< Ісус Навин 13 >
1 А Ісус поста́рівся й увійшов у дні. І сказав Господь до нього: „Ти поста́рівся та ввійшов у дні, а кра́ю позостається ще дуже багато, щоб посісти його.
౧యెహోషువ వయసు మళ్ళిన వృద్ధుడు అయ్యాడు. యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “నీవు బాగా వృద్ధుడివయ్యావు. స్వాధీనం చేసుకోడానికి ఇంకా అతి విస్తారమైన దేశం మిగిలి ఉంది.
2 Оце позосталий край: усі округи филисти́мські, і ввесь Ґешурей,
౨ఆ ప్రాంతాలేవంటే, ఫిలిష్తీయుల ప్రదేశాలన్నీ గెషూరీయుల దేశమంతా ఐగుప్తుకు తూర్పున ఉన్న షీహోరు నుండి
3 від Шіхору, що навпроти Єгипту, і аж до границі Екрону на пі́вніч, що до ханаанеянина залічений, п'ять филистимських князів: аззатський, ашдодський, ашкелонський, ґаттійський і екронський, та аввеї.
౩కనానీయులవైన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకూ, ఫిలిష్తీయుల ఐదుగురు సర్దారులకు సంబంధించిన గాజీయుల, అష్డోదీయుల, అష్కెలోనీయుల, గాతీయుల, ఎక్రోనీయుల దేశాలూ
4 Від пі́вдня вся ханаанська земля та Меара, що сидонська, аж до Афеки, аж до аморейської границі,
౪దక్షిణ దిక్కున ఆవీయుల దేశమూ కనానీయుల దేశమంతా సీదోనీయుల మేరా నుండి ఆఫెకు వరకూ ఉన్న అమోరీయుల సరిహద్దు వరకూ
5 і ґівлейська земля, і ввесь Ливан на схід сонця від Баал-Ґаду під горою Гермон аж до входу до Хамату.
౫గిబ్లీయుల దేశమూ హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు నుండి హమాతుకు పోయే మార్గం వరకూ లెబానోను ప్రదేశమంతా లెబానోను నుండి మిశ్రేపొత్మాయిము వరకూ దేశం ఇంకా మిగిలి ఉంది.
6 Усіх ме́шканців гір від Ливану аж до Місрефот-Маїму, усіх сидо́нян, — Я повиганяю їх перед Ізраїлевими синами. Тільки поділи́ її жеребком на спа́док Ізра́їлеві, як Я наказав був тобі.
౬సీదోను ప్రజలతో సహా పర్వత ప్రాంతం ప్రజలందరినీ నేను ఇశ్రాయేలీయుల ముందు నుండి వెళ్లగొడతాను. కాబట్టి నేను ఆజ్ఞాపించిన విధంగా నీవు ఇశ్రాయేలీయులకు దాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టాలి.
7 А тепер поділи цей край на спа́док дев'яти́ племе́нам та половині пле́мени Манасі́їному“.
౭తొమ్మిది గోత్రాలకు, మనష్షే అర్థ గోత్రానికి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టు.”
8 Ра́зом із ним Руви́мові та Ґа́дові взяли свій спа́док що дав їм Мойсей по той бік Йорда́ну на схід, як дав їм Мойсей, раб Господній,
౮యెహోవా సేవకుడు మోషే వారికిచ్చిన విధంగా రూబేనీయులూ గాదీయులూ తూర్పుదిక్కున, అంటే యొర్దాను అవతల స్వాస్థ్యం పొందారు.
9 від Ароеру, що на березі арнонського потоку, і місто, що серед тієї долини, і вся медевська рівнина аж до Дівону,
౯అదేమంటే, అర్నోను ఏటిలోయ దగ్గర ఉన్న అరోయేరు మొదలు ఆ లోయమధ్య ఉన్న పట్టణం నుండి దీబోను వరకూ మేదెబా మైదానమంతా, అమ్మోనీయుల సరిహద్దు వరకూ
10 і всі міста Сигона, царя аморейського, що царював у Хешбоні, аж до границі Аммонових синів,
౧౦హెష్బోనులో పాలిస్తున్న అమోరీయుల రాజైన సీహోనుకు చెందిన సమస్త పట్టణాలు,
11 і Ґілеад, і границя ґешурейська та маахейська, і вся гора Гермон, і ввесь Башан аж до Салхи,
౧౧గిలాదూ గెషూరీయుల, మాయకాతీయుల దేశమూ హెర్మోను మన్యమంతా సల్కావరకూ బాషాను దేశమంతా
12 усе царство Оґа в Башані, що царював в Аштароті та в Едреї, — він позостався з останку рефаїв, а Мойсей повбивав їх та повиганяв їх.
