< Sakaria 3 >

1 Afei, ɔkyerɛɛ me ɔsɔfopanin Yosua a ɔgyina Awurade ɔbɔfoɔ anim, na Satan gyina ne nifa so rebɛbɔ no soboɔ.
అప్పుడు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండడం నాకు చూపించాడు. అతని మీద అభియోగం మోపడానికి సాతాను అతని కుడి పక్కన నిలబడి ఉన్నాడు.
2 Na Awurade ka kyerɛɛ Satan sɛ, “Awurade nka wʼanim, Satan! Awurade a Yerusalem yɛ ne dea no nka wʼanim. Saa ɔbarima yi nyɛ gyentia a wɔatu afiri ogya mu anaa?”
సాతానుతో యెహోవా దూత “సాతానూ, యెహోవా నిన్ను గద్దిస్తాడు. యెరూషలేమును ఎన్నుకున్న యెహోవా నిన్ను గద్దిస్తాడు. ఇతడు అగ్నిలో నుండి తీసిన నిప్పుకణం లాగానే ఉన్నాడు గదా” అన్నాడు.
3 Na Yosua hyɛ ntadeɛ fi ɛberɛ a ɔgyina ɔbɔfoɔ no anim.
యెహోషువ మురికి దుస్తులు ధరించుకుని దూత సమక్షంలో ఇంకా నిలబడి ఉన్నాడు.
4 Ɔbɔfoɔ no ka kyerɛɛ wɔn a wɔgyinagyina nʼanim no sɛ, “Monnyi ne ho ntadeɛ fi no.” Afei ɔka kyerɛɛ Yosua sɛ, “Hwɛ, mayi wo bɔne afiri wo so, na mede ntadeɛ a ɛyɛ fɛ bɛhyɛ wo.”
అప్పుడు దూత అక్కడ నిలబడి ఉన్నవారిని పిలిచి, ఇతని మురికి దుస్తులు తీసివేయమని ఆజ్ఞాపించాడు. “నేను నీ అపరాధాలను తొలగించాను. ప్రశస్తమైన దుస్తులతో నిన్ను అలంకరిస్తున్నాను” అని చెప్పాడు.
5 Afei, mekaa sɛ, “Momfa abotire a ani teɛ mmɔ ne ti.” Enti, wɔde abotire a ani teɛ bɔɔ no, na wɔhyɛɛ no atadeɛ, ɛberɛ a Awurade ɔbɔfoɔ no gyina hɔ.
“అతని తల మీద తెల్లని పాగా పెట్టించండి” అని ఆయన చెప్పినప్పుడు వారు యెహోవా దూత సమక్షంలో అతని తలకు తెల్లని పాగా పెట్టి, దుస్తులు ధరింపజేసి అతణ్ణి అలంకరించారు.
6 Na Awurade ɔbɔfoɔ de saa akwankyerɛ yi maa Yosua:
అప్పుడు యెహోవా దూత యెహోషువతో ఇలా చెప్పాడు.
7 “Yei ne deɛ Asafo Awurade seɛ: ‘Sɛ wobɛyɛ ɔsetie ama me na woayɛ mʼapɛdeɛ a, ɛnneɛ wobɛdi me fie so na woahwɛ mʼabannwa so, na mɛma wo baabi atena wɔ nnipa a wɔgyinagyina ha yi mu.
సేనల ప్రభువు యెహోవా చెప్పేది ఏమిటంటే “నువ్వు నా కట్టడలను గైకొంటూ నేను నీకు అప్పగించిన కార్యం సవ్యంగా జరిగిస్తే నువ్వు నా ఆలయం మీద అధికారిగా ఉండి నా ఆవరణాలకు సంరక్షకుడివి అవుతావు. అంతేకాక, ఇక్కడ నిలబడే వారికి కలుగుతున్నట్టు నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ప్రసాదిస్తాను.
8 “‘Tie, Ao ɔsɔfopanin Yosua, wo ne wo nkurɔfoɔ a wɔtete wʼanim yi, moyɛ nnipa a wɔgyina hɔ ma nneɛma a ɛrebɛsisi: Mede me ɔsomfoɔ, Dubaa, no bɛba.
ప్రధాన యాజకుడవైన యెహోషువా, నీ యెదుట కూర్చుని ఉన్న నీ సహకారులు జరగబోయేవాటికి సూచనలుగా ఉన్నారు. నువ్వూ, వాళ్ళూ నా మాట ఆలకించాలి. అది ఏమిటంటే, ‘చిగురు’ అనే నా సేవకుణ్ణి నేను రప్పించబోతున్నాను.
9 Hwɛ, aboɔdenboɔ a mede asi Yosua anim! Ani nson na ɛtuatua saa ɛboɔ baako no ho, na mekrukyire atwerɛ bi wɔ so,’ sɛdeɛ Asafo Awurade seɛ nie, ‘na mede ɛda koro pɛ bɛpepa asase yi so bɔne.
యెహోషువ ముందు నేను ఉంచిన రాయిని జాగ్రత్తగా చూడండి. ఆ రాయికి ఏడు కళ్ళు ఉన్నాయి. నేను దాని మీద అక్షరాలు చెక్కుతాను.” ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు. “ఒక్క రోజులో నేను ఈ దేశ ప్రజల అపరాధాలను తొలగిస్తాను.
10 “‘Saa ɛda no mo mu biara bɛto nsa afrɛ ne yɔnko ne no akɔtena ne ngo dua ne borɔdɔma dua ase,’ sɛdeɛ Asafo Awurade seɛ nie.”
౧౦ఆ రోజుల్లో మీరు ద్రాక్షచెట్ల క్రింద, అంజూరపు చెట్ల క్రింద కూర్చోవడానికి ఒకరినొకరు పిలుచుకుంటారు.” ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.

< Sakaria 3 >