< 1 Самуїлова 16 >
1 І сказав Господь до Самуїла: „Аж доки ти сумува́тимеш за Саулом? Таж Я відкинув його, щоб не царював над Ізраїлем. Напо́вни рога свого оливою, та й іди, — пошлю тебе до віфлеє́млянина Єссея, бо Я наглянув Собі царя між синами його“.
౧యెహోవా సమూయేలుతో ఇలా చెప్పాడు “ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను తిరస్కరించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు? నీ కొమ్మును నూనెతో నింపు, బేత్లెహేముకు చెందిన యెష్షయి దగ్గరకి నిన్ను పంపిస్తున్నాను. అతని కొడుకుల్లో ఒకడిని నేను రాజుగా ఎంపిక చేశాను.”
2 І сказав Самуїл: „Як я піду́? А почує Саул, то вб'є мене“. А Господь сказав: „Візьми в свою руку теля з великої худоби, та й скажеш: Я прийшов, щоб прине́сти жертву для Господа.
౨అందుకు సమూయేలు “నేనెలా వెళ్ళగలను? నేను వెళ్లిన సంగతి సౌలుకు తెలిస్తే అతడు నన్ను చంపేస్తాడు” అన్నాడు. యెహోవా “నువ్వు ఒక లేగ దూడను తీసుకువెళ్ళి యెహోవాకు బలి అర్పించడానికి వచ్చానని చెప్పి,
3 І закличеш Єссе́я на жертву, а Я тобі дам знати, що́ маєш робити, і пома́жеш Мені того, кого скажу́ тобі“.
౩యెష్షయిని బలి అర్పణ చేసే చోటికి పిలిపించు. అప్పుడు నువ్వు ఏమి చేయాలో నీకు చెబుతాను. ఎవరి పేరు నేను నీకు సూచిస్తానో అతణ్ణి నువ్వు అభిషేకించాలి” అని చెప్పాడు.
4 І зробив Самуїл, що́ Господь говорив. І прийшов він до Віфлеєму, а старші́ міста вийшли йому назустріч із тремтінням. І сказали вони: „Чи твій при́хід — то мир?“
౪సమూయేలు యెహోవా సెలవిచ్చినట్టు బేత్లెహేముకు బయలుదేరాడు. ఆ ఊరి పెద్దలు అతడు రావడం చూసి భయపడి “నువ్వు శాంతంగానే వస్తున్నావా?” అని అడిగినప్పుడు,
5 А він відказав: „Мир! Я прийшов, щоб прине́сти жертву Господе́ві. Освятіться, і при́йдете зо мною до жертви“. І освятив він Єссе́я та синів його, і покликав їх на жертву.
౫అతడు “శాంతంగానే వచ్చాను. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని నాతో కలసి బలికి రండి” అని చెప్పి యెష్షయిని, అతని కొడుకులను శుద్ధి చేసి బలి అర్పించాడు.
6 І сталося, як вони поприхо́дили, то побачив він Еліява, та й сказав: „Справді — перед Господом пома́занець Його!“
౬వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూసి “నిజంగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదురుగా నిలబడి ఉన్నాడు” అని అనుకున్నాడు.
7 Та Господь сказав Самуїлові: „Не дивись на обличчя його та на високість зросту його, бо Я відкинув його Собі! Бо Бог бачить не те, що бачить люди́на: чоловік бо дивиться на лице, а Господь дивиться на серце“.
౭అయితే యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు. “అతడి అందాన్నీ ఎత్తునూ చూడవద్దు. మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతణ్ణి నిరాకరించాను. మనుషులు పైరూపాన్ని చూస్తారు గానీ యెహోవా అయితే హృదయాన్ని చూస్తాడు.”
8 І покликав Єссе́й Авінадава, і привів його перед Самуїла, та той сказав: „Також цього не вибрав Господь!“
౮యెష్షయి అబీనాదాబును పిలిచి అతణ్ణి సమూయేలు ముందు నిలబెట్టగా, అతడు “యెహోవా ఇతణ్ణి ఎన్నుకోలేదు” అన్నాడు.
9 І привів Єссе́й Шамму, та Самуїл сказав: „Також цього не вибрав Господь“.
౯అప్పుడు యెష్షయి షమ్మాను పిలిచి నిలబెట్టినప్పుడు సమూయేలు “యెహోవా ఇతణ్ణి ఎన్నుకోలేదు” అన్నాడు.
10 І привів Єссей сімох своїх синів перед Самуїла. І сказав Самуїл до Єссея: „Цих не вибрав Господь“.
౧౦యెష్షయి తన ఏడుగురు కొడుకులనూ సమూయేలు ముందుకి రప్పించాడు. సమూయేలు “యెహోవా వీరిలో ఎవరినీ ఎన్నుకోలేదు” అని చెప్పి,
11 І сказав Самуїл до Єссея: „Чи то всі твої діти?“А той відказав: „Ще позостався найменший, — він пасе отару“. І сказав Самуїл до Єссея: „Пошли ж приве́сти його, бо не сядемо за стіл, аж поки він не при́йде сюди“.
౧౧“నీ కొడుకులందరూ ఇక్కడే ఉన్నారా?” అని యెష్షయిని అడిగాడు. అతడు “ఇంకా చివరివాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను మేపడానికి వెళ్ళాడు” అని చెప్పాడు. అందుకు సమూయేలు “నువ్వు అతనికి కబురు పంపి ఇక్కడికి రప్పించు. అతడు వచ్చేదాకా మనం కూర్చోలేం కదా” అని యెష్షయితో చెప్పాడు.
