< 2 Івана 1 >
1 Старець. Обраній пані та її дітям, яких я люблю в істині, і не тільки я, але й всі, хто пізнав істину,
౧పెద్దనైన నేను ఎన్నికైన తల్లికీ, ఆమె పిల్లలకూ, నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తూ, రాస్తున్న సంగతులు. నేను మాత్రమే కాక సత్యాన్ని ఎరిగిన వారందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
2 бо істина залишилася в нас і буде з нами повік. (aiōn )
౨ఎందుకంటే మనలో సత్యం నిలిచి ఉంది, అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. (aiōn )
3 Благодать, милість і мир від Бога Отця й від Ісуса Христа, Сина Отця, нехай буде з нами в істині й любові.
౩తండ్రి అయిన దేవుని నుండీ, కుమారుడు యేసు క్రీస్తు నుండీ సత్యంలో, ప్రేమలో మనకు కృప, దయ, శాంతి తోడుగా ఉండు గాక.
4 Я сильно зрадів, тому що знайшов серед твоїх дітей тих, хто ходить в істині, згідно із заповіддю, яку ми отримали від Отця.
౪తండ్రి నుండి మనం పొందిన ఆజ్ఞ ప్రకారం మీ పిల్లల్లో కొందరు సత్యమార్గంలో ఉన్నారని తెలిసి నేను చాలా సంతోషిస్తున్నాను.
5 І тепер прошу тебе, пані, не так, ніби пишу тобі нову заповідь, але ту, яку маємо від початку: любімо одне одного!
౫అమ్మా, కొత్త ఆజ్ఞ మీకు రాసినట్టు కాదు, ఒకరిని ఒకరు ప్రేమించాలన్న ఆజ్ఞ ఆరంభం నుండి మనకు ఉన్నదాన్ని బట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.
6 І в цьому полягає любов: щоб ми жили за Його заповідями. Це є заповідь, яку ви чули від початку. За нею й живіть!
౬ఆయన ఆజ్ఞలను విధేయతతో పాటించడమే ప్రేమ. ఆరంభం నుండి మీరు విన్న ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి.
7 Тому що у світі з’явилося багато тих, хто вводить в оману й не визнає Ісуса Христа, Який прийшов у тілі. Це є антихрист і ошуканець.
౭యేసు క్రీస్తు రక్తమాంసాలతో వచ్చాడని ఒప్పుకోని మోసగాళ్ళు చాలా మంది ఈ లోకంలో బయలుదేరారు. అలాటి వాడు వంచకుడు, క్రీస్తు విరోధి.
8 Пильнуйте себе, щоб ви не загубили того, що ми напрацювали, але щоб ви отримали повну винагороду.
౮మనందరం పని చేసినందుకు రావలసినవి పోగొట్టుకోకుండా, సంపూర్ణ ప్రతిఫలం పొందేలా చూసుకోవాలి.
9 Кожен, хто віддаляється й не залишається у вченні Христа, не має Бога. Той, хто залишається у вченні, має Отця і Сина.
౯క్రీస్తు బోధలో నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగే ప్రతివాడూ దేవుడు లేనివాడు. ఈ బోధలో నిలిచి ఉండే వాడికి తండ్రి, కుమారుడు కూడా ఉన్నారు.
10 Якщо хтось приходить до вас і не приносить цього вчення, не приймайте його до вашого дому й не кажіть йому: «Вітаю!».
౧౦ఈ ఉపదేశం కాకుండా మరొక ఉపదేశంతో ఎవరైనా మీ దగ్గరికి వస్తే, అతన్ని కుశల ప్రశ్నలు వేయవద్దు. మీ ఇంటికి ఆహ్వానించవద్దు.
11 Бо той, хто каже: «Вітаю!», розділяє його лихі вчинки.
౧౧అతన్ని పలకరించినవాడు అతని చెడ్డ పనుల్లో పాలిభాగస్తుడే.
12 Я мав би багато чого вам написати, але не хочу [цього робити] чорнилом на папері. Я сподіваюся прийти до вас, і ми поговоримо віч-на-віч, щоб наша радість була повна.
౧౨ఇంకా ఎన్నో సంగతులు మీకు రాయాలని ఉంది. కాని కాగితం, సిరా వాడడం నాకు ఇష్టం లేదు. మన ఆనందం సంపూర్ణం అయ్యేలా మీ దగ్గరికి వచ్చి మీతో ముఖాముఖి మాట్లాడాలని ఆశగా ఉంది.
13 Діти твоєї обраної сестри вітають тебе!
౧౩ఎన్నికైన మీ సోదరి పిల్లలు మీకు శుభాలు తెలుపుతున్నారు.