< Об'явлення 19 >
1 По цьому почув я на́че гучни́й голос великого на́товпу в небі, який говорив: „Алілу́я! Спасі́ння, і слава, і сила Господе́ві нашому,
౧ఈ విషయాలు జరిగిన తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు పరలోకంలో నుండి ఒక పెద్ద శబ్దం నేను విన్నాను. “హల్లెలూయ! రక్షణ, యశస్సు, బల ప్రభావాలు మన దేవునివే.
2 правдиві бо та справедливі суди́ Його, бо Він засудив ту велику розпусницю, що землю зіпсула своєю розпустою, і помстив за кров Своїх рабів з її рук!“
౨ఆయన తీర్పులు సత్యంగా న్యాయంగా ఉన్నాయి. తన లైంగిక అవినీతితో భూలోకాన్ని భ్రష్టత్వంలోకి నెట్టిన మహా వేశ్యను ఆయన శిక్షించాడు. ఆమె ఒలికించిన తన సేవకుల రక్తానికి ఆయన ప్రతీకారం తీర్చాడు.”
3 І вдруге сказали вони: „Алілуя! І з неї дим виступає на вічні віки!“ (aiōn )
౩రెండోసారి వారంతా, “హల్లెలూయ! ఆ నగరం నుండి పొగ కలకాలం పైకి లేస్తూనే ఉంటుంది” అన్నారు. (aiōn )
4 І попа́дали двадцять чотири ста́рці й чотири твари́ни, і поклонилися Богові, що сидить на престолі, говорячи: „Амінь, алілуя!“
౪అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలూ ఆ నాలుగు ప్రాణులూ సాష్టాంగపడి సింహాసనంపై కూర్చున్న దేవునికి, “ఆమెన్, హల్లెలూయ!” అని చెబుతూ ఆయనను పూజించారు.
5 А від престолу вийшов голос, що кли́кав: „Хваліть Бога нашого, усі раби Його, і всі, хто боїться Його, і малі, і великі!“
౫అప్పుడు, “దేవుని దాసులు, ఆయనకు భయపడే వారు, గొప్పవారైనా అనామకులైనా అందరూ మన దేవుణ్ణి స్తుతించండి” అంటూ ఒక స్వరం సింహాసనం నుండి వినిపించింది.
6 І почув я ніби голос великого на́товпу, і на́че шум великої води, і мов голос громів гучних, що вигукували: „Алілуя, бо запанував Господь, наш Бог Вседержи́тель!
౬తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు, అనేక జలపాతాల గర్జనలా, బలమైన ఉరుముల ధ్వనిలా ఒక స్వరం ఇలా వినిపించింది. “హల్లెలూయ! సర్వ శక్తిశాలి, మన ప్రభువు అయిన దేవుడు పరిపాలిస్తున్నాడు.”
7 Радіймо та тішмося, і даймо славу Йому́, бо весі́лля Агнця настало, і жона Його себе приготува́ла!“
౭“గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. పెండ్లికుమార్తె సిద్ధపడి ఉంది. కాబట్టి మనం సంతోషించి ఆనందించుదాం. ఆయనకు మహిమ ఆపాదించుదాం.”
8 І їй да́но було зодягнутися в чистий та світлий вісо́н, бо вісо́н — то праведність святих.
౮ఆమె ధరించుకోడానికి మెరిసిపోయే, పరిశుభ్రమైన శ్రేష్ఠవస్త్రాలు ఇచ్చారు. ఈ శ్రేష్ఠవస్త్రాలు పరిశుద్ధుల నీతి కార్యాలు.
9 І сказав він мені: „Напиши: Блаженні покликані на весільну вечерю Агнця!“І сказав він мені: „Це правдиві Божі слова!“
౯అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, “గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం అందినవారు ధన్యులు అని రాయి.” అతడే ఇంకా, “ఇవి నిజంగా దేవుని మాటలు” అన్నాడు.
10 І я впав до його ніг, щоб вклонитись йому. А він каже мені: „Таж ні! Я співслуга твій та братів твоїх, хто має засві́дчення Ісусове, — Богові вклонися!“Бо засві́дчення Ісусове, — то дух пророцтва.
౧౦అందుకు నేను అతణ్ణి పూజించడానికి అతని ముందు సాష్టాంగపడబోయాను. కానీ అతడు, “అలా చేయకు! యేసుకు సాక్షులుగా ఉన్న నీకూ నీ సోదరులకూ నేను తోటి దాసుణ్ణి మాత్రమే” అన్నాడు.
11 І побачив я небо відкрите. І ось білий кінь, а Той, Хто на ньому сидів, зветься Вірний і Правдивий, і Він праведно судить і воює.
౧౧తరువాత పరలోకం తెరుచుకుని ఉండడం చూశాను. అప్పుడు చూడండి! తెల్లని గుర్రం ఒకటి నాకు కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తి పేరు ‘నమ్మకమైన వాడు, సత్యవంతుడు.’ ఆయన న్యాయంగా తీర్పు చెబుతూ యుద్ధం చేస్తాడు.
