< Nnwom 102 >
1 Aberanteɛ mmɔborɔni mpaeɛbɔ. Ɛberɛ a ne home te no na ɔka nʼahometesɛm kyerɛ Awurade. Ao Awurade tie me mpaeɛbɔ; na ma me mmoa ho sufrɛ nnuru wʼanim.
౧బాధితుడి ప్రార్థన, దుఃఖంలో సోలిపోయి యెహోవా సన్నిధిలో పెట్టిన మొర. యెహోవా, నా ప్రార్థన విను, నా మొర నీకు చేరనివ్వు.
2 Mfa wʼanim nhinta me ɛberɛ a mewɔ ahohiahia mu. Brɛ wʼaso ase ma me; na sɛ mesu mefrɛ wo a, gye me so ntɛm.
౨నా కష్టసమయాన నీ ముఖం నాకు దాచవద్దు. నా మాట విను. నేను నిన్ను పిలిచినప్పుడు వెంటనే నాకు జవాబివ్వు.
3 Me nkwa nna reyera te sɛ wisie; me nnompe hyehye te sɛ egya.
౩పొగ లాగా నా రోజులు గతించిపోతున్నాయి. నా ఎముకలు కాలిపోతున్నట్టు ఉన్నాయి.
4 Mʼakoma aboto na akusa sɛ ɛserɛ; na me kɔn nnɔ aduane.
౪నా గుండె కుంగిపోయింది. నేను వాడిన గడ్డి పరకలాగా ఉన్నాను. నేనేమీ తినలేక పోతున్నాను.
5 Mʼapinisie denden enti maka honam ne nnompe.
౫నేను ఆపకుండా మూలుగుతూ ఉండడం వలన చాలా చిక్కిపోయాను.
6 Mete sɛ ɛserɛ so patuo, te sɛ ɔpatuo a ɔte mmubuiɛ mu.
౬నేను అడవి గూడబాతులాంటి వాణ్ణి. పాడుబడిపోయిన చోట్ల ఉండే గుడ్లగూబలాంటి వాణ్ణి.
7 Meda hɔ a, mʼani gu so; mayɛ sɛ anomaa bi a ɔno nko ara si ɛdan atifi.
౭ఇంటిమీద ఏకాకిగా కూర్చున్న ఒంటరి పిట్టలాగా రాత్రంతా మెలకువగా ఉన్నాను.
8 Ɛda mu nyinaa mʼatamfoɔ bɔ me akutia. Wɔn a wɔdi me ho fɛ no bɔ me din de dome.
౮రోజంతా నా విరోధులు నా మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. నన్ను నిందించేవాళ్ళు నా పేరు ఎత్తి శపిస్తారు.
9 Mede nsõ ayɛ mʼaduane na mede nisuo fra me nsuo mu
౯బూడిదను అన్నం లాగా తింటున్నాను. కన్నీళ్ళతో కలిపి నీళ్ళు తాగుతున్నాను.
10 ɛsiane wʼabufuhyeɛ denden no enti, woama me so, ayi me asi nkyɛn.
౧౦నీ కోపాగ్నిని బట్టి నువ్వు నన్ను పైకెత్తి అవతల పారేశావు.
11 Me nkwa nna te sɛ anwummerɛ sunsum; na mekusa sɛ ɛserɛ.
౧౧నా రోజులు అదృశ్యమయ్యే నీడలా ఉన్నాయి, గడ్డిలాగా నేను వాడిపోయాను.
12 Nanso, wo Awurade, woyɛ ɔhene daa daa; na wo din a ahyeta no te hɔ daa awoɔ ntoatoasoɔ nyinaa mu.
౧౨అయితే యెహోవా, నువ్వు శాశ్వతంగా ఉంటావు. నీ కీర్తి తరతరాలుంటుంది.
13 Wobɛsɔre na woahunu Sion mmɔbɔ; berɛ aduru sɛ wohunu no mmɔbɔ; ɛberɛ a wohyɛeɛ no aso.
౧౩నువ్వు లేచి సీయోనును కనికరిస్తావు. దానిమీద దయ చూపడానికి సరైన సమయం వచ్చింది.
14 Nʼaboɔ som bo ma wʼasomfoɔ; ne mfuturo hyɛ wɔn awerɛhoɔ.
౧౪దాని రాళ్లంటే నీ సేవకులకు ఎంతో ఇష్టం. దాని శిథిలాల దుమ్ము అంటే వారికి వాత్సల్యం.
