< Mateo 24 >
1 Yesu refiri baabi a asɔredan no si hɔ no, nʼasuafoɔ no baa ne nkyɛn pɛɛ sɛ wɔkyerɛkyerɛ no adan ahodoɔ a ɛwɔ asɔredan no mu.
౧యేసు దేవాలయం నుండి వెళ్తూ ఉండగా, ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడాలను ఆయనకు చూపించారు.
2 Nanso, ɔka kyerɛɛ wɔn sɛ, “Wɔbɛdwiri saa dan yi agu pasaa!”
౨అందుకాయన, “మీరు ఇవన్నీ చూస్తున్నారు గదా. నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఇక్కడ రాయి మీద రాయి ఒక్కటి కూడా నిలిచి ఉండకుండా అన్నీ కూలదోస్తారు” అని వారితో అన్నాడు.
3 Yesu kɔɔ Ngo Bepɔ no so. Ɔte hɔ no, nʼasuafoɔ no baa ne nkyɛn bɛbisaa no sɛ, “Ɛberɛ bɛn na deɛ woreka yi bɛba? Na nsɛnkyerɛnneɛ bɛn na ɛbɛma yɛahunu wo ba a wobɛsane aba bio no ne ewiase awieeɛ a ɛbɛba no?” (aiōn )
౩ఆయన ఒలీవ కొండమీద కూర్చుని ఉండగా శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి, “నువ్వు చెప్పిన విషయాలు ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకూ, లోకాంతానికీ సంకేతాలు మాకు చెప్పు” అని అడిగారు. (aiōn )
4 Yesu ka kyerɛɛ wɔn sɛ, “Monhwɛ na obi annaadaa mo.
౪యేసు వారితో ఇలా అన్నాడు, “ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి.
5 Nnipa bebree de me din bɛba abɛka sɛ, wɔne Agyenkwa no, na wɔadaadaa mo mu pii.
౫చాలామంది నా నామంలో వచ్చి ‘నేనే క్రీస్తుని’ అని చెప్పి అనేకమంది దారి తప్పేలా చేస్తారు.
6 Sɛ mote sɛ akokoakoko resi afanan nyinaa a, ɛnkyerɛ me ba a mɛsane aba no ho nsɛnkyerɛnneɛ. Ɛsɛ sɛ yeinom ba, nanso awieeɛ no deɛ, ɛnnya mmaeɛ.
౬అంతే గాక మీరు యుద్ధాల గురించి వింటారు. వాటి గురించిన వార్తలు వింటారు. అప్పుడు కలవరపడవద్దు. ఇవన్నీ జరిగి తీరవలసిందే గాని అంతం వెంటనే రాదు.
7 Aman bɛsɔre aman so, na ahennie asɔre ahennie so, na ɛkɔm ne asasewosoɔ bɛba mmeammea.
౭జనం మీదికి జనమూ, రాజ్యం మీదికి రాజ్యమూ లేస్తాయి. అక్కడక్కడ కరువులూ భూకంపాలూ వస్తాయి.
8 Yeinom nyinaa bɛyɛ nneɛma a ɛyɛ hu a ɛbɛba no mfitiaseɛ.
౮ఇవన్నీ కష్టాలకు ఆరంభం మాత్రమే.
9 “Sɛ moyɛ me deɛ enti, wɔbɛyɛ mo ayayadeɛ, na wɔakum mo wɔ ewiase afanan nyinaa,
౯“అప్పుడు మనుషులు మిమ్మల్ని హింసలకు గురి చేస్తారు, చంపుతారు. నా నామం కారణంగా మనుషులంతా మిమ్మల్ని ద్వేషిస్తారు.
10 na mo mu pii bɛsane akɔ bɔne mu, na moayiyi mo ho mo ho ama, na moatan mo ho.
౧౦ఆ కాలంలో చాలామంది వెనక్కి జారిపోతారు, ఒకరినొకరు ద్వేషించుకుని ఒకరినొకరు శత్రువులకు పట్టిస్తారు.
11 Atorɔ adiyifoɔ bebree bɛsɔre, na wɔadaadaa mo mu pii.
౧౧అధిక సంఖ్యలో కపట ప్రవక్తలు వచ్చి అనేకమందిని మోసగిస్తారు.
12 Bɔne bɛdɔɔso wɔ ewiase, na abrɛ nnipa dɔ a wɔwɔ no ase.
౧౨అన్యాయం పెరిగిపోయి, దాని ఫలితంగా చాలామందిలో ప్రేమ చల్లారిపోతుంది.
13 Nanso, wɔn a wɔbɛgyina pintinn akɔduru awieeɛ no, wɔbɛgye wɔn nkwa.
౧౩కానీ అంతం వరకూ ఎవరు నిలిచి ఉంటారో వారికే విమోచన లభిస్తుంది.