౧౨రెఫాయీయుల్లో మిగిలి ఉన్నవారిలో అష్తారోతులో ఎద్రెయీలో పరిపాలిస్తున్న ఓగు రాజ్యమంతా మిగిలి ఉంది. మోషే ఆ రాజులను జయించి వారి దేశాన్ని పట్టుకున్నాడు.
13 І не вигнали Ізраїлеві сини ґешуре́янина, і маахате́янина, — і сидів Ґешур та Маахат серед Ізраїля, і так є аж до цього дня.
౧౩కానీ ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశాన్ని గానీ మాయకాతీయుల దేశాన్ని గానీ పట్టుకోలేదు కాబట్టి గెషూరీయులు మాయకాతీయులు ఇప్పటి వరకూ ఇశ్రాయేలీయుల మధ్యలో నివసిస్తున్నారు.
14 Тільки Левієвому племені не дав він спа́дку, — огняні́ жертви Господа, Бога Ізраїля, то спа́док його, „як Я говорив був йому.“
౧౪లేవి గోత్రానికే అతడు స్వాస్థ్యం ఇవ్వలేదు. ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మోషేతో చెప్పినట్టు “ప్రజలు ఆయనకు అర్పించే దహన బలులే” వారికి స్వాస్థ్యం.
15 І дав Мойсей племені Рувимових синів спа́док за їхніми ро́дами.
౧౫వారి వంశాలను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యమిచ్చాడు.
16 І була їм границя від Ароеру, що на березі арнонського потоку, і місто, що серед тієї долини, і вся рівни́на при Медеві,
౧౬వారి సరిహద్దు ఏదంటే, అర్నోను నది లోయ పక్కన ఉన్న అరోయేరు మొదలు ఆ లోయలోని పట్టణం నుండి మేదెబా దగ్గర మైదానమంతా.
17 Хешбон і всі міста його, що на рівнині, Дівон, і Бамот-Баал, і Бет-Баал-Меон,
౧౭ఇది గాక రూబేను గోత్రికులు హెష్బోను, దాని మైదానంలోని పట్టణాలన్నీ, దీబోను, బామోత్బయలు, బేత్బయల్మెయోను,
18 і Ягца, і Кедемот, і Мефаат,
౧౮యాహసు, కెదేమోతు, మేఫాతు,
19 і Кір'ятаїм, і Сівма, і Церет-Гашшахар на горі Емеку,
౧౯కిర్యతాయిము, సిబ్మాలోయ లోని కొండ మీది శెరెత్షహరు ప్రాంతాలు దక్కించుకున్నారు.
20 і Бет-Пеор, і узбіччя Пісґі, і Бет-Гаєшімот,
౨౦అంతేకాక, బేత్పయోరు, పిస్గా కొండచరియలు, బెత్యేషీమోతు,
21 і всі міста рівни́ни, і все царство Сигона, царя аморейського, що царював у Хешбоні, що Мойсей убив його та мідіянських начальників: Евія, і Рекема, і Цура, і Хура, і Реву, сигонових князів, мешканців того кра́ю.
౨౧మైదానంలోని పట్టణాలు అన్నీ, ఇంకా ఎవీరేకెము, సూరు, హోరు, రేబ, అనే మిద్యాను రాజుల దేశాన్నీ అమోరీయుల రాజైన సీహోను రాజ్యమంతటినీ వారికి మోషే స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇవి హెష్బోనులో పరిపాలించే సీహోను అధికారం కింద ఉన్న ప్రాంతాలు. ఇతన్నిమోషే ఓడించాడు.
22 А Валаама, Беорового сина, чарівника́, Ізраїлеві сини забили мечем серед інших, яких вони побили.
౨౨ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడు, సోదెగాడు అయిన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గంతో చంపారు.
