< Ісая 28 >
1 Горе тобі, Самарії, короні пишно́ти Єфре́млян п'яни́х, квітці зів'ялій краси́ його го́рдости, що лежить на верхі́в'ї долини врожа́йної, від вина поп'яні́лих!
౧ఎఫ్రాయీములో తాగుబోతులకు గర్వకారణంగా ఉన్న పూలమాలకు బాధ. వాడిపోతున్న పువ్వులాంటి అతడి ప్రాభవ సౌందర్యానికి బాధ. అది ద్రాక్షారసం వశంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు నివసించే పచ్చని లోయ తలపై ఉన్న కిరీటం.
2 Ось поту́жний та сильний у Господа, — мов злива із градом, мов буря руїнна, мов по́відь сильна́, заливна́, його кине на землю із силою!
౨వినండి! శక్తిశాలీ, బలశాలీ అయిన ఒకడు ప్రభువుకి ఉన్నాడు. అతడు వడగళ్ళ లాంటి వాడు. అతడు వినాశనకారి అయిన తుఫాను వంటివాడు. ముంచెత్తే బలమైన జడివాన వంటివాడు. ఆయన తన చేతితో భూమిని కొడతాడు.
3 Ногами пото́птана буде корона пишно́ти Єфре́млян п'яни́х,
౩ఎఫ్రాయీములో తాగుబోతులకు గర్వకారణంగా ఉన్న కిరీటాన్ని కింద పడేసి కాళ్ళతో తొక్కుతారు.
4 і станеться квітка зів'я́ла краси́ його гордости, що на верхі́в'ї долини врожайної, немов передчасно дозріла та смо́ква, що її як побачить люди́на, ковтає її, як вона ще в долоні його!
౪పచ్చని లోయ తలపై ఉన్న వాడిపోతున్న పువ్వులాంటి అతడి ప్రాభవ సౌందర్యం కోతకాలం రాకముందే పండిపోయిన మొదటి అంజూరపు పండులా ఉంటుంది. మొదట దాన్ని చూసినవాడు దాన్ని చేతిలోకి తీసుకున్న వెంటనే నోట్లో వేసుకుని మింగివేస్తాడు.
5 Стане Господь Саваот того дня за прекрасну корону, і за пишний вінок для останку наро́ду Його,
౫ఆ రోజున సేనల ప్రభువైన యెహోవా మిగిలి ఉన్న తన ప్రజలకు తానే అందమైన కిరీటంగానూ, అందమైన రాజ మకుటంగానూ ఉంటాడు.
6 і духом права тому́, хто сидить у суді, і хоробрістю тим, хто до брами пове́ртає бій!
౬ఆయన న్యాయం చెప్పడానికి న్యాయపీఠం పైన కూర్చున్న వాడికి న్యాయం నేర్పే ఆత్మగానూ, తమ ద్వారాల దగ్గర శత్రువులను తరిమి కొట్టే వాళ్లకి బలంగానూ ఉంటాడు.
7 І ось ці від вина позбива́лись з дороги, і від п'янко́го напо́ю хитаються: священик і пророк позбива́лись з дороги напо́єм п'янки́м, від вина збаламу́тились, від напо́ю п'янко́го хита́ються, блу́дять вони у видіннях, у постановах своїх спотика́ються.
౭అయితే వీళ్ళు కూడా ద్రాక్షారసం తాగి తూలుతారు. మద్యపానం చేసి తడబడతారు. యాజకుడైనా, ప్రవక్త అయినా మద్యం తాగి తూలుతారు. ద్రాక్షారసం వాళ్ళని వశం చేసుకుంటుంది. మద్యపానం చేసి తడబడుతూ ఉంటారు. దర్శనం కలిగినప్పుడు తూలుతూ ఉంటారు. తీర్పు చెప్పాల్సి వచ్చినప్పుడు తడబడతారు.
8 Бо всі столи повні блюво́тою калу, аж місця нема!
౮వాళ్ళు భోజనం చేసే బల్లలు అన్నీ వాంతితో నిండి ఉన్నాయి. శుభ్రమైన స్థలం అక్కడ కనిపించదు.
9 „Кого буде навчати пізна́ння, і кому́ виясняти об'я́влення буде? Відставлених від молока чи від перс повідлу́чуваних?
౯వాడు జ్ఞానాన్ని ఎవరికి బోధిస్తాడు? వర్తమానాన్ని ఎవరికి వివరిస్తాడు? పాలు విడిచిన వాళ్ళకా? లేక తల్లి రొమ్ము విడిచిన వాళ్ళకా?
