< Nnwom 44 >

1 Kora mma “maskil” dwom. Ao Onyankopɔn, yɛde yɛn aso ate; yɛn agyanom aka akyerɛ yɛn; deɛ woyɛeɛ wɔ wɔn berɛ so, wɔ tete mmerɛ no mu.
ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల దైవ ధ్యానం. దేవా, మా పూర్వీకుల రోజుల్లో, మా పితరుల కాలంలో నువ్వు చేసిన పనులన్నిటిని గూర్చి మా పితరులు మాకు చెప్పారు. మేము మా చెవులారా విన్నాం.
2 Wode wo nsa pamoo amanaman no na wobɔɔ yɛn agyanom atenaseɛ; wodwerɛɛ nnipa no na womaa yɛn agyanom dii yie.
నువ్వు నీ చేత్తో వివిధ జాతులను తోసివేశావు. మా ప్రజలను అక్కడ నాటావు. ప్రజలను బాధపెట్టావు. కానీ దేశంలో మా ప్రజలను విస్తరింపజేశావు.
3 Ɛnyɛ wɔn akofena na wɔde nyaa asase no, na ɛnyɛ wɔn nsa na ɛmaa wɔn nkonimdie; ɛyɛ wo nsa nifa, wo basa, ne wʼanim hann, ɛfiri sɛ na wodɔ wɔn.
వాళ్ళు తమ చేతనున్న కత్తితో అక్కడి భూమిని తమ కోసం స్వాధీనం చేసుకోలేదు. వారి భుజబలం వారిని రక్షించలేదు. కానీ నీ కుడి చెయ్యి, నీ భుజబలం, నీ ముఖకాంతి వాళ్ళకి విజయం సాధించిపెట్టాయి. నువ్వు వాళ్ళకు అనుకూలంగా ఉన్నావు.
4 Woyɛ me Ɔhene ne me Onyankopɔn, deɛ ɔhyɛ nkonimdie ma Yakob.
దేవా, నువ్వే నాకు రాజువి. యాకోబుకు విజయం కలగాలని ఆజ్ఞాపించు.
5 Ɛnam wo so na yɛpamoo yɛn Atamfoɔ; wo din mu na yɛtiatia wɔn a wɔkyiri yɛn soɔ.
నీ ద్వారా మేము మా శత్రువులను అణచి వేస్తాం. నీ నామాన్ని బట్టి మేము మాపై లేచే వాళ్ళను తొక్కి వేస్తాం.
6 Meremfa me ho nto mʼagyan so mʼakofena remfa nkonimdie mmrɛ me;
నేను నా విల్లుపై భరోసా ఉంచను. నా కత్తి నన్ను రక్షించలేదు.
7 na wo na woma yɛdi yɛn atamfoɔ so. Wogu wɔn a wɔtane yɛn anim ase.
మా శత్రువుల నుండి మమ్మల్ని కాపాడింది నువ్వే. మమ్మల్ని ద్వేషించే వాళ్ళను సిగ్గుపరిచిందీ నువ్వే.
8 Onyankopɔn mu na yɛhoahoa yɛn ho da mu nyinaa na yɛbɛkamfo wo din no daa daa.
మా దేవునిలోనే మేము రోజంతా గర్విస్తున్నాం. నీ నామానికి శాశ్వతంగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. (సెలా)
9 Nanso seesei woapo yɛn abrɛ yɛn ase; wone yɛn asraafoɔ nnkɔ ɔsa bio.
అయితే ఇప్పుడు నువ్వు మమ్మల్ని తోసివేశావు. మా పైకి అవమానం పంపించావు. మా సైన్యాలతో కలసి నువ్వు బయలుదేరడం లేదు.
10 Woma yɛdwane firii ɛdɔm anim ma yɛn atamfoɔ fom yɛn agyapadeɛ.
౧౦శత్రువుల ఎదుట నిలబడలేక వెనక్కి తిరిగేలా చేస్తున్నావు. మమ్మల్ని ద్వేషించేవాళ్ళు తమ కోసం మమ్మల్ని దోచుకుంటున్నారు.
11 Woyii yɛn maa sɛ wɔnkum yɛn sɛ nnwan na woahwete yɛn wɔ amanaman no mu.
౧౧వాళ్ళ కోసం ఆహారంగా తయారైన గొర్రెల్లాగా మమ్మల్ని చేశావు. అనేక దేశాల్లోకి మమ్మల్ని చెదరగొట్టావు.
12 Wotɔn wo nkurɔfoɔ fofoofo, na woannya mfasoɔ biara amfiri mu.
౧౨అతి తక్కువ వెలకు మమ్మల్ని అమ్మివేశావు. అలా చేయడం మూలంగా నీ సంపద ఏమీ అధికం కాలేదు.
