< Ездра 10 >

1 А коли Ездра молився та сповіда́вся, плакав та припада́в перед Божим домом, зібрався до нього з Ізраїля дуже великий збір, — чолові́ки, і жінки́ та діти, бо наро́д плакав ре́вним плаче́м...
ఎజ్రా దేవుని మందిరం ముందు సాష్టాంగపడి విలపిస్తూ, పాపం ఒప్పుకొంటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు పురుషులు, స్త్రీలు, పిన్నలూ గుంపులు గుంపులుగా అతని దగ్గరికి వచ్చి గట్టిగా రోదించారు.
2 І відпові́в Шеханія, Єхіїлів син, з Еламових синів, та й сказав до Ездри: „Ми спроневі́рилися нашому Богові, бо взяли ми чужи́нок із наро́дів цього кра́ю за жіно́к. Але є ще наді́я для Ізраїля в цьо́му!
అప్పుడు ఏలాము మనుమడు, యెహీయేలు కొడుకు షెకన్యా ఎజ్రాతో ఇలా అన్నాడు. “మేము దేశంలో ఉన్న పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకోవడం ద్వారా మా దేవుని దృష్టికి పాపం చేశాం. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ ప్రవర్తన మార్చుకొంటారన్న నిరీక్షణ ఉంది.
3 А тепер складімо заповіта нашому Богові, що випровадимо від себе всіх жінок та наро́джене від них, за радою пана нашого, та тих, хто тремти́ть перед заповіддю нашого Бога, і буде зро́блене за Зако́ном.
ఈ పని ధర్మశాస్త్ర నియమం ప్రకారం జరిగేలా నాయకుడవైన నువ్వు, దేవుడంటే భయపడేవారూ చెబుతున్నట్టు మేము పెళ్లి చేసుకొన్న భార్యలను, వారికి పుట్టిన పిల్లలను విడిచిపెట్టి, పంపివేస్తామని మన దేవుని పేరట ఒట్టు పెట్టుకుంటాం.
4 Устань, бо на тобі ця річ, а ми з тобою. Будь му́жній і дій!“
ఈ పని నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ధైర్యంగా ఈ పని మొదలు పెట్టు. మేమంతా నీతోనే ఉంటాం.”
5 І встав Ездра, і заприсяг зверхників, священиків і Левитів та всього Ізраїля, щоб робити за цим словом. І вони заприсягли́.
ఎజ్రా లేచి, ముఖ్య యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయులంతా ఆ మాట ప్రకారమే నడుచుకొంటామని వారి చేత ప్రమాణం చేయించాడు. వారంతా ప్రమాణం చేసిన తరువాత,
6 І Ездра встав з-перед Божого дому й пішов до кімна́ти Єгохонана, Ел'яшівового сина, і ночував там. Хліба він не їв і води не пив, бо був у жало́бі за спроневі́рення пове́рненців.
ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి, ఎల్యాషీబు కొడుకు యోహానాను గదిలోకి వెళ్ళాడు. అక్కడ అతడు చెరకు లోనైన వారి అపరాధాలను బట్టి రోదిస్తూ, భోజనం చేయకుండా, నీళ్ళు తాగకుండా ఉండిపోయాడు.
7 І оголоси́ли в Юдеї та в Єрусалимі до всіх пове́рненців, щоб зібратися до Єрусалиму.
చెరనుండి తిరిగి వచ్చిన వారంతా యెరూషలేములో తప్పక సమకూడాలని యూదా దేశమంతటా, యెరూషలేము పట్టణంలో దండోరా వేశారు.
8 А кожен, хто не при́йде до трьох день, за порадою зверхників та старши́х, — увесь маєток того буде зро́блений закляттям, а він буде ви́лучений із громади пове́рненців.
ప్రధానులు, పెద్దలు నిర్ణయించినట్టుగా మూడు రోజుల్లోగా ఎవరైనా రాకపోతే వారి ఆస్తులు జప్తు చేసి, వాటిని దేవుని మందిరపు ఆస్తిగా ప్రకటించాలని, వాళ్ళను సమాజం నుండి బహిష్కరించాలని తీర్మానం చేశారు.
9 І зібралися всі люди Юди та Веніямина до Єрусалиму до трьох день, — це був дев'ятий місяць, двадцятого дня місяця. І сидів увесь народ на площі Божого дому, тремтячи́ від цієї справи та від дощу.
యూదా, బెన్యామీను గోత్రాల వారంతా మూడు రోజుల్లోగా యెరూషలేము చేరుకున్నారు. తొమ్మిదో నెల 20 వ రోజున ప్రజలంతా దేవుని మందిరం వీధిలో వర్షంలో తడుస్తూ కూర్చున్నారు. జరగబోయేది తలంచుకుని భయంతో వణికిపోతున్నారు.
10 І встав священик Ездра та й сказав до них: „Ви спроневі́рилися, і взяли чужи́нних жінок, щоб побільши́ти Ізраїлеву прови́ну.
౧౦అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇలా అన్నాడు. “మీరు ఆజ్ఞను అతిక్రమించి పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకుని మన జాతి పాపాన్ని ఇంకా అధికం చేశారు.
