< Дії 26 >

1 А Агріппа сказав до Павла: „Дозволяємо тобі говорити про себе само́го“. Павло тоді простягнув руку, і промовив у своїй обороні:
అగ్రిప్ప పౌలుతో, “నీ వాదన వినిపించడానికి నీకు అనుమతి నిచ్చాను” అన్నాడు. అప్పుడు పౌలు తాను మాట్లాడబోతున్నట్టు సూచిస్తూ చెయ్యి చాచి ఈ విధంగా జవాబు చెప్పాడు.
2 „О ца́рю Агріппо! Уважаю себе за щасливого, що сьогодні я перед тобою боронитися маю з усьо́го, у чім мене винуватять юдеї,
“అగ్రిప్ప రాజా, మీరు యూదుల ఆచారాలనూ వివాదాలనూ బాగా ఎరిగిన వారు.
3 особливо ж тому́, що ти знаєш усі юдейські звича́ї та супере́чки. Тому я прошу́ мене вислухати терпля́че.
యూదులు నామీద ఆరోపించిన నేరాలను గూర్చి ఈ రోజు మీ ముందు జవాబు చెప్పుకోవడం నా అదృష్టం అని నేను భావిస్తున్నాను. దయచేసి ఓపికతో నా మనవి వినండి.
4 А життя моє зма́лку, що споча́тку точилося в Єрусалимі серед наро́ду мого, знають усі юдеї,
మొదట నా ప్రజల మధ్య తరువాత యెరూషలేములో బాల్యం నుండి నేను గడిపిన జీవితం ఎలాటిదో యూదులందరికీ తెలుసు.
5 які відають зда́вна мене, аби тільки схотіли засві́дчити, — що я жив фарисеєм за найдокладнішою сектою нашої віри.
వారు మొదటినుండీ నన్ను ఎరిగినవారు కాబట్టి వారు నా గురించి చెప్పాలంటే నేను మన మతంలోని బహునిష్ఠగల తెగను అనుసరించి, పరిసయ్యుడిగా జీవించినట్టు చెప్పగలరు.
6 І тепер я стою отут су́джений за надію обі́тниці, що Бог дав ії нашим отцям,
అయితే ఇప్పుడు దేవుడు మన పూర్వీకులకు చేసిన వాగ్దాన సంబంధమైన నిరీక్షణను బట్టి నన్నిక్కడ విమర్శకు గురి చేస్తూ నిలబెట్టారు.
7 а її викона́ння чекають побачити наші дванадцять племен, слу́жачи Богові безперестанно вдень та вночі. За цю надію, о ца́рю, мене винуватять юдеї!
మన పన్నెండు గోత్రాల ప్రజలు రాత్రింబగళ్ళు దేవుణ్ణి సేవిస్తూ ఆ వాగ్దానం నెరవేర్పు కోసం ఎదురు చూస్తున్నారు. రాజా, ఈ నిరీక్షణ గురించే యూదులు నాపై నేరం మోపారు.
8 Чому ви вважаєте за неймовірне, що Бог воскрешає померлих?
దేవుడు మృతులను లేపుతాడన్న సంగతి నమ్మశక్యం కానిదని మీరెందుకు భావిస్తున్నారు?
9 Правда, ду́мав був я, що мені нале́жить чинити багато ворожого проти Ймення Ісуса Назаряни́на,
నజరేయుడైన యేసు అనే పేరుకి విరోధంగా అనేక కార్యాలు చేయాలని నేను అనుకొన్నాను.
10 що я в Єрусалимі й робив, і багато кого зо святих до в'язниць я замкнув, як отримав був вла́ду від первосвящеників; а як їх убивали, я голос давав проти них.
౧౦యెరూషలేములో నేనలాగే చేశాను. ప్రధాన యాజకుల వలన అధికారం పొంది, అనేకమంది పవిత్రులను చెరసాలల్లో వేశాను. వారిని చంపినప్పుడు సమ్మతించాను.
11 І часто по всіх синагогах караючи їх, до богозневаги примушував я, а лютуючи ве́льми на них, переслідував їх навіть по закордонних містах.
