< Книга Суддів 2 >

1 І прийшов Ангол Господній з Ґілґалу до Бохіму, та й сказав: „Я вивів вас із Єгипту до того кра́ю, що присягнув був вашим батька́м. І сказав Я: не зламаю Свого заповіту з вами повіки!
యెహోవా దూత గిల్గాలు నుంచి బయలుదేరి బోకీముకు వచ్చి ఇలా అన్నాడు “నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి రప్పించి, మీ పితరులకు ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని చేర్చాను. మీతో చేసిన నిబంధన నేనెప్పుడూ నిరర్ధకం చేయను.
2 А ви не складете заповіту з ме́шканцями цього краю, їхні же́ртівники порозбиваєте, — та не слухали ви Мого голосу. Що́ це ви зробили?
మీరు ఈ దేశవాసులతో సంధి చేసుకోకూడదని, వాళ్ళ బలిపీఠాలు విరుగగొట్టాలని ఆజ్ఞ ఇచ్చాను గాని మీరు నా మాట వినలేదు.
3 І Я теж сказав: Не прожену́ їх від вас, і вони стануть вам те́рням у боки, а їхні боги стануть вам па́сткою“.
మీరు చేసిందేమిటి? కాబట్టి నేను మీ ముంగిట్లో నుంచి వాళ్ళని వెళ్లగొట్టను. వాళ్ళు మీ పక్కలో బల్లేలుగా ఉంటారు. వాళ్ళ దేవుళ్ళు మీకు ఉరిగా ఉంటారని చెప్తున్నాను.”
4 І сталося, як Ангол Господній говорив ці слова́ до всіх Ізраїлевих синів, то народ підніс свій голос, та й заплакав.
యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పినప్పుడు
5 І назвали ім'я́ того місця: Бохім, і прино́сили там жертви Господе́ві.
ప్రజలు బిగ్గరగా ఏడ్చారు. కాబట్టి ఆ చోటికి బోకీము అని పేరు పెట్టారు. అక్కడ వాళ్ళు యెహోవాకు హోమబలి అర్పించారు.
6 А Ісус відпустив наро́д, і Ізраїлеві сини розійшлися кожен до свого спа́дку, щоб посісти той край.
యెహోషువ ప్రజలను అక్కడ నుంచి సాగనంపినప్పుడు ఇశ్రాయేలీయులు ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోడానికి వాళ్ళకు కేటాయించిన స్థలాలకు వెళ్లారు.
7 І служив народ Господе́ві по всі дні Ісуса та по всі дні ста́рших, які продовжили дні свої по Ісусі, що бачили всякий великий чин Господа, якого зробив Він Ізра́їлеві.
యెహోషువ బ్రతికిన కాలమంతటిలోనూ, యెహోషువ తరువాత కాలంలోనూ ఇంకా బ్రతికి ఉండి ఇశ్రాయేలీయుల కోసం యెహోవా చేసిన కార్యాలన్నిటిని చూసిన పెద్దల రోజుల్లోనూ ప్రజలు యెహోవాను సేవిస్తూ ఉన్నారు.
8 І вмер Ісус, син Навинів, раб Господній, віку ста й десяти літ.
నూను కుమారుడు, యెహోవా దాసుడు అయిన యెహోషువ నూట పది సంవత్సరాల వయస్సులో చనిపోయినప్పుడు అతనికి స్వాస్థ్యంగా వచ్చిన ప్రదేశం సరిహద్దులో ఉన్న తిమ్నత్సెరహులో ప్రజలు అతణ్ణి పాతిపెట్టారు.
9 І поховали його в ме́жах спа́дщини його, у Тімнат-Хересі, в Єфремових гора́х, на пі́вніч від гори Ґааш.
అది ఎఫ్రాయిమీయుల ఎడారిలో గాయషు కొండకు ఉత్తరం దిక్కున ఉంది.
10 І також усе це покоління було прилучене до батьків своїх, а по них настало інше покоління, що не знало Господа, а також тих діл, які чинив Він Ізраїлеві.
౧౦ఆ తరం వారంతా తమ తమ పితరుల దగ్గరికి చేరారు. వారి తరువాత యెహోవానుగాని, ఆయన ఇశ్రాయేలీయుల కోసం చేసిన కార్యాలను గాని తెలియని తరం ఒకటి మొదలయ్యింది.
11 І Ізраїлеві сини чинили зло в Господніх оча́х, і служили Ваалам.
౧౧ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో పాపం చేసి, బయలు దేవుళ్ళను పూజించారు.
12 І вони покинули Господа, Бога батьків своїх, що вивів їх із єгипетського кра́ю, та й пішли за іншими бога́ми, за бога́ми тих народів, що були в їхніх око́лицях, і вклонялися їм, і гніви́ли Господа.
౧౨ఐగుప్తుదేశంలో నుంచి వాళ్ళను రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను అనుసరించి, వాళ్ళ చుట్టూ ఉండే ఆ ప్రజల దేవుళ్ళకు సాగిలపడి, యెహోవాకు కోపం పుట్టించారు.
13 І покинули вони Господа, та й служили Ваа́лові та Аста́ртам.
౧౩వాళ్ళు యెహోవాను విడిచిపెట్టి బయలును అష్తారోతు దేవతను పూజించారు.
14 І запала́в Господній гнів на Ізраїля, і Він дав їх у руку грабіжників, — і вони їх грабува́ли. І Він передав їх у руку навко́лишніх їхніх ворогів, і вони не могли вже встояти перед своїми ворогами.