14 Na wɔbɛka asɛmpa a ɛfa Ahennie no ho no wɔ ewiase afanan nyinaa, na wɔate. Ɛno akyi ansa na awieeɛ no bɛba.
౧౪రాజ్యం గురించిన సువార్త మానవులందరికీ సాక్ష్యంగా లోకమంతటా వినబడుతుంది. ఆ తరువాత అంతం వస్తుంది.
15 “Enti, sɛ mohunu ‘Adeɛ a Ɛyɛ Hu’ a, Odiyifoɔ Daniel kaa ho asɛm sɛ ɛgyina kronkronbea hɔ no a, ma deɛ ɔkenkan no nte aseɛ,
౧౫“కాబట్టి దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా చెప్పిన ‘వినాశకారి అయిన హేయ వస్తువు’ అతి పరిశుద్ధ స్థలంలో నిలవడం మీరు చూడగానే (చదివేవాడు గ్రహిస్తాడు గాక),
16 wɔn a wɔte Yudea no nnwane nkɔ Yuda mmepɔ so.
౧౬యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి.
17 Mma obiara a ɔwɔ ne efie ɛdan atifi no nsiane nkɔfa biribiara mfiri ne efie hɔ.
౧౭మిద్దెలపై ఉన్నవారు కింద ఇంట్లో నుండి దేనినైనా తీసుకుపోవడానికి దిగి రాకూడదు.
18 Wɔn a wɔwɔ mfuom no nso nnsane wɔn akyi mmɛfa wɔn ntoma.
౧౮పొలాల్లో ఉన్నవాడు తన బట్టలు తీసుకోడానికి ఇంటికి వెళ్ళకూడదు.
19 Na wɔn a wɔafa afuro ne wɔn a wɔturu mma saa ɛberɛ no mu no nnue!
౧౯అయ్యో, ఆ రోజులు గర్భవతులకూ చంటిపిల్లల తల్లులకూ కష్టకాలం.
20 Na mommɔ mpaeɛ na ɛberɛ a ɛsɛ sɛ modwane no anyɛ awɔberɛ anaa Homeda.
౨౦అప్పుడు మహా బాధలు కలుగుతాయి. కాబట్టి మీరు పారిపోయే సమయం చలికాలంలో గానీ విశ్రాంతిదినాన గానీ రాకూడదని ప్రార్థన చేసుకోండి.
21 Ɛfiri sɛ, ɔtaa a ɛbɛba no, ebi nsii wɔ ewiase abakɔsɛm mu da, na ebi nso rensi da.
౨౧ఎందుకంటే అంతటి ఉపద్రవం లోకం పుట్టింది మొదలు ఇప్పటివరకూ రాలేదు, ఇక ముందు రాదు.
22 “Nokorɛm, sɛ wɔantwa saa nna no so a, nnipa nyinaa ase bɛtɔre.
౨౨ఆ రోజులను దేవుడు తగ్గించకపోతే శరీరంతో ఉన్న ఏ ఒక్కడూ తప్పించుకోలేడు. అయితే, ఆయన ఎన్నుకున్న వారి నిమిత్తం ఆ రోజులను దేవుడు తక్కువ చేస్తాడు.
23 Sɛ obi ka kyerɛ mo sɛ, ‘Agyenkwa no wɔ ha anaasɛ ɔwɔ nohoa anaa wayi ne ho adi wɔ ha anaa ɛhɔ’ a, monnye nni.
౨౩“ఆ కాలంలో ఎవరైనా, ‘ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు’ అని చెబితే నమ్మవద్దు.
24 Atorɔ Akristofoɔ ne atorɔ adiyifoɔ bɛsɔre, na wɔayɛ anwanwadeɛ ahodoɔ na sɛ ɛbɛtumi a, wɔadaadaa wɔn mpo a Onyankopɔn ayi wɔn no.
౨౪కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వచ్చి, సాధ్యమైతే దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించడానికి గొప్ప సూచక క్రియలూ, అద్భుతాలూ జరిగిస్తారు.
౨౫ఇదిగో, ఇవన్నీ నేను ముందుగానే మీతో చెప్పాను.
26 “Enti, sɛ obi ka kyerɛ mo sɛ, ‘Agyenkwa no asane aba na ɔwɔ ɛserɛ so a,’ monnha mo ho sɛ mobɛkɔ hɔ akɔhwehwɛ no; ‘anaasɛ nso ɔde ne ho asie baabi a,’ monnye nni!