10 Бо на заповідь заповідь, заповідь на заповідь, пра́вило на пра́вило, пра́вило на пра́вило, трохи тут, трохи там“.
౧౦ఎందుకంటే “ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ, సూత్రం వెంట సూత్రం, సూత్రం వెంట సూత్రంగా, ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెంగా ఉంటుంది.” అని వాళ్ళు అనుకుంటారు.
11 Тому незрозумілими у́стами й іншою мовою буде казати наро́дові цьому
౧౧అప్పుడు ఆయన నిజంగానే వాళ్ళతో వెక్కిరించే పెదాలతో, విదేశీ భాషలో మాట్లాడతాడు.
12 Отой, Хто до них говорив: „Це спочи́нок! Дайте змученому відпочи́ти, — і це відпочинок“, — та вони не хотіли послухати.
౧౨గతంలో ఆయన వాళ్ళతో “ఇది విశ్రాంతి స్థలం. అలసి పోయిన వాళ్ళని విశ్రాంతి తీసుకోనివ్వండి” అన్నాడు. కానీ వాళ్ళు వినలేదు. కాబట్టి వాళ్ళు వెళ్ళి వెనక్కి పడి, కుంగిపోయి, వలలో చిక్కుకుని, బందీలు అయ్యేలా యెహోవా మాట వాళ్లకి ఇలా వస్తుంది.
13 І станеться їм слово Господа: заповідь на заповідь, заповідь на заповідь, пра́вило на пра́вило, правило на правило, трохи тут, трохи там, щоб пішли та попадали на́взнак, і щоб були зла́мані й впали до па́стки й злови́лися!
౧౩“ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ, సూత్రం వెంట సూత్రం, సూత్రం వెంట సూత్రం, ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం.”
14 Тому то послухайте слова Господнього, ганьби́телі, що пануєте над тим наро́дом, що в Єфусалимі!
౧౪కాబట్టి ఎగతాళి చేసేవాళ్ళూ, యెరూషలేములో ఈ ప్రజలను పాలించే వాళ్ళు, యెహోవా మాట వినండి.
15 Бо кажете ви: „Заповіта ми склали зо смертю і з шео́лом зробили умову. Як перейде той бич, мов вода заливна́, то не при́йде до нас, бо брехню́ ми зробили притулком своїм, і в брехні́ ми схова́лись!“ (Sheol )
౧౫మీరు ఇలా అన్నారు “మేం చావుతో నిబంధన చేసుకున్నాం. పాతాళంతో ఒక ఒప్పందానికి వచ్చాం. కాబట్టి కీడు ప్రవాహంలా వచ్చినా అది మమ్మల్ని తాకదు. ఎందుకంటే మేం అబద్ధాన్ని ఆశ్రయించాం. మిథ్య వెనుక దాక్కున్నాం.” (Sheol )
16 Тому́ Господь Бог сказав так: Оце поклав каменя Я на Сіоні, каменя ви́пробуваного, нарі́жного, дорогого, міцно закла́деного. Хто вірує в нього, не буде той засоро́млений!
౧౬దానికి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, నేను సీయోనులో ఒక పునాది రాయి వేస్తాను. అది పరిశోధనకి గురైన రాయి. ఒక ప్రశస్తమైన మూలరాయిని వేస్తాను. అది దృఢమైన పునాది రాయి. విశ్వాసం ఉంచే వాడు సిగ్గుపడడు.
17 І право за міри́ло Я покладу́, а справедливість — вагою; і приту́лок брехні́ град понищить, а схо́вище во́ди заллють!
౧౭నేను న్యాయాన్ని కొలబద్దగానూ, నీతిని ఒడంబంగానూ చేస్తాను. వడగళ్ళు మీ అబద్దాలనే ఆశ్రయాన్ని తుడిచి పెట్టేస్తాయి. మీరు దాగి ఉన్న చోటును వరద నీళ్ళు ముంచెత్తుతాయి.
18 І заповіт ваш із смертю пола́маний буде, а ваша умова з шео́лом не втри́мається: як пере́йде нищівна́ ка́ра, то вас вона сто́пче! (Sheol )
౧౮చావుతో మీరు చేసుకున్న నిబంధనను రద్దు చేస్తాను. పాతాళంతో మీరు చేసుకున్న ఒప్పందం చెల్లదు. వరద ప్రవాహంలా విపత్తు మీకు పైగా దాటినప్పుడు మీరు ఉక్కిరిబిక్కిరి అవుతారు. (Sheol )
19 Коли тільки пере́йде вона, вона вас забере, бо щора́нку вона перехо́дити буде, удень та вночі, — і ста́неться, — тільки з тремтінням ви бу́дете слу́хати звістку про це.
