< Від Матвія 17 >
1 А через шість день забирає Ісус Петра, і Якова, і Івана, брата його, та й веде їх осі́бно на го́ру високу.
౧ఆరు రోజుల తరువాత యేసు పేతురు, యాకోబు, అతని సోదరుడు యోహానులను తీసుకుని ఎత్తయిన ఒక పర్వతం మీదికి వెళ్ళాడు.
2 І Він перед ними переобрази́вся: обличчя Його, як те сонце, зася́ло, а одежа Його стала біла, як світло.
౨వారు చూస్తూ ఉండగానే ఆయన రూపం మారిపోయింది. ఆయన ముఖం సూర్యుడిలాగా ప్రకాశించింది. ఆయన వస్త్రాలు కాంతి లాగా తెల్లనివయ్యాయి.
3 І ось з'явились до них Мойсей та Ілля́, і розмовляли із Ним.
౩అదే క్షణంలో మోషే, ఏలీయాలు యేసుతో మాట్లాడుతూ వారికి కనిపించారు.
4 І озвався Петро та й сказав до Ісуса: „Господи, до́бре бути нам тут! Коли хочеш, поста́влю оту́т три шатра: для Тебе одне, і одне для Мойсея, і одне для Іллі“.
౪అప్పుడు పేతురు యేసుతో, “ప్రభూ, మనమిక్కడే ఉండిపోదాం. నీకిష్టమైతే ఇక్కడ నీకు, మోషేకు, ఏలీయాకు మూడు పాకలు వేస్తాను” అన్నాడు.
5 Як він ще говорив, ось хмара ясна заслони́ла їх, і ось голос із хмари почувсь, що казав: „Це Син Мій Улю́блений, що Його Я вподо́бав. Його слухайтеся!“
౫అతడు మాట్లాడుతూ ఉండగానే గొప్ప వెలుగుతో నిండిన ఒక మేఘం వారిని కమ్ముకుంది. ఆ మేఘంలో నుండి ఒక స్వరం వారితో, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనంటే నాకు చాలా సంతోషం. మీరు ఈయన చెప్పేది వినండి” అని పలికింది.
6 А почувши, попа́дали учні долі́лиць, і полякалися сильно.
౬శిష్యులు ఈ మాటలు విని భయంతో బోర్లాపడిపోయారు.
7 А Ісус підійшов, доторкнувся до них і промовив: „Уставайте й не бійтесь!“
౭యేసు వారి దగ్గరికి వచ్చి, వారిని తాకి, “భయపడకండి, ఇక లేవండి” అన్నాడు.
8 Звівши ж очі свої, ніко́го вони не побачили, окрім Само́го Ісуса.
౮వారు కళ్ళు తెరచి చూస్తే, యేసు తప్ప ఇంకెవరూ వారికి కనబడలేదు.
9 А коли з гори схо́дили, заповів їм Ісус і сказав: „Не кажіть ніко́му про це виді́ння, аж поки Син Лю́дський із мертвих воскре́сне“.
౯వారు కొండ దిగి వచ్చేటప్పుడు, “మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి సజీవుడై లేచే వరకూ ఈ దర్శనం మీరు ఎవ్వరితో చెప్పవద్దు” అని యేసు వారికి ఆజ్ఞాపించాడు.
10 І запитали Його учні, говорячи: „Що́ це книжники кажуть, ніби треба Іллі́ перш прийти?“
౧౦అప్పుడు శిష్యులు, “మరి మొదట ఏలీయా రావాలని ధర్మశాస్త్ర బోధకులు ఎందుకు చెబుతున్నారు?” అని అడిగారు.
11 А Він відповів і сказав: „Ілля́, правда, при́йде, і все приготу́є.
౧౧అందుకు ఆయన ఇలా జవాబిచ్చాడు, “ఏలీయా ముందుగా వచ్చి అంతా చక్కబెడతాడనే మాట నిజమే.
12 Але́ кажу вам, що Ілля́ вже прийшов був, — та його не пізнали, але з ним зробили, що тільки хотіли. Так і Син Лю́дський має страждати від них“.
౧౨అయితే నేను కచ్చితంగా మీతో చెప్పేదేమంటే, ఏలీయా ఇప్పటికే వచ్చేశాడు గానీ వారు అతణ్ణి గుర్తించలేదు. పైగా, అతణ్ణి ఇష్టం వచ్చినట్టుగా బాధించారు. అదే విధంగా మనుష్య కుమారుడు కూడా వారి చేతిలో బాధలు అనుభవించబోతున్నాడు.”
13 Учні тоді зрозуміли, що Він їм говорив про Івана Христителя.
౧౩బాప్తిసమిచ్చే యోహాను గురించి ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు.
14 І як вони до наро́ду прийшли, то до Нього один чоловік приступив, і навко́лішки впав перед Ним,
౧౪వారు కొండ దిగి అక్కడి జనసమూహంలోకి రాగానే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకరించి,
15 і сказав: „Господи, змилуйсь над сином моїм, що біснується у новомі́сяччі, і мучиться тяжко, бо почасту падає він ув огонь, і почасту в воду.
