< Псалми 76 >
1 Для дириґента хору. На неґінах. Псалом Аса́фів. Пісня. Бог знаний у Юді, Його Йме́ння велике в Ізраїлі!
౧ప్రధాన సంగీతకారుని కోసం, తీగ వాయిద్యాలతో పాడేది. ఆసాపు కీర్తన, ఒక పాట. యూదాలో దేవుడు తనను తెలియబరచుకున్నాడు. ఇశ్రాయేలులో ఆయన నామం ఘనమైనది.
2 У Сали́мі намет Його, а мешка́ння Його на Сіоні, —
౨షాలేంలో ఆయన నివాసం ఉంది, సీయోనులో ఆయన గృహం ఉంది.
3 Він там полама́в стріли лу́ку, щита́ та меча, та війну́! (Се́ла)
౩అక్కడ ఆయన విల్లంబులు, డాలు, కత్తి మిగతా యుద్ధాయుధాలను విరిచి వేశాడు. (సెలా)
4 Ти осяйни́й, потужніший за го́ри відві́чні.
౪నువ్వు నీ శత్రువులను జయించి పర్వతాల నుంచి దిగి వస్తూ మెరిసిపోతున్నావు. నీ మహిమను ప్రదర్శిస్తున్నావు.
5 Обдерто людей сильносе́рдих, задріма́ли вони своїм сном, — і не знайшли своїх рук усі мужі військо́ві.
౫గుండె ధైర్యం గలవారు దోపిడికి గురి అయ్యారు. నిద్రపోయారు. శూరులంతా నిస్సహాయులయ్యారు.
6 Від сварі́ння Твого́, Боже Яковів, оглу́шується колесни́ця та кінь:
౬యాకోబు దేవా, యుద్ధంలో నీ గద్దింపుకు గుర్రం, రౌతు కూడా మూర్ఛిల్లారు.
7 Ти — Ти грізний, і хто перед обличчям Твоїм устоїть ча́су гніву Твого?
౭నీకు, నీకు మాత్రమే భయపడాలి. నువ్వు కోపపడితే నీ ఎదుట ఎవరు నిలుస్తారు?
8 Як звіщаєш Ти суд із небе́с, то боїться й стиха́є земля,
౮నీ తీర్పు పరలోకం నుంచి వచ్చింది, భూమికి భయమేసింది, అది మౌనంగా ఉంది.
9 як встає Бог на суд, щоб спасти́ всіх покі́рних землі! (Се́ла)
౯దేవా! నువ్వు తీర్పు ప్రకటించడానికి, దేశమంతటా అణగారిన వాళ్ళను కాపాడడానికి లేచావు. (సెలా)
10 Бо й гнів лю́дський Тебе вихваля́є, решту ж гніву Ти по́ясом в'я́жеш.
౧౦కోపంతో వారిపై నీ తీర్పు ప్రజలు కచ్చితంగా నిన్ను స్తుతించేలా చేస్తుంది. నీ ఆగ్రహాన్ని నువ్వు పూర్తిగా వెల్లడిస్తావు.
11 Присягайте й виконуйте Господу, Богові вашому, усі, хто Його оточа́є, хай прино́сять дарунка Грізно́му:
౧౧మీ యెహోవా దేవునికి మొక్కుకుని వాటిని చెల్లించండి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా భయభక్తులకు పాత్రుడైన ఆయనకు కానుకలు తీసుకు రండి.
12 Він духа вельмож впокоря́є, страшни́й Він для зе́мних царів!
౧౨అధికారుల పొగరును ఆయన అణచివేస్తాడు, భూరాజులు ఆయనకు భయపడతారు.