< Kwadwom 4 >
1 Sɛdeɛ sikakɔkɔɔ a anka ɛhyerɛn no nie? Sikakɔkɔɔ amapa no ho abiri! Wɔatoto aboɔdemmoɔ kronkron apete wɔ mmɔntene biara so.
౧బంగారం ఎలా మెరుగు మాసింది! మేలిమి బంగారం ఎలా మాసిపోయింది! ప్రతి వీధి మొదట్లో ప్రతిష్టితమైన రాళ్లు చెల్లాచెదరుగా పారేసి ఉన్నాయి.
2 Hwɛ sɛdeɛ Sion mmammarima a wɔdi mu na anka wɔsom bo sɛ sika kɔkɔɔ no ayɛ, seesei wɔfa wɔn sɛ dɔteɛ nkukuo, ɔnwomfoɔ nsa ano adwuma!
౨సీయోను కుమారులు శ్రేష్ఠులు. వాళ్ళు మేలిమి బంగారం కంటే విలువైన వాళ్ళు. అయితే వాళ్ళు ఇప్పుడు కుమ్మరి చేసిన మట్టికుండల్లాగా అందరూ వారిని చూస్తున్నారు.
3 Mpo sakraman yi wɔn nufoɔ ma wɔn mma enum, nanso me nkurɔfoɔ ayɛ atirimuɔdenfoɔ sɛ sohori a ɔwɔ ɛserɛ so.
౩నక్కలైనా చన్నిచ్చి తమ పిల్లలకు పాలు ఇస్తాయి. కాని నా ప్రజల కుమారి ఎడారిలోని నిప్పు కోడి అంత క్రూరంగా ఉంది.
4 Osukɔm enti, akokoaa tɛkrɛma fam ne dodo mu; mmɔfra no su pɛ aduane, nanso obiara mfa mma wɔn.
౪దప్పిక వల్ల పాలు తాగే పిల్ల నాలుక దాని అంగిటికి అంటుకుంటూ ఉంది. పిల్లలు అన్నం అడుగుతారు, కాని వాళ్ళు తినడానికి ఏమీ లేదు.
5 Wɔn a na anka wɔdi nnuane pa no ohia buruburo aka wɔn wɔ mmɔntene so. Wɔn a wɔde serekye tetee wɔn no seesei wɔdeda nso nkɔfie so.
౫ఒకప్పుడు రుచికరమైన భోజనం తిన్నవాళ్ళు ఇప్పుడు దిక్కు లేకుండా వీధుల్లో ఆకలితో ఉన్నారు. ఒకప్పుడు ఊదారంగు వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఇప్పుడు చెత్తకుప్పలను ఆశ్రయించారు.
6 Me nkurɔfoɔ asotwe so sene Sodom a wɔtuu wɔn mpofirim no deɛ, a wɔannya ɔboafoɔ biara no.
౬నా ప్రజల కుమారి చేసిన పాపం సొదొమ పాపం కంటే ఎక్కువ. ఎవరూ దాని మీద చెయ్యి వెయ్యకుండానే అకస్మాత్తుగా అది పడిపోయింది.
7 Na wɔn ahenemma ho twa sene sukyerɛmma, na wɔhoa sene nufosuo, na wɔn onipadua no bere na ɛwɔ ahoɔden te sɛ abohemaa, na wɔte sɛ aboɔdemmoɔ.
౭సీయోను నాయకులు మంచులా మెరిసే వాళ్ళు. పాలవలే తెల్లని వాళ్ళు. వాళ్ళ శరీరాలు పగడం కంటే ఎర్రనివి. వాళ్ళ దేహకాంతి నీలం లాంటిది.
8 Nanso, seesei deɛ, wɔbiri sene wisiapunu; na wɔnhunu wɔn yie wɔ mmɔntene so. Wɔn wedeɛ atwintwam wɔ wɔn nnompe so; ɛho awo wesee sɛ abaa.
