< Єремія 10 >
1 Послухайте слова того́, що вам каже Госпо́дь, о доме Ізраїлів!
౧ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మీ గురించి చెప్పే మాటలు వినండి.
2 Так говорить Госпо́дь: Не навчайтесь доріг цих наро́дів, і небесних озна́к не лякайтесь, — бо тільки пога́ни лякаються їх!
౨యెహోవా చెప్పేదేమంటే, అన్యజాతుల ప్రజల ఆచారాలు పాటించకండి. వారు ఆకాశంలో కనబడే సూచనలకు భయపడతారు. కానీ మీరు మాత్రం భయపడవద్దు.
3 Бо устави наро́дів — марно́та вони, божок бо — це дерево, з лісу ви́рубане, і це ді́ло рук майстра сокирою!
౩ఆ ప్రజల ఆచారాలు నిష్ప్రయోజనం. ఒకడు అడవిలో చెట్టు నరకుతాడు, పనివాడు దాన్ని గొడ్డలితో చెక్కుతాడు.
4 Срі́блом та зло́том його прикра́шають, цвя́хами та молотка́ми прикрі́плюють їх, і він не захитається.
౪అప్పుడు వారు దానికి వెండి బంగారు వస్తువులు అలంకరిస్తారు. అది కదలకుండా ఉండేలా దానికి సుత్తితో మేకులు కొట్టి బిగిస్తారు.
5 Вони, як опу́дало на огірко́вім горо́ді, й безмовні, і конче їх носять, бо не ходять вони. Не бійтеся їх, бо не вчинять лихого, і також учинити добро — це не в їхній силі!
౫అవి దోస తోటల్లో దిష్టి బొమ్మల్లాగా నిలబడి ఉంటాయి. పలకవు, నడవలేవు కాబట్టి వాటిని ఎవరైనా మోయాలి. అవి మీకు హాని చేయలేవు. కాబట్టి వాటికి భయపడకండి. వాటి వలన మంచి ఏమీ జరగదు.
6 Такого, як Ти, нема, Господи: Ти великий й велике Ім'я́ Твоє могу́тністю!
౬యెహోవా, నీలాంటివాడు ఎవరూ లేరు. నువ్వు గొప్పవాడివి. నీ బల ప్రభావాలను బట్టి నీ పేరు ఎంతో ఘనతకెక్కింది.
7 Хто не буде боятись Тебе, Ца́рю наро́дів? Бо Тобі це належить, бо між усіма́ мудреця́ми наро́дів і в усьо́му їхньому царстві немає такого, як Ти!
౭లోక జాతులకు రాజువైన నీకు భయపడని వాడెవడు? ఆయా రాజ్యాల ప్రజల్లోని జ్ఞానులందరిలో నీవంటి వాడెవడూ లేడు. కాబట్టి మనుషులు నీలో భయభక్తులు నిలపాలి.
8 Вони стали всі ра́зом безумні й безглузді, — наука марна́ — оце дерево!
౮వారంతా బుద్ధి హీనులు, అవివేకులు. చెక్కిన బొమ్మలను పూజించడం వలన వారికి కలిగే జ్ఞానం సున్నా.
9 Срібна бляха з Тарші́шу приве́зена, злото ж з Офі́ру, праця ма́йстра й руки́ золота́рської, блаки́ть та пурпу́ра — їхня одіж, усі́ вони — праця мистців.
౯తర్షీషు నుండి రేకులుగా సాగగొట్టిన వెండినీ ఉఫాజ్ నుండి బంగారాన్నీ తెస్తారు. అది కూలీల చేతి పని. ఆ విగ్రహాలకు నీలి, ఊదా రంగు వస్త్రాలు తొడిగారు. అవన్నీ వైపుణ్యం గల పనివారు చేసినవే.
10 А Господь — Бог правдивий, Він — Бог Живий та Цар вічний! Від гніву Його затрясе́ться земля, і не знесу́ть Його гніву наро́ди.
౧౦అయితే యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే సజీవుడైన దేవుడు, శాశ్వతమైన రాజు. ఆయన కోపాన్ని చూస్తే భూమి కంపిస్తుంది. ఆయన కోపాన్ని రాజ్యాలు తట్టుకోలేవు.
11 Отак їм скажіть: бо́ги, що неба й землі не вчинили, погинуть з землі та з-під неба цього!
౧౧మీరు వారితో ఇలా చెప్పాలి. “భూమ్యాకాశాలను సృష్టించని ఈ దేవుళ్ళు భూమి మీదా, ఆకాశం కిందా ఉండకుండా నశించిపోతారు.
12 Своєю Він силою землю вчинив, Своєю премудрістю міцно поставив вселе́нну, і небо напну́в Своїм розумом.
౧౨ఆయన తన బలంతో భూమిని సృష్టించాడు. తన జ్ఞానంతో ప్రపంచాన్ని స్థాపించాడు, తన తెలివితో ఆకాశాన్ని చక్కగా పరిచాడు.
13 Як голос Його забрини́ть, — у небеса́х шумлять води, а коли підіймає Він хмари із кра́ю землі, коли бли́скавки чинить дощем та вітер виво́дить з криївок Своїх,
౧౩ఆయన స్వరం ఆకాశమండలంలో నీటి గర్జనలాగా వినిపిస్తుంది. భూదిగంతాల్లో నుండి ఆయన ఆవిరి మేఘాలు వచ్చేలా చేస్తాడు. వర్షంతో బాటు ఆయన మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగుల నుండి గాలిని పంపిస్తాడు.