౧౪కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద రాజుకుంది. ఆయన వారిని దోపిడీగాళ్ళకు అప్పగించాడు. వాళ్ళు ఇశ్రాయేలీయులను దోచుకున్నారు. తమ చుట్టూ ఉన్న శత్రువుల చేతికి ఆయన వారిని అప్పగించాడు కాబట్టి వారు తమ శత్రువులను ఎదిరించలేకపోయారు.
15 У всьому, де вони ходили, Господня рука була проти них на зло, як говорив був Господь, і як заприсягнув їм Господь. І Він дуже їх тиснув.
౧౫వారు యుద్ధానికి ఎటు వెళ్ళినా సరే, ఆయన ప్రమాణపూర్వకంగా చెప్పినట్టుగానే వారు ఓడిపోయేలా యెహోవా హస్తం వారికీ విరోధంగా ఉంది. వాళ్లకు ఘోర బాధ కలిగింది.
16 І поставив Господь су́ддів, і вони рятували їх від руки їхніх грабіжників.
౧౬అటు తరువాత యెహోవా వాళ్ళ కోసం న్యాయాధిపతులను పుట్టించాడు. దోచుకొనేవాళ్ళ చేతిలో నుంచి వీళ్ళు ఇశ్రాయేలీయులను రక్షించారు. అయినా ఇస్రాయేల్ ప్రజ ఆ న్యాయాధిపతుల మాట వినలేదు.
17 Та вони не слухалися також своїх суддів, бо блудили за іншими богами, і вклонялися їм. Вони скоро відхиля́лися з тієї дороги, якою йшли їхні батьки, щоб слухатися Господніх нака́зів. Вони так не робили!
౧౭వాళ్ళ పితరులు యెహోవా ఆజ్ఞలు అనుసరించి నడిచిన మార్గం నుంచి వీళ్ళు త్వరగా తొలగిపోయి, వ్యభిచారంతో సమానంగా ఇతర దేవుళ్ళకు తమను తాము అప్పగించుకుని పూజించారు. తమ పితరులు దేవుని ఆజ్ఞలు అనుసరించినట్టు వాళ్ళు అనుసరించలేదు.
18 А коли Господь ставив їм суддів, то Господь був із суддею, і рятував їх із руки їхніх ворогів по всі дні того судді́, бо Господь жалував їх через їхній сто́гін через тих, що їх переслідували та гноби́ли їх.
౧౮వారి శత్రువులు వారిని బాధించగా, ఆ మూలుగులు యెహోవా విని, జాలిపడి, వారి కోసం న్యాయాధిపతులను పుట్టించాడు. ఆయన ఆ న్యాయాధిపతులకు తోడై ఉండి, ఒక్కొక్క న్యాయాధిపతి బ్రతికిన కాలమంతా వాళ్ళ శత్రువుల చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను రక్షించాడు.
19 І бувало, як умирав той суддя, вони зно́ву псувалися більше від своїх батьків, щоб іти за іншими богами, щоб їм служити та щоб їм вклонятися, і вони не кидали чи́нів своїх та своєї неслухня́ної дороги.
౧౯ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోయినప్పుడెల్లా వాళ్ళు వెనక్కు తిరిగి ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ, పూజిస్తూ, వాటికి సాగిలపడుతూ ఉండేవారు. వారు అలా తమ క్రియల్లోగాని, తమ మూర్ఖ ప్రవర్తనలోగాని దేనినీ విడిచిపెట్టకుండా వాళ్ళ పూర్వికుల కంటే ఇంకా భ్రష్టులై పోయారు.
20 І запалився Господній гнів на Ізраїля, і Він сказав: „За те, що люд цей переступив Мого заповіта, що Я наказав був їхнім батькам, і не слухалися Мого голосу,
౨౦కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద రగిలినప్పుడు ఆయన ఇలా అన్నాడు “ఈ ప్రజలు తమ పితరులతో నేను ఏర్పాటు చేసిన వాగ్దానంలోని షరతులు మీరి, నా మాట వినలేదు గనక,
21 тож Я більше не виганятиму перед ними нікого з тих народів, що Ісус позоставив, умира́ючи,
౨౧నేను నియమించిన షరతులు అనుసరించి వాళ్ళ పితరులు నడిచినట్టు వీళ్ళు కూడా యెహోవా షరతులు అనుసరించి నడుస్తారో లేదో ఆ జాతుల వలన ఇశ్రాయేలీయులను పరీక్షింఛి చూస్తాను.
22 щоб ви́пробувати ними Ізраїля, — чи держатимуться вони Господньої дороги, щоб нею ходити, як держалися їхні батьки, чи ні.
౨౨అందుకని యెహోషువ చనిపోయిన కాలంలో మిగిలిన శత్రుజాతుల్లో ఏ జనాంగాన్నీ వాళ్ళ దగ్గర నుంచి నేను వెళ్లగొట్టను.”
23 І Господь позоставив тих людей, щоб їх скоро не виганяти, і не дав їх у руку Ісусову.
౨౩ఈ కారణంగానే యెహోవా ఆ జనాంగాన్ని యెహోషువ చేతికి అప్పగించకుండా, వెంటనే వెళ్లగొట్టకుండా వాళ్ళను ఉండనిచ్చాడు.

< Книга Суддів 2 >