12 І послав він, і привів його, а він — рум'яний, із гарними очима та хорошого стану. А Господь сказав Самуїлові: „Устань, пома́ж його, — бо це він!“
౧౨యెష్షయి అతణ్ణి పిలిపించి లోపలికి తీసుకువచ్చాడు. అతడు రూపంలో ఎర్రని వాడు, చక్కని కళ్ళు కలిగి చూపులకు అందమైనవాడు. అతడు రాగానే “నేను కోరుకొన్నది ఇతడే, నీవు లేచి అతణ్ణి అభిషేకించు” అని యెహోవా చెప్పగానే,
13 І взяв Самуїл рога оливи, та й пома́зав його серед братів його. І Дух Господній злинув на Давида, і був на ньо́му від того дня й далі. А Самуїл устав, і пішов до Рами́.
౧౩సమూయేలు నూనె కొమ్మును తీసి అతని తలపై నూనె పోసి అతని అన్నల ముందు అతణ్ణి అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదును తీవ్రంగా ఆవహించాడు. తరువాత సమూయేలు లేచి రమాకు వెళ్లిపోయాడు.
14 І Дух Господній відступився від Саула, а напав його дух злий, по́сланий від Господа.
౧౪యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిన తరువాత యెహోవా దగ్గర నుండి ఒక దురాత్మ అతణ్ణి భయపెట్టి, వేధించడం మొదలుపెట్టింది,
15 І сказали раби Саула до нього: „Оце злий дух від Бога нападає на тебе.
౧౫సౌలు సేవకులు “దేవుని దగ్గర నుండి వచ్చిన దురాత్మ నిన్ను భయపెడుతున్నది.
16 Нехай скаже пан наш, — раби твої пошукають тобі кого, хто вміє грати на гу́слах. І станеться, коли буде на тебе злий дух від Бога, то заграє той рукою своєю, — і буде тобі добре“.
౧౬నీ సేవకులమైన మాతో చెప్పు, దేవుని దగ్గర నుండి దురాత్మ నిన్ను వేధిస్తూ ఉన్నప్పుడు దాని నుండి ఉపశమనం పొందడానికి తంతివాద్యం చక్కగా వాయించగల ఒకణ్ణి వెదుకుతాం. దురాత్మ వచ్చి నిన్ను వేధించినప్పుడల్లా అతడు తంతివాద్యం వాయించడం వల్ల నువ్వు బాగుపడతావు” అని సౌలుతో అన్నారు.
17 І сказав Саул до рабів своїх: „Нагляньте мені кого, хто добре грає, і приведіть до ме́не“.
౧౭అప్పుడు సౌలు “బాగా వాయించగల ఒకణ్ణి వెతికి నా దగ్గరికి తీసికురండి” అని వారితో చెప్పాడు.
18 I відповів один із слуг, і сказав: „Ось бачив я сина віфлеємлянина Єссе́я, що вміє грати, — ли́цар та вояка, і розуміється на речах, і чоловік хорошої поста́ви. І Господь із ним“.
౧౮వారిలో ఒకడు “బేత్లెహేము వాడైన యెష్షయి కొడుకుల్లో ఒకణ్ణి చూశాను, అతడు చక్కగా వాయించగలడు, అతడు ధైర్యవంతుడు, యుద్ధవీరుడు, మాటకారి, అందగాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కూడా” అని చెప్పాడు.
19 І послав Саул послів до Єссе́я й сказав: „Пошли до мене Давида, сина свого, що при отарі“.
౧౯సౌలు యెష్షయి దగ్గరకి తన సేవకులను పంపి “గొర్రెలు కాస్తున్న నీ కొడుకు దావీదును నా దగ్గరకి పంపించు” అని కబురు చేశాడు.
20 І взяв Єссе́й осла, наладованого хлібом, та бурдюка́ вина, та одне козля, і послав через сина свого Давида до Саула.
౨౦అప్పుడు యెష్షయి ఒక గాడిదపై రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తి, ఒక మేకపిల్లను ఉంచి దావీదు ద్వారా సౌలుకు పంపించాడు.
21 І прийшов Давид до Саула, та й став перед ним. І той сильно полюбив його, і він став йому зброєно́шею.
౨౧దావీదు సౌలు దగ్గరకి వచ్చి అతని ముందు నిలబడినపుడు అతడు సౌలుకు బాగా నచ్చాడు. అతణ్ణి సౌలు ఆయుధాలు మోసే పనిలో పెట్టారు.
22 І послав Саул до Єссея, говорячи: „Нехай остається Давид при мені, бо він знайшов ласку в оча́х моїх“.
౨౨అప్పుడు సౌలు “దావీదు నాకు బాగా నచ్చాడు కాబట్టి అతణ్ణి నా సముఖంలో నిలిచి ఉండడానికి ఒప్పుకో” అని యెష్షయికి కబురు పంపాడు.
23 І бувало, коли злий дух від Бога нападав на Саула, то Дави́д брав гу́сла, та й грав своєю рукою. І легшало Саулові, і ставало йому добре, і відступа́в від нього той злий дух.
౨౩దేవుని నుండి దురాత్మ వచ్చి సౌలును వేధించినప్పుడల్లా దావీదు తంతి వాద్యం వాయించేవాడు. అప్పుడు దురాత్మ అతణ్ణి విడిచిపోయేది. అతడు కోలుకుని నెమ్మది పొందేవాడు.