< Luka 1 >
1 Adamfo pa Teofilo, nnipa pii abɔ mmɔden atwerɛ Yesu ho nsɛm a akɔ so wɔ yɛn mu no.
౧ఘనులైన తియొఫిలా,
2 Wɔtwerɛɛ sɛdeɛ nnipa a wɔhunuu saa nneɛma yi firi ahyɛaseɛ no daa no adi kyerɛɛ wɔn.
౨మొదటి నుంచీ కళ్ళారా చూసిన వాక్య సేవకులు మనకు అప్పగించినట్టు మన మధ్య నెరవేరిన కార్యాలను గురించి వివరంగా రాయడానికి చాలా మంది పూనుకున్నారు.
3 Nanso, menyaa adwene bi sɛ, sɛ mehwehwɛ deɛ wɔatwerɛ no nyinaa mu yie na metwerɛ brɛ wo a, ɛyɛ.
౩కాబట్టి నీకు ఉపదేశించిన సంగతులు కచ్చితంగా జరిగాయని నువ్వు తెలుసుకోవాలని వాటిని మొదటి నుండీ పరిశోధించి కూలంకషంగా తెలుసుకున్న నేను నీ కోసం
4 Yei bɛboa wo ma woahunu nokorɛ a ɛwɔ deɛ woasua no nyinaa mu.
౪వాటన్నిటినీ క్రమపద్ధతిలో రాయడం మంచిదని నాకు అనిపించింది.
5 Mede mʼasɛm no bɛfiri Yudafoɔ ɔsɔfoɔ Sakaria a ɔtenaa ase Yudeahene Herode berɛ so a na ɔfiri Abia asɔfokuo mu no so. Sakaria yere Elisabet nso, na ɔyɛ Aaron aseni.
౫యూదా దేశానికి హేరోదు రాజుగా ఉన్న రోజుల్లో అబీయా యాజక శాఖకు చెందిన జెకర్యా అనే యాజకుడు ఉండేవాడు. అతని భార్య అహరోను వంశీకురాలు. ఆమె పేరు ఎలీసబెతు.
6 Na Sakaria ne ne yere Elisabet som Onyankopɔn nokorɛm a wɔn ho nni asɛm wɔ Onyankopɔn anim.
౬వీరిద్దరూ ప్రభువు ఆజ్ఞలు, న్యాయవిధులన్నిటి విషయంలో నిరపరాధులుగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా నడుచుకొనేవారు.
7 Na wɔnni ba, ɛfiri sɛ, na Elisabet yɛ obonini. Na wɔn baanu nyinaa nso anyinyini.
౭అయితే వారికి పిల్లలు లేరు. ఎలీసబెతు గొడ్రాలు. అంతేకాదు, వారిద్దరూ వయసు మళ్ళిన వృద్ధులు.
8 Ɛda bi a ɛduruu Sakaria asɔfokuo so sɛ wɔyɛ asɔredan mu adwuma no,
౮జెకర్యా ఒక రోజు తన శాఖ వారి వంతు వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో యాజకుడుగా సేవ చేస్తూ ఉండగా
9 wɔtoo aba yii no sɛ, ɔnkɔhye aduhwam wɔ ɔhyeɛ afɔrebukyia no so.
౯యాజకులు వారి సంప్రదాయం ప్రకారం చీట్లు వేస్తే ప్రభువు ఆలయం లోపలికి వెళ్ళి ధూపం వేయడానికి అతనికి వంతు వచ్చింది.
10 Saa ɛberɛ yi ara nso na asafo no rebɔ mpaeɛ wɔ adihɔ hɔ sɛdeɛ wɔtaa yɛ no.
౧౦ధూపం వేసే సమయంలో జనమంతా బయట ప్రార్థన చేస్తున్నారు.
11 Sakaria gu so rehye aduhwam no, prɛko pɛ, Awurade ɔbɔfoɔ bɛgyinaa afɔrebukyia no nkyɛn mu wɔ nifa so.
౧౧ప్రభువు దగ్గర నుండి వచ్చిన దేవదూత ధూపవేదిక కుడి వైపున అతనికి కనిపించాడు.
