< Atemmufoɔ 7 >
1 Anɔpahema, Yerubaal (a ɔne Gideon) ne nʼakodɔm kɔɔ ara kɔsii Harod nsuo ho. Midian akodɔm nso bɔɔ dɔmpem wɔ atifi fam wɔ bɔnhwa bi a ɛbɛn More bepɔ no.
౧యెరుబ్బయలు, (అంటే గిద్యోను) అతనితో ఉన్నవారంతా తెల్లవారే లేచి హరోదు బావి దగ్గరికి వచ్చినప్పుడు లోయలో ఉన్న మోరె కొండకు ఉత్తరంగా మిద్యానీయుల శిబిరం కనబడింది.
2 Awurade ka kyerɛɛ Gideon sɛ, “Akofoɔ a wɔka wo ho no dɔɔso dodo. Sɛ mema mo nyinaa ko tia Midianfoɔ a, Israelfoɔ no bɛhoahoa wɔn ho akyerɛ me sɛ wɔn ara nam wɔn ahoɔden so na wɔgyee wɔn ho sii hɔ.
౨యెహోవా గిద్యోనుతో “నీతో ఉన్నవారు ఎక్కువ మంది. నేను వాళ్ల చేతికి మిద్యానీయులను అప్పగించడం తగదు. ఇశ్రాయేలీయులు, ‘నా కండబలమే నాకు రక్షణ కలుగజేసింది’ అనుకుని తమను తామే గొప్ప చేసుకోవచ్చు.
3 Ɛno enti, ka kyerɛ nnipa no sɛ, ‘Obiara a ɔyɛ tebɔɔ anaa ɔsuro no, ɔnyi ne ho mfiri mu na ɔnkɔ efie.’” Wɔn mu ɔpeduonu mmienu na wɔkɔɔ fie, ɛnna ɛkaa wɔn mu ɔpedu a wɔpɛɛ sɛ wɔbɛko.
౩కాబట్టి నువ్వు, ‘భయపడి, వణుకుతున్న వాడెవడైనా ఉంటే తొందరగా గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్లిపోవాలి’ అని ప్రజలందరూ వినేలా ప్రకటించు” అని చెప్పాడు. అప్పుడు ప్రజల్లోనుంచి ఇరవై రెండు వేలమంది తిరిగి వెళ్లిపోయారు.
4 Nanso, Awurade ka kyerɛɛ Gideon sɛ, “Wɔdɔɔso ara. Fa wɔn bra asuo no ho na mɛsa wɔn mu ayi wɔn a wo ne wɔn bɛkɔ ne wɔn a wɔne wo renkɔ.”
౪ఇంకా అక్కడ పదివేలమంది ఉన్నారు. యెహోవా “ఈ ప్రజలు ఇంకా ఎక్కువమందే. నీళ్ల దగ్గరికి వాళ్లను దిగేలా చెయ్యి. అక్కడ నీ కోసం వాళ్ల సంఖ్య తగ్గిస్తాను. ‘ఇతను నీతో కలిసి వెళ్ళాలి’ అని ఎవరి గురించి చెబుతానో అతడు నీతో కలిసి వెళ్ళాలి. ‘ఇతడు నీతో కలిసి వెళ్లకూడదు’ అని ఎవరి గురించి చెప్తానో అతడు వెళ్ళకూడదు” అని గిద్యోనుతో చెప్పాడు.
5 Ɛberɛ a Gideon de nʼakofoɔ no kɔɔ nsuo no ho no, Awurade ka kyerɛɛ no sɛ, “Kyɛ nnipa no mu akuo mmienu. Fa nnipa a wɔbɔ nsuo gu wɔn nsam na wɔde wɔn tɛkrɛma tafere no sɛ nkraman no kɔ ekuo baako mu. Ekuo a ɛtɔ so mmienu no nso, fa wɔn a wɔbu nkotodwe de wɔn ano nom nsuo wɔ asuwa mu no hyɛ mu.”
౫అతడు నీళ్ల దగ్గరికి ఆ ప్రజలను దిగేలా చేసినప్పుడు యెహోవా “కుక్క తాగినట్టు తన నాలుకతో నీళ్ళు తాగిన వాణ్ణి, నీళ్ళు తాగడానికి మోకాళ్ళు వంచిన వాణ్ణి, వేరువేరుగా ఉంచు” అని గిద్యోనుతో చెప్పాడు.
