< Yona 4 >

1 Yona bo annwo koraa, na ne bo fuiɛ.
కాని, ఇది యోనా దృష్టిలో చాలా తప్పుగా అనిపించింది. అతడు కోపంతో మండిపడ్డాడు.
2 Ɔbɔɔ Awurade mpaeɛ sɛ, “Ao Awurade, ɛberɛ a na mewɔ fie no, ɛnyɛ sei na mekaeɛ? Yei enti na meperee sɛ medwane akɔ Tarsis no, ɛfiri sɛ na menim sɛ, woyɛ ɔdomfoɔ ne mmɔborɔhunu Onyankopɔn a wo bo kyɛre fu, na wodɔ boro so. Woyɛ Onyankopɔn a ɔtwentwɛnee ne nan ase wɔ bɔne amanehunu ho.
కాబట్టి యోనా యెహోవాను ఇలా ప్రార్ధించాడు. “నేను నా దేశంలో ఉన్నప్పుడు ఇలానే జరుగుతుందని చెప్పాను గదా! అందుకే నేనే మొదట తర్షీషుకు పారిపోడానికి ప్రయత్నించాను. ఎందుకంటే, నువ్వు కృపగల దేవుడివనీ, జాలిగల వాడివనీ, త్వరగా కోపగించే వాడివి కాదనీ, పూర్తిగా నమ్మదగిన వాడివనీ, నశింపజేయడానికి వెనుకంజ వేసేవాడివనీ నాకు తెలుసు.
3 Enti Ao Awurade! Gye me nkwa firi me nsɛm. Ɛyɛ ma me sɛ mɛwu sene sɛ mɛtena ase.”
కాబట్టి, యెహోవా, ఇప్పుడు నా ప్రాణం తీసెయ్యమని బతిమాలుతున్నాను. ఎందుకంటే నేను బతకడం కంటే చావే మేలు.”
4 Na Awurade buaa sɛ, “Ɛyɛ sɛ wo bo fu saa asɛm yi ho anaa?”
అందుకు యెహోవా “నువ్వు అంతగా కోపించడం న్యాయమా?” అని అడిగాడు.
5 Na Yona kɔɔ kuropɔn no apueeɛ fam baabi kɔtenaa hɔ. Ɔbɔɔ apata tenaa ne nwunu no mu, twenee deɛ ɛbɛba kuropɔn no so.
అప్పుడు యోనా ఆ పట్టణం నుంచి వెళ్లి దానికి తూర్పుగా ఒకచోట కూర్చున్నాడు. అక్కడ ఒక పందిరి వేసుకుని, పట్టణానికి ఏమి సంభవిస్తుందో చూద్దామని, ఆ పందిరి నీడలో కూర్చున్నాడు.
6 Na Awurade Onyankopɔn maa bobe dua bi nyinii ntɛm ntɛm wɔ nʼatifi na ɛmaa Yona nyaa ahomeka, na nʼani gyee dua no ho.
యెహోవా దేవుడు ఒక మొక్కను సిద్ధం చేసి, అతనికి కలిగిన బాధ పోగొట్టడానికి, అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చేలా చేశాడు. ఆ మొక్కను బట్టి యోనా చాలా సంతోషించాడు.
7 Nanso ahemadakye no, Onyankopɔn maa ɔsa bɛwee bobe dua maa nhahan no poeɛ.
మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగును సిద్ధంచేసి ఉంచాడు. అది ఆ మొక్కను పాడు చేయగా అది వాడిపోయింది.
8 Awia pueeɛ no, Onyankopɔn ma apueeɛ mframa bi a emu yɛ hyeɛ bɔeɛ na awia hyee Yona apampam ma ɔtɔɔ bira. Ɔpɛɛ sɛ ɔwu, na ɔkaa sɛ, “Ɛyɛ ma me sɛ mewu sene sɛ metena ase.”
ఆ తరువాత రోజు సూర్యోదయం అయినప్పుడు, దేవుడు తూర్పునుండి వీచే వడగాలిని సిద్ధం చేశాడు. యోనాకు ఎండ దెబ్బ తగిలి సొమ్మసిల్లిపోయాడు. “బతకడం కంటే చావడమే నాకు మేలు” అని తనలో తాను అనుకున్నాడు.
9 Onyankopɔn bisaa Yona sɛ, “Ɛyɛ sɛ wofa abufuo wɔ dua no ho anaa?” Yona buaa sɛ, “Aane, me bo afu, na sɛ mɛwu a anka mepa.”
అప్పుడు దేవుడు యోనాతో “ఈ మొక్క గురించి నువ్వు అంతగా కోపపడడం భావ్యమేనా?” అన్నాడు. యోనా “చచ్చి పోయేటంతగా కోపపడడం భావ్యమే” అన్నాడు.
10 Na Awurade kaa sɛ, “Dua yi ho asɛm aha wo, nanso woanni ho dwuma biara, na ɛnyɛ wo na woma ɛnyiniiɛ. Ɛfifirii ntɛm ntɛm na ɛwuu ntɛm ntɛm.
౧౦అందుకు యెహోవా “నువ్వేమాత్రం కష్టపడకుండా, పెంచకుండా దానికదే పెరిగిన మొక్క మీద నువ్వు జాలిపడుతున్నావే. అది ఒక రాత్రిలోనే పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయింది.
11 Nanso nnipa mpem ɔha ne aduonu wɔ Ninewe a wɔnnim wɔn benkum ne wɔn nifa. Na mmoa bebree nso wɔ hɔ. Ɛnsɛ sɛ mema Ninewe kuropɔn kɛseɛ yi ho asɛm ha me anaa?”
౧౧అయితే నీనెవె మహా పట్టణంలో కుడి ఎడమలు తెలియని లక్షా ఇరవై వేల కంటే ఎక్కువమంది ప్రజలున్నారు. చాలా పశువులు కూడా ఉన్నాయి. దాని గురించి నేను జాలిపడవద్దా?” అని అతనితో అన్నాడు.

< Yona 4 >