12 Sakaria hunuu no no, ɔbɔɔ birim na ne ho popoeɛ.
౧౨జెకర్యా అతనిని చూసి, కంగారుపడి భయపడ్డాడు.
13 Nanso, ɔsoro ɔbɔfoɔ no ka kyerɛɛ no sɛ, “Sakaria, nsuro, Awurade Onyankopɔn ate wo mpaeɛbɔ. Wo yere Elisabet bɛwo babarima na ɛsɛ sɛ woto ne din Yohane.
౧౩అప్పుడా దూత అతనితో, “జెకర్యా, భయపడకు. నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కొడుకును కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు.
14 Nʼawoɔ bɛma wʼani agye na wo ho asɛpɛ wo. Saa ara na ɛbɛma nnipa bebree nso ani agye.
౧౪అతని మూలంగా నీకు హర్షం, మహదానందం కలుగుతుంది. అతడు పుట్టడం వలన చాలా మంది సంతోషిస్తారు.
15 Ɔbɛyɛ kɛse Awurade anim. Ɔrennom nsã biara da, na Honhom Kronkron bɛyɛ no ma afiri ne maame yam.
౧౫అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు, ద్రాక్షారసం గానీ సారాయి గానీ సేవించడు. తల్లి గర్భాన పుట్టింది మొదలు అతడు దేవుని పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు.
16 Israelfoɔ pii nam nʼasɛnka so bɛnya adwensakyera asane aba Awurade, wɔn Onyankopɔn, nkyɛn.
౧౬ఇశ్రాయేలీయుల్లో అనేకమందిని వారి ప్రభువైన దేవుని వైపుకు మళ్ళిస్తాడు.
17 Ɔbɛnya Odiyifoɔ Elia honhom ahoɔden no bi, na ɔbɛdi Agyenkwa no ba no anim abɛsiesie nnipa ama ne ba a ɔbɛba no. Nʼasɛnka bɛma nteaseɛ aba agyanom ne wɔn mma ntam. Na ɔbɛdane Awurade asɛm no ho asoɔdenfoɔ adwene akɔ Awurade pɛ ho.”
౧౭తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు మళ్ళించి, అవిధేయులు నీతిమంతుల జ్ఞానాన్ని అనుసరించి నడుచుకునేలా చేస్తాడు. తద్వారా ప్రభువు కోసం సిద్ధపాటు కలిగిన ప్రజానీకాన్ని తయారు చేయడానికి అతడు ఏలీయా ఆత్మతో బలప్రభావాలతో ప్రభువుకు ముందుగా వస్తాడు” అన్నాడు.
18 Sakaria buaa ɔbɔfoɔ no sɛ, “Ɛbɛyɛ dɛn na yei aba mu? Mabɔ akɔkoraa na me yere nso abɔ aberewa.”
౧౮దేవదూతతో జెకర్యా, “ఇది నాకు ఎలా తెలుస్తుంది? నేను ముసలివాణ్ణి, నా భార్య కూడా వయసు మళ్ళిన వృద్ధురాలు” అన్నాడు
19 Ɔbɔfoɔ no kaa sɛ, “Mene Gabriel a megyina Onyankopɔn anim daa no. Ɔno na ɔsomaa me sɛ memmɛka asɛmpa yi nkyerɛ wo.
౧౯దూత, “నేను దేవుని సముఖంలో నిలిచే గాబ్రియేలును. నీతో మాట్లాడడానికి, ఈ శుభవార్త నీకు తెలియజేయడానికి దేవుడు నన్ను పంపించాడు.
20 Esiane sɛ woagye akyinnyeɛ enti, wobɛtɔ mumu kɔsi sɛ wɔbɛwo abɔfra no. Na deɛ maka akyerɛ wo yi nyinaa bɛba mu pɛpɛɛpɛ wɔ ne berɛ a ɛsɛ mu.”
