< Дії 23 >
1 І вп'явся очима Павло на той синедріо́н і промовив: „Мужі-браття, я аж по сьогоднішній день жив для Бога всім добрим сумлі́нням!“
౧పౌలు మహా సభవారిని సూటిగా చూసి, “సోదరులారా, నేను ఈ రోజు వరకూ దేవుని ముందు పూర్తిగా మంచి మనస్సాక్షితో నడచుకుంటున్నాను” అని చెప్పాడు.
2 Але первосвященик Ана́ній звелів тим, що стояли при ньому, щоб били його по уста́х.
౨అందుకు ప్రధాన యాజకుడు అననీయ, “అతన్ని నోటి మీద కొట్టండి” అని దగ్గర నిలబడిన వారికి ఆజ్ఞాపించాడు.
3 Тоді промовив до нього Павло: „Тебе битиме Бог, ти сті́но побілена... Ти ж сидиш, щоб судити мене за Зако́ном, а наказуєш бити мене проти Зако́ну?“
౩పౌలు అతణ్ణి చూసి, “సున్నం కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొడతాడు. నీవు ధర్మశాస్త్రం ప్రకారం నన్ను విచారణ చేయడానికి కూర్చుని, ధర్మశాస్త్రానికి విరోధంగా నన్ను కొట్టమని ఆజ్ఞాపిస్తున్నావా?” అన్నాడు.
4 А присутні сказали: „То ти Божому первосвященикові лихосло́виш?“
౪అప్పుడు దగ్గర ఉన్నవారు, “నీవు దేవుని ప్రధాన యాజకుణ్ణి దూషిస్తున్నావేంటి?” అన్నారు.
5 І промовив Павло: „Не знав я, брати, що то первосвященик. Бо написано: На начальника люду твого не лихосло́в“.
౫అందుకు పౌలు, “సోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. ‘నీ ప్రజల అధికారిని నిందించవద్దు’ అని రాసి ఉంది” అన్నాడు.
6 І Павло, спостерігши, що частина одна — саддуке́ї, а друга — фарисеї, покликнув у синедріоні: „Мужі-браття, — я фарисей, і син фарисея. За наді́ю на воскресіння мертвих мене судять!“
౬అక్కడ ఉన్న వారిలో ఒక భాగం సద్దూకయ్యులూ, మరొక భాగం పరిసయ్యులూ ఉన్నట్టు పౌలు గ్రహించి, “సోదరులారా, నేను పరిసయ్యుణ్ణి, పరిసయ్యుల సంతతివాణ్ణి. మనకున్న నిరీక్షణ గూర్చీ, మృతుల తిరిగి బ్రతకడం గూర్చీ నేను విచారణ పాలవుతున్నాను.” అని సభలో గొంతెత్తి చెప్పాడు.
7 Якже він це промовив, колотне́ча постала поміж саддуке́ями та фарисеями, — і розділи́лась юрба́.
౭అతడా విధంగా చెప్పినప్పుడు పరిసయ్యులకు సద్దూకయ్యులకు మధ్య కలహం రేగింది. అందువల్ల ఆ సమూహం రెండు పక్షాలుగా చీలిపోయింది.
8 Саддуке́ї бо тве́рдять, що немає воскресіння, ані а́нгола, ані духа, фарисеї ж оце визнають.
౮సద్దూకయ్యులు పునరుత్థానం లేదనీ, దేవదూత గానీ, ఆత్మగానీ లేదనీ చెబుతారు. కాని పరిసయ్యులు ఇవన్నీ ఉన్నాయంటారు.
9 І галас великий зчинився. А деякі книжники, із фарисейської групи, уставши, почали́ сперечатися, кажучи: „У чоловікові цьому ми жодного ли́ха не знаходимо! А коли промовляв Дух до нього, чи ангол, не противмося Богові“.
౯అప్పుడు పెద్ద గోల పుట్టింది. పరిసయ్యుల పక్షంగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, “ఈ మనిషిలో ఏ దోషమూ మాకు కనబడలేదు. బహుశా ఒక ఆత్మగానీ, దేవదూతగానీ అతనితో మాట్లాడాడేమో” అని వాదించారు.
10 А коли колотне́ча велика зчинилась, то тисяцький, боячись, щоб Павла не роздерли, звелів вояка́м увійти та забрати його з-поміж них, і відве́сти в форте́цю.
౧౦కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేస్తారేమో అని సహస్రాధిపతి భయపడి, “వారి మధ్య నుండి అతణ్ణి బలవంతంగా పట్టుకుని కోటలోకి తీసుకుని రండి” అని సైనికులకు ఆజ్ఞాపించాడు.
11 А наступної ночі став Господь перед ним і промовив: „Будь бадьорий! Бо як в Єрусалимі про Мене ти свідчив, так треба тобі свідкува́ти й у Римі!“
౧౧ఆ రాత్రి ప్రభువు అతని పక్కన నిలబడి “ధైర్యంగా ఉండు. యెరూషలేములో నన్ను గూర్చి నువ్వెలా సాక్ష్యం చెప్పావో అదే విధంగా రోమ్ నగరంలో కూడా చెప్పాల్సి ఉంటుంది” అని చెప్పాడు.