౮కానీ ఇప్పుడు చీకటి వారి ముఖాలను నల్లగా చేసేసింది. వాళ్ళు వీధుల్లో గుర్తు పట్టలేనట్టుగా ఉన్నారు. వాళ్ళ చర్మం వాళ్ళ ఎముకలకు అంటుకు పోయింది. అది ఎండిపోయిన చెక్కలా అయ్యింది!
9 Wɔn a wɔtotɔ wɔ akofena ano no yɛ koraa sene wɔn a ɛkɔm kunkumm wɔn; ɛkɔm tware wɔn, ma wɔwuwu ɛsiane aduane a ɛnni mfuo so enti.
౯కత్తిపోటుతో హతమైన వాళ్ళ పరిస్థితి పొలంలో పంటలేక క్షీణించి కరువుతో హతమైన వాళ్ళ పరిస్థితికన్నా మెరుగు.
10 Mmaa a wɔwɔ ayamhyehyeɛ de wɔn nsa anoa wɔn ankasa mma, ayɛ wɔn aduane ɛberɛ a wɔsɛee me nkurɔfoɔ no.
౧౦కరుణ గల స్త్రీల చేతులు తాము కన్న తమ సొంత పిల్లలను వండుకున్నాయి. నా ప్రజల కుమారికి వచ్చిన నాశన కాలంలో వాళ్ళ పిల్లలు వాళ్లకు ఆహారం అయ్యారు.
11 Awurade ada nʼabufuhyeɛ nyinaa adi; wahwie nʼabufuo a ano yɛ den no. Ɔsɔɔ ogya ano wɔ Sion ma ɛhyee ne fapem.
౧౧యెహోవా తన కోపం తీర్చుకున్నాడు. తన కోపాగ్ని కుమ్మరించాడు. ఆయన సీయోనులో అగ్ని రాజేశాడు. అది దాని పునాదులను కాల్చేసింది.
12 Asase so ahemfo annye anni, ewiase mu nnipa nso annye anni sɛ atamfoɔ bɛtumi ahyɛne Yerusalem apono mu.
౧౨భూరాజులు గాని, ప్రపంచ నివాసులు గాని, ఒక శత్రువు యెరూషలేము గుమ్మాల్లోకి ప్రవేశించగలడని ఎవరూ అనుకోలేదు.
13 Nanso ɛsiiɛ, nʼadiyifoɔ no bɔne ne nʼasɔfoɔ amumuyɛ enti, wɔn na wɔhwiee teneneefoɔ mogya guu wɔ kuropɔn no mu.
౧౩దానిలో నీతిమంతుల రక్తం చిందడానికి కారణం అయిన దాని యాజకుల పాపం వల్ల, దాని ప్రవక్తల పాపం వల్ల శత్రువు ప్రవేశించాడు.
14 Afei wɔkeka wɔ mmɔntene so te sɛ nnipa a wɔn ani afira. Mogya a ama wɔn ho agu fi no enti obiara suro sɛ ɔde ne ho bɛka wɔn ntadeɛ.
౧౪ఇప్పుడు వాళ్ళు గుడ్డివాళ్ళలా వీధుల్లో తిరుగుతున్నారు. వాళ్ళు రక్తం అంటిన అపవిత్రులు. అందుకే ఎవరూ వాళ్ళ వస్త్రాలైనా ముట్టలేక పోతున్నారు.
15 Nnipa teateaam gu wɔn so sɛ, “Momfiri ha nkɔ! Mo ho nnte! Monkɔ, monkɔ! Mommfa mo ho nka yɛn.” Sɛ wɔdwane kɔnenam a amanaman no mu nnipa ka sɛ, “Wɔrentumi ntena ha bio.”
౧౫ప్రజలు కేకపెడుతూ “పొండి! శుద్ధి లేని వాళ్ళలారా పొండి! నన్ను ముట్టుకోవద్దు” అన్నారు. వాళ్ళు పారిపోయి తిరుగులాడుతూ ఉన్నప్పుడు అన్యప్రజలు వాళ్ళతో, “విదేశీయులు ఇంక ఇక్కడ ఉండకూడదు” అంటున్నారు.