౨౦నా మాటలు తగిన కాలంలో నెరవేరతాయి. అయితే నువ్వు వాటిని నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు జరిగే వరకూ నువ్వు మూగవాడివై మౌనంగా ఉంటావు” అని అతనితో అన్నాడు.
21 Saa ɛberɛ yi nyinaa na asafo mma no retwɛn Sakaria sɛ ɔbɛba. Na ɛyɛ wɔn nwanwa sɛ wakyɛ saa.
౨౧ప్రజలు జెకర్యా కోసం ఎదురు చూస్తూ, ఆలయంలో అతడు ఆలస్యం చేస్తున్నాడెందుకో అనుకుంటూ ఉన్నారు.
22 Ɛberɛ a ɔbaeɛ no, wantumi ankasa ankyerɛ asafo mma no. Wɔhunu firii ne nneyɛeɛ mu sɛ wahunu nʼani so adeɛ wɔ asɔredan mu hɔ.
౨౨అతడు బయటికి వచ్చి వారితో మాటలాడలేక పోయాడు. ఆలయంలో అతనికి ఏదో దర్శనం కలిగిందని వారు గ్రహించారు. అతడు వారికి సైగలు చేస్తూ మూగవాడిగా ఉండిపోయాడు.
23 Ɔwiee nʼasɔfodwuma wɔ asɔredan mu hɔ no, ɔkɔɔ efie.
౨౩అతడు సేవ చేసే కాలం పూర్తి అయిన తరవాత ఇంటికి వెళ్ళి పోయాడు.
24 Nna bi akyi no, ne yere Elisabet nyinsɛnee na ɔde ne ho siee abosome enum.
౨౪ఆ రోజులైన తరువాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఆమె ఐదు నెలల పాటు ఇతరుల కంట బడలేదు.
25 Ɔde anigyeɛ kaa sɛ, “Awurade ayɛ me adɔeɛ. Wayi animguaseɛ a ɛkaa me wɔ nnipa anim no afiri me so.”
౨౫ఆమె, “దేవుడు నన్ను కనికరించి మనుషుల్లో నా అవమానాన్ని తొలగించడానికి ఇలా చేశాడు” అనుకుంది.
26 Elisabet nyinsɛnee abosome nsia no, Onyankopɔn somaa ɔbɔfoɔ Gabriel kɔɔ Galilea akuraa bi a wɔfrɛ no Nasaret no ase
౨౬ఎలీసబెతు ఆరవ నెల గర్భవతిగా ఉండగా దేవుడు తన దూత గాబ్రియేలును గలిలయలోని నజరేతు అనే ఊరిలో
27 sɛ, ɔnkɔ ɔbaa kronkron bi a wɔfrɛ no Maria a na wɔde no ama Yosef a ɔfiri Ɔhene Dawid abusua mu no awadeɛ no nkyɛn.
౨౭దావీదు వంశీకుడైన యోసేపు అనే వ్యక్తితో ప్రదానం అయిన కన్య దగ్గరికి పంపించాడు. ఆ కన్య పేరు మరియ.
28 Gabriel hunuu no ara pɛ, ɔka kyerɛɛ no sɛ, “Asomdwoeɛ nka wo! Awurade ka wo ho, wo a Awurade adom wo.”
౨౮ఆ దూత లోపలికి వచ్చి ఆమెతో, “అనుగ్రహం పొందినదానా, నీకు శుభం. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు” అని పలికాడు.
29 Ɔbɔfoɔ no asɛm no maa Maria adwenem yɛɛ no nnaa ma ɔbisaa ne ho sɛ, “Na saa nkyea yi, ase ne sɛn?”
౨౯ఆమె ఆ మాటకు కంగారు పడిపోయి ఈ అభివందనం ఏమిటి అని ఆలోచించుకొంటుండగా,
30 Ɔbɔfoɔ no sane ka kyerɛɛ Maria bio sɛ, “Maria, nsuro, ɛfiri sɛ, Awurade adom wo.
౩౦దూత, “మరియా, భయపడకు. నీకు దేవుని అనుగ్రహం లభించింది.