౨౬కాబట్టి ఎవరైనా ‘ఇదిగో, క్రీస్తు అరణ్యంలో ఉన్నాడు’ అని చెప్పినా, ‘ఇదిగో, ఈ గది లోపల ఉన్నాడు’ అని చెప్పినా మీరు నమ్మవద్దు. వారి వెంట వెళ్ళవద్దు.
27 Na sɛdeɛ anyinam pa firi apueeɛ kɔ atɔeɛ no, saa ara na sɛ Onipa Ba no reba a, ɛbɛyɛ ara ne no.
౨౭“మెరుపు తూర్పు వైపున పుట్టి పడమర వైపుకు ఏవిధంగా కనిపిస్తుందో, ఆ విధంగా మనుష్య కుమారుడి రాక కూడా ఉంటుంది.
28 Na deɛ efunu wɔ no, ɛhɔ na apete mpa.
౨౮శవం ఎక్కడ ఉంటే అక్కడ రాబందులు పోగవుతాయి.
29 “Ɔtaa no akyiri pɛ “‘awia bɛduru sum, na ɔsrane renhyerɛn; na nsoromma bɛtete ahwe, na wɔbɛwoso tumi a ɛwɔ ɔsoro no.’
౨౯“ఆ బాధలన్నీ అయిపోగానే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలోని శక్తులు చెల్లాచెదరౌతాయి.
30 “Afei, Onipa Ba no ho nsɛnkyerɛnneɛ bɛda adi, na ɛsoro ne asase sofoɔ nyinaa bɛtwa agyaadwoɔ. Na ewiase amanaman bɛhunu me, sɛ mede tumi ne animuonyam nam ɛsoro omununkum mu reba.
౩౦అప్పుడు మనుష్య కుమారుడి సూచన ఆకాశంలో కనిపిస్తుంది. అప్పుడు మనుష్య కుమారుడు మహా మహిమా ప్రభావాలతో ఆకాశ మేఘాలపై రావడం చూసి, భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజలు గుండెలు బాదుకుంటారు.
31 Na mɛsoma mʼabɔfoɔ a wɔrebɔ totorobɛnto aba, na wɔbɛboaboa wɔn a mayi wɔn no ano firi ɛsoro ano kɔka asase ano.
౩౧ఆయన గొప్ప బూర ధ్వనులతో తన దూతలను పంపుతాడు. వారు ఆకాశం ఆ కొన నుండి ఈ కొన వరకూ నలుదిక్కుల నుండీ ఆయన ఎన్నుకున్న వారిని సమకూర్చుతారు.
32 “Afei, monsua biribi mfiri borɔdɔma dua no ho asɛm no mu. Sɛ ɛyi mman foforɔ, sane yi ahahan foforɔ a, na ɛkyerɛ sɛ asusɔ abɛn.
౩౨“అంజూరు చెట్టు గురించిన ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మలు చిగిరించి లేత కొమ్మలు వేసేటప్పుడు వసంత కాలం దగ్గర పడిందని మీరు తెలుసుకుంటారు.
33 Saa ara nso na sɛ mohunu sɛ saa nneɛma yi nyinaa afiti aseɛ resisi a, mobɛhunu sɛ meba a mɛsane aba no abɛn, aduru apono ano.
౩౩అదే విధంగా ఈ సంగతులన్నీ జరగడం చూసినప్పుడు ఆయన మీకు సమీపంలోనే, ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి.
34 Nokorɛ mese mo sɛ, awontoatoasoɔ yi rentwam, gye sɛ saa nneɛma yi nyinaa aba mu ansa.
౩౪ఇవన్నీ జరిగే వరకూ ఈ జాతి అంతరించదని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను.
35 Ɛsoro ne asase bɛtwam akɔ, na me nsɛm deɛ, ɛbɛtena hɔ daa.
౩౫ఆకాశమూ భూమీ గతించిపోతాయి గాని నా మాటలు ఎన్నటికీ గతించవు.
36 “Nanso, ɛda anaa dɔn ko a awieeɛ no bɛba deɛ, obiara nnim. Ɔsoro abɔfoɔ ne Onyankopɔn Ba no mpo nnim. Agya no nko na ɔnim.
౩౬“అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడో తండ్రికి మాత్రమే తెలుసు గానీ ఏ మనిషికీ తెలియదు. చివరికి పరలోకంలోని దూతలకు, కుమారుడికి కూడా తెలియదు.
37 Onipa Ba no ba a ɔbɛba no bɛyɛ sɛdeɛ Noa berɛ so ɛyɛeɛ no ara pɛ.
౩౭నోవహు రోజుల్లో ఎలా ఉండేదో మనుష్య కుమారుడి రాకడ కూడా అలా ఉంటుంది.
