< Nnwom 137 >

1 Babilonia nsubɔntene ho, ɛhɔ na yɛtena suiɛ ɛberɛ a yɛkaee Sion no.
మనం బబులోను నదుల దగ్గర కూర్చుని ఏడుస్తూ సీయోనును జ్ఞాపకం చేసుకున్నాం.
2 Ɛhɔ nsukakye nnua so na yɛde yɛn asankuo sensɛneeɛ,
అక్కడ ఉన్న నిరవంజి చెట్ల కొమ్మలకు మన తంతివాయిద్యాలు తగిలించాం.
3 ɛhɔ na yɛn nnommumfafoɔ bisaa yɛn nnwom, yɛn ahohiahiafoɔ pɛɛ yɛn hɔ ahurisie nnwom; wɔkaa sɛ, “Monto Sion nnwom baako mma yɛn!”
మనలను బందీలుగా పట్టుకుని హింసిస్తున్నవాళ్ళు సీయోను కీర్తనల్లో ఒక పాట పాడండి, మేము విని ఆనందిస్తాం అన్నారు.
4 Ɛbɛyɛ dɛn na yɛatumi ato Awurade nnwom ɛberɛ a yɛwɔ ananafoɔ asase so?
మనం అన్యుల దేశంలో ఉంటూ యెహోవా కీర్తనలు ఎలా పాడగలం?
5 Ao Yerusalem, sɛ mewerɛ firi wo a ma me nsa nifa werɛ mfiri sankubɔ.
యెరూషలేమా, నేను నిన్ను మరచిపోతే నా కుడి చెయ్యి తన నైపుణ్యాన్ని కోల్పోతుంది గాక.
6 Sɛ mankae wo sɛ mʼanigyedeɛ kɛseɛ pa ara a, ma me tɛkrɛma nka mfam mʼanomu.
నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకోకపోతే, నాకున్న మహానంద కారణాలకు మించి యెరూషలేమును ప్రాముఖ్యమైనదిగా ఎంచకపోతే నా నాలుక నా అంగిటికి అంటుకుంటుంది గాక.
7 Ao Awurade, kae deɛ Edomfoɔ yɛeɛ wɔ ɛda a Yerusalem hwee ase no. Wɔteam sɛ, “Monnwiri, monnwiri ngu fam nkɔka nʼafapem!”
యెహోవా, ఎదోము ప్రజలు ఏమి చేశారో జ్ఞాపకం చేసుకో. యెరూషలేము పాడైపోయిన రోజులను జ్ఞాపకం చేసుకో. దాన్ని నాశనం చేయండి, సమూలంగా ధ్వంసం చెయ్యండి, అని వాళ్ళు చాటింపు వేశారు గదా.
8 Ao Babilonia babaa a wɔahyɛ sɛ wɔbɛsɛe wo, nhyira nka deɛ ɔtua wo ka wɔ deɛ wode ayɛ yɛn so.
నాశనం అయ్యేందుకు సిద్ధంగా ఉన్న బబులోను కుమారీ, నువ్వు మా పట్ల జరిగించిన దుష్ట క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయబోయేవాడు ధన్యుడు.
9 Nhyira nka deɛ ɔkyekyee wo nkokoaa de wɔn bobɔɔ abotan so.
నీ పసిపిల్లలను పట్టుకుని బండ కేసి కొట్టేవాడు ధన్యుడు.

< Nnwom 137 >