< Амос 5 >

1 Послухайте слова цього, що я ним голосі́ння підно́шу за вас, о доме Ізраїлів!
ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని గురించి నేను దుఃఖంతో చెప్పే ఈ మాట వినండి.
2 Упала, і більше не встане та діва Ізра́їлева! Вона кинена на свою землю, — немає, хто звів би її!
ఇశ్రాయేలు కన్య కూలిపోయింది. ఆమె ఇంకా ఎప్పటికీ లేవదు. లేపడానికి ఎవరూ లేక ఆమె తన నేల మీద పడి ఉంది.
3 Бо так Господь Бог промовляє: Місто, що вихо́дило тисячею, позоста́вить лиш сотню, а те, що вихо́дило сотнею, позоста́вить десятку для дому Ізраїля.
యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, “ఇశ్రాయేలు వారిలో ఒక పట్టణం నుంచి వెయ్యి మంది బయలుదేరితే వంద మంది మాత్రమే తప్పించుకుని వస్తారు. వంద మంది బయలుదేరితే పది మంది మాత్రమే తప్పించుకుని వస్తారు.”
4 Бо так промовляє Госпо́дь до дому Ізраїлевого: Наверні́ться до Мене її живіть!
ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెబుతున్నాడు, “నన్ను వెతికి జీవించండి.
5 І не зверта́йтеся до Бет-Елу, і до Ґілґалу не прихо́дьте, а через Беер-Шеву не перехо́дьте, бо на вигна́ння Ґілґа́л конче пі́де, і марно́тою стане Бет-Ел.
బేతేలును ఆశ్రయించవద్దు. గిల్గాలులో అడుగు పెట్టవద్దు. బెయేర్షెబాకు పోవద్దు. గిల్గాలు వారు తప్పకుండా బందీలవుతారు. బేతేలుకు ఇక దుఖమే.”
6 Наверні́ться до Господа, і будете жити, щоб Вій не ввійшов, як огонь до Йо́сипового дому, — і буде він же́рти, та не бу́де кому погаси́ти в Бет-Елі, —
యెహోవాను ఆశ్రయించి జీవించండి. లేకపోతే ఆయన యోసేపు వంశం మీద నిప్పులాగా పడతాడు. అది దహించి వేస్తుంది. బేతేలులో ఎవరూ దాన్ని ఆర్పలేరు.
7 вони змінюють суд на поли́н, і кидають правду на землю.
వాళ్ళు న్యాయాన్ని భ్రష్టం చేసి, నీతిని నేలపాలు చేస్తున్నారు.
8 Той, хто Волосожа́ра й Оріо́на створив, Хто сме́ртну темно́ту зміня́є на ра́нок, а день затемня́є на ніч, хто прикликує воду морську́ й виливає її на пове́рхню землі, — Господь Йме́ння Йому!
ఆయన నక్షత్ర మండలాలను చేసిన వాడు. చీకటిని తెలవారేలా చేసేవాడు. పగటిని రాత్రి చీకటిగా మార్చేవాడు. సముద్రపు నీటిని మబ్బుల్లాగా చేసి భూమి మీద కుమ్మరిస్తాడు.
9 Він наводить погибіль на сильного, — і при́йде погибіль тверди́ні!
ఆయన పేరు యెహోవా. బలవంతుల మీదికి ఆయన అకస్మాత్తుగా నాశనం రప్పిస్తే కోటలు నాశనమవుతాయి.
10 Вони ненави́дять того́, хто у брамі карта́є, і обри́джують тим, хто говорить правдиве.
౧౦పట్టణ గుమ్మం దగ్గర బుద్ధి చెప్పే వారిని వాళ్ళు అసహ్యించుకుంటారు. యథార్థంగా మాట్లాడే వారిని ఏవగించుకుంటారు.
11 Тому́, що нужде́нного то́пчете ви, і дару́нки збіже́ві берете від нього, що ви набудува́ли будинків із ка́меня те́саного, то сидіти не будете в них; понаса́джували винограду улю́бленого, та не будете пити із нього вина!
౧౧మీరు పేదలను అణగదొక్కుతూ ధాన్యం ఇమ్మని వారిని బలవంతం చేస్తారు, కాబట్టి మీరు చెక్కిన రాళ్ళతో ఇళ్ళు కట్టుకున్నా వాటిలో నివసించరు. మీకు చక్కటి ద్రాక్ష తోటలు ఉన్నా ఆ ద్రాక్ష మద్యం తాగరు.
12 Бо Я знаю про ваші числе́нні провини і про ваші великі гріхи́: ти́снете ви справедливого, берете ви пі́дкупа та викривля́єте право убогих у брамі.
౧౨మీ నేరాలెన్నో నాకు తెలుసు. మీ పాపాలు ఎంత భయంకరమైనవో నాకు తెలుసు. మీరు లంచాలు తీసుకుని తప్పుచేయని వారిని బాధిస్తారు. ఊరి గుమ్మం దగ్గర పేదలను పట్టించుకోరు.
13 Тому́ то розуміний мовчить цього ча́су, бо це час лихий.
౧౩అది గడ్డుకాలం గనక ఎలాంటి బుద్దిమంతుడైనా అప్పుడు ఊరుకుంటాడు.
14 Шукайте добра, а не зла, щоб вам жити, і буде із вами Госпо́дь, Бог Саваот, так, як кажете ви.
