< Єзекіїль 41 >
1 І впрова́див мене до храму, і він зміряв стовпи, — шість ліктів завши́ршки звідси, і шість ліктів завши́ршки звідти, ширина́ скинії.
౧తరువాత అతడు నన్ను మందిరానికి తీసుకుని వచ్చి దాని పరిశుద్ధ స్థలం ప్రవేశానికి రెండు పక్కల ఉన్న స్తంభాలను కొలిచాడు. అవి ఒక్కొక్కటీ 3 మీటర్ల 20 సెంటి మీటర్లు.
2 А ширина́ входу — десять ліктів, а боки входу — п'ять ліктів звідси й п'ять ліктів звідти; і зміряв довжину́ його — сорок ліктів, а завши́ршки двадцять ліктів.
౨ప్రవేశ ద్వారం వెడల్పు 5 మీటర్ల 40 సెంటి మీటర్లు. తలుపు రెండు వైపులా 2 మీటర్ల 70 సెంటి మీటర్లు, దాని పొడవు 22 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు.
3 І ввійшов він до сере́дини, і зміряв входо́вого стовпа́ — два лікті, а вхід — шість ліктів, а ширина́ входу — сім ліктів.
౩అతడు లోపలికి పోయి వాకిలి స్తంభాలను కొలిచినప్పుడు అది ఒక్కొక్కటి ఒక మీటరు వెడల్పు ఉన్నాయి. వాకిలి 3 మీటర్ల 20 సెంటి మీటర్లు, రెండు వైపులా ఉన్న గోడల వెడల్పు 3 మీటర్ల 80 సెంటి మీటర్లు ఉన్నాయి.
4 І зміряв довжину́ його — двадцять ліктів, а завши́ршки — двадцять ліктів на пе́реді храму. І сказав він мені: „Це Святеє Святих!“
౪అతడు “ఇది అతి పరిశుద్ధస్థలం” అని చెప్పి దాన్ని కొలిచాడు. దాని పొడవు 11 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు.
5 І зміряв він стіну́ храму — шість ліктів, а ширина́ бічно́ї кімна́ти — чотири лікті кругом навко́ло храму.
౫తరువాత అతడు మందిరం గోడను కొలిచినప్పుడు అది, 3 మీటర్ల 20 సెంటి మీటర్లు, మందిరం పక్కన ఉన్న మేడ గదులు ఒక్కొక్కటి సుమారు 2 మీటర్లు వెడల్పు ఉన్నాయి.
6 А кімна́ти бічні́, кімна́та при кімна́ті, тридцять в трьох по́верхах, і вхо́дили в стіну́, що храм мав для бічни́х кімна́т навко́ло круго́м, щоб держа́лися, і не держалися в стіні того храму.
౬ఈ మేడగదులు మూడు అంతస్థులు ఉన్నాయి. ఆ విధంగా అవి ఒక్కొక్క అంతస్తుకు 30 గదులు. ఈ గదులు మందిరం గోడ మీద ఆనుకోలేదు. మందిరం చుట్టూ కట్టిన గోడతో కలిసి ఉన్నాయి.
7 І він ставав ширший, і обе́ртався все більше вго́ру до бічни́х кімна́т, бо той храм був обе́рнений більше вго́ру, круго́м навколо храму, тому храм був ширший вго́ру, і так до́лішній по́верх вхо́дить на горі́шній через середній.
౭ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొద్దీ వాటి వెడల్పు పెరుగుతూ వచ్చింది. అంటే పైకెక్కిన కొద్దీ మందిరం చుట్టూ ఉన్న మేడగదుల అంతస్థుల వెడల్పు పెరుగుతూ వచ్చింది కాబట్టి మందిరపు పైభాగం వెడల్పు కింది భాగం కంటే ఎక్కువగా ఉంది.
8 І бачив я вишину́ храму навко́ло, підва́лини бічних кімна́т — повна па́лиця, шість ліктів.
౮ఇంకా నేను చూసినప్పుడు మందిరం చుట్టూ మేడ గదులకు ఎత్తుగా ఉన్న పునాది కనిపించింది. ఆ పునాది ఎత్తు 3 మీటర్ల 20 సెంటి మీటర్లు.
9 Ширина́ стіни, що в бічні́й кімна́ті назо́вні, п'ять ліктів, а вільне місце між бічни́ми кімна́тами, що належить до храму.
౯మేడగదుల బయట ఉన్న గోడ వెడల్పు 2 మీటర్ల 70 సెంటి మీటర్లు. మందిరపు మేడగదుల పక్కన ఖాళీ స్థలం ఉంది.
10 І поміж комо́рами — завши́ршки двадцять ліктів круго́м навколо храму.
౧౦గదుల మధ్య మందిరం చుట్టూ నాలుగు వైపులా 11 మీటర్లు వెడల్పున స్థలం విడిచిపెట్టారు.
11 А вхід з бічно́ї кімна́ти до вільного місця — вхід один у напрямі на пі́вніч, і вхід один на пі́вдень, а ширина́ вільного місця — п'ять ліктів круго́м навко́ло.
౧౧మేడగదుల గుమ్మాలు ఖాళీగా ఉన్న స్థలం వైపు ఉన్నాయి. ఒక గుమ్మం ఉత్తరపు వైపు, మరొకటి దక్షిణం వైపు ఉన్నాయి. ఖాళీగా ఉన్న స్థలం చుట్టూ 2 మీటర్ల 70 సెంటి మీటర్లు వెడల్పు ఉంది.
12 А буді́вля, що перед відгоро́дженим майда́ном у напрямі на за́хід, завши́ршки сімдеся́т ліктів, а стіна будівлі п'ять ліктів, ширина́ кругом навколо, а довжина́ її — дев'ятдеся́т ліктів.
