< 2 до коринтян 9 >
1 А про службу святим мені зайво писати до вас,
౧పరిశుద్ధుల కోసమైన ఈ సేవ గురించి నేను మీకు రాయనవసరం లేదు.
2 бо відаю вашу охоту, і нею хвалюся за вас македо́нянам, що Аха́я готова з минулого року, а ваша ре́вність заохо́тила багатьох.
౨మీ ఆసక్తి నాకు తెలుసు. దాన్ని గురించి మాసిదోనియ ప్రజల ముందు మిమ్మల్ని పొగిడాను గదా! పోయిన సంవత్సరం నుండి అకయ ప్రాంతం వారు సిద్ధంగా ఉన్నారని వారికి చెప్పాను. మీ ఆసక్తి వారిలో చాలా మందిని ప్రోత్సహించింది.
3 А я послав братів, щоб моя похвала́, щодо вас, не даремна була в цім випа́дкові, але, як казав, щоб були ви пригото́ва́ні,
౩అయితే మీ గురించి మేము గొప్పగా చెప్పిన సంగతులు ఈ విషయంలో వ్యర్థం కాకూడదనీ నేను చెప్పినట్టు మీరు సిద్ధంగా ఉండాలనీ సోదరులను పంపాను.
4 щоб, коли македо́няни при́йдуть зо мною та зна́йдуть, що ви неготові, щоб не осоро́митись нам — не кажемо вам — у цій речі.
౪ఒకవేళ మాసిదోనియ వారెవరైనా నాతో వచ్చి మీరు సిద్ధంగా లేరని తెలుసుకుంటే మీకే కాదు, మీ మీద ఇంత నమ్మకం ఉంచిన మాకు కూడా అవమానం కలుగుతుంది.
5 Отож, я наду́мався, що треба вблагати братів, щоб пішли перше до вас та приготува́ли заздалегі́дь оголошений ваш щедрий дар, щоб був він пригото́ваний, як щедрий дар, а не річ примусова.
౫అందుచేత సోదరులు ముందుగానే మీ దగ్గరికి వచ్చి పూర్వం మీరు వాగ్దానం చేసిన విరాళం పోగుచేయాలని ప్రోత్సహించడానికి వారిని పంపడం అవసరమని నేను భావించాను. తద్వారా మీ విరాళం బలవంతంగా ఇచ్చింది కాకుండా స్వచ్ఛందంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను.
6 А до цього кажу́: Хто скупо сіє, — той скупо й жатиме, а хто сіє щедро, — той щедро й жатиме!
౬“కొద్దిగా చల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు” అని దీని గురించి చెప్పవచ్చు.
7 Нехай кожен дає, як серце йому призволя́є, — не в смутку й не з примусу, бо Бог любить того, хто з радістю дає!
౭సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు.
8 А Бог має силу всякою благода́ттю вас збагати́ти, щоб ви, мавши за́вжди в усьому всілякий достаток, збага́чувалися всяким добрим учинком,
౮అన్నిటిలో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీలో తన కృపను అధికం చేయగలడు.
9 як написано: „Розси́пав та вбогим роздав, — Його праведність триває навіки!“ (aiōn )
౯దీని గురించి “అతడు తన సంపద దరిద్రులకు పంచి ఇచ్చాడు. అతని నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది” అని లేఖనంలో రాసి ఉంది. (aiōn )
10 А Той, Хто насіння дає сіяче́ві та хліб на поживу, — нехай дасть і примно́жить ваше насіння, і нехай Він зрости́ть плоди праведности вашої,
౧౦విత్తనాలు చల్లేవారికి విత్తనాన్నీ తినడానికి ఆహారాన్నీ దయచేసే దేవుడు మీకు విత్తనాన్ని దయచేసి వృద్ధి చేస్తాడు. మీ నీతి ఫలాన్ని అధికం చేస్తాడు.
11 щоб усім ви збагачувались на всіляку щирість, яка через нас чинить Богові дяку.
౧౧ఎప్పుడూ ఉదారంగా ఇవ్వడానికి మీకు సర్వ సమృద్ధి కలుగుతుంది. దాన్ని బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞత తెలియజేసే కారణం దొరుకుతుంది.
12 Бо ді́ло служі́ння цього не тільки випо́внює недостачі святих, але й багатіє багатьма́ подяками Богові.
౧౨మీరు చేసే ఈ సేవ పరిశుద్ధుల అక్కరలు తీర్చడమే కాకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించేలా చేస్తుంది.
13 Досвідченням цього служі́ння вони хвалять Бога за по́слух Христовій Єва́нгелії, що ви визнаєте її, та за щирість учасництва з ними й усіма́,
౧౩ఈ సేవ ద్వారా మీ యోగ్యత కనబడుతుంది. క్రీస్తు సువార్తను ఒప్పుకుని విధేయులై, ఇంత ఉదారంగా వారికీ, అందరికీ పంచిపెట్టడం బట్టి, వారు కూడా దేవుణ్ణి మహిమ పరుస్తారు.
14 вони за вас моляться й тужать по вас із-за дуже великої Божої благода́ті на вас.
౧౪మీ పట్ల దేవుడు కనపరచిన అత్యధికమైన కృపను చూసి, వారు మీ కోసం ప్రార్థన చేస్తూ, మిమ్మల్ని చూడాలని ఎంతో కోరికతో ఉన్నారు.
15 Дяка Богові за невимо́вний дар Його!
౧౫వర్ణించ శక్యం గాని ఆయన బహుమానానికి దేవునికి ధన్యవాదాలు.