23 І була́ границя Рувимових синів: Йорда́н і границя. Це спа́док Рувимових синів за їхніми родами, їхні міста та їхні оселі.
౨౩యొర్దాను ప్రదేశమంతా రూబేనీయులకు సరిహద్దు. అదీ, దానిలోని పట్టణాలూ, గ్రామాలూ రూబేనీయుల వంశాల ప్రకారం వారికి కలిగిన స్వాస్థ్యం.
24 І дав Мойсей Ґадовому племені, синам Ґада за їхніми родами,
౨౪మోషే గాదు గోత్రానికి, అంటే గాదీయులకు వారి వంశాల ప్రకారం స్వాస్థ్యమిచ్చాడు.
25 і була їм границя: Язер, і всі ґілеадські міста, і половина краю аммонових синів аж до Ароеру, що навпроти Рабби,
౨౫వారి సరిహద్దు యాజెరు, గిలాదు పట్టణాలన్నీ, రబ్బాకు ఎదురుగా ఉన్న అరోయేరు వరకూ అమ్మోనీయుల దేశంలో సగభాగం.
26 А з Хешбону аж до Рамат Гамміцпі й Бетоніму, а від Маханаїму аж до границі Девіру,
౨౬హెష్బోను మొదలు రామత్మిజ్బెతు బెతోనిము వరకూ, మహనయీము మొదలు దెబీరు సరిహద్దు వరకూ.
27 і в долині Бет-Гараму, і Бет-Німра, і Суккот, і Цафон, останок царства Сигона, царя хешбонського, Йорда́н і границя аж до кінця озера Кіннерет по тім боці Йорда́ну на схід.
౨౭లోయలో బేతారాము బేత్నిమ్రా, సుక్కోతు, సాపోను, అంటే హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషం, తూర్పు దిక్కున యొర్దాను అవతల కిన్నెరెతు సముద్రతీరం వరకూ ఉన్న యొర్దాను ప్రదేశం.
28 Це спа́док Ґадових синів за їхніми ро́дами, міста та їхні оселі.
౨౮ఇవీ, వారి వంశాల ప్రకారం గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణాలు, గ్రామాలు.
29 І дав Мойсей половині племени Манасіїного, і воно було половині племени Манасіїних синів за їхніми ро́дами.
౨౯మోషే మనష్షే అర్థగోత్రానికి స్వాస్థ్యమిచ్చాడు. అది వారి వంశాల ప్రకారం మనష్షీయుల అర్థగోత్రానికి స్వాస్థ్యం.
30 І була їхня границя від Манахаїму, увесь Башан, усе царство Оґа, царя башанського, і всі села Яіру, що в Башані, шістдеся́т міст.
౩౦వారి సరిహద్దు మహనయీము మొదలు బాషాను అంతా, బాషాను రాజైన ఓగు రాజ్యమంతా, బాషానులోని యాయీరు పురాలు అయిన అరవై పట్టణాలు,
31 А половина Ґілеаду, і Аштарот, і Едрея, міста Оґового царства в Башані, — синам Махіра, Манасіїного сина, половині синів Махіра за їхніми ро́дами.
౩౧గిలాదులో సగం, అష్తారోతు, ఎద్రెయి అనే బాషానులోని ఓగు రాజ్య పట్టణాలు. ఇవన్నీ మనష్షే కుమారుడు మాకీరు, అనగా మాకీరీయుల్లో సగం మందికి వారి వంశాల ప్రకారం కలిగాయి.
32 Оце те, що Мойсей дав на спа́док в моавських степа́х по тім боці Йорда́ну на схід.
౩౨ఇవీ, యెరికో దగ్గర తూర్పు దిక్కున యొర్దాను అవతల ఉన్న మోయాబు మైదానంలో మోషే పంచి పెట్టిన స్వాస్థ్యాలు.
33 А Левієвому племені Мойсей не дав спа́дку, — Господь, Бог Ізраїлів, Він їхній спа́док, як говорив їм.
౩౩లేవీ గోత్రానికి మోషే స్వాస్థ్యం పంచిపెట్ట లేదు, ఎందుకంటే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో చెప్పినట్టుగా ఆయనే వారికి స్వాస్థ్యం.