31 Tie! Ɛrenkyɛre biara wobɛnyinsɛn na woawo ɔbabarima na woato ne din Yesu.
౩౧ఎలాగంటే నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు.
32 Ɔbɛyɛ ɔkɛseɛ, na wɔbɛfrɛ no Ɔsorosoro Onyankopɔn Ba. Na Awurade de ne nana Dawid ahennwa no bɛma no.
౩౨ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని ‘సర్వోన్నతుని కుమారుడు’ అంటారు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు.
33 Na ɔbɛdi Yakob efie so ɔhene daa; na nʼahennie to rentwa da.” (aiōn )
౩౩ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని ఆమెతో చెప్పాడు. (aiōn )
34 Maria bisaa ɔbɔfoɔ no sɛ, “Na ɛbɛyɛ dɛn na mawo wɔ ɛberɛ a ɔbarima nhunuu me da?”
౩౪మరియ, “నేను కన్యను గదా, ఇదెలా జరుగుతుంది?” అంది.
35 Ɔbɔfoɔ no buaa sɛ, “Honhom Kronkron bɛba wo so na Ɔsorosoro Onyankopɔn tumi abɛkata wo so, yei enti abɔfra a wobɛwo no no bɛyɛ kronkron na wɔbɛfrɛ no Onyankopɔn Ba.
౩౫ఆ దూత, “పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది. అందువల్ల పుట్టబోయే పవిత్ర శిశువును దేవుని కుమారుడు అంటారు.
36 Ɛbɛyɛ abosome nsia ni a wo busuani Elisabet mpo a ɔyɛ obonini anyinsɛn ɔbabarima wɔ ne mmerewaberɛ mu.
౩౬పైగా నీ బంధువు ఎలీసబెతు కూడా ముసలితనంలో గర్భవతిగా ఉంది. గొడ్రాలు అనిపించుకున్న ఆమెకు ఇది ఆరవ నెల.
37 Ɛfiri sɛ, Onyankopɔn deɛ, biribiara nso no yɛ.”
౩౭దేవునికి అసాధ్యం ఏమీ లేదు” అని ఆమెతో చెప్పాడు.
38 Maria kaa sɛ, “Me deɛ, meyɛ Awurade afenaa. Deɛ Awurade pɛ na ɛnyɛ.” Ɛno akyi, ɔbɔfoɔ no gyaa no hɔ kɔeɛ.
౩౮అందుకు మరియ, “నేను ప్రభువు పాదదాసిని. నీ మాట ప్రకారం నాకు జరుగుతుంది గాక” అంది. అప్పుడా దూత వెళ్ళిపోయాడు.
39 Nna kakra bi akyi no, Maria kɔɔ Yudea mmepɔ so kuro bi mu.
౩౯ఇది జరిగిన కొద్దికాలానికే మరియ లేచి యూదయ మన్యంలో జెకర్యా ఉండే ఊరికి త్వరగా చేరుకుని ఇంట్లోకి పోయి ఎలీసబెతుకు వందనం చేసింది.
40 Saa kuro no mu na Sakaria te. Ɔduruu kuro no mu hɔ no, ɔkɔɔ Sakaria efie kɔsraa Elisabet. Ɔkyeaa no.
౪౦
41 Elisabet tee Maria nkyea no, ɔba a ɔda ne yam no kekaa ne ho; amonom hɔ ara, Honhom Kronkron hyɛɛ Elisabet ma.
౪౧ఎలీసబెతు ఆ అభివందనం వినగానే, ఆమె గర్భంలో బిడ్డ ఉల్లాసంగా కదిలాడు. అప్పుడు ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండి గొంతెత్తి ఇలా అంది.
42 Elisabet de ahosɛpɛ teaam sɛ, “Maria, wɔahyira wo sene mmaa nyinaa, na wo ba a wobɛwo no no bɛyɛ onipa kɛseɛ.
౪౨“స్త్రీలలో నీవు ధన్యురాలివి. నీ గర్భఫలం దీవెన పొందినది.