౧౨ఆవరణం ఎదురుగా పడమటి వైపు ఒక కట్టడం ఉంది. దాని వెడల్పు 38 మీటర్లు, దాని గోడ వెడల్పు 2 మీటర్ల 70 సెంటి మీటర్లు, గోడ పొడవు 49 మీటర్లు.
13 І він зміряв той храм, завдо́вжки — сто ліктів, а відгоро́джений майда́н і будівля та стіни її, завдо́вжки — сто ліктів.
౧౩మందిరం పొడవును కొలిచినప్పుడు అది 44 మీటర్లు ఉంది. ఆ కట్టడం, దాని గోడల కొలత 54 మీటర్లు.
14 А ширина передньої частини храму та відгородженого майда́ну на схід — сто ліктів.
౧౪తూర్పు వైపు మందిరం పొడవు 54 మీటర్లు.
15 І зміряв він довжину́ будівлі до пе́реду відгородженого майда́ну, що позад неї, ґалерія звідси й звідти, сто ліктів, і так внутрішній храм і сі́нечки подві́р'я.
౧౫మందిరం వెనక భాగంలోని ఖాళీ స్థలానికి ఎదురుగా ఒక కట్టడం ఉంది. దాని రెండు వైపులా ఉన్న వసారాల పొడవు 54 మీటర్లు.
16 Пороги та ві́кна, широкі знадво́ру, і вузькі́ всере́дині, ґалерія навколо них трьох, навпроти поро́гу дерев'яний о́бклад навко́ло й земля до ві́кон, а ві́кна зачинені.
౧౬అప్పుడా వ్యక్తి గర్భాలయం, ఆవరణపు మంటపాలు, గడపలు, కమ్ములు ఉన్న కిటికీలను, మూడు అంతస్థుల చుట్టూ ఉన్న వసారాలను కొలిచాడు. గడపలకెదురుగా నేల నుండి కిటికీలు చెక్కతో కప్పి ఉన్నాయి.
17 Усе понад входом і аж до вну́трішнього храму, і назо́вні при кожній стіні круго́м навко́ло, у вну́трішньому й у зо́внішньому, ви́різьблене,
౧౭గుమ్మాలకు పైన మందిరానికి బయట, లోపల ఉన్న గోడంతా, చుట్టూ గోడ పైనా, కెరూబులు, ఖర్జూరపు చెట్టు చెక్కి ఉన్నాయి.
18 і було зро́блене херувимами та пальмами, і пальма була між херувимом та херувимом, два обличчя в херувима.
౧౮రెండు కెరూబుల మధ్య ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. ప్రతి కెరూబుకు రెండేసి ముఖాలున్నాయి.
19 І лю́дське обличчя — мали пальми звідси, а обличчя левчука́ — мали пальми звідти, поро́блені при всьому домі навко́ло.
౧౯ఇటు ఖర్జూరపు చెట్టు వైపున మనిషి ముఖం, అటు ఖర్జూరపు చెట్టు వైపున సింహం ముఖం ఉన్నాయి. మందిరం అంతా ఆ ప్రకారమే ఉన్నాయి.
20 Від землі аж понад вхід — поро́блені херувими та пальми на стіні храму.
౨౦నేల మొదలుకుని గుమ్మం పైవరకూ మందిరపు గోడకు కెరూబులు, ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి.
21 Храм мав чотирику́тні одві́рки, а пе́ред святині мав такий самий вигляд.
౨౧మందిరపు ద్వారబంధాలు నలు చదరంగా ఉన్నాయి. పరిశుద్ధస్థలపు ద్వారబంధాలు కూడా అలాగే ఉన్నాయి.
22 Же́ртівник був із дерева, — три лікті високий, а довжина́ його — два лікті, а в нього його кути́ й підні́жжя його та стіни його — дерево. І сказав він мені: „Це той стіл, що перед Господнім лицем!“
౨౨బలిపీఠం చెక్కతో చేశారు. దాని ఎత్తు 1 మీటరు 60 సెంటి మీటర్లు, పొడవు ఒక మీటరు. దాని పీఠం, మూలలు, పక్కలు చెక్కతో చేసినవి. అతడు నాతో “ఇది యెహోవా సముఖంలో ఉండే బల్ల” అని చెప్పాడు.
23 А в храмі та в святині було двоє двере́й.
౨౩మందిరానికి, పరిశుద్ధ స్థలానికి రెండు గుమ్మాలున్నాయి.
24 І в тих дверях було по дві до́шці, оби́дві до́шки обе́рталися, дві в одних две́рях, і дві в інших две́рях.
౨౪ఒక్కొక గుమ్మం రెండేసి మడత రెక్కలతో ఉంది.
25 І були́ зро́блені на них, на две́рях храму, херувими та пальми, як поро́блені були́ в сті́нах, а дерев'яний ґанок при пе́реді сіне́й назо́вні.
౨౫అంతే కాక గోడల మీద ఉన్నట్టుగా మందిరపు గుమ్మాల మీద కూడా కెరూబులు, ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి. బయటి వసారాకి విచిత్రంగా చేసిన చెక్క చూరు ఉంది.
26 І вікна, широкі знадво́ру й вузькі́ всере́дині, і пальми звідси та звідти при бока́х сіне́й, і такі бічні́ кімна́ти храму та стрі́хи.
౨౬మరియు వసారాకి, రెండు వైపులా గోడలకు, మేడగదులకు రెండు వైపులా కమ్ములు వేసిన కిటికీలు, ఖర్జూరపు చెట్ల ఆకారాలు చెక్కి ఉన్నాయి.