12 А коли настав день, то дехто з юдеїв зібрались, та клятву скла́ли, говорячи, що ні їсти, ні пити не бу́дуть, аж доки Павла́ не заб'ють!
౧౨తెల్లవారిన తరువాత కొందరు యూదులు పోగై, తాము పౌలును చంపేటంతవరకూ అన్నపానాలు ముట్టం అని ఒట్టు పెట్టుకున్నారు.
13 А тих, що закляття таке покла́ли, було більш сорока́.
౧౩నలభై కంటే ఎక్కువమంది ఈ కుట్రలో చేరారు.
14 І вони приступили до первосвящеників та старших і сказали: „Ми клятву скла́ли нічого не їсти, аж поки заб'ємо Павла!
౧౪వారు ప్రధాన యాజకుల దగ్గరకూ, పెద్దల దగ్గరకూ వచ్చి, “మేము పౌలును చంపేవరకూ ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొన్నాం.
15 Отож разом із синедріоном передайте тисяцькому, щоб до вас він привів його, ніби хочете ви докладніш розізнати про нього. А ми, перше ніж він набли́зиться, готові забити його“.
౧౫కాబట్టి మీరు మహా సభతో కలిసి, అతనిని క్షుణ్ణంగా విచారించాలి అన్న వంకతో అతణ్ణి మీ దగ్గరికి తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయండి. అతడు మీ దగ్గరకి రాకముందే మేము అతనిని చంపడానికి సిద్ధపడి ఉన్నాం” అని చెప్పారు.
16 Як зачув же сестрі́нець Павлів про цю змову, то прибув, і ввійшов у форте́цю, і Павла́ завідо́мив.
౧౬అయితే పౌలు మేనల్లుడు వారు అలా పొంచి ఉన్నారని విని కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలియజేశాడు.
17 Павло ж зараз покликав одно́го з сотників, та й сказав: „Цього юнака́ запровадь до тисяцького, бо він має йому щось сказати“.
౧౭అప్పుడు పౌలు ఒక శతాధిపతిని పిలిచి, “ఈ అబ్బాయిని సహస్రాధిపతి దగ్గరకి తీసుకు వెళ్ళు. ఇతడు అతనితో ఒక మాట చెప్పాల్సి ఉంది” అన్నాడు.
18 Той же взяв його, та й запровадив до тисяцького та сказав: „Павло в'язень покликав мене, і просив запрова́дити до тебе цього юнака́, що має тобі щось сказати“.
౧౮శతాధిపతి ఆ అబ్బాయిని సహస్రాధిపతి దగ్గరికి తీసుకుని పోయి, “ఖైదీగా ఉన్న పౌలు నన్ను పిలిచి ఈ యువకుణ్ణి నీ దగ్గరికి తీసుకుపొమ్మని అడిగాడు. ఇతడు నీతో ఒక మాట చెప్పుకోవాలట” అని చెప్పాడు.
19 І взяв тисяцький того за руку, і на́бік відвів і спитав: „Що́ ти маєш звістити мені?“
౧౯సహస్రాధిపతి ఆ అబ్బాయి చెయ్యి పట్టుకుని అవతలికి తీసుకుపోయి, ‘నీవు నాతో చెప్పాలనుకొన్న సంగతి ఏమిటి?’ అని ఒంటరిగా అడిగాడు.
20 А той розповів: „Змову склали юдеї, — просити тебе, щоб ти взавтра до синедріо́ну Павла припрова́див, ніби хочуть вони докладніш розпізнати про нього.
౨౦అందుకతడు, “నువ్వు పౌలును పూర్తిగా విచారించడం కోసం అతణ్ణి రేపు మహాసభ దగ్గరికి తీసుకురావాలని నిన్ను బతిమాలడానికి యూదులు ఎదురు చూస్తున్నారు.
21 Отож, не послухайся їх, бо чигає на нього їх більш сорока чоловіка, що клятву скла́ли ні їсти, ні пити, аж доки його не заб'ють. І тепер он готові вони, і чекають твого прире́чення“.
౨౧వారి విన్నపానికి ఒప్పుకోవద్దు. ఎందుకంటే వారిలో నలభై కంటే ఎక్కువమంది అతని కోసం చూస్తూ ఉన్నారు. వారు అతణ్ణి చంపేదాకా అన్నపానాలు ముట్టకూడదని ఒట్టు పెట్టుకున్నారు. ఇప్పుడు నీ మాట కోసం కనిపెట్టుకుని ఉన్నారు” అని చెప్పాడు.
22 Тоді тисяцький відпустив юнака́, наказавши йому — „не розповіда́ти ані о́дному, що мені ти це ви́явив.“
౨౨అప్పుడు ఆ సహస్రాధిపతి, “నువ్వు ఈ సంగతి నాకు తెలిపినట్టు ఎవరితోనూ చెప్పవద్దు” అని హెచ్చరించి పంపేశాడు.