6 Mmarima no mu ahasa pɛ na na wɔnom nsuo firi wɔn nsa mu. Wɔn a aka no nyinaa nso, na wɔbu nkotodwe de wɔn ano nom nsuo firi asuwa no mu.
౬చేత్తో నోటికందించుకుని నీళ్ళు తాగినవాళ్ళు మూడు వందల మంది. మిగిలిన వాళ్ళందరు నీళ్లు తాగడానికి మోకాళ్ళు వంచినవాళ్ళే.
7 Awurade ka kyerɛɛ Gideon sɛ, “Menam saa mmarima ahasa yi so bɛgye mo, na mama moadi Midianfoɔ no so nkonim. Ma wɔn a aka no nyinaa nkɔ fie.”
౭అప్పుడు యెహోవా “చేత్తో నోటికందించుకుని నీళ్ళు తాగిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షిస్తాను. మిద్యానీయుల మీద జయం ఇస్తాను. తక్కిన ప్రజలందరూ తమ తమ ప్రాంతాలకు వెళ్ళొచ్చు” అని గిద్యోనుతో చెప్పాడు.
8 Enti, Gideon gyegyee wɔn akwansoduane ne ntotorobɛnto firii akofoɔ no nkyɛn ma wɔkɔɔ fie. Ɛnna ɔmaa mmarima ahasa no kaa ne nkyɛn. Na Midianfoɔ no atenaeɛ wɔ bɔnhwa a ɛwɔ Gideon ase pɛɛ.
౮ఎంపిక చేసిన ప్రజలు వెళ్లిపోయినవారి ఆహారం, బూరలు తీసుకున్నారు. యెహోషువా ప్రజలందరినీ వాళ్ళ గుడారాలకు పంపివేశాడు. కాని ఆ మూడువందల మందిని అక్కడే ఉంచుకున్నాడు. మిద్యానీయుల శిబిరం అతనికి దిగువ భాగంలో లోయలో ఉంది.
9 Anadwo no, Awurade kaa sɛ, “Sɔre! Kɔ Midianfoɔ no atenaeɛ no mu wɔ aseɛ hɔ, na mɛma mo adi wɔn so nkonim!
౯ఆ రాత్రి యెహోవా అతనితో ఇలా అన్నాడు “నువ్వు లేచి ఆ శిబిరం మీదికి వెళ్ళు. దాని మీద నీకు జయం ఇస్తాను.
10 Na sɛ wosuro sɛ wobɛkoto ahyɛ wɔn so a, wo ne wo ɔsomfoɔ Pura nkɔ hɔ.
౧౦వెళ్ళడానికి నీకు భయమైతే నీ పనివాడు పూరాతో కలిసి ఆ శిబిరం దగ్గరికి దిగి వెళ్ళు.
11 Tie deɛ Midianfoɔ no reka na ɛbɛhyɛ wo nkuran. Na wo ho bɛpere wo ama woato ahyɛ wɔn so.” Enti, Gideon faa Pura kaa ne ho ne no kɔɔ atamfoɔ no atenaeɛ no mfikyire.
౧౧ఆ శిబిరంలో ఉన్నవాళ్ళు చెప్పుకుంటున్న దాన్ని వినిన తరువాత నువ్వు ఆ శిబిరంలోకి దిగి వెళ్ళడానికి నీకు ధైర్యం వస్తుంది” అని చెప్పినప్పుడు, అతడు, అతని పనివాడైన పూరా ఆ శిబిరంలో బయట కాపలా వాళ్ళున్న చోటికి వెళ్ళారు.
12 Saa ɛberɛ no na Midianfoɔ, Amalekfoɔ ne nnipa no nkaeɛ a wɔfifiri apueeɛ fam no abɛyɛ bitibiti te sɛ ntutummɛ wɔ bɔnhwa no mu. Na wɔn nyoma nso dodoɔ te sɛ mpoano anwea. Wɔdɔɔso dodo!
౧౨మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పుప్రాంతాల వాళ్ళు లెక్కకు మిడతల్లా ఆ మైదానంలో పోగై ఉన్నారు. వాళ్ల ఒంటెలు సముద్ర తీరంలో ఉన్న యిసుక రేణువుల్లా లెక్కకు మించి ఉన్నాయి.
13 Gideon weaweaa kɔduruu hɔ no, na ɔbarima bi reka ne daeɛ a ɔsoeɛ akyerɛ nʼadamfo bi sɛ, “Mesoo daeɛ na burodo kurukuruwa bi ate abɛhwe Midianfoɔ atenaeɛ. Ɛkɔpem ntomadan no bi na ɛbu faa so ma ɛkɔhwee ase!”