13 Woayɛ yɛn ahohoradeɛ ama yɛn afipamfoɔ, animtiabudeɛ ne aseredeɛ ama wɔn a atwa yɛn ho ahyia.
౧౩మా పొరుగు వాళ్ళ దృష్టిలో మమ్మల్ని నిందకూ ఎగతాళికీ పరిహాసానికీ కారణంగా చేశావు.
14 Woayɛ yɛn akasabɛbuo wɔ aman no mu na nnipa no woso wɔn ti de gu yɛn so.
౧౪మా చుట్టూ ఉన్న దేశాల్లో మమ్మల్ని ఒక అవమానంగా, ప్రజలు తల ఊపి హేళన చేయడానికి కారణంగా చేశావు.
15 Mʼanimguaseɛ di mʼanim daa, na aniwuo akata mʼanim
౧౫పరిహాసం, అవమానం చేసే వాళ్ళ కారణంగా, పగ తీర్చుకునే శత్రువు కారణంగా
16 ɛsiane wɔn a wɔbɔ me ahohora na wɔkasa tia me de yi me ahi, ɛsiane ɔtamfoɔ a nʼani abre sɛ ɔbɛtɔ were no enti.
౧౬ఆ అవమానమే రోజంతా నా ఎదుట ఉంది. నా ముఖంలో కనిపించే అవమానం నన్ను నిలువెల్లా కప్పివేస్తున్నది.
17 Yeinom nyinaa too yɛn deɛ, nanso yɛn werɛ mfirii wo, na yɛmmuu wʼapam no nso so.
౧౭ఇదంతా మాకు జరిగినా మేము మాత్రం నిన్ను మర్చిపోలేదు. నీ నిబంధనను అతిక్రమించలేదు.
18 Yɛn akoma ntwe mfirii wo ho; na yɛn nan nso mmane mfirii wo kwan so.
౧౮మా హృదయం నిన్ను విడిచి వెనక్కి మళ్ళలేదు. మా అడుగులు నీ మార్గాన్ని విడువలేదు.
19 Nanso wodwerɛɛ yɛn yɛɛ yɛn sakraman tuo na wode esum kabii kataa yɛn so.
౧౯కానీ నువ్వు నక్కలు తిరిగే చోట మమ్మల్ని తీవ్రంగా విరగ్గొట్టావు. చావునీడ కింద మమ్మల్ని కప్పి ఉంచావు.
20 Sɛ na yɛn werɛ afiri yɛn Onyankopɔn din anaa sɛ yɛatrɛ yɛn nsam akyerɛ ananafoɔ nyame a
౨౦ఒకవేళ మేము మా దేవుడి నామాన్ని మర్చిపోయి అన్య దేవతల వైపు మా చెయ్యి చాపితే
21 anka Onyankopɔn bɛhunu, ɛfiri sɛ ɔnim akoma mu ahintasɛm.
౨౧హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు ఇది తెలుసుకోకుండా ఉంటాడా?
22 Nanso, wo enti, wɔkum yɛn daa nyinaa; wɔbu yɛn sɛ nnwan a wɔrekɔkum wɔn.
౨౨కచ్చితంగా మేము నీ కోసం రోజంతా వధకు గురౌతున్నాం. వధించడం కోసం ప్రత్యేకించిన గొర్రెల్లాగా ఉన్నాము.
23 Nyane, Ao Awurade! Adɛn enti na wada? Keka wo ho! Nnya yɛn hɔ afebɔɔ.
౨౩ప్రభూ, నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు? నిద్ర మేలుకో, మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టకు.
24 Adɛn enti na wode wʼanim ahinta na wo werɛ firi yɛn ahohia ne nhyɛsoɔ?
౨౪నీ ముఖాన్ని మాకెందుకు చాటు చేసుకుంటున్నావు? మా వేదననూ మాకు కలిగే హింసనూ మర్చిపోయావెందుకు?
25 Wɔabrɛ yɛn ase kɔ dɔteɛ mu na yɛn onipadua aka afam dɔteɛ.
౨౫మా ప్రాణం నేల వరకూ కుంగి పోయింది. మా శరీరం నేలకు కరచుకుని ఉంది.
26 Sɔre bɛboa yɛn; wʼadɔeɛ a ɛnsa da no enti, gye yɛn. Wɔde “Sukooko” sankuo dwomtobea na ɛtoeɛ. Wɔde ma dwomkyerɛfoɔ.
౨౬మాకు సహాయం చేయడానికి లే. నీ నిబంధన కృపను బట్టి మమ్మల్ని విమోచించు.

< Nnwom 44 >