౧౯అవి వచ్చినప్పుడల్లా మిమ్మల్ని ముంచెత్తి వేస్తాయి. ప్రతి ఉదయమూ, ప్రతి పగలూ, ప్రతి రాత్రీ అది వస్తుంది. ఈ వార్త అర్థం అయినప్పుడు అది మహాభయాన్ని కలిగిస్తుంది.
20 Бо буде постеля коротка, щоб на ній розтягну́тись, а покрива́ло вузьке, щоб накри́тися ним,
౨౦పడుకుని కాళ్ళు చాపుకోడానికి మంచం పొడవు చాలదు. కప్పుకోడానికి దుప్పటి వెడల్పు చాలదు.
21 Бо повстане Господь, немов на горі Перацім; затремтить Він у гніві, немов у долині в Гів'оні, щоб Свій чин учинити, предивний Свій чин, щоб зробити роботу Свою, незви́чайну роботу Свою!
౨౧యెహోవా తన పనిని జరిగించడానికి, ఆశ్చర్యకరమైన తన పనిని చేయడానికి, విచిత్రమైన తన పనిని జరిగించడానికి పెరాజీము పర్వతం పైన లేచినట్టుగా లేస్తాడు. గిబియోను లోయలో ఆయన తనను తాను రెచ్చగొట్టుకున్నట్టుగా లేస్తాడు.
22 Тож не насміха́йтесь тепер, щоб не стали міцнішими ваші кайда́ни, бо призна́чене зни́щення чув я від Господа, Бога Саваота, про всю землю.
౨౨కాబట్టి పరిహాసం చేయకండి. లేకుంటే మీ సంకెళ్ళు మరింతగా బిగుసుకుంటాయి. సేనల ప్రభువైన యెహోవా నుండి భూమిపైన నాశనం జరుగుతుందనే సమాచారం నేను విన్నాను.
23 Візьміть це до ушей і почуйте мій голос, послухайте пильно й почуйте мій голос!
౨౩కాబట్టి మనస్సు పెట్టి నేను చెప్పేది వినండి. జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి.
24 Чи кожного дня о́ре ра́тай на по́сів, ралить землю свою й борону́є?
౨౪రైతు విత్తడానికి ఎప్పుడూ పొలం దున్నుతూనే ఉంటాడా? ఎప్పుడూ పొలంలో మట్టి పెళ్లలను పగలగొడుతూ ఉంటాడా?
25 Чи ж, як рівною зробить поверхню її, він не сіє чорну́ху й не кидає кмин, не розсіва́є пшеницю та просо й ячмінь на озна́ченім місці, а жито в ме́жах її?
౨౫అతడు నేలను చదును చేసిన తర్వాత సోపు గింజలు చల్లడా? జీలకర్ర చల్లడా? గోధుమలు వరుసల్లో, బార్లీ సరైన స్థలంలో వేసి చేను అంచుల్లో మిరప మొక్కలు నాటడా?
26 І за правом напу́тив його, його Бог його ви́вчив цього́:
౨౬అతడి దేవుడే అతడికి ఆ క్రమాన్ని నేర్పించాడు. ఎలా చేయాలో జ్ఞానంతో అతనికి బోధించాడు.
27 Бож не бороно́ю чорну́ха молотиться, і ко́ло возо́ве не ходить по кмині, а палицею б'ють чорну́ху та києм — той кмин.
౨౭జీలకర్రను యంత్రంలో ఉంచి నూర్చారు. జీలకర్ర పై బండి చక్రాన్ని దొర్లించరు. కానీ సోపుని చువ్వతో, జీలకర్రను కర్రతో దుళ్ళకొడతారు.
28 Розтирається збіжжя? Ні, бо його не наза́вжди моло́титься ко́нче, і підганяють ко́ло возо́ве та коні на нього, а не розтирають його.
౨౮మనుషులు రొట్టెల కోసం గోధుమలను నూర్చి పిండి చేస్తారు. కానీ అదేపనిగా గోధుమలను పిండి చేస్తూనే ఉండరు కదా! గోధుమలను దుళ్ళగొట్టడానికి గుర్రాలనూ బండి చక్రాలనూ నడిపిస్తారు గానీ దాన్ని పిండి చేయడానికి కాదు కదా!
29 І це вийшло від Господа Саваота, — чудова порада Його, і велика премудрість Його!
౨౯దీన్ని కూడా మనుషులకు సేనల ప్రభువైన యెహోవా నేర్పిస్తున్నాడు. ఆయన బోధ అద్భుతంగానూ ఆయన ఆలోచన శ్రేష్టంగానూ ఉంటుంది.”