43 Animuonyam bɛn na ɛsene yei. Me sɛɛ ne hwan a anka mʼAwurade na bɛba abɛsra me?
౪౩నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకెంత భాగ్యం!
44 Wokyeaa me pɛ, na abɔfra no de anigyeɛ kekaa ne ho.
౪౪నీ అభివందనం నా చెవిని పడగానే నా గర్భంలోని బిడ్డ ఆనందంగా గంతులు వేశాడు.
45 Nhyira nka wo sɛ wogye dii sɛ, deɛ Onyankopɔn aka no, ɔbɛyɛ; ɛno enti na wɔadom wo yi.”
౪౫ప్రభువు ఆమెకు వెల్లడి చేసినది తప్పక జరుగుతుందని నమ్మిన ఆమె ధన్యురాలు” అంది.
46 Maria kaa sɛ, “Me ɔkra kamfo Awurade.
౪౬అప్పుడు మరియ ఇలా అంది, “నా ఆత్మ ప్రభువును కీర్తిస్తున్నది.
47 Na me honhom ani gye mʼagyenkwa Onyankopɔn mu;
౪౭ఆయన తన దాసి దీనస్థితిని చూసి దయ చూపించాడు.
48 ɛfiri sɛ, wahunu nʼafenawa mmɔborɔni mmɔbɔ, na ɛfiri ɛnnɛ, awontoatoasoɔ nyinaa bɛfrɛ me deɛ Onyankopɔn ahyira no.
౪౮నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో హర్షిస్తున్నది. సర్వశక్తిశాలి నాకు గొప్ప మేళ్ళు చేశాడు, కాబట్టి ఇది మొదలు అన్ని తరాలవారూ నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామం పవిత్రం.
49 Ɛfiri sɛ, Ɔkronkronni Otumfoɔ no ayɛ ade kɛseɛ ama me;
౪౯
50 nʼahummɔborɔ firi awoɔ ntoatoasoɔ kɔsi awoɔ ntoatoasoɔ ma wɔn a wɔsuro no na wɔdi no ni no nyinaa.
౫౦ఆయన పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కరుణ కలకాలం ఉంటుంది.
51 Ɔde ne nsa a tumi wɔ mu no abɔ ahomasofoɔ ne ahantanfoɔ ne wɔn nsusuiɛ apete.
౫౧ఆయన తన బాహువుతో ప్రతాపం కనపరిచాడు. గర్విష్ఠులను, వారి అంతరంగంలోని ఆలోచనలను బట్టి చెదరగొట్టాడు.
52 Watu aberempɔn adeɛ so ama ahobrɛasefoɔ so.
౫౨బలవంతులను గద్దెల పైనుంచి పడదోసి దీనులను ఎక్కించాడు
53 Wama wɔn a ahia wɔn no nnepa na wagya ahonyafoɔ kwan nsapan.
౫౩ఆకలితో ఉన్న వారికి మంచి ఆహారం దయచేసి ధనికులను వట్టి చేతులతో పంపివేశాడు.
54 Waboa nʼakoa Israel na ne werɛ amfiri ne mmɔborɔhunu ne ne bɔ
౫౪
55 a ɔhyɛɛ yɛn agya Abraham ne nʼasefoɔ no da.” (aiōn )
౫౫అబ్రాహామునూ అతని సంతానాన్నీ శాశ్వతంగా కరుణతో చూసి, వారిని జ్ఞాపకం చేసుకుంటానని మన పితరులకు మాట ఇచ్చినట్టు, ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాడు.” (aiōn )
56 Maria tenaa Elisabet nkyɛn bɛyɛ abosome mmiɛnsa ansa na ɔresane akɔ ne kurom.
౫౬మరియ దాదాపు మూడు నెలలు ఆమెతో ఉండి, ఆ పైన తన ఇంటికి వెళ్ళిపోయింది.
57 Elisabet awoɔ duruu so no, ɔwoo ɔbabarima.
౫౭ఎలీసబెతు నెలలు నిండి కొడుకుని కన్నది.
