< До галатів 1 >

1 Павло, апостол, [покликаний] не людьми і не людиною, а Ісусом Христом і Богом Отцем, Який воскресив Його з мертвих,
మనుషుల ద్వారా కాకుండా ఏ వ్యక్తి వలనా కాకుండా కేవలం యేసుక్రీస్తు ద్వారానూ, ఆయనను చనిపోయిన వారిలోనుంచి సజీవుడిగా లేపిన తండ్రి అయిన దేవుని ద్వారానూ అపొస్తలుడుగా నియమితుడైన పౌలు అనే నేనూ,
2 разом з усіма братами. Церквам Галатії.
నాతో ఉన్న సోదరులంతా గలతీయ ప్రాంతంలో ఉన్న సంఘాలకు శుభాకాంక్షలతో రాస్తున్న విషయాలు.
3 Благодать вам і мир від Бога, нашого Отця, і від Господа Ісуса Христа,
తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభు యేసు క్రీస్తు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.
4 [Який, ] віддавши Самого Себе за наші гріхи, визволив нас від нинішнього злого віку згідно з волею Бога й Отця нашого, (aiōn g165)
మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలం నుంచి విమోచించాలని మన పాపాల కోసం తనను తాను అప్పగించుకున్నాడు. (aiōn g165)
5 Якому слава навіки-віків! Амінь. (aiōn g165)
నిరంతరమూ దేవునికి మహిమ కలుగు గాక. ఆమేన్‌. (aiōn g165)
6 Я здивований, що ви так швидко відвертаєтеся від Того, Хто покликав вас благодаттю Христа, заради іншої «доброї звістки».
క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచినవాణ్ణి విడిచిపెట్టి, భిన్నమైన సువార్త వైపు మీరింత త్వరగా తిరిగిపోవడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
7 Насправді іншої немає, але існують деякі [люди], які бентежать вас і намагаються змінити Добру Звістку Христа.
అసలు వేరే సువార్త అనేది లేదు. క్రీస్తు సువార్తను వక్రీకరించి మిమ్మల్ని కలవరపరచే వారు కొంతమంది ఉన్నారు.
8 Але навіть якщо хтось із нас або ангел із неба буде проповідувати вам добру звістку, відмінну від тієї, яку ми вам проповідували, то нехай буде проклятий!
మేము మీకు ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్తను మేము అయినా లేక పరలోకం నుంచి వచ్చిన ఒక దూత అయినా సరే మీకు ప్రకటిస్తే, అతడు దేవుని శాపానికి గురౌతాడు గాక.
9 Ми говорили вже раніше, і я ще раз повторюю: якщо хтось проповідує вам іншу добру звістку, а не ту, що ви прийняли, то нехай буде проклятий!
మేము ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొకటి ఎవరైనా మీకు ప్రకటిస్తే, వాణ్ణి దేవుడు శపిస్తాడు గాక.
10 Чиє схвалення я намагаюся завоювати: людей чи Бога? Хіба я намагаюся догодити людям? Якби я намагався догодити людям, я б не був рабом Христа.
౧౦ఇప్పుడు నేను మనుషుల ఆమోదం కోరుతున్నానా? లేకపోతే దేవుని ఆమోదం కోరుతున్నానా? నేను మనుషులను తృప్తి పరచాలనుకుంటున్నానా? నేనింకా మనుషులను తృప్తి పరచాలనుకుంటుంటే క్రీస్తు సేవకుణ్ణి కానే కాదు.
11 Я хочу, щоб ви, брати, знали, що Добра Звістка, яку я проповідував, не від людей.
౧౧సోదరులారా, నేను ప్రకటించిన సువార్త మానవమాత్రుని నుంచి వచ్చింది కాదని మీకు తెలియాలి.
12 Бо я отримав і вивчив її не від якоїсь людини, але через одкровення Ісуса Христа.
౧౨మనిషి నుంచి నేను దాన్ని పొందలేదు, నాకెవరూ దాన్ని బోధించ లేదు, యేసు క్రీస్తు స్వయంగా నాకు వెల్లడి పరిచాడు.
13 Ви чули про мій попередній спосіб життя в юдействі, як я завзято переслідував Церкву Божу й намагався її зруйнувати.
౧౩నా గత యూదామత జీవితం గురించి మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని తీవ్రంగా హింసిస్తూ నాశనం చేస్తూ ఉండేవాణ్ణి.
14 В юдействі я перевершив багатьох моїх однолітків зі свого народу і був надзвичайно ревним до звичаїв моїх предків.
౧౪అప్పుడు నాకు నా పూర్వీకుల సంప్రదాయాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. యూదా మత నిష్ఠ విషయంలో నా స్వజాతీయుల్లో నా వయసు గల అనేకులను మించిపోయాను.
15 Але коли Бог, Який обрав мене ще до мого народження, покликав мене через Свою благодать, уподобав
౧౫అయినా తల్లిగర్భంలోనే నన్ను ప్రత్యేకపరచుకుని, తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను యూదేతరులకు తన కుమారుణ్ణి ప్రకటించాలని
16 відкрити мені Свого Сина, щоб я проповідував Його Добру Звістку серед язичників, тоді я не пішов відразу радитися з кимось із людей,
౧౬ఆయనను నాలో వెల్లడి చేయడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు వెంటనే నేను మనుషులతో సంప్రదించలేదు.
17 не ходив також і до Єрусалима, до тих, що були апостолами до мене, але пішов в Аравію і знову повернувся в Дамаск.
౧౭నాకంటే ముందు అపొస్తలులైన వారి దగ్గరికి గానీ, యెరూషలేముకు గానీ వెళ్ళలేదు, అరేబియా దేశానికి వెళ్ళి ఆ తరువాత దమస్కు పట్టణానికి తిరిగి వచ్చాను.
18 Потім, через три роки, я вирушив до Єрусалима, щоб познайомитися з Кифою, і пробув із ним п’ятнадцять днів.
౧౮మూడు సంవత్సరాలైన తరవాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేము వెళ్లి అతనితో పదిహేను రోజులున్నాను.
19 Інших же апостолів я не бачив, окрім Якова, брата Господнього.
౧౯అతనిని తప్ప అపొస్తలుల్లో మరి ఎవరినీ నేను చూడలేదు, ప్రభువు సోదరుడు యాకోబును మాత్రం చూశాను.
20 Я пишу вам і запевняю перед Богом, що не обманюю.
౨౦నేను మీకు రాస్తున్న ఈ విషయాల గురించి దేవుని ముందు నేను చెపుతున్నాను.
21 Після того я пішов до земель Сирії та Килікії.
౨౧ఆ తరువాత సిరియా, కిలికియ ప్రాంతాలకు వచ్చాను.
22 Церкви Юдеї, що в Христі, мене особисто не знали.
౨౨క్రీస్తులో ఉన్న యూదయ సంఘాల వారికి నా ముఖ పరిచయం లేదు గానీ
23 Вони лише чули, що той, хто раніше їх переслідував, зараз проповідує віру, яку колись намагався знищити,
౨౩“మునుపు మనలను హింసించిన వాడు తాను గతంలో నాశనం చేస్తూ వచ్చిన విశ్వాసాన్ని తానే ప్రకటిస్తున్నాడు” అనే విషయం మాత్రమే విని,
24 і прославляли Бога за мене.
౨౪వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమ పరిచారు.

< До галатів 1 >