౧౧చాలాసార్లు సమాజ మందిరాల్లో వారిని దండించి వారు దేవదూషణ చేసేలా బలవంతపెట్టాను. అంతేగాక వారిమీద తీవ్రమైన కోపంతో ఇతర పట్టణాలకు సైతం వెళ్ళి వారిని హింసించాను.
12 Коли в цих справах я йшов до Дамаску зо вла́дою та припору́ченням первосвящеників,
౧౨“అందుకోసం నేను ప్రధాన యాజకుల చేత అధికారాన్నీ ఆజ్ఞలనూ పొంది దమస్కు పట్టణానికి వెళుతున్నపుడు
13 то опі́вдні, о ца́рю, на дорозі побачив я світло із неба, ясніше від світлости сонця, що ося́яло мене та тих, хто разом зо мною йшов!
౧౩రాజా, మధ్యాహ్నం నా చుట్టూ, నాతో కూడ వచ్చినవారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సుకంటే ఎక్కువ దేదీప్యమానమైన ఒక వెలుగు ప్రకాశించడం చూశాను.
14 І як ми всі повалились на землю, я голос почув, що мені говорив єврейською мовою: „Савле, Савле, — чому ти Мене переслідуєш? Трудно тобі бити ногою колю́чку!“
౧౪మేమందరమూ నేల మీద పడినప్పుడు, ‘సౌలూ, సౌలూ, నన్నెందుకు హింసిస్తున్నావు? మునికోలలకు ఎదురు తన్నడం నీకు కష్టం’ అని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలకడం విన్నాను.
15 А я запитав: „Хто Ти, Господи?“А Він відказав: „Я Ісус, що Його переслідуєш ти.
౧౫అప్పుడు నేను ‘ప్రభూ, నీవు ఎవరివి?’ అని అడిగినపుడు ప్రభువు, ‘నీవు హింసిస్తున్న యేసుని.
16 Але підведи́ся, і стань на ноги свої. Бо на те Я з'явився тобі, щоб тебе вчинити слугою та свідком того, що ти бачив та що Я відкрию тобі.
౧౬నీవు నన్ను చూసిన సంగతిని గురించీ, నీకు ఇకముందు వెల్లడి కాబోయే సంగతులను గురించీ నిన్ను నా పరిచారకునిగా, సాక్షిగా నియమించడానికే నీకు ప్రత్యక్షమయ్యాను. నీవు లేచి నిలబడు,
17 Визволяю тебе від твого наро́ду та від поган, до яких Я тебе посилаю, —
౧౭నేను ఈ ప్రజల వల్లా యూదేతరుల వల్లా నీకు హాని కలగకుండా కాపాడతాను.
18 відкрити їм очі, щоб вони наверну́лись від те́мряви в світло та від сатани́ної вла́ди до Бога, щоб вірою в Мене отримати їм дарува́ння гріхів і насліддя з освяченими“.
౧౮వారు చీకటి నుండి వెలుగులోకీ సాతాను అధికారం నుండి దేవుని వైపుకూ తిరిగి, నాపై విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణనూ, పరిశుద్ధుల్లో వారసత్వాన్నీ పొందడం కోసం వారి కళ్ళు తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరికి పంపిస్తాను’ అని చెప్పాడు.
19 Через це я, о ца́рю Агріппо, не був супротивний видінню небесному,
౧౯“కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను లోబడి
20 але ме́шканцям перше Дамаску, потім Єрусалиму й усякого кра́ю юдейського та поганам я проповідував, щоб пока́ялися й наверну́лись до Бога, і чинили діла, гі́дні покая́ння.
౨౦మొదట దమస్కులో, యెరూషలేములో, యూదయ దేశమంతటా, ఆ తరువాత యూదేతరులకూ, వారు మారుమనస్సు పొంది దేవుని వైపు తిరిగి మారుమనస్సుకు తగిన క్రియలు చేయాలని ప్రకటిస్తున్నాను.
21 Через це юдеї в святині схопи́ли мене та й хотіли роздерти.
౨౧ఈ కారణంగానే యూదులు నన్ను దేవాలయంలో పట్టుకుని చంపడానికి ప్రయత్నం చేశారు.
