< Михей 3 >
1 А я відказав: Послухайте ж, го́лови Якова та начальники дому Ізраїля, — чи ж не ва́м знати право?
౧నేనిలా చెప్పాను. “యాకోబు నాయకులారా, ఇశ్రాయేలీయుల అధికారులారా, ఇప్పుడు వినండి. న్యాయం అంటే ఏంటో మీరు తెలుసుకోవద్దా?
2 Добро ви нена́видите та кохаєте зло, шкіру їхню здираєте з них, а їхнє тіло — з косте́й їхніх.
౨మీరు మంచిని అసహ్యించుకుని చెడును ఇష్టపడతారు. నా ప్రజల చర్మం ఒలిచేసి వారి ఎముకల మీద ఉన్న మాంసాన్ని చీలుస్తారు.
3 Ви оста́нок наро́ду Мого їсте та стягаєте з них їхню шкіру, а їхні кості ламаєте, і січе́те, немов до горня́ти, і мов м'ясо в котел.
౩నా ప్రజల మాంసాన్ని తింటారు. వారి చర్మాన్ని ఒలిచి వారి ఎముకలను విరగగొట్టేస్తారు. ఒకడు పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్టుగా ఉడుకుతున్న పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్టు మీరు చేస్తారు.
4 Вони тоді кли́кати будуть до Господа, та Він відповіді їм не дасть, і заховає обличчя Своє того ча́су від них, коли будуть робити лихі свої вчинки.
౪ఆ తరువాత నాయకులైన మీరు యెహోవాకు మొరపెడతారు కానీ ఆయన వారికి జవాబివ్వడు. మీరు చెడు పనులు చేశారు. కాబట్టి అప్పుడు ఆయన వారికి తన ముఖాన్ని చూపించడు.”
5 Так говорить Госпо́дь на пророків, що вводять наро́д Мій у блуд, що зубами своїми гризу́ть та покли́кують: „Мир!“А на то́го, хто їм не дає що до рота, на ньо́го святую війну оголо́шують.
౫నా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రవక్తలను గురించి యెహోవా చెప్పేదేమిటంటే, తమకు భోజనం పెట్టేవారికి “సంపద వస్తుంది” అని చెబుతారు. భోజనం పెట్టకపోతే, వారి మీద యుద్ధం ప్రకటిస్తారు.
6 Тому буде вам ніч, щоб не стало видіння, і сте́мніє вам, щоб не чарува́ти. І над тими пророками сонце зако́титься, і над ними поте́мніє день.
౬అందుచేత మీకు దర్శనాలేమీ రాకుండా రాత్రి కమ్ముకువస్తుంది. సోదె చెప్పకుండా మీకు చీకటి ఆవరిస్తుంది. ఇలాంటి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండ అస్తమిస్తాడు. పగలు చీకటిగా మారిపోతుంది.
7 І посоро́млені будуть такі прозорли́вці, і будуть засти́джені чарівники́, і всі вони свої у́ста закриють, бо не буде їм Божої відповіді.
౭అప్పుడు భవిష్యత్తును చెప్పేవారికి సిగ్గు కలుగుతుంది. సోదె చెప్పేవాళ్ళు కలవరపడతారు. నా దగ్గరనుంచి జవాబేమీ రానందుకు వారంతా నోరు మూసుకుంటారు.
8 А я́ повний сили й Госпо́днього Духа, і правди й відваги, щоб представити Якову про́гріх його, а Ізраїлеві — його гріх.
౮అయితే నా మట్టుకైతే, యాకోబు సంతానానికి వాళ్ళ అతిక్రమాలనూ ఇశ్రాయేలీయులకు తమ పాపాన్ని వెల్లడించడానికి యెహోవా ఆత్మమూలంగా సంపూర్ణ అధికారంతో, న్యాయంతో ఉన్నాను.
9 Почуйте ж це, го́лови дому Якового та начальники дому Ізраїля, які не́хтують справедливість, а все про́сте викри́влюють,
౯యాకోబు వంశపు ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఈ మాట వినండి. మీరు న్యాయాన్ని తృణీకరిస్తూ సక్రమంగా ఉండే సమస్తాన్నీ వక్రం చేస్తారు.
10 вони кров'ю будують Сіо́на, а кривдою — Єрусали́ма.
౧౦సీయోనును మీరు రక్తంతో కడతారు. దుర్మార్గంతో యెరూషలేమును కడతారు.
11 Його го́лови судять за хабара́, і навчають за плату його ті священики, і за срі́бло воро́жать пророки його́, хоч на Господа вони опира́ються, кажучи: „Хіба не Господь серед нас? Зло не при́йде на нас!“
౧౧ప్రజల ప్రధానులు లంచం పుచ్చుకుని తీర్పు తీరుస్తారు. వారి యాజకులు కూలికి బోధిస్తారు. ప్రవక్తలు డబ్బు కోసం సోదె చెబుతారు. అయినా వాళ్ళు యెహోవాను ఆధారం చేసుకుని “యెహోవా మన మధ్య ఉన్నాడు గదా, ఏ కీడూ మనకు రాదు” అనుకుంటారు.
12 О так, — через вас Сіон буде на поле зао́раний, а Єрусалим на руїни обе́рнеться, а гора́ храмова́ стане взгі́р'ями лісу.
౧౨కాబట్టి మీ మూలంగా శత్రువులు సీయోనును పొలంలాగా దున్నుతారు. యెరూషలేము రాళ్ల కుప్ప అవుతుంది. మందిరమున్న కొండ, అడవిలాగా అవుతుంది.