< Nnwom 140 >
1 Dawid dwom. Ao Awurade gye me firi nnipa bɔne nsam; bɔ me ho ban firi basabasayɛfoɔ nsam,
౧ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన యెహోవా, దుష్టుల బారి నుండి నన్ను విడిపించు. దుర్మార్గుల చేతుల్లో పడకుండా నన్ను కాపాడు.
2 wɔn a wɔdwene bɔne wɔ wɔn akoma mu na wɔhwanyane ɔko mu da biara.
౨వాళ్ళు తమ హృదయాల్లో ప్రమాదకరమైన తలంపులు పెట్టుకుంటారు. అన్నివేళలా కలహాలు పుట్టించాలని ఎదురు చూస్తుంటారు.
3 Wɔse wɔn tɛkrɛma ano te sɛ ɔtweaseɛ deɛ; ananka borɔ wɔ wɔn ano.
౩వాళ్ళు పాము నాలుకలాగా తమ నాలుకలు పదును చేసుకుంటారు. వారి పెదాల కింద పాము విషం ఉంచుకుంటారు. (సెలా)
4 Ao Awurade, yi me firi amumuyɛfoɔ nsam; bɔ me ho ban firi basabasayɛfoɔ a wɔdwene sɛ wɔbɛtwintwan mʼanan mu.
౪యెహోవా, దుర్మార్గుల బారిన పడకుండా నన్ను కాపాడు. దౌర్జన్యపరుల చేతిలోనుండి నన్ను రక్షించు. నన్ను పడగొట్టడానికి వాళ్ళు పథకాలు వేస్తున్నారు.
5 Ahantanfoɔ asum me afidie; wɔatrɛtrɛ wɔn asau nhoma mu, wɔasunsum me mfidie wɔ me kwan so.
౫గర్వాంధులు నాకోసం బోను పెట్టారు. వాళ్ళు దారి పక్కన వల పరిచారు. నన్ను బంధించడానికి ఉచ్చులు పన్నారు. (సెలా)
6 Ao Awurade, meka kyerɛ wo sɛ, “Wone me Onyankopɔn.” Ao Awurade, tie me mmɔborɔ su.
౬అయితే నేను యెహోవాతో ఇలా మనవి చేసుకుంటున్నాను, యెహోవా, నా దేవుడివి నువ్వే. నా విన్నపాలు ఆలకించు.
7 Ao Otumfoɔ Awurade, me gyefoɔ ɔhoɔdenfoɔ a wobɔ me tiri ban ɔko da,
౭యెహోవా ప్రభూ, నువ్వే నాకు ఆశ్రయమిచ్చే కోట. యుద్ధ సమయంలో నా తలకు కాపు కాసే వాడివి నువ్వే.
8 nyɛ amumuyɛfoɔ abisadeɛ mma wɔn, Ao Awurade; mma wɔn nhyehyɛeɛ nyɛ yie.
౮యెహోవా, భక్తిహీనుల కోరికలను నేరవేర్చకు. వాళ్ళు మిడిసిపడకుండేలా వాళ్ళ పథకాలు భగ్నం చెయ్యి. (సెలా)
9 Wɔatwa me ho ahyia, nanso, ma amumuyɛsɛm a ɛfiri wɔn anomu nsɛe wɔn.
౯నా చుట్టూ మూగిన వాళ్ళ తల మీదికి వాళ్ళ మాటల ద్వారా కీడు కలుగు గాక.
10 Ma nnyasrama ngu wɔn so; ma wɔnto wɔn ngu ogya mu, ngu atɛkyɛ amena mu a wɔrensɔre bio.
౧౦కణకణలాడే నిప్పులు వాళ్ళపై కురియాలి. వాళ్ళను అగ్నిగుండంలో పడవెయ్యి. ఎన్నటికీ లేవకుండా అగాధంలో పడవెయ్యి.
11 Mma dinsɛefoɔ ntim asase no so; ma amanehunu ntaataa basabasayɛfoɔ.
౧౧దూషకులకు భూమి మీద భద్రత లేకుండా పోవాలి. దుర్మార్గులను ఆపదలు వెంటాడి పడగొట్టాలి.
12 Menim sɛ Awurade bu ahiafoɔ atɛntenenee na ɔka onnibie asɛm ma no.
౧౨బాధితుల తరపున యెహోవా వాదిస్తాడనీ. ఆయన దరిద్రులకు న్యాయం చేకూరుస్తాడని నాకు తెలుసు.
13 Ampa ara, teneneefoɔ bɛkamfo wo din na wɔn a wɔnam tee no bɛtena nkwa mu wɔ wʼanim.
౧౩నీతిపరులు నీ నామానికి కచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. యథార్థవర్తనులు నీ సన్నిధిలో నివసిస్తారు.