16 Awurade ankasa abɔ wɔn ahwete; nʼani nni wɔn so bio. Wɔmmfa anidie mma asɔfoɔ, na wɔn ani nnsɔ mpanimfoɔ.
౧౬యెహోవా తన సన్నిధిలోనుంచి వాళ్ళను చెదరగొట్టాడు. ఇంక ఆయన వాళ్ళను పట్టించుకోడు. ఇంక యాజకులపట్ల ఎవరూ గౌరవం చూపించరు. పెద్దల పట్ల ఎవరూ దయ చూపించరు.
17 Deɛ ɛka ho bio, yɛn ani anni ammoa yɛn, yɛpɛɛ sɛ yɛbɛnya mmoa, nanso ɛyɛɛ ɔkwa; yɛfiri yɛn abantenten so de yɛn ani too ɔman a wɔrentumi nnye yɛn so.
౧౭దొరకని సహాయం కోసం కనిపెట్టినా మా కళ్ళకు ఏదీ కనబడలేదు. రక్షించలేని ప్రజల కోసం మా కళ్ళు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి.
18 Nnipa dii yɛn ntɛntɛ wɔ yɛn anammɔntuo mu, enti yɛantumi annante yɛn mmɔntene so. Yɛn awieeɛ bɛneeɛ, na wɔkanee yɛn nna, ɛfiri sɛ na yɛn awieeɛ aduru so.
౧౮మా వీధుల్లో మేము నడవకుండా మా విరోధులు మా జాడ పసిగట్టి మమ్మలి వెంటాడారు. మా చివరి దశ దగ్గర పడింది. మా రోజులు ముగిసిపోయాయి. మా అంతం వచ్చేసింది.
19 Yɛn ataafoɔ ho yɛ hare sene akɔdeɛ a wɔwɔ ewiem; wɔtaa yɛn faa mmepɔ so na wɔtɛɛ yɛn wɔ ɛserɛ so.
౧౯మమ్మల్ని తరిమే వాళ్ళు ఆకాశంలో ఎగిరే గద్దలకన్నా వేగం గల వాళ్ళు. పర్వతాల్లోకి వాళ్ళు మమ్మల్ని తరిమారు. అరణ్యంలో మా కోసం కాచుకుని ఉన్నారు.
20 Deɛ Awurade asra no ngo, yɛn ankasa yɛn nkwa no, ɔtɔɔ wɔn mfidie mu. Yɛgye dii sɛ ne nwunu ase yɛbɛnya nkwa wɔ amanaman no mu.
౨౦మా నాసికారంధ్రాల ఊపిరి, యెహోవా చేత అభిషేకం పొందిన మా రాజు, వాళ్ళు తవ్విన గుంటల్లో పడి దొరికిపోయాడు.
21 Di ahurisie na ma wʼani nnye, Ao Edom Ɔbabaa, wo a wote Us asase so. Wɔde kuruwa no bɛma wo nso bi; wobɛboro na wɔabɔ wo adagya.
౨౧“అతని నీడ కింద అన్యప్రజల మధ్య బతుకుదాం” అని మేము ఎవరి గురించి అనుకున్నామో వాడు శత్రువుల చేజిక్కాడు. ఊజు దేశంలో నివాసం ఉన్న ఎదోము కుమారీ, సంతోషించు, ఉల్లాసంగా ఉండు. ఈ గిన్నెలోది తాగే వంతు నీకూ వస్తుంది. నువ్వు దానిలోది తాగి మత్తుగా ఉండి నిన్ను నువ్వు నగ్నంగా చేసుకుంటావు.
22 Ao Ɔbabaa Sion, wʼasotwe bɛba awieeɛ; ɔremma wonkɔ so ntena nnommumfa mu. Nanso, Ao Ɔbabaa Edom, ɔbɛtua wo bɔne so ka na wada wʼamumuyɛ adi.
౨౨సీయోను కుమారీ, నీ శిక్ష ముగిసింది. ఇంక ఎన్నడూ ఆయన నిన్ను బందీగా చెరలోకి తీసుకు పోడు. ఎదోము కుమారీ, నీ పాపానికి ఆయన శిక్ష వేస్తాడు. నీ పాపాలను ఆయన బయట పెడతాడు.