11 А тепер повині́ться Господе́ві, Богові ваших батьків, і чиніть Його волю! І віддаліться від наро́дів цього кра́ю та від тих чужих жіно́к!“
౧౧కాబట్టి ఇప్పుడు మీ తండ్రుల దేవుడైన యెహోవా ముందు మీ పాపాలను ఒప్పుకుని, ఆయనకు నచ్చే విధంగా ప్రవర్తించడానికి సిద్ధపడి, పరాయి దేశపు స్త్రీలను విడిచిపెట్టి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకుని ఉండండి.”
12 І відповіла́ вся громада, і сказали гучним голосом: „Так, за словом твоїм, ми повинні зробити!
౧౨అప్పుడు అక్కడ సమకూడిన వారంతా బిగ్గరగా ఇలా అన్నారు. “నువ్వు చెప్పినట్టుగా మేము తప్పకుండా చేయవలసి ఉంది.
13 Але наро́д числе́нний, і час дощів, і нема сили стояти на вулиці. Та й праці не на один день і не на два, бо ми багато нагрішили в цій справі.
౧౩అయితే ఇక్కడ జనసమూహం ఎక్కువగా ఉంది. ఇప్పుడు విపరీతంగా వర్షం కురుస్తున్నందువల్ల మేము బయట నిలబడలేకపోతున్నాం. ఈ పని ఒకటి రెండు రోజుల్లో జరిగేది కాదు. ఈ విషయంలో మాలో చాలామందిమి పాపం చేశాం. కాబట్టి అన్ని సమాజాల్లోని పెద్దలందరికీ ఈ పని కేటాయించండి.
14 Нехай же стануть наші зверхники за ввесь збір, а кожен, хто є в наших містах, хто взяв чужи́нних жіно́к, нехай при́йде на означені часи́, а з ними старші́ кожного міста та су́дді його, аж поки не відве́рнеться від нас жар гніву нашого Бога за цю річ“.
౧౪మన పట్టణాల్లో ఎవరెవరు పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్నారో వాళ్ళంతా గడువులోగా రావాలి. ఈ విషయంలో మాపై దేవునికి వచ్చిన తీవ్రమైన కోపం తొలగిపోయేలా ప్రతి పట్టణాల్లోని పెద్దలు, న్యాయాధిపతులు వాళ్ళతో ఉండాలి.”
15 Особливо стали над цим Йонатан, син Асагелів, та Яхзея, син Тіквин, а Мешуллам та Левит Шеббетай допомагали їм.
౧౫ఈ పని జరిగించడానికి అశాహేలు కొడుకు యోనాతాను, తిక్వా కొడుకు యహజ్యా, వాళ్లకు సహాయకులుగా మెషుల్లాము, లేవీ గోత్రికుడు షబ్బెతైలను నియమించారు.
16 І зробили так пове́рненні. І відділи́в собі священик Ездра людей, голів батьків за родом їхніх батьків, і всі вони поіме́нно. І сіли вони першого дня десятого місяця, щоб дослідити цю справу.
౧౬చెరనుంచి వచ్చినవారు ఆ క్రమం ప్రకారం చేశారు. యాజకుడైన ఎజ్రా పెద్దల్లో కొందరు ప్రధానులును వారి తండ్రుల ఇంటి పేర్ల ప్రకారం ఎన్నుకున్నాడు. పదవ నెల మొదటి రోజున ఈ విషయాన్ని గూర్చి పరిశీలించడం మొదలుపెట్టారు.
17 І скінчи́ли до першого дня першого місяця справи про всіх тих людей, що взяли були чужи́нних жіно́к.
౧౭మొదటి నెల మొదటి రోజునాటికి పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసికొన్న వారందరి వ్యవహారం పరిష్కారం చేశారు.
18 І знайшлися поміж священичими синами, що взяли́ чужи́нних жіно́к, із синів Єшуї, сина Йоцадакового, та братів його: Моасея, і Еліезер, і Ярів, і Ґедалія.
౧౮యాజకుల వంశంలో పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్న వారు ఎవరంటే, యోజాదాకు కొడుకు యేషూవ వంశంలో, అతని సహోదరుల్లో మయశేయా, ఎలీయెజెరు, యారీబు, గెదల్యా.
19 І дали́ вони руку свою, що повипрова́джують жіно́к своїх, а винні прине́сли в жертву барана́ з отари за прови́ну свою.
౧౯వీరు తమ తమ భార్యలను పంపివేస్తామని ప్రమాణం చేశారు. వారు అపరాధులు కావడంవల్ల తమ అపరాధం విషయంలో మందలోనుండి ఒక పొట్టేలును సమర్పించారు.
20 А з синів Іммерових: Ханані та Зевадія.
౨౦ఇమ్మేరు వంశంలో హనానీ, జెబద్యా.
21 І з синів Харімових: Массея, і Елійя, і Шемая, і Єхіїл, і Уззійя.
