< 2 Тимофію 1 >
1 Павло, з волі Божої апо́стол Христа Ісуса, за обі́тницею життя, що в Христі Ісусі,
౧క్రీస్తు యేసులో ఉన్న జీవాన్ని గురించిన వాగ్దానం ప్రకారం దేవుని సంకల్పం వలన క్రీస్తు యేసు అపొస్తలుడు పౌలు అనే నేను నా ప్రియ పుత్రుడు తిమోతికి రాసిన ఉత్తరం.
2 до Тимофія, сина улю́бленого: благода́ть, милість, мир від Бога Отця й Христа Ісуса, Господа нашого!
౨తండ్రియైన దేవుని నుండీ మన ప్రభువు క్రీస్తు యేసు నుండీ కృప, కనికరం, సమాధానం నీకు కలుగు గాక.
3 Дякую Богові, Якому служу́ від предків чистим сумлінням, що тебе пам'ятаю я за́вжди в молитвах своїх день і ніч.
౩నా ప్రార్థనల్లో నిన్ను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ నా పూర్వీకులవలే కల్మషంలేని మనస్సాక్షితో నేను సేవిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను.
4 Я бажаю побачити тебе, пам'ята́ючи сльо́зи твої, щоб напо́внитись радістю.
౪నీ కన్నీళ్లను జ్ఞాపకం చేసుకుని, నిన్ను చూసి నా ఆనందాన్ని పరిపూర్ణం చేసుకోవాలని ఎదురుచూస్తున్నాను.
5 Я приво́джу на пам'ять собі твою нелицемірну віру, що перше була́ осели́лася в бабі твоїй Лоі́ді та в твоїй матері Евні́кії; певен же я, що й у тобі вона осели́лась.
౫నీలోని కపటం లేని విశ్వాసం నాకు తెలుసు. ఆ విశ్వాసం మొదట మీ అమ్మమ్మ లోయిలోనూ, మీ అమ్మ యునీకేలోనూ ఉంది. అది నీలో కూడా ఉన్నదని నా పూర్తి నమ్మకం.
6 З цієї причини я нагадую тобі, щоб ти розгрівав Божого дара, який у тобі через покла́дання рук моїх.
౬ఆ కారణంగానే నేను నీమీద నా చేతులు ఉంచడం ద్వారా నీకు కలిగిన దేవుని కృపావరాన్ని ప్రజ్వలింపజేసుకోమని నిన్ను ప్రోత్సహిస్తున్నాను.
7 Бо не дав нам Бог духа стра́ху, але сили, і любови, і здорового розуму.
౭దేవుడు మనకు శక్తీ, ప్రేమా, నిగ్రహం కలిగించే ఆత్మనే ఇచ్చాడు గాని పిరికితనం కలిగించే ఆత్మను ఇవ్వలేదు.
8 Тож, не соромся засві́дчення Господа нашого, ні мене, Його в'я́зня, але страждай з Єва́нгелією за силою Бога,
౮కాబట్టి నువ్వు మన ప్రభువు విషయమైన సాక్ష్యం గురించి గానీ, ఆయన ఖైదీనైన నన్ను గురించి గానీ సిగ్గుపడకుండా, దేవుని శక్తితో సువార్త మూలంగా వాటిల్లే కష్టాల్లో భాగం పంచుకో.
9 що нас спас і покликав святим по́кликом, — не за наші діла, але з волі Своєї та з благодаті, що нам да́на в Христі Ісусі попе́реду вічних часі́в. (aiōnios )
౯ఆయన మన క్రియలనుబట్టి కాక తన సంకల్పాన్నిబట్టి, కాలం ఆరంభానికి ముందే మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపునిచ్చాడు. (aiōnios )
10 А тепер об'яви́лась через з'я́влення Спасителя нашого Христа Ісуса, що й смерть зруйнував, і вивів на світло життя та нетління Єва́нгелією.
౧౦ఆ కృప ఇప్పుడు క్రీస్తు యేసు అనే మన రక్షకుడు ప్రత్యక్షం కావడం ద్వారా వెల్లడి అయింది. ఆయన మరణాన్ని నాశనం చేసి జీవాన్నీ అమర్త్యతనూ సువార్త ద్వారా వెలుగులోకి తెచ్చాడు.
11 що для неї я був настано́влений за проповідника, апо́стола й учителя.
౧౧ఆ సువార్త విషయంలో నేను ప్రచారకుడుగా, అపొస్తలుడుగా, బోధకుడుగా నియామకం పొందాను.
12 З цієї причини й терплю́ я оце, але не соро́млюсь, бо знаю, в Кого я ввірував та впе́внився, що має Він силу заховати на той день заста́ву мою.
౧౨ఆ కారణం చేత నేనీ కష్టాలు అనుభవిస్తున్నాను. నేను నమ్మినవాడు నాకు తెలుసు కాబట్టి సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించినదాన్ని రాబోతున్న ఆ రోజు వరకూ ఆయన కాపాడగలడని నాకు పూర్తి నమ్మకం ఉంది.
13 Май же за взір здорових слів ті, які від мене почув ти у вірі й любові, що в Христі Ісусі вона.
౧౩క్రీస్తు యేసులో ఉంచవలసిన విశ్వాసంతో, ప్రేమతో నేను నీకు నేర్పిన క్షేమకరమైన బోధ నమూనాను పాటించు.
14 Добро припору́чене стережи Святим Духом, що в нас пробува́є.
౧౪దేవుడు నీకు అప్పగించిన ఆ మంచిదాన్ని మనలో నివాసమున్న పరిశుద్ధాత్మ వలన కాపాడుకో.
15 Ти знаєш оце, що відверну́лись від мене всі, хто в А́зії, а між ними Фіге́л та Гермоге́н.
౧౫ఆసియలోని వారంతా నన్ను విడిచిపోయారని నీకు తెలుసు. ఫుగెల్లు, హెర్మొగెనే అలాటివారే.
16 Хай Госпо́дь подасть милосердя Ониси́форовому дому, бо він часто мене підкріпляв і кайда́нів моїх не соро́мився.
౧౬ప్రభువు ఒనేసిఫోరు కుటుంబంపై కనికరం చూపు గాక.
17 А коли він до Риму прибув, шукав мене пильно й знайшов, —
౧౭అతడు రోమ్ నగరానికి వచ్చినప్పుడు నేను ఖైదీనని సిగ్గుపడకుండా చాలాసార్లు నన్ను శ్రద్ధగా వెతికి, కనుగొని, ఆదరించాడు.
18 хай Госпо́дь йому дасть знайти милість від Господа в день той, — скільки ж він послужив був в Ефе́сі мені, ти ві́даєш краще!
౧౮పైగా అతడు ఎఫెసులో నాకు ఎంత ఉపచారం చేశాడో నీకు బాగా తెలుసు. ఆ దినాన అతడు ప్రభువు వలన కనికరం పొందేలా ప్రభువు అనుగ్రహించు గాక.