< अय्यू 32 >
1 तब उन तीनों आदमी ने अय्यूब को जवाब देना छोड़ दिया, इसलिए कि वह अपनी नज़र में सच्चा था।
౧యోబు తన దృష్టికి తాను నీతిమంతుడుగా ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు గ్రహించి అతనికి జవాబు చెప్పడం చాలించుకున్నారు.
2 तब इलीहू बिन — बराकील बूज़ी का, जुराम के ख़ान्दान से था, क़हर से भड़का। उसका क़हर अय्यूब पर भड़का, इसलिए कि उसने ख़ुदा को नहीं बल्कि अपने आप को रास्त ठहराया।
౨అప్పుడు రము వంశస్థుడు, బూజీయుడు, బరకెయేలు కుమారుడు అయిన ఎలీహు, యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్టు చెప్పుకోవడం చూసి అతని మీద ఎంతో కోపగించాడు.
3 और उसके तीनों दोस्तों पर भी उसका क़हर भड़का, इसलिए कि उन्हें जवाब तो सूझा नहीं, तोभी उन्होंने अय्यूब को मुजरिम ठहराया।
౩యోబు ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమీ చెప్పకుండా యోబు మీద దోషం మోపినందుకు వారి మీద కూడా అతడు ఎంతో కోపగించాడు.
4 और इलीहू अय्यूब से बात करने से इसलिए रुका रहा कि वह उससे बड़े थे।
౪వారు ఎలీహుకన్న ఎక్కువ వయస్సు గలవారు గనక అతడు యోబుతో మాటలాడాలని ఎదురు చూస్తున్నాడు.
5 जब इलीहू ने देखा कि उन तीनों के मुँह में जवाब न रहा, तो उसका क़हर भड़क उठा।
౫అయితే ఆ ముగ్గురూ ప్రత్యుత్తరమేమీ ఇయ్యక పోవడం చూసి అతనికి కోపం రేగింది.
6 और बराकील बूज़ी का बेटा इलीहू कहने लगा, मैं जवान हूँ और तुम बहुत बुज़ुर्ग हो, इसलिए मैं रुका रहा और अपनी राय देने की हिम्मत न की।
౬కాబట్టి బూజీయుడైన బరకెయేలు కుమారుడు ఎలీహు ఇలా మాటలాడసాగాడు. నేను వయస్సులో చిన్నవాణ్ణి. మీరు బహు వృద్ధులు. ఆ కారణం చేత నేను భయపడి నా ఉద్దేశం మీకు తెలియజేయడానికి తెగించలేదు.
7 मैं कहा साल खूरदह लोग बोलें और उम्र रसीदा हिकमत से खायें
౭వృద్ధాప్యం మాట్లాడాలి, అధిక సంఖ్యగల సంవత్సరాలు జ్ఞానం బోధించడానికి తగినవి, అని నేను అనుకున్నాను.
8 लेकिन इंसान में रूह है, और क़ादिर — ए — मुतलक़ का दम अक़्ल बख़्शता है।
౮అయినా మనుషుల్లో ఆత్మ ఒకటి ఉంది. సర్వశక్తుడైన దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేస్తుంది.
9 बड़े आदमी ही 'अक़्लमन्द नहीं होते, और बुज़ुर्ग ही इन्साफ़ को नहीं समझते।
౯వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు. పెద్ద వయస్సు గలవారు ఒకప్పుడు న్యాయం తెలిసినవారు కారు.
10 इसलिए मैं कहता हूँ, 'मेरी सुनो, मैं भी अपनी राय दूँगा।
౧౦కాబట్టి నా మాట అంగీకరించమని మనవి చేస్తున్నాను. నేను కూడా నా అభిప్రాయం తెలుపుతాను.
11 “देखो, मैं तुम्हारी बातों के लिए रुका रहा, जब तुम अल्फ़ाज़ की तलाश में थे; मैं तुम्हारी दलीलों का मुन्तज़िर रहा।
౧౧ఏమి పలకాలా అని మీరు ఆలోచిస్తుండగా నేను మీ మాటల కోసం కనిపెట్టుకున్నాను.