58 Nʼafipamfoɔ ne nʼabusuafoɔ tee adɔeɛ a Awurade ayɛ no no, wɔne no nyinaa de anigyeɛ dii ahurisie.
౫౮అప్పుడు ప్రభువు ఆమెపై ఇంత గొప్ప జాలి చూపాడని ఆమె ఇరుగుపొరుగు, బంధువులు విని ఆమెతో కలిసి సంతోషించారు.
59 Ɛduruu nnawɔtwe no, abusuafoɔ ne adɔfoɔ bɛhyiaa sɛ wɔrebɛtwa abɔfra no twetia na wɔato ne din. Wɔpɛɛ sɛ wɔde abɔfra no to nʼagya Sakaria.
౫౯వారు ఎనిమిదవ రోజున ఆ బిడ్డకు సున్నతి చేయడానికి వచ్చి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని నామకరణం చేయబోతుండగా
60 Nanso, ne maame kaa sɛ, “Dabi! Ɛsɛ sɛ wɔfrɛ no Yohane.”
౬౦తల్లి, “అలా కాదు. ఆ బాబుకు యోహాను అని పేరు పెట్టాలి” అంది.
61 Wɔka kyerɛɛ no sɛ, “Obiara nni abusua yi mu a wɔfrɛ no saa.”
౬౧అందుకు వారు, “నీ బంధువుల్లో ఆ పేరుగల వారెవరూ లేరు గదా” అని,
62 Yei maa wɔde wɔn nsa yɛɛ nsɛnkyerɛnneɛ bisaa nʼagya din a wɔmfa nto abɔfra no.
౬౨“వాడికి ఏ పేరు పెట్టాలి?” అని తండ్రిని సైగలతో అడిగారు.
63 Sakaria maa wɔde krataa brɛɛ no na ɔtwerɛɛ so sɛ, “Ne din de Yohane.” Yei yɛɛ wɔn nyinaa nwanwa.
౬౩అతడు పలక తెమ్మని, “బాబు పేరు యోహాను” అని రాశాడు. అందుకు వారంతా ఆశ్చర్యపడ్డారు.
64 Amonom hɔ ara, Sakaria tumi kasaa bio, na ɔhyɛɛ aseɛ yii Onyankopɔn ayɛ.
౬౪వెంటనే అతని నోరు తెరుచుకుంది, నాలుక సడలి, అతడు దేవుణ్ణి స్తుతించ సాగాడు.
65 Wɔn a wɔteeɛ nyinaa ho dwirii wɔn, na saa asɛm yi trɛ faa Yudea mmepɔ so hɔ nyinaa.
౬౫అది చూసి చుట్టుపక్కల కాపురం ఉన్న వారికందరికీ భయమేసింది. ఈ సమాచారం యూదయ మన్యంలో అంతటా చెప్పుకోసాగారు.
66 Obiara a ɔtee saa nsɛm yi bisaa ne ho sɛ, “Ɛdeɛn na abɔfra yi bɛnyini ayɛ daakye? Ɛda adi pefee sɛ Awurade nsa wɔ ne so.”
౬౬జరిగిన సంగతులు విన్న వారంతా ప్రభువు హస్తం అతనికి తోడుగా ఉండటం చూసి, “ఈ బిడ్డ ఎలాటి వాడవుతాడో!” అనుకున్నారు.
67 Honhom hyɛɛ nʼagya Sakaria ma ma ɔhyɛɛ nkɔm sɛ,
౬౭అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండిపోయి ఇలా పలికాడు,
68 “Nhyira nka Awurade, Israel Onyankopɔn, sɛ waba abɛgye ne manfoɔ.
౬౮“ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతి పొందు గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగించాడు.
69 Ɔde Agyenkwa Otumfoɔ a ɔyɛ ne ɔsomfoɔ Dawid aseni rebrɛ yɛn,
౬౯తన సేవకుడైన దావీదు వంశంలోనుంచి మన కోసం శక్తి గల రక్షకుణ్ణి తీసుకువచ్చాడు.
