< Atemmufoɔ 17 >
1 Ɔbarima bi tenaa Efraim bepɔ asase so a na wɔfrɛ no Mika.
౧ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో మీకా అనే ఒక వ్యక్తి నివసించేవాడు.
2 Ɛda koro bi, ɔka kyerɛɛ ne maame sɛ, “Metee sɛ wodomee ɔkorɔmfoɔ a ɔwiaa wo nnwetɛbena kilogram dumienu firii wo nkyɛn no. Ɛyɛ, ɛnie. Me ara na mefaeɛ.” Ne maame kaa sɛ, “Awurade nhyira wo sɛ woaka nokorɛ.”
౨అతడు తన తల్లితో “నీ దగ్గర నుండి నేను తీసుకున్న పదకొండు వందల వెండి ఇదిగో. వాటిని తీసుకున్న వాణ్ణి నువ్వు శపించడం నేను విన్నాను. చూడు, అవి నా దగ్గరే ఉన్నాయి. నేనే వాటిని దొంగిలించాను” అన్నాడు. అతని తల్లి అతణ్ణి చూసి “కొడుకా, యెహోవా నిన్ను ఆశీర్వదించు గాక!” అంది.
3 Ɔde sika no maa no no, ne maame no kaa sɛ, “Mede saa nnwetɛbena kilogram dumienu ne fa yi ma Awurade. Mɛma wɔayɛ nsɛsodeɛ ne ohoni a wɔagu de ahyɛ me babarima animuonyam.”
౩అతడు ఆ పదకొండు వందల వెండిని తిరిగి తన తల్లికి ఇచ్చేశాడు. ఆమె “ఈ సొమ్మును నేను యెహోవాకు ఇచ్చేస్తున్నాను. దీనితో నా కొడుకు కోసం ఒక చెక్క విగ్రహమూ, మరొక పోత విగ్రహమూ తయారు చేయిస్తాను. అందుకని ఇవి నీకే తిరిగి ఇచ్చేస్తాను” అంది.
4 Enti ne maame de nnwetɛbena ahanu kɔmaa dwetɛdwumfoɔ na ɔde yɛɛ nsɛsodeɛ ne ohoni. Na wɔde sii Mika fie.
౪అతడు ఆ నాణేలను తన తల్లికి ఇచ్చాడు. ఆమె వాటిలో రెండు వందలు తీసి ఒక కంసాలికి ఇచ్చింది. వాడు వాటితో ఒక విగ్రహాన్ని చెక్కాడు. లోహంతో మరో విగ్రహాన్ని పోత పోశాడు. ఆ విగ్రహాన్ని మీకా ఇంట్లోనే ఉంచారు.
5 Mika yɛɛ asɔreeɛ na ɔyɛɛ asɔfotadeɛ ne efiefoɔ ahoni kaa ho. Ɛnna ɔhyɛɛ ne mmammarima no mu baako ɔsɔfoɔ.
౫మీకా ఇంట్లో విగ్రహాలున్న పూజ గది ఒకటుంది. అతడు ఒక ఎఫోదునూ కొన్ని విగ్రహాలనూ చేయించి అందులో ఉంచాడు. తన కొడుకుల్లో ఒకణ్ణి పూజారిగా ప్రతిష్టించాడు. అతని కొడుకే అతనికి యాజకుడు అయ్యాడు.
6 Saa ɛberɛ no na Israel nni ɔhene, enti na nnipa no yɛ deɛ wɔpɛ biara.
౬ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇష్టానుసారం జీవిస్తున్నారు.
7 Ɛda bi, Lewini aberanteɛ bi a ɔfiri Betlehem a ɛwɔ Yuda
౭అక్కడ యూదా గోత్రంలో చేరిన ఒక లేవీ యువకుడు ఉండేవాడు. ఇతడు యూదా ప్రాంతానికి చెందిన బేత్లెహేము నుండి వచ్చాడు.
8 bɛduruu saa beaeɛ hɔ wɔ Efraim asase so a ɔrepɛ baabi pa atena. Ɛbaa sɛ, ɔkɔsoɛɛ Mika fie.
౮ఆ వ్యక్తి తనకో నివాస స్థలం కోసం యూదా బేత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణం చేస్తూ ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో ఉన్న మీకా యింటికి వచ్చాడు.
9 Mika bisaa no sɛ, “Ɛhe na wofiri?” Ɔno nso buaa sɛ, “Meyɛ Lewini a mefiri Betlehem wɔ Yuda na merepɛ baabi matena.”
౯అతణ్ణి మీకా “నీవు ఎక్కడ నుంచి వచ్చావు?” అని అడిగాడు. దానికతడు “నేను యూదా బేత్లెహేమునుంచి వచ్చిన లేవీయుణ్ణి. నాకో నివాస స్థలం కోసం వెదుకుతున్నాను.” అన్నాడు.
10 Mika ka kyerɛɛ no sɛ, “Wo ne me ntena ha, na wobɛyɛ agya ne ɔsɔfoɔ ama me. Mɛma wo nnwetɛbena gram ɔha ne dunan afe biara; mɛma wo ntadeɛ ne aduane.”
౧౦అప్పుడు మీకా “నువ్వు నా దగ్గరే ఉండు. నాకు తండ్రిగా, యాజకుడుగా ఉండు. నీకు సంవత్సరానికి పది వెండి నాణేలూ, బట్టలూ, ఆహారమూ ఇస్తాను.” అన్నాడు. దానికి ఆ లేవీయుడు అంగీకరించాడు.
11 Lewini no penee so na ɔbɛyɛɛ sɛ Mika mmammarima no mu baako.
౧౧ఆ వ్యక్తి దగ్గర ఉండిపోడానికి ఒప్పుకున్నాడు. ఆ యువకుడు అతని కొడుకుల్లో ఒకడిగా ఉన్నాడు.
12 Enti, Mika hyɛɛ Lewini no ɔsɔfoɔ, na ɔtenaa Mika fie.
౧౨మీకా ఆ లేవీయుణ్ణి ప్రతిష్టించాడు. అతడు మీకాకు యాజకుడుగా ఉన్నాడు.
13 Na Mika kaa sɛ, “Menim sɛ Awurade bɛhyira me, ɛfiri sɛ, mewɔ Lewini a ɔresom sɛ me ɔsɔfoɔ.”
౧౩అప్పుడు మీకా “ఈ లేవీయుడు నాకు యాజకుడుగా ఉన్నాడు కాబట్టి యెహోవా నాకు తప్పక మేలు చేస్తాడని నాకు తెలుసు” అన్నాడు.