆదేశించాడు.
39 Ulardin birsi otyax tǝrgili dalaƣa qiⱪip yawa ⱪapaⱪ pelikini tepip, uningdin yawa ⱪapaⱪ üzüp etikini toldurup kelip, toƣrap ⱪazanƣa saldi; qünki ular bularning ziyanliⱪ ikǝnlikini bilmǝytti.
౩౯వారిలో ఒకడు కూరగాయల కోసం పొలంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక చేదు ద్రాక్షచెట్టును చూశాడు. చేదు కూరగాయలను కోసుకుని తన అంగీ నిండా నింపుకుని తీసుకుని వచ్చాడు. వాటి స్వభావం వాళ్ళకి తెలియలేదు. వారు వాటిని ముక్కలు చేసి పులుసులో వేశారు.
40 Andin ular yǝnglar dǝp adǝmlǝrgǝ usup bǝrdi. Lekin ular tamaⱪni yegili baxliƣanda: I Hudaning adimi, ⱪazanda ɵlüm bar, dǝp warⱪiraxti. Ⱨeqkim uningdin yeyǝlmidi.
౪౦భోజనం సమయంలో ఆ పులుసును వాళ్ళకి వడ్డించారు. ప్రవక్తల సమాజం వారు దాన్ని నోట్లో పెట్టుకుని “దేవుని మనిషీ, పాత్రలో విషం ఉంది” అంటూ కేకలు వేశారు. వాళ్ళిక దాన్ని తినలేకపోయారు.
41 Elixa: Azraⱪⱪinǝ un elip kelinglar, dedi. U xuni ⱪazanƣa taxlap: Hǝlⱪⱪǝ usup bǝrgin, yesun, dedi. Wǝ mana, ⱪazanda ⱨeq zǝⱨǝr ⱪalmidi.
౪౧కానీ ఎలీషా “కొంచెం పిండి తీసుకు రండి” అన్నాడు. పాత్రలో అతడు ఆ పిండి వేసి “భోజనానికి దీన్ని వడ్డించండి” అన్నాడు. ఇక ఆ పాత్రలో హానికరమైనది లేకుండా పోయింది.
42 Əmdi Baal-Xalixaⱨdin bir adǝm kelip, Hudaning adimigǝ arpa ⱨosulining tunji mewisidin ax-nan, yǝni yigirmǝ arpa nanni wǝ bir halta kɵk baxni elip keliwidi, u: Hǝlⱪⱪǝ yegili aldiƣa ⱪoyƣin, dedi.
౪౨తరువాత బయల్షాలిషా నుండి ఒక వ్యక్తి కొత్తగా పండిన యవల పిండితో చేసిన ఇరవై రొట్టెలనూ, తాజాగా కోసిన ధాన్యాన్నీ ఒక బస్తాలో వేసుకుని దేవుని మనిషి కోసం తీసుకు వచ్చాడు. అప్పుడు అతడు “వీటిని వడ్డించు, ఇక్కడున్నవారు భోజనం చేస్తారు” అని చెప్పాడు.
43 Uning hizmǝtkari: Xuni bir yüz adǝmning aldida ⱪandaⱪ ⱪoyalaymǝn? dedi. Elixa: Hǝlⱪⱪǝ yegili bǝrgin; qünki Pǝrwǝrdigar mundaⱪ dǝydu: Ular yǝydu wǝ uningdin exip ⱪalidu, dedi.
౪౩అయితే అతని సేవకుడు “ఏమిటీ? వందమందికి తినడానికి ఈ మాత్రం వాటిని వడ్డించాలా?” అన్నాడు. దానికి అతడు “వారు తినడానికి వడ్డించు. ఎందుకంటే ‘వారు తినగా ఇంకా మిగులుతాయి’ అని యెహోవా చెప్తున్నాడు” అన్నాడు.
44 Xuning bilǝn u xuni ularning aldida ⱪoydi; ular yedi wǝ dǝl Pǝrwǝrdigarning deginidǝk, uningdin exip ⱪaldi.
౪౪కాబట్టి అతని సేవకుడు వాటిని వాళ్ళకి వడ్డించాడు. యెహోవా చెప్పినట్లుగానే వాళ్ళంతా భుజించిన తరువాత ఆహారం ఇంకా మిగిలి పోయింది.