70 sɛdeɛ ɔnam nʼadiyifoɔ kronkron so firi teteete hyɛɛ bɔ (aiōn )
౭౦మన శత్రువులబారి నుండీ మనలను ద్వేషించే వారందరి చేతినుండీ తప్పించి రక్షణ నిచ్చాడు. దీన్ని గురించి ఆయన ఆదినుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చాడు. ఆయన మన పూర్వీకులను కరుణించడానికీ తన పవిత్ర ఒడంబడికను, అంటే మన తండ్రి అయిన అబ్రాహాముకు తాను ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికీ ఈ విధంగా జరిగించాడు. (aiōn )
71 sɛ, ɔbɛma yɛn Agyenkwa a ɔbɛgye yɛn afiri yɛn atamfoɔ ne wɔn a wɔkyiri yɛn no nsam no.
౭౧
72 Na wama bɔ a ɔhyɛɛ yɛn agyanom wɔ nʼahummɔborɔ ho no aba mu na wakae nʼapam kronkron no,
౭౨
73 na wakae nʼapam kronkron a ɔne Abraham pameeɛ no;
౭౩
74 sɛ ɔbɛgye yɛn afiri yɛn atamfoɔ nsam no, na yɛasom no a osuro biara nni mu.
౭౪మనం మన శత్రువుల చేతిలోనుంచి విడుదల పొంది, పరిశుద్ధంగా బతికినన్నాళ్ళు ఆయన సన్నిధానంలో, పవిత్రతతోను న్యాయప్రవర్తనతోను ఉంటూ, భయం లేకుండా ఆయనకు సేవ చేస్తాము అన్నదే, మన పూర్వీకుడైన అబ్రాహాముకు ఆయన చేసిన ప్రమాణం.
75 Na yɛn nkwa nna nyinaa mu, yɛayɛ kronkron ne ateneneefoɔ wɔ nʼanim.
౭౫
76 “Na wo, akɔkoaa yi, wɔbɛfrɛ wo Ɔsorosoroni no Odiyifoɔ, ɛfiri sɛ, wo na wobɛsiesie ɛkwan ama Agyenkwa no,
౭౬ఇకపోతే చిన్నవాడా, నిన్ను అందరూ సర్వోన్నతుని ప్రవక్త అంటారు. మన దేవుని మహా వాత్సల్యాన్ని బట్టి ఆయన తన ప్రజల పాపాలు మన్నించి, వారికి రక్షణ జ్ఞానం అనుగ్రహించేలా, ఆయన మార్గాలను సిద్ధపరచడానికి నీవు ప్రభువుకు ముందుగా వెళ్తావు.
77 na wobɛkyerɛ ne manfoɔ kwan a wɔnam bɔnefakyɛ so nya nkwa a ɛnni awieeɛ;
౭౭
78 na yeinom nyinaa bɛba mu ɛfiri sɛ, Onyankopɔn mmɔborɔhunu a ɛdɔɔso no,
౭౮
79 na ɛbɛma hann a ɛfiri ɔsoro abɛpue yɛn so ahyerɛn wɔn a wɔte sum ne owuo sum mu no so, na akyerɛ yɛn ɛkwan akɔ asomdwoeɛ mu.”
౭౯మన పాదాలను శాంతి మార్గంలో నడిపించేలా చీకటిలోను, చావు నీడలోను కూర్చున్న వారిపై వెలుగు ప్రకాశిస్తుంది. ఆ మహా వాత్సల్యాన్ని బట్టి పై నుండి ఆయన మనపై ఉదయ కాంతి ప్రసరింపజేశాడు.”
80 Abɔfra no nyinii na honhom hyɛɛ no ma; ɔtenaa ɛserɛ so kɔsii ɛberɛ a ɔfirii nʼasɛnka adwuma ase.
౮౦ఆ బాలుడు ఎదిగి, ఆత్మలో బలం పుంజుకుంటూ, ఇశ్రాయేలు ప్రజానీకం ఎదుటికి వచ్చేదాకా అరణ్యంలో నివసించాడు.