38 Na sɛdeɛ nna a ɛdi nsuyire no anim no, nnipa didiiɛ, na wɔnomeeɛ, warewareeɛ, de kɔsii ɛda a Noa kɔɔ ɛhyɛn no mu,
౩౮జలప్రళయం రాక ముందు నోవహు ఓడలోకి వెళ్ళిన రోజు వరకూ, మనుషులు తింటూ, తాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఇచ్చి పుచ్చుకుంటూ ఉన్నారు.
39 na nnipa annye deɛ ɛbɛba anni, kɔsii sɛ nsuyire bɛfaa wɔn nyinaa kɔeɛ no, saa ara na Onipa Ba no ba a ɔbɛsane aba no bɛyɛ.
౩౯జలప్రళయం వచ్చి వారంతా కొట్టుకునిపోయే వరకూ వారికి తెలియలేదు. ఆ విధంగానే మనుష్య కుమారుడి రాకడ ఉంటుంది.
40 Saa ɛberɛ no, wɔbɛfa mmarima baanu a wɔreyɛ adwuma wɔ afuom no mu baako akɔ, na wɔagya ɔbaako.
౪౦ఆ రోజు, పొలంలో ఇద్దరు పురుషులు ఉంటే, ఒకడు వెళ్ళిపోతాడు, మరొకడు అక్కడే ఉండిపోతాడు.
41 Saa ara nso na mmaa baanu a wɔwɔ efie renoa aduane no nso, wɔbɛfa ɔbaako agya ɔbaako no no.
౪౧ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే, ఒకామె వెళ్ళిపోతుంది, మరొకామె ఉండిపోతుంది.
42 “Enti, monwɛn ɛfiri sɛ, monnim da ko a Awurade bɛba.
౪౨ఏ రోజున మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి.
43 Sɛdeɛ onipa tumi wɛn de bɔ ne ho ban firi akorɔmfoɔ ho no,
౪౩దొంగ ఏ గంటలో వస్తాడో ఇంటి యజమానికి ముందే తెలిస్తే అతడు మేలుకుని ఉండి దొంగతనం చేయనివ్వడు కదా!
44 saa ara na ɛwɔ sɛ mosiesie mo ho, ɛfiri sɛ Onipa Ba no bɛba ɛberɛ a mo ani nna so sɛ ɔbɛba.
౪౪మీరు ఎదురు చూడని గంటలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి.
45 “Hwan ne ɔsomfoɔ nokwafoɔ nyansafoɔ no, deɛ ne wura de ne fidua mu asomfoɔ ahyɛ ne nsa sɛ ɔmma wɔn adwuma wɔ ɛberɛ a ɛsɛ mu?
౪౫“ఒక యజమాని తన ఇంట్లో పనివారికి వేళకు భోజనం పెట్టడానికి నియమించిన నమ్మకమైన, తెలివైన దాసుడు ఎవరు?
46 Nhyira ne ɔsomfoɔ a ne wura no bɛba abɛto no sɛ wayɛ nʼadwuma pɛpɛɛpɛ.
౪౬యజమాని ఇంటికి వచ్చినప్పుడు ఏ దాసుడు ఆ విధంగా చేస్తుండడం గమనిస్తాడో ఆ దాసుడు ధన్యుడు.
47 Nokorɛm, ɔde nʼagyapadeɛ nyinaa bɛhyɛ ne nsa.
౪౭ఆ యజమాని తన యావదాస్తి మీదా ఆ దాసుని నియమిస్తాడని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను.
48 Na sɛ ɔyɛ akoa bɔne, na ɔka kyerɛ ne ho sɛ, ‘Me Wura nnya mmaeɛ,’
౪౮కానీ ఆ దాసుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని ఆలస్యంగా వస్తాడులే’ అని తన మనసులో అనుకుని
49 na ɔhyɛ aseɛ ha ne mfɛfoɔ nkoa, na ɔdidi, boro nsã a,
౪౯తన సాటి సేవకులను కొడుతూ, తాగుబోతులతో కలిసి తింటూ, తాగుతూ ఉంటే,
50 ne Wura no bɛba ɛda a nʼani nna so sɛ ɔbɛba.
౫౦అతడు ఎదురు చూడని రోజున, అనుకోని గంటలో వాని యజమాని వస్తాడు.
51 Ɔbɛtwe nʼaso denden, na ɔde no akɔ baabi a wɔbu nyaatwomfoɔ atɛn; ɛhɔ na wɔtwa agyaadwoɔ na wɔtwɛre wɔn se.
౫౧వాణ్ణి రెండు ముక్కలుగా నరికించి కపట వేషధారులతో బాటు వాడిని శిక్షిస్తాడు. అక్కడ ఏడుపూ పండ్లు కొరకడమూ ఉంటాయి.”