౧౫“ప్రభూ, నా కొడుకును కనికరించు. వాడు మూర్ఛరోగి. చాలా బాధపడుతున్నాడు. పదే పదే నిప్పుల్లో నీళ్ళలో పడిపోతుంటాడు.
16 Я його був привів до учнів Твоїх, — та вони не могли вздорови́ти його“.
౧౬వాణ్ణి నీ శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాను గాని వారు బాగుచేయలేక పోయారు” అని చెప్పాడు.
17 А Ісус відповів і сказав: „О роде невірний і розбе́щений, доки бу́ду Я з вами? Доки вас Я терпітиму? Приведіть до Мене сюди його!“
౧౭అందుకు యేసు, “వక్ర మార్గం పట్టిన విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎప్పటి వరకూ మిమ్మల్ని సహిస్తాను? అతణ్ణి నా దగ్గరికి తీసుకు రండి” అన్నాడు.
18 Пото́му Ісус погрози́в йому, і де́мон вийшов із нього. І видужав хлопець тієї години!
౧౮యేసు ఆ దయ్యాన్ని గద్దించగానే అది ఆ బాలుణ్ణి విడిచిపెట్టేసింది. వెంటనే అతడు బాగుపడ్డాడు.
19 Тоді підійшли учні насамоті́ до Ісуса й сказали: „Чому ми́ не могли його вигнати?“
౧౯తరువాత శిష్యులు ఏకాంతంగా యేసును కలిసి, “మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేక పోయాం?” అని అడిగారు.
20 А Він їм відповів: „Через ваше невірство. Бо поправді кажу́ вам: коли будете ви мати віру, хоч як зе́рно гірчи́чне, і горі оцій скажете: „Перейди́ звідси туди“, то й пере́йде вона, і нічо́го не матимете неможливого!
౨౦అందుకాయన, “మీ అల్పవిశ్వాసమే దానికి కారణం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళు అనగానే అది వెళ్ళిపోతుంది అని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
21 Цей же рід не вихо́дить інакше, як тільки молитвою й по́стом“.
౨౧మీకు అసాధ్యమైంది ఏదీ ఉండదు” అని వారితో చెప్పాడు.
22 Коли пробува́ли вони в Галіле́ї, то сказав їм Ісус: „Людський Син буде ви́даний лю́дям до рук,
౨౨వారు గలిలయలో ఉన్నప్పుడు యేసు, “మనుష్య కుమారుణ్ణి మనుషుల చేతికి అప్పగిస్తారు,
23 і вони Його вб'ють, але третього дня Він воскре́сне“. І тяжко вони зажурились.
౨౩వారు ఆయనను చంపుతారు. కానీ ఆయన మూడవ రోజు సజీవుడై తిరిగి లేస్తాడు” అని తన శిష్యులతో చెప్పినప్పుడు వారు చాలా దుఃఖపడ్డారు.
24 Як прийшли ж вони в Капернау́м, до Петра підійшли збирачі́ дидра́хм на храм, та й сказали: „Чи не запла́тить ваш Учитель дидра́хми?“
౨౪వారు కపెర్నహూముకు చేరగానే అర షెకెలు పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరికి వచ్చి, “మీ గురువుగారు ఈ అర షెకెలు పన్ను చెల్లించడా?” అని అడిగారు.
25 Він відказує: „Так“. І як він увійшов до дому, то Ісус попере́див його та сказав: „Як ти ду́маєш, Си́моне: царі зе́мні з кого беру́ть мито або пода́тки: від синів своїх, чи чужих?“
౨౫అతడు, “అవును, చెల్లిస్తాడు” అన్నాడు. అతడు ఇంట్లోకి వెళ్ళి యేసుతో ఆ విషయం చెప్పక ముందే ఆయన, “సీమోనూ, ఈ భూమి మీద రాజులు సుంకం, పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు? తమ కొడుకుల దగ్గరా లేక బయటివాళ్ళ దగ్గరా?” అని అడిగాడు.
26 А як той відказав: „Від чужих“, то промовив до нього Ісус: „Тож вільні сини!
౨౬అతడు, “బయటివాళ్ళ దగ్గరే” అని చెప్పాడు. యేసు, “అలాగైతే కొడుకులు స్వతంత్రులే.
27 Та щоб їх не спокуси́ти, піди над море, та ву́дку закинь, і яку першу рибу ізло́виш, візьми, і рота відкрий їй, — і зна́йдеш стати́ра; візьми ти його, — і віддай їм за Мене й за себе“.
౨౭అయినా ఈ పన్ను వసూలు చేసేవారిని ఇబ్బంది పెట్టకుండా నీవు సముద్రానికి వెళ్ళి, గాలం వేసి, మొదట పడిన చేపను తీసుకుని దాని నోరు తెరువు. దానిలో ఒక షెకెలు నాణెం నీకు దొరుకుతుంది. దాన్ని నాకోసం, నీకోసం వారికి ఇవ్వు” అన్నాడు.