23 І він закли́кав якихось двох із сотників, і наказав: „Пришикуйте на третю годину вночі дві сотні вояків, щоб іти до Кесарії, і кіннотників сімдеся́т, та дві сотні стрільців.
౨౩తరువాత అతడు ఇద్దరు శతాధిపతులను పిలిచి, “కైసరయ వరకూ వెళ్ళడానికి రెండు వందల మంది సైనికులనూ డెబ్భై మంది గుర్రపురౌతులనూ రెండు వందలమంది ఈటెల వారినీ రాత్రి తొమ్మిది గంటలకల్లా సిద్ధపరచండి.
24 Приготуйте також в'ючаків і Павла посадіть, і здоровим його проведіть до намісника Фе́лікса.
౨౪గవర్నర్ ఫేలిక్సు దగ్గరికి తీసుకుపోవడానికి గుర్రాలను ఏర్పాటు చేయండి” అని చెప్పాడు.
25 І листа написав він такого ось змісту:
౨౫అతడు ఈ విధంగా ఒక ఉత్తరం కూడా రాశాడు,
26 „Кла́вдій Лі́сій намісникові вседостойному Фе́ліксові — поздоро́влення!
౨౬“అత్యంత గౌరవనీయులైన గవర్నర్ ఫేలిక్సుకు, క్లాడియస్ లూసియస్ వందనాలు.
27 Цього мужа, що його юдеї схопи́ли були́ та хотіли забити, урятував я, із вояка́ми прийшовши, довідавшися, що він ри́млянин.
౨౭యూదులు ఈ వ్యక్తిని పట్టుకుని చంపబోతుండగా, అతడు రోమీయుడని విని, సైనికులతో వెళ్ళి అతణ్ణి తప్పించాను.
28 І хотів я довідатися про причину, що за неї його оскаржа́ли, та й привів був його до їхнього синедріо́ну.
౨౮వారు అతని మీద మోపిన నేరమేమిటో తెలుసుకోవాలని నేను వారి మహాసభకు అతణ్ణి తీసుకువెళ్ళాను.
29 Я знайшов, що його винуватять у спірних речах їхнього Зако́ну, і що провини не має він жа́дної, ва́ртої смерти або ланцюгі́в.
౨౯వారు తమ ధర్మశాస్త్ర వాదాలను గూర్చి ఏవో నేరాలు అతని మీద మోపారు తప్ప మరణానికి గాని, చెరసాలకు గాని తగిన నేరమేదీ అతనిలో చూపలేదు.
30 Як доне́сли ж мені про ту змову, що юдеї вчинили на мужа цього, я зараз до тебе його відіслав, наказавши також позива́льникам, щоб перед тобою сказали, що́ мають на нього. Будь здоровий!“
౩౦అయితే వారు ఈ వ్యక్తిని చంపడానికి కుట్ర చేస్తున్నారని నాకు తెలిసి, వెంటనే అతణ్ణి మీ దగ్గరికి పంపించాను. నేరం మోపినవారు కూడా అతని మీద చెప్పాలనుకున్న సంగతిని మీ ముందే చెప్పుకోవాలని ఆజ్ఞాపించాను.”
31 Отож вояки, як наказано їм, забрали Павла́, і вночі попровадили в Антипатри́ду.
౩౧కాబట్టి సహస్రాధిపతి సైనికులకు ఆజ్ఞాపించిన ప్రకారం వారు పౌలుని రాత్రి పూట అంతిపత్రి తీసుకువెళ్ళారు.
32 А другого дня, полишивши кінно́тчиків, щоб ішли з ним, у форте́цю вони повернулись.
౩౨మరునాడు వారు గుర్రపు రౌతులను పౌలుతో పంపి తమ కోటకు తిరిగి వెళ్ళారు.
33 А ті прибули́ в Кесарі́ю, і, листа передавши намісникові, поставили також Павла перед ним.
౩౩వారు కైసరయ వచ్చి గవర్నరుకి ఆ ఉత్తరాన్ని అప్పగించి పౌలును అతని ముందు నిలబెట్టారు.
34 Намісник листа прочитав і спитав, із якого він кра́ю. А довідавшись, що з Кілікії, промовив:
౩౪గవర్నర్ ఆ ఉత్తరం చదివి ఇతడు ఏ ప్రాంతపు వాడని అడిగాడు. కిలికియకు చెందినవాడని తెలుసుకుని,
35 „Я тебе переслухаю, як при́йдуть і твої позива́льники“. І звелів стерегти його в Іродовому Прето́рії.
౩౫“నీ మీద నేరం మోపిన వారు కూడా వచ్చిన తరువాత నీ సంగతి పూర్తిగా విచారిస్తాను” అని చెప్పి, హేరోదు రాజమందిరంలో అతణ్ణి కావలిలో ఉంచాలని ఆజ్ఞాపించాడు.