< 3 Івана 1 >

1 Ста́рець — улю́бленому Гаєві, якого я направду люблю́.
ప్రియమైన గాయికి, పెద్దనైన నేను యథార్థమైన ప్రేమతో రాస్తున్నది.
2 Улю́блений, — я молюся, щоб добре вело́ся в усьому тобі, і щоб був ти здоровий, як добре веде́ться душі твоїй.
ప్రియ సోదరా, నీవు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఉన్నట్టుగానే అన్ని విషయాల్లో వర్ధిల్లాలనీ, ఆరోగ్యవంతుడివిగా ఉండాలనీ నేను ప్రార్ధిస్తున్నాను.
3 Бо я дуже зрадів, як прийшли були браття, і засві́дчили правду твою, як ти живеш у правді.
నీవు ఎప్పుడూ నడుస్తున్నట్టే సత్యమార్గంలో నడచుకొంటున్నావని నీ గురించి కొందరు సోదరులు వచ్చి చెప్పగా విని చాలా సంతోషించాను.
4 Я не маю більшої радости від цієї, щоб чути, що діти мої живуть у правді.
నా పిల్లలు సత్యమార్గంలో నడుచుకుంటున్నారని తెలుసుకోవడం కన్నా నాకు గొప్ప సంతోషం మరేదీ లేదు.
5 Улю́блений, — вірно ти чи́ниш, як що робиш для братті та для чужи́нців, —
ప్రియ సోదరా, నీవు సోదరుల కోసం అపరిచితుల కోసం చేస్తున్నది నమ్మకంగా చేస్తున్నావు.
6 вони про любов твою свідчили Церкві; добре ти зробиш, як їх ви́провадиш, як достойно для Бога,
వారు సంఘం ఎదుట నీ ప్రేమను గూర్చి సాక్ష్యం ఇచ్చారు. దేవునికి తగినట్టుగా వారి ముందున్న ప్రయాణానికి తోడ్పాటు ఇచ్చి పంపించు.
7 бо вийшли вони ради Йме́ння Його, нічого не взявши від поган.
వారు దేవుని నామం కోసం వెళ్తున్నారు. యూదేతరుల నుండి వారు ఏమీ తీసుకోవడం లేదు.
8 Отож, ми повинні приймати таких, щоб бути співробі́тниками правді.
కాబట్టి మనం సత్యం విషయంలో జత పనివారమయ్యేలా వారిని స్వీకరించాలి.
9 Я до Церкви писав був, але Діотре́ф, що любить бути першим у них, нас не приймає.
అక్కడి సంఘానికి నేను రాశాను గాని, వారిలో గొప్పవాడుగా ఉండాలని కోరుకొనే దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించడం లేదు.
10 Тому́ то, коли я прийду́, то згадаю про вчинки його, що їх ро́бить, словами лихими обмовля́ючи нас. І він тим не задово́льнюється, — а й сам не приймає братів, і тим, що бажають приймати, боронить, і виго́нить із Церкви.
౧౦కాబట్టి, నేను అక్కడికి వచ్చినప్పుడు అతడు చేసిన పనులు, మా విషయంలో మాట్లాడిన చెడ్డ మాటలు గుర్తు చేసుకుంటాను. అంతే కాదు, తాను స్వయంగా సోదరులను ఆహ్వానించడు, ఆహ్వానించిన వారిని కూడా అడ్డగించి, సంఘంలో నుండి వెళ్ళగొడుతున్నాడు.
11 Улюблений, — не робися подібним до лихо́го, а до доброго: доброчинець від Бога, а злочинець Бога не бачив.
౧౧ప్రియ సోదరా, చెడునుగాక మంచినే అనుకరించు. మంచి జరిగించేవాడు దైవ సంబంధి. చెడు జరిగించేవాడు దేవుణ్ణి చూడలేదు.
12 Про Димитрія сві́дчили всі й сама правда. І сві́дчимо й ми, а ви знаєте, що свідчення наше правдиве.
౧౨దేమేత్రి గురించి అందరూ మంచి సాక్ష్యం చెప్పారు. సత్యం విషయంలో అతడు మంచి సాక్ష్యం పొందాడు. మేము కూడా మంచి సాక్ష్యం ఇస్తున్నాం. మా సాక్ష్యం సత్యం అని నీకు తెలుసు.
13 Багато хотів я писати, та не хочу писати до тебе чорнилом та очерети́нкою,
౧౩ఇంకా చాలా సంగతులు నీకు రాయాలనుకున్నాను గాని కలంతో, సిరాతో రాయడం నాకు ఇష్టం లేదు.
14 але маю надію побачити тебе незаба́ром, і говорити уста́ми до уст. Мир тобі! Друзі вітають тебе. Привітай друзів пойменно! Амі́нь.
౧౪కానీ నేను నిన్ను త్వరలోనే చూడగలనని ఆశిస్తున్నాను. అప్పుడు మనం ముఖాముఖీ మాట్లాడుకుందాం. నీకు శాంతి కలుగు గాక. స్నేహితులు నీకు అభివందనాలు చెబుతున్నారు. అక్కడి స్నేహితులకు పేరు పేరునా మా అభివందనాలు తెలియజెయ్యి.

< 3 Івана 1 >