15 Amanaman no bɛsuro Awurade din; asase so ahemfo nyinaa bɛdi wʼanimuonyam ni.
౧౫యెహోవా, రాజ్యాలు నీ నామాన్ని గౌరవిస్తాయి, ప్రపంచ రాజులంతా నీ గొప్పదనాన్ని గౌరవిస్తారు.
16 Awurade bɛkyekyere Sion bio, na wapue wɔ nʼanimuonyam mu.
౧౬యెహోవా సీయోనును తిరిగి కట్టిస్తాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమవుతాడు.
17 Ɔbɛtie mmɔborɔfoɔ mpaeɛbɔ; na ɔremmu nʼani ngu wɔn sufrɛ so.
౧౭అప్పుడు ఆయన దిక్కులేని వాళ్ళ ప్రార్థనకు స్పందిస్తాడు. వాళ్ళ ప్రార్థన ఆయన నిరాకరించడు.
18 Montwerɛ yei mma nkyirimma, sɛdeɛ ɛbɛyɛ a wɔn a wɔnnya nwoo wɔn bɛkamfo Awurade;
౧౮రాబోయే తరాలకు ఇది రాసి పెట్టి ఉంటుంది, ఇంకా పుట్టని ప్రజలు యెహోవాను స్తుతిస్తారు.
19 “Awurade hwɛɛ fam firi ne kronkronbea wɔ soro hɔ; ɔfiri soro hwɛɛ asase,
౧౯బందీల మూలుగులు వినడానికీ చావు ఖరారైన వాళ్ళను విడిపించడానికీ,
20 sɛdeɛ ɔbɛte nneduafoɔ apinisie na wagyaa wɔn a wɔabu wɔn kumfɔ no.”
౨౦యెహోవా ఉన్నతమైన పవిత్ర స్థలం నుంచి కిందికి చూశాడు, పరలోకం నుంచి భూమిని చూశాడు.
21 Enti, wɔbɛpae mu abɔ Awurade din wɔ Sion na wɔakamfo no wɔ Yerusalem,
౨౧యెహోవాను సేవించడానికి రాజ్యాలూ ప్రజలూ సమకూడినప్పుడు,
22 ɛberɛ a amanaman ne ahennie ahodoɔ bɛhyiam na wɔasom Awurade.
౨౨మనుషులు యెహోవా నామాన్ని సీయోనులో ప్రకటిస్తారు. యెరూషలేములో ఆయన కీర్తిని ప్రకటిస్తారు.
23 Ɔmaa me yɛɛ mmerɛ wɔ ɛberɛ a merenyini. Ɔtwaa me nkwa nna so.
౨౩ఆయన నా యవ్వనంలో నా బలం తీసేశాడు. నా రోజులు తగ్గించేసాడు.
24 Enti mekaa sɛ, “Ao me Onyankopɔn, mfa me nkɔ, wɔ me nkwa nna mfimfini; wo mfeɛ wɔ hɔ daa kɔduru awoɔ ntoatoasoɔ nyinaa mu.
౨౪నేనిలా అన్నాను, నా దేవా, నడివయస్సులో నన్ను తీసి వేయవద్దు. నువ్వు తరతరాలూ ఇక్కడ ఉన్నావు.
25 Ahyɛaseɛ no, wotoo asase fapem, na ɔsoro yɛ wo nsa ano adwuma.
౨౫పురాతన కాలంలో నువ్వు భూమిని స్థాపించావు, ఆకాశాలు నీ చేతిపనులే.
26 Ne nyinaa bɛtwam, na wo deɛ, wobɛtena hɔ daa; wɔbɛtete te sɛ atadeɛ. Wobɛsesa wɔn te sɛ ntoma na wɔbɛto wɔn agu.
౨౬అవి అంతరించిపోతాయి. కానీ నువ్వు నిలిచి ఉంటావు. అవన్నీ బట్టల్లాగా పాతవై పోతాయి. నువ్వు వాటిని దుస్తుల్లాగా మార్చి వేస్తావు. అవి ఇక కనబడవు.
27 Nanso, wote sɛdeɛ woteɛ, na wo mfeɛ to rentwa da.
౨౭అయితే నువ్వు అలానే ఉన్నావు, నీ సంవత్సరాలకు అంతం లేదు.
28 Wʼasomfoɔ mma bɛtena nkwa mu wɔ wʼanim; na wɔn asefoɔ ase bɛtim wɔ wʼanim.”
౨౮నీ సేవకుల పిల్లలు నిలిచి ఉంటారు. వారి వంశస్థులు నీ సన్నిధిలో జీవిస్తారు.