౨౧హారీం వంశంలో మయశేయా, ఏలీయా, షెమయా, యెహీయేలు, ఉజ్జియా.
22 Із синів Пашхурових: Ел'йоенай, Маасея, Ізмаїл, Натанаїл, Йозавад та Ел'аса.
౨౨పషూరు వంశంలో ఎల్యో యేనై, మయశేయా, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాశా.
23 А з Левитів: Йозавад, і Шім'ї, і Келая, він Келіта, Петахія, Юда та Еліезер.
౨౩లేవీ గోత్రం నుండి యోజాబాదు, షిమీ కెలిథా అనే పేరున్న కెలాయా, పెతహయా, యూదా, ఎలీయెజెరు.
24 А з співакі́в: Ел'яшів. А з придве́рних: Шаллум, і Телем, та Урі.
౨౪గాయక బృందానికి చెందిన ఎల్యాషీబు, ద్వారపాలకుల నుండి షల్లూము, తెలెము, ఊరి అనేవాళ్ళు.
25 А з Ізраїля, з синів Пар'ошових: Рам'я, і Їззійя, і Малкійя, і Мійямін, і Елеазар, і Малкійя та Беная.
౨౫ఇశ్రాయేలీయుల్లో పరోషు వంశం నుండి రమ్యా, యిజ్జీయా, మల్కీయా, మీయామిను, ఎలియేజరు, మల్కీయా, బెనాయా.
26 А з синів Еламових: Маттанія, Захарій, і Єхіїл, і Авді, і Єремот, і Елійя,
౨౬ఏలాము వంశంలో మత్తన్యా, జెకర్యా, యెహీయేలు, అబ్దీ, యెరేమోతు, ఏలీయా.
27 І з синів Затту: Ел'йоенай, Ел'яшів, Маттанія, і Еремот, і Завад та Азіза.
౨౭జత్తూ వంశంలో ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్యా, యెరేమోతు, జాబాదు, అజీజా.
28 А з синів Беваєвих: Єгоханан, Хананія, Заббай, Атлай.
౨౮బేబై వంశంలో యెహోహానాను, హనన్యా, జబ్బయి, అత్లాయి.
29 І з синів Банієвих: Мешуллам, Маллух, і Адая, Яшув, і Шеал та Рамот.
౨౯బానీ వంశంలో మెషుల్లాము, మల్లూకు, అదాయా, యాషూబు, షెయాలు, రామోతు.
30 І з синів Пахатових: Моав, Адна, і Хелал, Беная, Маасея, Маттанія, Веселії́л, і Біннуй та Манасія.
౩౦పహత్మోయాబు వంశంలో అద్నా, కెలాలు, బెనాయా, మయశేయా, మత్తన్యా, బెసలేలు, బిన్నూయి, మనష్షే.
31 І з синів Харімових: Еліезер, Їшшійя, Малкійя, Шемая, Шімон,
౩౧హారిము వంశంలో ఎలీయెజెరు, ఇష్షీయా, మల్కీయా, షెమయా.
32 Веніямин, Маллух, Шемарія.
౩౨షిమ్యోను, బెన్యామీను, మల్లూకు, షెమర్యా,
33 З синів Хашумових: Маттенай, Маттатта, Завад, Еліфелет, Єремай, Манасія, Шім'ї.
౩౩హాషుము వంశంలో మత్తెనై, మత్తత్తా, జాబాదు, ఎలీపేలెటు, యెరేమై, మనష్షే, షిమీ.
34 З синів Банаєвих: Маадай, Амрам, і Уїл,
౩౪బానీ వంశంలో మయదై, అమ్రాము, ఊయేలు.
35 Беная, Бедея, Келугу,
౩౫బెనాయా, బేద్యా, కెలూహు.
36 Ванія, Меремот, Ел'ятів,
౩౬వన్యా, మెరేమోతు, ఎల్యాషీబు.
37 Маттанія, Маттенай, і Яасай,
౩౭మత్తన్యా, మత్తెనై, యహశావు.
38 і Бані, і Бійнуй, Шім'ї,
౩౮బానీ, బిన్నూయి, షిమీ.
39 і Шелемія, і Натан, і Адая,
౩౯షిలెమ్యా, నాతాను, అదాయా.
40 Махнадвай, Шашай, Шарай,
౪౦మక్నద్బయి, షామై, షారాయి.
41 Азаріїл, і Шелемія, Шемарія,
౪౧అజరేలు, షెలెమ్యా, షెమర్యా.
42 Шаллум, Амарія, Йо́сип.
౪౨షల్లూము, అమర్యా, యోసేపు.
43 А з синів Нево: Єіїл, Маттітія, Завад, Зевіна, Яддай, і Йоїл, Беная.
౪౩నెబో వంశానికి చెందిన యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేలు, బెనాయా అనేవాళ్ళు.
44 Усі оці взяли́ були́ чужи́нних жіно́к, а деякі з цих жіно́к і дітей породили.
౪౪వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకొన్నవారు. ఈ స్త్రీలలో కొందరు పిల్లలను కూడా కన్నారు. వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకొన్నవారు.

< Ездра 10 >