12 Очі Його — немов по́лум'я огняне́, а на голові Його — багато вінців. Він ім'я́ мав написане, якого не знає ніхто, тільки Він Сам.
౧౨ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన తలపై అనేక కిరీటాలున్నాయి. ఆయనపై ఒక పేరు రాసి ఉంది. అది ఆయనకు తప్ప వేరెవరికీ తెలియదు.
13 I зодя́гнений був Він у шату, покра́шену кров'ю. А Йому на ім'я: Слово Боже.
౧౩ఆయన ధరించిన దుస్తులు రక్తంలో ముంచి తీసినవి. ‘దేవుని వాక్కు’ అనే పేరు ఆయనకుంది.
14 А війська́ небесні, зодягнені в білий та чистий вісо́н, їхали вслід за Ним на білих ко́нях.
౧౪ఆయన వెనకే పరలోక సేనలు తెల్లని నార బట్టలు వేసుకుని తెల్ల గుర్రాలపై ఎక్కి వెళ్తున్నారు.
15 А з Його уст виходив гострий меч, щоб ним бити наро́ди. І Він па́стиме їх залізним жезлом, і Він буде топтати чави́ло вина лютого гніву Бога Вседержи́теля!
౧౫వివిధ జాతి ప్రజలను కొట్టడానికి ఆయన నోటి నుండి పదునైన కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ఇనుప లాఠీతో వారిని పరిపాలిస్తాడు. సర్వాధికారి అయిన దేవుని తీక్షణమైన ఆగ్రహపు ద్రాక్ష గానుగ తొట్టిని ఆయనే తొక్కుతాడు.
16 I Він має на шаті й на сте́гнах Своїх написане ймення: „Цар над царями, і Господь над панами“.
౧౬ఆయన బట్టల మీదా, తొడ మీదా ‘రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు’ అనే పేరు రాసి ఉంది.
17 І бачив я одного ангола, що на сонці стояв. І він гучним голосом кли́кнув, ка́жучи до всіх птахів, що серед неба літали: „Ходіть, — і зберіться на велику Божу вечерю,
౧౭అప్పుడు ఒక దూత సూర్యబింబంలో నిలబడి ఉండడం నేను చూశాను. అతడు బిగ్గరగా కేక వేసి పైన ఎగిరే పక్షులను పిలిచాడు, “రండి, దేవుడు ఏర్పాటు చేసిన మహా విందును ఆరగించండి.
18 щоб ви їли тіла царів, і тіла ти́сячників, і тіла сильних, і тіла ко́ней і тих, хто сидить на них, і тіла всіх вільних і рабів, і мали́х, і великих“.
౧౮రాజుల మాంసం, సైన్యాధిపతుల మాంసం, బలవంతుల మాంసం, గుర్రాల మాంసం, వాటిపై స్వారీ చేసేవారి మాంసం, స్వతంత్రులూ, బానిసలూ, పలుకుబడి లేనివారూ, గొప్పవారూ అయిన మనుషులందరి మాంసం, వచ్చి తినండి” అన్నాడు.
19 І я побачив звіри́ну, і зе́мних царів, і війська́ їхні, зібрані, щоб учинити війну з Тим, Хто сидить на коні, та з ві́йськом Його.
౧౯క్రూరమృగం, భూమి మీదనున్న రాజులందరూ తమ సైన్యాలతో వ్యూహం తీరి ఉండడం నేను చూశాను. వారు ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తితోనూ ఆయన సైన్యంతోనూ యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నారు.
20 І схо́плена була звіри́на, а з нею неправдивий пророк, що ознаки чинив перед нею, що ними звів тих, хто знаме́но звіри́ни прийняв і поклонився був о́бразові її. Обоє вони були вкинені живими до огняно́го озера, що сіркою горіло. (Limnē Pyr )
౨౦అప్పుడా మృగమూ, వాడి ముందు అద్భుతాలు చేసిన అబద్ధ ప్రవక్తా పట్టుబడ్డారు. ఈ అద్భుతాలతోనే వీడు మృగం ముద్ర వేయించుకున్న వారిని, ఆ విగ్రహాన్ని పూజించిన వారిని మోసం చేశాడు. ఈ ఇద్దరినీ గంధకంతో మండుతున్న అగ్ని సరస్సులో ప్రాణాలతోనే పడవేశారు. (Limnē Pyr )
21 А решта побита була мечем Того, Хто сидів на коні, що виходив із уст Його. І все пта́ство наїлося їхніми трупами.
౨౧మిగిలిన వారు గుర్రం మీద కూర్చున్న వ్యక్తి నోటి నుండి వస్తున్న కత్తివాత పడి చచ్చిపోయారు. వారి మాంసాన్ని పక్షులు కడుపారా ఆరగించాయి.