< Повторення Закону 6 >

1 А оце заповідь, постанови та зако́ни, що наказав Господь, Бог ваш, щоб навчити вас виконувати їх у кра́ї, що ви переходите туди посісти його,
“మీరూ మీ కొడుకులూ మీ మనుమలూ
2 щоб ти боявся Господа, Бога свого, щоб пильнувати всіх постано́в Його та заповідей Його, що я наказую тобі, ти й син твій, та син твого́ сина по всі дні життя твого, і щоб були довгі твої дні.
మీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను మీకు ఆజ్ఞాపించే ఆయన కట్టడలు, ఆజ్ఞలు అన్నిటినీ మీ జీవితకాలమంతా పాటిస్తే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీరు స్వాధీనం చేసుకోడానికి నది దాటి వెళ్తున్న దేశంలో మీరు పాటించడానికి మీకు బోధించాలని మీ యెహోవా దేవుడు ఆజ్ఞాపించిన కట్టడలు, విధులు ఇవే.
3 І слухай, Ізраїлю, і пильнуй виконувати це, щоб було добре тобі, і щоб ви си́льно розмно́жились, як прирік був Господь, Бог батьків твоїх, дати край, що тече молоком та медом.
ఇశ్రాయేలూ, నీ పూర్వీకుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో సుఖశాంతులతో బాగా అభివృద్ధి చెందడానికి నువ్వు వాటిని విని, అనుసరించాలి.
4 Слухай, Ізраїлю: Господь, Бог наш — Господь один!
ఇశ్రాయేలూ విను. మన యెహోవా దేవుడు అద్వితీయుడు.
5 І люби Господа, Бога твого, усім серцем своїм, і всією душею своєю, і всією силою своєю!
నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.
6 І будуть ці слова, що Я сьогодні наказую, на серці твоїм.
ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి.
7 І пильно навчиш цього синів своїх, і будеш говорити про них, як сиді́тимеш удома, і як ходи́тимеш дорогою, і коли ти лежатимеш, і коли ти вставатимеш.
మీరు మీ కొడుకులకు వాటిని నేర్పించి, మీ ఇంట్లో కూర్చున్నప్పుడూ దారిలో నడిచేటప్పుడూ నిద్రపోయేటప్పుడూ లేచేటప్పుడూ వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని మీ చేతికి కట్టుకోవాలి.
8 І прив'яжеш їх на ознаку на руку свою, і будуть вони пов'я́зкою між очима твоїми.
అవి మీ రెండు కళ్ళ మధ్యలో బాసికం లాగా ఉండాలి.
9 І напишеш їх на бічни́х одвірках дому свого та на брамах своїх.
మీ ఇంట్లో గుమ్మాల మీదా తలుపుల మీదా వాటిని రాయాలి.
10 І станеться, коли Господь, Бог твій, уведе тебе до того краю́, якого присягнув був батькам твоїм, Авраамові, Ісакові та Якову, щоб дати тобі великі та гарні міста́, яких ти не будував,
౧౦మీ దేవుడు యెహోవా మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆ దేశంలోకి తీసుకెళ్ళి, మీరు కట్టని గొప్ప, మంచి పట్టణాలను మీకు ఇస్తున్నాడు.
11 та доми, повні всякого добра, яких ти не напо́внював, і те́сані колодязі, яких ти не теса́в, і виноградники та оливки, яких ти не садив, і ти будеш їсти й наси́тишся, —
౧౧మీరు నింపని మంచి వస్తువులతో నిండిన ఇళ్ళనూ, మీరు తవ్వని బావులనూ, మీరు నాటని ద్రాక్షతోటలనూ ఒలీవ తోటలనూ మీకిస్తున్నాడు.
12 стережися тоді, щоб ти не забув Господа, що вивів тебе з єгипетського кра́ю, з дому ра́бства!
౧౨అక్కడ మీరు తిని, తృప్తి పొందినప్పుడు, బానిసలుగా ఉన్న ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త వహించాలి.
13 Бійся Господа, Бога свого, і Йому будеш служити, і Йменням Його будеш присягати.
౧౩మీ యెహోవా దేవునికే భయపడాలి, ఆయననే పూజించాలి, ఆయన పేరట మాత్రమే ప్రమాణం చేయాలి.