౧౩గిద్యోను దిగి వచ్చినప్పుడు, ఒకడు తాను కనిన కలను మరో సైనికుడికి చెప్తూ “నాకొక కలొచ్చింది. బార్లీ రొట్టె ఒకటి మిద్యానీయుల శిబిరంలోకి దొర్లి, ఒక గుడారానికి తాకి, దాన్ని పడగొట్టి తలకిందులు చేయగా ఆ గుడారం కూలిపోయింది” అన్నాడు.
14 Nʼadamfo no kaa sɛ, “Wo daeɛ no kyerɛ adeɛ baako pɛ. Onyankopɔn de Midian ne ne mpamfoɔ nyinaa so nkonimdie ahyɛ Yoas babarima Gideon, Israelni no nsa.”
౧౪అందుకు అతని స్నేహితుడు “అది ఇశ్రాయేలీయుడు యోవాషు కొడుకు గిద్యోను ఖడ్గమే తప్ప మరొకటి కాదు. దేవుడు మిద్యానీయుల మీద, ఈ శిబిరం మీద, అతనికి జయం ఇస్తున్నాడు” అని జవాబిచ్చాడు.
15 Ɛberɛ a Gideon tee daeɛ no ne nʼasekyerɛ no, ɔkoto sɔree Onyankopɔn. Ɔsane baa Israel atenaeɛ mu teaam sɛ, “Monsɔre! Awurade de Midianfoɔ ahyɛ mo nsa.”
౧౫గిద్యోను ఆ కల, దాని భావం విన్నప్పుడు, అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలీయుల శిబిరంలోకి తిరిగి వెళ్లి “లెండి, యెహోవా మిద్యానీయుల సైన్యం మీద మీకు జయం ఇచ్చాడు” అని చెప్పి,
16 Ɔkyɛɛ mmarima ahasa no mu akuakuo mmiɛnsa. Ɔde ntotorobɛnto ne dɔteɛ kuruwa a ogyatɛn hyehyɛ mu maa wɔn.
౧౬ఆ మూడు వందలమందిని మూడు గుంపులుగా చేశాడు. ఒక్కొక్కరి చేతికి ఒక బూర, ఒక ఖాళీ కుండ, ఆ కుండలో ఒక దివిటీని ఇచ్చి, వాళ్లతో ఇలా అన్నాడు “నన్ను చూసి, నేను చేసినట్టు చేయండి.
17 Afei, ɔka kyerɛɛ wɔn sɛ, “Monhwɛ me. Monni mʼakyi. Sɛ meduru atenaeɛ no mfikyire a, deɛ mɛyɛ biara no, monyɛ bi.
౧౭చూడండి! నేను వాళ్ల శిబిరం మీదకి వెళ్తున్నాను. నేను చేసినట్టే మీరూ చెయ్యాలి.
18 Sɛ me ne wɔn a wɔka me ho nyinaa hyɛn ntotorobɛnto no a, mo a moatwa atenaeɛ no ho ahyia no nyinaa, mo nso monhyɛn mo deɛ na monteam sɛ, ‘Yɛko ma Awurade ne Gideon.’”
౧౮నేను, నాతో ఉన్నవాళ్ళందరు బూరలను ఊదేటప్పుడు మీరు కూడా ఆ శిబిరం చుట్టూ బూరలు ఊదుతూ, ‘యెహోవాకు, గిద్యోనుకు, జయం’ అని కేకలు వెయ్యాలి” అని చెప్పాడు.
19 Anadwo dasuo mu a wɔasesa awɛmfoɔ no awie pɛ, na Gideon ne mmarima ɔha a wɔka ne ho no kɔduruu Midianfoɔ atenaeɛ mfikyire. Mpofirim wɔhyɛnee wɔn ntotorobɛnto no, bobɔɔ dɔteɛ nkuruwa a na ɛhyehyɛ wɔn nsam no.
౧౯కాబట్టి, అర్దరాత్రి కాపలా కాసేవారు కాపలా సమయం మారుతూ ఉన్నప్పుడు, గిద్యోను, అతనితో ఉన్న వందమంది, శిబిరం చివరకూ వెళ్లి, బూరలు ఊది, వాళ్ళ చేతుల్లో ఉన్న కుండలు పగులగొట్టారు.