12 बल्कि मैं तुम्हारी तरफ़ तवज्जुह करता रहा, और देखो, तुम में कोई न था जो अय्यूब को क़ायल करता, या उसकी बातों का जवाब देता।
౧౨మీ అభిప్రాయాలు చెవిని వేసుకోవడం కోసం మీరు చెప్పిన వాటిపై బహు జాగ్రత్తగా ధ్యాస పెట్టాను. అయితే మీలో ఎవరూ యోబును ఖండించలేదు. ఎవరూ అతని మాటలకు జవాబు ఇయ్యలేదు.
13 ख़बरदार, यह न कहना कि हम ने हिकमत को पा लिया है, ख़ुदा ही उसे लाजवाब कर सकता है न कि इंसान।
౧౩కాబట్టి మాకు జ్ఞానం లభించిందని, దేవుడు తప్ప మనుషులు అతన్ని ఓడించలేరని మీరు అనకూడదు.
14 क्यूँकि न उसने मुझे अपनी बातों का निशाना बनाया, न मैं तुम्हारी तरह तक़रीरों से उसे जवाब दूँगा।
౧౪అతడు నాతో వాదమాడలేదు. మీరు చెప్పిన మాటలను బట్టి నేనతనికి జవాబు ఇయ్యను.
15 वह हैरान हैं, वह अब जवाब नहीं देते; उनके पास कहने को कोई बात न रही।
౧౫వారు ఆశ్చర్యపడి ఇక జవాబు చెప్పడం మానుకున్నారు. పలకడానికి వారికి మాట ఒకటి కూడా లేదు.
16 और क्या मैं रुका रहूँ, इसलिए कि वह बोलते नहीं? इसलिए कि वह चुपचाप खड़े हैं और अब जवाब नहीं देते?
౧౬కాగా వారిక ఏమీ జవాబు చెప్పకుండా ఊరుకున్నారు. వారు మాటలాడక పోవడం చూసి నేను ఊరుకుంటానా?
17 मैं भी अपनी बात कहूँगा, मैं भी अपनी राय दूँगा।
౧౭నేను ఇయ్యవలసిన జవాబు నేనిస్తాను. నేను కూడా నా అభిప్రాయం తెలుపుతాను.
18 क्यूँकि मैं बातों से भरा हूँ, और जो रूह मेरे अंदर है वह मुझे मज़बूर करती है।
౧౮నా మనస్సునిండా మాటలున్నాయి. నా అంతరంగంలో ఉన్న ఆత్మ నన్ను బలవంతం చేస్తున్నది.
19 देखो, मेरा पेट बेनिकास शराब की तरह है, वह नई मश्कों की तरह फटने ही को है।
౧౯నా మనస్సు తెరవని ద్రాక్షారసపు తిత్తి లాగా ఉంది. కొత్త తిత్తుల్లాగా అది పిగిలిపోడానికి సిద్ధంగా ఉంది.
20 मैं बोलूँगा ताकि तुझे तसल्ली हो: मैं अपने लबों को खोलूँगा और जवाब दूँगा।
౨౦నేను మాట్లాడి బరువు దించుకుంటాను. నా పెదాలు విప్పి ప్రత్యుత్తరమిస్తాను.
21 न मैं किसी आदमी की तरफ़दारी करूँगा, न मैं किसी शख़्स को ख़ुशामद के ख़िताब दूँगा।
౨౧మీరు దయచేసి వినండి. నేను ఎవరి విషయంలోనూ పక్షపాతం చూపించను. నేను ముఖస్తుతి కోసం ఎవరికీ బిరుదులు తగిలించను.
22 क्यूँकि मुझे ख़ुश करने का ख़िताब देना नहीं आता, वर्ना मेरा बनाने वाला मुझे जल्द उठा लेता।
౨౨ముఖస్తుతి చేయడం నా చేత కాదు. అలా చేస్తే నన్ను చేసినవాడు శీఘ్రంగా నన్ను నిర్మూలం చేస్తాడు.