22 Але, поміч від Бога одержавши, я стою́ аж до дня сьогоднішнього та свідкую мало́му й великому, нічого не розповідаючи, окрім того, що сказали Пророки й Мойсей, що статися має, —
౨౨అయినప్పటికీ నేను దేవుని సహాయం వలన ఈ రోజు వరకూ నిలిచి ఉన్నాను. క్రీస్తు హింసలు పొంది మృతుల పునరుత్థానం పొందేవారిలో మొదటివాడు కావడంచేత, యూదులకూ యూదేతరులకూ వెలుగు ప్రసరిస్తుందని ప్రవక్తలు, మోషే, ముందుగా చెప్పిన దానికి మరేమీ కలపకుండా, అల్పులకూ ఘనులకూ సాక్ష్యమిస్తున్నాను.”
23 що має Христос постраждати, що Він, як перший воскреснувши з мертвих, проповідувати буде світло народові й поганам!“
౨౩
24 Коли ж він боронився отак, то Фест проказав гучни́м голосом: „Дурієш ти, Павле! Велика наука доводить тебе до нерозуму“!
౨౪అతడు ఈ విధంగా సమాధానం చెబుతుండగా ఫేస్తు, “పౌలూ, నీవు వెర్రివాడివి, మితిమీరిన విద్య వలన నీకు పిచ్చి పట్టింది” అని గట్టిగా అరిచాడు.
25 А Павло: „Не дурію — сказав, — о Фесте достойний, але провіщаю слова правди та щирого розуму.
౨౫అందుకు పౌలు ఇలా అన్నాడు, “మహా ఘనులైన ఫేస్తూ, నేను వెర్రివాణ్ణి కాదు. సత్యం, వివేకం గల మాటలే చెబుతున్నాను.
26 Цар бо знає про це, — до нього з відвагою я й промовляю. Бо не гада́ю я, щоб із цього щобудь схова́лось від нього, — бо не в за́кутку ді́ялось це.
౨౬రాజుకు ఈ సంగతులు తెలుసు కాబట్టి వారి ముందు నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. వాటిలో ప్రతి ఒక్క విషయమూ వారికి తెలుసు అని రూఢిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది ఏదో ఒక మూలన జరిగిన విషయం కాదు.
27 Чи віруєш, ца́рю Агріппо, Пророкам? Я знаю, що віруєш“.
౨౭అగ్రిప్ప రాజా, మీరు ప్రవక్తలను నమ్ముతున్నారా? నమ్ముతున్నారని నాకు తెలుసు.” అన్నాడు.
28 Агріппа ж Павлові: „Ти малощо не намовляєш мене, щоб я став християни́ном“.
౨౮అందుకు అగ్రిప్ప, “ఇంత తేలికగా నన్ను క్రైస్తవుడుగా మార్చాలని చూస్తున్నావే” అని పౌలుతో అన్నాడు.
29 А Павло: „Благав би я Бога, щоб чи мало, чи багато, — не тільки но ти, але й усі, хто чує сьогодні мене, зробились такими, як і я, крім оцих ланцюгів“.
౨౯అందుకు పౌలు, “తేలికగానో కష్టంగానో, మీరు మాత్రమే కాదు, ఈ రోజు నా మాట వింటున్న వారంతా ఈ సంకెళ్ళు తప్ప నాలాగానే ఉండేలా దేవుడు అనుగ్రహిస్తాడు గాక” అన్నాడు.
30 І встав цар та намісник, і Верні́ка та ті, хто з ними сидів.
౩౦అప్పుడు రాజు, ఫేస్తూ, బెర్నీకే, వారితో కూడ కూర్చున్నవారు లేచి అవతలకు పోయి
31 І на́бік вони відійшли, і розмовляли один до одно́го й казали: „Нічого, ва́ртого смерти або ланцюгів, чоловік цей не робить!“
౩౧“ఈ వ్యక్తి మరణానికి గాని, బంధకాలకు గాని తగిన నేరమేమీ చేయలేదు” అని తమలో తాము మాట్లాడుకున్నారు.
32 Агріппа ж до Феста сказав: „Міг би бути відпу́щений цей чоловік, якби не відкликавсь був до ке́саря“
౩౨అప్పుడు అగ్రిప్ప, “ఈ మనిషి సీజరు ముందు చెప్పుకొంటానని అనకపోయి ఉంటే ఇతణ్ణి విడుదల చేసేవాళ్ళమే” అని ఫేస్తుతో చెప్పాడు.

< Дії 26 >