14 тоді кожна люди́на дурі́є в своєму знанні́, усяк золота́р посоро́млений через бовва́на, бо ві́длив його — це неправда, і немає в них духа!
౧౪ప్రతి మనిషీ తెలివిలేని మూర్ఖుడు. విగ్రహాలు పోతపోసే ప్రతివాడూ తాను చేసిన విగ్రహాన్నిబట్టి అవమానం పొందుతాడు. అతడు పోత పోసిన విగ్రహాలు నకిలీవి. వాటికి ప్రాణం లేదు.
15 Марно́та вони, вони праця на сміх, — в час наві́щення їх вони згинуть!
౧౫అవి ఉపయోగం లేనివి. అవన్నీ ఎగతాళి పనులు. వాటి మీద తీర్పు జరిగినప్పుడు అవి నశించి పోతాయి.
16 Не така, як оці, частка Яковова, бо Він все вформува́в, а Ізраїль — племе́но спа́дку Його, Господь Савао́т — Його Йме́ння!
౧౬యాకోబు వంశానికి వారసత్వంగా ఉన్నవాడు అలాంటి వాడు కాడు. ఆయన సమస్తాన్నీ నిర్మించేవాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన వారసత్వం. సేనల ప్రభువు అని ఆయనకు పేరు.
17 Забери із землі свій това́р, ти, що сидиш ув обло́зі!
౧౭ముట్టడిలో ఉన్న ప్రజలారా, దేశం విడిచి వెళ్ళడానికి నీ సామాను సర్దుకోండి.”
18 Бо Господь каже так: Ось цим ра́зом Я кину мешка́нців цієї землі, мов із пра́щі, і прити́сну їх так, щоб пізна́ння знайшли.
౧౮యెహోవా చేప్పేదేమంటే “నేను ఈసారి ఈ దేశ నివాసులను బయటికి విసిరివేస్తాను. వారు పట్టబడేలా చేసి నిస్పృహకు గురి చేస్తాను.”
19 Ой, горе мені з-за нещастя мого́, моя рана болю́ча! А я говорив: це хвороба моя, і знесу́ я її.
౧౯అయ్యో, నా ఎముకలకు దెబ్బ తగిలి ఆ గాయం పుండుగా మారింది. అయితే “ఇది నాకు కలిగిన బాధ. నేను దీనిని సహించాల్సిందే” అనుకుంటాను.
20 Наме́та мого́ попусто́шено і зі́рвані всі мої шну́ри. Розійшли́сь мої діти від мене й нема їх, нема вже кому́ розтягну́ти наме́та мого́ та пові́сити заві́си мої.
౨౦నా గుడారం చిందర వందర అయ్యింది. నా డేరా తాళ్ళు అన్నీ తెగిపోయాయి. వారు నా పిల్లలను తీసుకెళ్ళిపోయారు. అందుకే వారు లేరు. నా డేరా నిలబెట్టడానికి, వాటి తెరలు వేయడానికి నా దగ్గర ఎవరూ లేరు.
21 Бо па́стирі стали безглу́зді, і вони не зверта́лись до Господа, — тому́ не щасти́лося їм, і розпоро́шене все їхнє ста́до.
౨౧కాపరులు మూర్ఖులై యెహోవాను అడగరు. కాబట్టి వారికి విజయం లేదు. వారి మందలన్నీ చెదరిపోతున్నాయి.
22 Голос звістки: Іде ось, і гу́ркіт великий з півні́чного кра́ю, щоб ю́дські міста́ оберну́ти в спусто́шення, на мешка́ння шака́лів.
౨౨అదిగో వినండి, వార్త రానే వచ్చింది, వారి రాక ధ్వని వినబడుతూ ఉంది. యూదా పట్టణాలను పాడు చేసి, వాటిని నక్కల నివాసంగా చేయడానికి ఉత్తరదేశం నుండి వస్తున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుతూ ఉంది.
23 Знаю, Господи, я, що не в волі люди́ни доро́ги її, не в силі люди́ни, коли вона ходить, кермува́ти своїм кро́ком.
౨౩యెహోవా, మనుషులు తమ మార్గాలను నిర్ణయించుకోవడం వారికి చేతకాదనీ, మంచిగా ప్రవర్తించడం వారి వశంలో లేదనీ నాకు తెలుసు.
24 Карай мене, Господи, тільки ж за су́дом, не гнівом Своїм, щоб не знищити мене́!
౨౪యెహోవా, నన్ను నీ న్యాయవిధిని బట్టి క్రమశిక్షణలో పెట్టు. అలా కాక నీ కోపాన్ని బట్టి శిక్షించావంటే నేను నాశనమైపోతాను.
25 Вилий лю́тість Свою на наро́ди, що не знають Тебе, та на ро́ди, що Йме́ння Твого не кликали, що Якова з'їли й поже́рли його, і погубили його, а мешка́ння його опусто́шили!“
౨౫నిన్నెరగని అన్యజనాల మీదా నీ పేరున ప్రార్థించని వంశాల మీదా నీ కోపాన్ని కుమ్మరించు. ఎందుకంటే వారు యాకోబు వంశాన్ని పూర్తిగా నిర్మూలం చేయడానికి మింగివేశారు. దాని నివాస స్థలాలను పాడు చేశారు.