< До Тита 1 >
1 Павло́, раб Божий, а апо́стол Ісуса Христа, по вірі ви́браних Божих і пізна́нні правди, що за благоче́стям,
౧దేవుడు ఎన్నుకున్న వారి విశ్వాసాన్ని స్థిరపరచడం కోసం, వారు దైవ భక్తికి అనుగుణమైన సత్యం గురించిన ఎరుకలో నిలకడగా ఉండేలా,
2 в надії вічного життя, яке обіцяв був від вічних часів необма́нливий Бог, (aiōnios )
౨అబద్ధమాడలేని దేవుడు కాలానికి ముందే వాగ్దానం చేసిన శాశ్వత జీవం గురించిన నిశ్చయతలో పౌలు అనే నేను దేవుని సేవకుణ్ణి, యేసు క్రీస్తు అపొస్తలుణ్ణి. (aiōnios )
3 і ча́су свого з'явив Слово Своє в пропові́данні, що дору́чене було мені з наказу Спасителя нашого Бога, —
౩సరైన సమయంలో ఆయన ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగించిన సందేశం వలన తన వాక్కును వెల్లడి చేశాడు.
4 до Тита, щирого сина за спільною ві́рою: благодать, милість та мир від Бога Отця й Христа Ісуса, Спасителя нашого!
౪మన అందరి ఉమ్మడి విశ్వాసం విషయంలో నా సొంత కుమారుడు తీతుకు రాస్తున్న లేఖ. తండ్రియైన దేవుని నుండీ, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండీ కృప, కరుణ, శాంతి సమాధానాలు నీకు కలుగు గాక.
5 Я для того тебе полиши́в був у Кріті, щоб ти впорядкував недокінчене та пресвітерів настанови́в по містах, як тобі я звелів, —
౫నేను నీకు ఆదేశించినట్టు నువ్వు ఇంకా క్రమపరచని వాటిని క్రమపరచి, ప్రతి పట్టణంలోని క్రీస్తు ప్రభువు సంఘంలో పెద్దలను నియమించడం కోసం నేను నిన్ను క్రేతులో విడిచి వచ్చాను.
6 коли хто бездога́нний, муж єдиної дружи́ни, має вірних дітей, недокорених за блуд або неслухня́ність.
౬సంఘపెద్ద నిందకు చోటివ్వనివాడూ ఒకే భార్య కలవాడై ఉండాలి. అతని పిల్లలు లెక్కలేనితనంగా క్రమశిక్షణ లేనివారు అనే పేరు లేకుండా విశ్వాసులై ఉండాలి.
7 Бо єпи́скоп мусить бути бездоганний, як Божий доморя́дник, не самолюбний, не гнівли́вий, не п'яни́ця, не заводія́ка, не кори́сливий,
౭అధ్యక్షుడు దేవుని ఇంటి సేవ నిర్వహించేవాడు కాబట్టి నిందారహితుడుగా ఉండాలి. అతడు అహంకారి, ముక్కోపి, ద్రాక్ష మద్యానికి అలవాటు పడినవాడు, దెబ్బలాడేవాడు, దురాశపరుడు అయి ఉండకూడదు.
8 але гостинний до при́ходнів, добролюбець, поміркований, справедливий, побожний, стри́маний,
౮అతిథి ప్రియుడు, మంచిని ప్రేమించేవాడు, ఇంగిత జ్ఞానం గలవాడు, నీతిపరుడు, పవిత్రుడు, ఆశలను అదుపులో ఉంచుకొనేవాడు,
9 що трима́ється вірного слова згідно з наукою, щоб мав силу й навчати в здоровій науці, і переконувати противних.
౯నమ్మదగిన బోధను స్థిరంగా చేపట్టడం ద్వారా క్షేమకరమైన సిద్ధాంతం బోధిస్తూ ప్రజలను హెచ్చరించడంలో, ఎదిరించే వారి వాదాలను ఖండించడంలో సమర్ధుడుగా ఉండాలి.
10 Багато бо є неслухня́них, марносло́вців, зводників, особливо ж з обрізаних, —
౧౦ఎందుకంటే అక్రమకారులు, ముఖ్యంగా సున్నతి పొందిన వారు చాలామంది ఉన్నారు. వారి మాటలు ఎందుకూ పనికి రానివి. వారు మనుషులను తప్పుదారి పట్టిస్తారు.
11 їм треба уста́ затуляти: вони ці́лі доми баламу́тять, навчаючи, чого не належить, для зиску брудно́го.
౧౧వారి నోళ్ళు మూయించడం అవసరం. వారు సిగ్గుకరమైన స్వలాభం కోసం బోధించకూడని వాటిని బోధిస్తూ, కుటుంబాలను పాడు చేస్తున్నారు.
12 Сказав один з них, їхній власний пророк: „Крітяни за́вжди брехливі, люті звірі, черева́ні ліниві“!
౧౨వారిలో ఒకడు, వారి స్వంత ప్రవక్తే ఇలా అన్నాడు, ‘క్రేతు ప్రజలు ఎంతసేపూ అబద్ధికులు, ప్రమాదకరమైన దుష్టమృగాలు, సోమరులైన తిండిబోతులు.’
13 Це свідоцтво правдиве. Ради цієї причини докоряй їм суворо, щоб у вірі здорові були́,
౧౩ఈ మాటలు నిజమే.
14 і на юдейські байки́ не вважали, ані на нака́зи людей, що від правди відверта́ються.
౧౪అందుచేత వారు యూదుల కల్పిత గాథలనూ, సత్యం నుండి మళ్ళిన వారి ఆజ్ఞల గురించి సమయం వ్యర్థం చేసుకోకుండా పట్టించుకోకుండా విశ్వాసంలో స్థిరపడడం కోసం వారిని కఠినంగా మందలించు.
15 Для чистих все чисте, а для занечищених та для невірних не чисте ніщо, але занечи́стилися і розум їхній, і сумління.
౧౫పవిత్రులకు అన్నీ పవిత్రమే. కానీ అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏదీ పవిత్రం కాదు. కానీ వారి హృదయం, వారి మనస్సాక్షి కూడా అపవిత్రాలే.
16 Вони тве́рдять, немов знають Бога, але відкидаються вчинками, бувши бридкі́ й неслухняні, і до всякого доброго діла нездатні.
౧౬దేవుడు తమకు తెలుసని వారు చెప్పుకొంటారు గాని తమ క్రియల వలన దేవుడెవరో తమకు తెలియదు అన్నట్టు ఉన్నారు. నిజానికి వారు అసహ్యులు, అవిధేయులు, ఎలాంటి సత్కార్యం విషయంలోనూ పనికి రానివారు.