౧౪మీరు బతికేలా చెడు విడిచి మంచి వెతకండి. అలా చేస్తే మీరనుకున్నట్టు యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు తప్పకుండా మీతో ఉంటాడు.
15 Нена́видьте зло й покохайте добро, і правосу́ддя поставте у брамі, — може змилується Господь, Бог Савао́т над ре́шткою Йо́сипа.
౧౫చెడును ద్వేషించి మంచిని ప్రేమించండి. పట్టణ గుమ్మాల్లో న్యాయాన్ని స్థిరపరచండి. ఒకవేళ యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు యోసేపు వంశంలో మిగిలిన వారిని కనికరిస్తాడేమో.
16 Тому так промовляє Госпо́дь, Бог Саваот, Вседержи́тель: На майда́нах усіх голосі́ння, на всіх вулицях крики: ой, ой! І покличуть хліборобів на жало́бу, і голосі́льніщь, що вміють плачли́ві пісні,
౧౬అందుచేత యెహోవా ప్రభువు, సేనల అధిపతి అయిన దేవుడు చెప్పేదేమిటంటే, “ప్రతి రాజమార్గంలో ఏడుపు ఉంటుంది. ప్రతి నడివీధిలో ప్రజలు చేరి ‘అయ్యో! అయ్యో’ అంటారు. ఏడవడానికి, వాళ్ళు రైతులను పిలుస్తారు. దుఖపడే నేర్పు గలవారిని ఏడవడానికి పిలిపిస్తారు.
17 і стане рида́ння по всіх виноградниках, бо Я перейду́ серед тебе, говорить Госпо́дь!
౧౭ద్రాక్షతోటలన్నిటిలో ఏడుపు తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే నేను మీ మధ్యగా వెళతాను.”
18 Горе тим, що жадають Госпо́днього дня, — на́що це вам день Госпо́дній? Він не світло, а те́мрява!
౧౮యెహోవా తీర్పు దినం రావాలని ఆశించే మీకు ఎంతో బాధ. యెహోవా తీర్పు దినం కోసం ఎందుకు ఆశిస్తారు? అది వెలుగుగా ఉండదు, చీకటిగా ఉంటుంది.
19 Це так, коли хто утікає від ле́ва, — і ведмі́дь спотика́є його! І він убігає до дому, і опе́рся своєю рукою об сті́ну, — аж гадю́ка кусає його...
౧౯ఒకడు సింహం నుంచి తప్పించుకుంటే ఎలుగుబంటి ఎదురు పడినట్టు, లేకపోతే ఒకడు ఇంట్లోకి పోయి, గోడ మీద చెయ్యివేస్తే పాము అతన్ని కాటేసినట్టు ఆ రోజు ఉంటుంది.
20 Чи ж не є день Госпо́дній темно́та, а не світло, і хіба він не темний, і ся́йва немає у ньому?
౨౦యెహోవా దినం వెలుగుగా కాక అంధకారంగా ఉండదా? కాంతితో కాక చీకటిగా ఉండదా?
21 Знена́видів Я, обри́див Собі ваші свята, і не нюхаю же́ртов ваших зборів.
౨౧మీ పండగ రోజులు నాకు అసహ్యం. అవి నాకు గిట్టవు. మీ ప్రత్యేక సభలంటే నాకేమీ ఇష్టం లేదు.
22 І коли принесе́те Мені цілопа́лення та хлібні же́ртви свої, Я Собі не вподо́баю їх, а на мирні жертви ваші із ситих барані́в — не погля́ну.
౨౨నాకు దహనబలులనూ నైవేద్యాలనూ మీరర్పించినా నేను వాటిని అంగీకరించను. సమాధాన బలులుగా మీరర్పించే కొవ్విన పశువులను నేను చూడను.
23 Усунь же від Мене пісе́нь своїх гук, і не почую Я ро́коту гу́сел твоїх,
౨౩మీ పాటల ధ్వని నా దగ్గర నుంచి తీసేయండి. మీ తీగ వాయిద్యాల సంగీతం నేను వినను.
24 і хай тече́ правосу́ддя, немов та вода, а справедливість — як сильний поті́к!
౨౪నీళ్లలా న్యాయాన్ని పారనివ్వండి. నీతిని ఎప్పుడూ ప్రవహించేలా చేయండి.
25 Чи ж жертви та хлібні прино́си за тих сорок літ на пустині Мені ви прино́сили, доме Ізраїлів?
౨౫ఇశ్రాయేలీయులారా, అరణ్యంలో నలభై ఏళ్ళు మీరు బలులనూ నైవేద్యాలనూ నాకు తెచ్చారా?
26 Ви ж носили Саккута, свойого царя, та Кевана, свої виобра́ження, зорю ваших богі́в, що собі пороби́ли.
౨౬మీరు మీకోసం కైవాను అనే నక్షత్ర దేవుడి విగ్రహాలను చేసుకున్నారు. సిక్కూతు అనే దేవుడి విగ్రహాన్ని రాజుగా మీరు మోసుకొచ్చారు.
27 Тому́ Я вас вижену геть за Дама́ск, говорить Господь, що Бог Саваот Йому Йме́ння!
౨౭కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి మిమ్మల్ని బందీలుగా తీసుకుపోతాను, అని యెహోవా చెబుతున్నాడు. ఆయన పేరు సేనల అధిపతి అయిన దేవుడు.

< Амос 5 >