< Nnwom 27 >

1 Dawid dwom. Awurade ne me hann ne me nkwagyeɛ; hwan na mensuro no? Awurade ne me nkwa ahoɔden, na hwan anim na me ho mpopoɔ?
దావీదు కీర్తన. యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ. నేను ఎవరికి భయపడాలి? యెహోవా నా ప్రాణానికి ఆశ్రయం, నేను ఎవరికి బెదరాలి?
2 Sɛ nnipa bɔne toa me pɛ sɛ wɔkum me a, sɛ mʼatamfoɔ to hyɛ me so a wɔbɛsuntisunti ahwehwe ase.
నా శరీరాన్ని మింగడానికి దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నా విరోధులూ శత్రువులూ తొట్రిల్లి కూలిపోతారు.
3 Sɛ dɔm mpo twa me ho hyia a, mʼakoma rentu; mpo sɛ wɔtu me so sa a, ɛno mu koraa na menya awerɛhyɛmu.
నాతో యుద్ధం చెయ్యడానికి శత్రువు శిబిరం వేసుకుని ఉన్నా, నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధం రేగినా నేను ధైర్యంగానే ఉంటాను.
4 Adeɛ baako na mebisa Awurade; na ɛno na mehwehwɛ; sɛ mɛtena Awurade fie me nkwa nna nyinaa, na mahwɛ Awurade ahoɔfɛ na mahwehwɛ no wɔ nʼasɔrefie.
యెహోవాను ఒక్క సంగతి అడిగాను. దాని కోసం చూస్తున్నాను. నేను వెదుకుతున్నాను. యెహోవా సౌందర్యాన్ని చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానం చెయ్యడానికి నా జీవితకాలమంతా నేను యెహోవా ఇంట్లో నివాసం ఉండాలని అడిగాను.
5 Wɔ hia ɛda mu no ɔde me sie nʼatenaeɛ; ɔkora me wɔ Ahyiaeɛ Ntomadan mu. Ɔde me si ɔbotan so wɔ ɔsorosoro.
ఆపద కాలంలో ఆయన తన పర్ణశాలలో నాకు ఆశ్రయం ఇస్తాడు. తన గుడారం చాటున నన్ను కప్పుతాడు. ఉన్నతమైన ఆశ్రయశిల మీద ఆయన నన్ను ఉంచుతాడు.
6 Afei ɔbɛma me tiri so wɔ atamfoɔ a wɔatwa me ho ahyia no so; mede anigyeɛ bɛbɔ afɔdeɛ wɔ nʼAhyiaeɛ Ntomadan mu; na mɛto dwom, ahyehyɛ nnwom ama Awurade.
అప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఉంటుంది. నేను ఆయన గుడారంలో ఆనంద బలులు అర్పిస్తాను. నేను పాడి, యెహోవాకు స్తుతిగానం చేస్తాను.
7 Ao, Awurade, sɛ mesu frɛ wo a, tie me! Hu me mmɔbɔ na gye me so!
యెహోవా, నేను స్వరమెత్తి నిన్ను అడిగినప్పుడు నా మనవి ఆలకించు. నన్ను కరుణించి నాకు జవాబివ్వు.
8 Mʼakoma ka wɔ wo ho sɛ, “Hwehwɛ nʼanim!” Wʼanim, Ao Awurade na mɛhwehwɛ.
ఆయన ముఖాన్ని వెదుకు! అని నీ గురించి నా హృదయం అంటుంది, యెహోవా, నేను నీ ముఖం వెదుకుతాను.
9 Mfa wʼanim nhinta me, mfa abufuo mpamo wo ɔsomfoɔ me ɔboafoɔ ne wo. Mpo me na nnya me, Ao me Nkwagyeɛ Onyankopɔn.
నా నుంచి నీ ముఖం దాచకు. కోపంతో నీ సేవకుణ్ణి దెబ్బ కొట్టకు! నా సహాయకుడిగా నువ్వే ఉన్నావు, రక్షణకర్తవైన నా దేవా, నన్ను విడువకు, నన్ను విడిచి వెళ్ళకు.
10 Mʼagya ne me maame bɛgya me hɔ deɛ, nanso Awurade bɛgye me.
౧౦నా తల్లిదండ్రులు నన్ను విడిచినా, యెహోవా నన్ను చేరదీస్తాడు.
11 Kyerɛ me wʼakwan, Ao Awurade; fa me fa ɛkwan tee so, me nhyɛsofoɔ enti.
౧౧యెహోవా, నీ మార్గం నాకు బోధించు. నా శత్రువుల నిమిత్తం సమతలంగా ఉన్న దారిలో నన్ను నడిపించు.
12 Nnyaa me mma sɛdeɛ mʼatamfoɔ pɛ, adansekurumfoɔ sɔre tia me na wɔpu awurukasɛm.
౧౨శత్రువులకు నా ప్రాణం అప్పగించకు. ఎందుకంటే అబద్ధ సాక్షులు నా మీదకి లేచారు, వాళ్ళు హింస వెళ్లగక్కుతున్నారు!
13 Meda so wɔ saa anidasoɔ yi sɛ: mɛhunu Awurade ayamyɛ wɔ ateasefoɔ asase so.
౧౩సజీవుల దేశంలో నేను యెహోవా దయ పొందుతానన్న నమ్మకం నాకు లేకపోతే నేను నిరీక్షణ కోల్పోయేవాణ్ణి.
14 Twɛn Awurade. Hyɛ wo ho den na ma wo bo nyɛ duru na twɛn Awurade.
౧౪యెహోవా కోసం కనిపెట్టుకుని ఉండు! ధైర్యం తెచ్చుకుని నీ హృదయాన్ని బలంగా ఉంచుకో! యెహోవా కోసం కనిపెట్టుకుని ఉండు!

< Nnwom 27 >