20 Afei akuo mmiɛnsa no nyinaa hyɛnee wɔn ntotorobɛnto bobɔɔ wɔn nkuruwa. Na wɔkurakura ogyatɛn a ɛrederɛ no wɔ wɔn nsa benkum mu na wɔkurakura ntotorobɛnto wɔ wɔn nsa nifa mu, wɔteaam sɛ, “Awurade akofena yɛ Gideon akofena!”
౨౦అలా ఆ మూడు గుంపులవాళ్ళు బూరలు ఊదుతూ ఆ కుండలు పగులగొట్టి, ఎడమ చేతుల్లో దివిటీలు, కుడి చేతుల్లో ఊదడానికి బూరలు పట్టుకుని “యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం” అని కేకలు వేశారు.
21 Ɔbarima biara gyinaa nʼafa wɔ atenaeɛ no ho, hwɛɛ Midianfoɔ no sɛ wɔabɔ huboa reteateam na wɔredwane.
౨౧వాళ్లలో ప్రతివాడూ తన స్థలం లో శిబిరం చుట్టూ నిలబడి ఉన్నప్పుడు ఆ సైనికులు అందరూ కేకలు వేస్తూ పారిపోయారు.
22 Ɛberɛ a Israelfoɔ ahasa no hyɛnee wɔn ntotorobɛnto no, Awurade maa wɔn atamfoɔ akofoɔ a wɔwɔ atenaeɛ hɔ no twaa wɔn ho de akofena ne wɔn ho koeɛ. Wɔn a wɔanwu no dwane kɔduruu Bet-Sita a ɛbɛn Serera ne Abel-Mehola hyeɛ a ɛbɛn Tabat so.
౨౨ఆ మూడు వందలమంది బూరలు ఊదినప్పుడు యెహోవా, ఆ శిబిరం అంతటిలో ప్రతి వాని కత్తి తన ప్రక్కన ఉన్న వాని మీదకి తిప్పాడు. ఆ సైన్యం సెరేరాతు వైపు ఉన్న బేత్షిత్తా వరకూ, తబ్బాతు దగ్గర ఉన్న ఆబేల్మెహోలా తీరం వరకూ పారిపోయినప్పుడు,
23 Afei, Gideon soma kɔfaa Naftali, Aser ne Manase akofoɔ a wɔbɛboa ma wɔtaa Midian akodɔm a wɔredwane no.
౨౩నఫ్తాలి గోత్రంలో నుంచి, ఆషేరు గోత్రంలో నుంచి, మనష్షే గోత్రమంతటిలో నుంచి, పిలుచుకు వచ్చిన ఇశ్రాయేలీయులు కలిసి మిద్యానీయులను తరిమారు.
24 Gideon tuu abɔfoɔ kɔɔ Efraim mmepɔ aman no so kɔkaa sɛ “Mommra mmɛto nhyɛ Midianfoɔ so. Montware wɔn wɔ Yordan aworɔso a ɛwɔ Bet-Bera hɔ no.” Na Efraim mmarima no yɛɛ sɛdeɛ wɔka kyerɛɛ wɔn no.
౨౪గిద్యోను ఎఫ్రాయిమీయుల ఎడారి ప్రాంతం అంతటా వేగులను పంపి “మిద్యానీయులను ఎదుర్కోడానికి రండి. బేత్బారా వరకూ వాగులను, యొర్దాను నది, వాళ్లకంటే ముందుగా స్వాధీనం చేసుకోండి” అని ముందే చెప్పాడు కాబట్టి ఎఫ్రాయిమీయులంతా కూడుకుని బేత్బారా వరకూ వాగులను యొర్దానును స్వాధీనపరచుకున్నారు.
25 Wɔkyeree Oreb ne Seeb a na wɔyɛ Midian asahene. Wɔkumm Oreb wɔ Oreb botan so ɛnna wɔkumm Seeb nso wɔ Seeb nsakyiamena ho. Na wɔkɔɔ so taa Midianfoɔ no. Akyire no, Israelfoɔ no de Oreb ne Seeb tiri no brɛɛ Gideon a na saa ɛberɛ no ɔwɔ Yordan ho no.
౨౫వాళ్ళు మిద్యాను అధిపతులైన ఓరేబు జెయేబు అనే ఇద్దరిని పట్టుకుని, ఓరేబు బండమీద ఓరేబును చంపారు. జెయేబు ద్రాక్షల తొట్టి దగ్గర జెయేబును చంపి, మిద్యానీయులను తరుముకుంటూ వెళ్ళారు. ఓరేబు, జెయేబుల తలలు యొర్దాను అవతల ఉన్న గిద్యోను దగ్గరికి తెచ్చారు.