< 3 Mose 3 >
1 “‘Sɛ obiara pɛ sɛ ɔbɔ asomdwoeɛ afɔdeɛ ma Awurade a, ɔtumi de nantwinini anaa nantwibereɛ bɔ, nanso ɛsɛ sɛ aboa no yɛ deɛ ne ho nni dɛm biara.
౧“ఎవరైనా ఒక మంద లోని పశువుల్లో నుండి ఒక మగదాన్ని గానీ ఆడదాన్ని గానీ శాంతిబలిగా అర్పించాలనుకుంటే, అతడు లోపం లేని దాన్ని యెహోవా సన్నిధిలో అర్పించాలి.
2 Onipa a ɔde aboa no aba no de ne nsa bɛgu aboa no apampam na wakum no wɔ Ahyiaeɛ Ntomadan no ano. Na Aaron mmammarima no apete aboa no mogya agu afɔrebukyia no ho,
౨అతడు తాను అర్పించబోయే పశువు తలపై తన చేతిని ఉంచాలి. తరువాత ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర దాన్ని వధించాలి. అప్పుడు యాజకులైన అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు.
3 na wɔahye aboa no ayamdeɛ ne ɛho sradeɛ nyinaa
౩అతడు ఆ పశువు లోపలి భాగాలకు అంటి ఉన్న కొవ్వునూ, మూత్రపిండాలనూ, వాటిపైన కొవ్వునూ, మూత్రపిండాల దగ్గర కాలేయాన్ని అంటి ఉన్న కొవ్వునూ వేరు చేయాలి.
4 ne ne sawa mmienu no ne ne sisia ne ne sawa kotokuo wɔ Awurade anim.
౪వాటిని యెహోవాకు శాంతి బలి అర్పణగా దహించాలి.
5 Na ɛbɛsɔ Awurade ani yie.
౫అహరోను కొడుకులు వాటిని బలిపీఠం మీద నిప్పులపై పేర్చిన కట్టెల పైన ఉన్న దహనబలి తో పాటు దహిస్తారు. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది. అది అగ్నితో చేసిన అర్పణగా ఉంటుంది.
6 “‘Sɛ abirekyie anaa odwan na mode bɛbɔ asomdwoeɛ afɔdeɛ ama Awurade a, ɛnsɛ sɛ ɛdɛm biara ba ne ho na ɛsɛ sɛ ɔyɛ onini anaa ɔbereɛ.
౬ఎవరైనా ఒక గొర్రెల లేక మేకల మందలో నుండి ఒక మగదాన్ని గానీ ఆడదాన్ని గానీ శాంతిబలిగా యెహోవాకు అర్పించదలిస్తే, అతడు లోపం లేని దాన్ని అర్పించాలి.
7 Sɛ mode odwan ba sɛ mo akyɛdeɛ a,
౭తన అర్పణ కోసం గొర్రె పిల్లని అర్పించాలనుకుంటే దాన్ని యెహోవా సన్నిధికి తీసుకుని రావాలి.
8 momfa mo nsa ngu nʼapampam na monkum no wɔ Ahyiaeɛ Ntomadan no kwan ano. Afei, Aaron mmammarima no bɛpete mogya no agu afɔrebukyia no ho nyinaa.
౮తాను అర్పించబోయే దాని తల మీద అతడు తన చేతినుంచాలి. తరువాత దాన్ని ప్రత్యక్ష గుడారం ఎదుట వధించాలి. అప్పుడు అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు.
9 Saa asomdwoeɛ afɔrebɔdeɛ yi, fa bi na wɔmfa mma Awurade sɛ ɔhyeɛ afɔrebɔdeɛ a ne dua ne mu nneɛma ne ɛho sradeɛ, sradeɛ a ɛwɔ ne yam adeɛ nyinaa ho,
౯ఆ వ్యక్తి శాంతిబలి అర్పణను దహనబలి అర్పణగా యెహోవాకు అర్పిస్తాడు. ఆ బలి పశువు కొవ్వునూ, వెన్నెముక చివర వరకూ ఉండే కొవ్వు పట్టిన తోకనంతా, దాని అంతర్భాగాలకి పట్టి ఉన్న కొవ్వునూ, వాటి దగ్గరలో కనిపించే కొవ్వునూ తీసి వేరు చేయాలి.
10 ne sawa mmienu ne ɛho sradeɛ a ɛbɛn ne sisia ne ne berɛboɔ a wɔbɛyi ɛno ne ne sawa no ka ho.
౧౦అలాగే రెండు మూత్ర పిండాలనూ, వాటితో ఉన్న కొవ్వునూ, మూత్రపిండాల దగ్గర కాలేయాన్ని అంటి ఉన్న కొవ్వునూ కూడా వేరు చేయాలి.
11 Ɔsɔfoɔ no bɛhye no wɔ afɔrebukyia no so sɛ aduane a ɛyɛ ɔhyeɛ afɔdeɛ ama Awurade.
౧౧వీటన్నిటినీ యాజకుడు బలిపీఠం పైన ఆహారంగా కాలుస్తాడు. ఇది యెహోవాకి అర్పించే దహనబలి.
12 “‘Sɛ obi de abirekyie brɛ Awurade sɛ nʼafɔrebɔdeɛ a,
౧౨అతడు అర్పించేది మేక అయితే దాన్ని యెహోవా ఎదుట అర్పించాలి.
13 fa wo nsa gu aboa no apampam naku no wɔ Ahyiaeɛ Ntomadan no kwan ano. Aaron mmammarima de aboa no mogya bɛpete afɔrebukyia no ho nyinaa.
౧౩ఆ వ్యక్తి దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారం ఎదుట దాన్ని వధించాలి. అప్పుడు అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు.
14 Ɛsɛ sɛ wɔhye saa afɔrebɔdeɛ yi fa bi ma Awurade. Saa afɔrebɔdeɛ fa no yɛ aboa no yam sradeɛ,
౧౪తన అర్పణను దహనబలిగా యెహోవాకు అర్పిస్తాడు. అతడు దాని అంతర్భాగాలకు పట్టి ఉన్న కొవ్వునూ, వాటి దగ్గరలో కనిపించే కొవ్వునూ తీసి వేరు చేయాలి.
15 ne sawa mmienu ne ɛho sradeɛ a ɛbɛn nʼasene mu ne ne berɛboɔ a wɔbɛyi aka ne sawa no ho.
౧౫అలాగే రెండు మూత్ర పిండాలనూ, వాటితో ఉన్న కొవ్వును, మూత్రపిండాల దగ్గర కాలేయాన్ని అంటి ఉన్న కొవ్వును కూడా వేరు చేయాలి.
16 Ɔsɔfoɔ no bɛhye wɔ afɔrebukyia no so sɛ ɔhyeɛ afɔdeɛ. Awurade ani bɛsɔ saa ɔhyeɛ afɔdeɛ no. Kae sɛ sradeɛ no nyinaa yɛ Awurade dea.
౧౬వీటన్నిటినీ యాజకుడు కమ్మని సువాసన వచ్చేలా బలిపీఠం పైన ఆహారంగా కాలుస్తాడు. కొవ్వు అంతా యెహోవాకే చెందుతుంది.
17 “‘Yei ne mmara a monni so daa nyinaa wɔ asase yi so baabiara. Monnni sradeɛ anaa mogya.’”
౧౭మీరు రక్తాన్ని గానీ కొవ్వుని గానీ తినకూడదు. మీరు నివాసముండే ప్రతిచోటా, మీ తరతరాల్లో ఇది మీకు శాశ్వతమైన శాసనం.”