14 Не будеш ходити за іншими богами з богів тих наро́дів, що в околицях ваших,
౧౪మీరు ఇతర దేవుళ్ళను, అంటే మీ చుట్టూ ఉన్న ఇతర జాతుల ప్రజల దేవుళ్ళను పూజింపకూడదు.
15 бо Господь, Бог твій — Бог ревнивий посеред тебе; щоб не запалився на тебе гнів Господа, Бога твого, і щоб Він не вигубив тебе з поверхні землі.
౧౫మీ మధ్య ఉన్న మీ యెహోవా దేవుడు రోషం గల దేవుడు కాబట్టి ఆయన కోపాగ్ని మీ మీద చెలరేగి దేశంలో ఉండకుండాా మిమ్మల్ని నాశనం చేస్తాడు.
16 Не будете спокуша́ти Господа, Бога вашого, як спокушали ви в Массі.
౧౬మీరు మస్సాలో ఆయన్ని పరీక్షించిన విధంగా మీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు.
17 Будете конче пильнувати заповідей Господа, Бога вашого, і свідо́цтва Його, і постанови Його, що наказав Він тобі.
౧౭ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, అంటే ఆయన శాసనాలను, కట్టడలను జాగ్రత్తగా పాటించాలి.
18 І будеш робити справедливе та добре в Господніх очах, щоб було тобі добре, і щоб увійшов ти та посів той хороший Край, що Господь присягнув був батькам твоїм,
౧౮మీకు సుఖశాంతులు కలిగేలా, మీ ఎదుట నుండి మీ శత్రువులందరినీ తరిమి వేస్తానని
19 щоб вигнати всіх ворогів твоїх перед тобою, як говорив був Господь.
౧౯యెహోవా చెప్పిన ప్రకారం మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఆ మంచి దేశంలో మీరు ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకొనేలా మీరు యెహోవా దృష్టికి యథార్థమైనదీ ఉత్తమమైనదీ చేయాలి.
20 Коли запитає тебе син твій колись, говорячи: „Що це за свідо́цтва й постанови та зако́ни, що вам наказав Господь, Бог наш?“
౨౦ఇక ముందు మీ కొడుకులు, మన యెహోవా దేవుడు మీకు ఆజ్ఞాపించిన శాసనాలు, కట్టడలు, విధులు ఏవి? అని మిమ్మల్ని అడిగినప్పుడు
21 то скажеш синові своєму: „Ми були раби фараонові в Єгипті, а Господь вивів нас із Єгипту сильною рукою.
౨౧మీరు వారితో ఇలా చెప్పాలి, మనం ఐగుప్తులో ఫరోకు బానిసలుగా ఉన్నప్పుడు యెహోవా తన బాహుబలంతో మనలను విడిపించాడు.
22 І дав Господь ознаки та чуда великі та страшні на Єгипет, і на фараона та ввесь дім його на наших оча́х.
౨౨యెహోవా ఐగుప్తు మీదా ఫరో మీదా అతని ఇంటివారందరి మీదా బాధాకరమైన, గొప్ప సూచకక్రియలూ అద్భుతాలూ మన కళ్ళ ఎదుట కనపరచి,
23 А нас вивів звідти, щоб увести нас та дати той край, що присягнув був Він нашим батькам.
౨౩తాను మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశాన్ని మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టడానికి అక్కడ నుండి మనలను రప్పించాడు.
24 І наказав нам Господь чинити всі ті постанови, щоб боятися Господа, Бога нашого, щоб було́ добре нам усі дні, щоб утри́мати нас при житті, як дня цього.
౨౪మనం ఎప్పుడూ సుఖశాంతులు కలిగి ఈ రోజు ఉన్నట్టు మనం జీవించేలా మన యెహోవా దేవునికి భయపడి ఈ కట్టడలనన్నిటినీ పాటించాలని మనకు ఆజ్ఞాపించాడు.
25 І буде нам праведність у тому, коли будемо пильнувати виконувати всі ці заповіді перед лицем Господа, Бога нашого, як Він наказав нам“.
౨౫మన యెహోవా దేవుడు మనకి ఆజ్ఞాపించిన విధంగా ఆయన ఎదుట ఈ ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ నడుచుకుంటే అదే మన విషయంలో నీతి అనిపించుకుంటుంది.”

< Повторення Закону 6 >